గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్
470-శ్రీ మేళ్ళ చెర్వుసుబ్రహ్మణ్య శాస్త్రి
ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతకావ్యాలంకార ,వ్యాకరణ శాస్త్రాదులు నేర్చారు .తెనాలి సంస్క్రుతకాలేజిలో విద్యా ప్రవీణ అయ్యారు .సంస్క్రుతాధ్యాపకులయ్యారు .ఆంద్ర సంస్కృతాలలో ఏం ఏ పొందారు .సంస్కృతం లో బహు గ్రంధాలు రాశారు ‘
‘’శ్రీ గురు చరితం ‘’లో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ని గురించి సమగ్రంగా రాశారు .’’శ్రీ దేవీ మానసానంద హేతవే ధర్మ సేతవే –గుర్వే శిష్య లోకస్య నమోవాకం ప్రశాస్మహే ‘’అని గురు కీర్తన చేశారు .’’భావనా బృందావనం ‘’కావ్యం లో ముక్తక శ్లోకాలు రాశారు .’’సాలభంజికా సూత్ర దారం ‘’’’లాలితానంద లహరి, స్తన్య ధారా స్తవం ;;రచించారు .ఇందులో ఒక శ్లోకం –‘’హే నిత్య ప్రసావిత్రీ తే స్తన యుగం ధారా ధారా హ్రీకరం-క్లీం మధ్యాక్రుతి మాత్రుగాదర గృహీత స్వాదితం భావయే –శ్రీ పీయూష ముపాస్య యస్య కవయ స్వెం బీజ వాజీ కృతా –అన్నాముత్ర జయంతి హన్తః –సుమనస్యో రాజ్య రారాజితాః’’
‘’వేదనాద స్తవం ‘’లో ‘’శరీరే యూపా గహనా కశేరుకా –విజ్ఞాన సంబందా మనసే మే జడస్య –ఆలస్య కచిద్ గోపికా హంత సుప్తా –నూనం కించిత్ స్ప్రుశతీ వాద్వ యోక్త్రం ‘’అన్నారు .
వేదనా నివేదనం ‘’కావ్యం లో శిఖరిణీ శార్దూల విక్రేడి తాలలో కవనాన్ని కధనం తొక్కించారు .-‘’కిం దుఃఖం కిం సుఖం కిం శుభమితి మానసా వర్తమానాతీతం-నిస్చేతుం పంగ గుబుద్ధిః -సతతామిద మా విశ్వాసజే ధ్నేయ్యమానః ‘’
ఇవికాక ‘’పరి ప్రశ్న మంజరి ‘’,లింగ దర్శనం ,కర్మ వాద నిర్మధనం’’,దయా దారిద్ర్యం ,పరాకాయ ప్రవేశ స్తోత్రం ,తత్వ మంజరి ,నమశ్శివాయ ,బిన్డుమాలినీ స్తవం ,రఘు కౌత్సం ,నిరపంనప ద్వాదశి ,శివ దోష స్తుతి ,అన్గాగార క్రుష్ణాగారః మొద లైనవి రాశారు
471-.సంస్కృత భాష సేవలో తరించిన వదాన్యుడు శ్రీ గోరంట్ల వెంకన్న (18 71-19 47)
ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం లో సంస్కృత భాష ను బ్రతికించి సేవలందించిన మహనీయుడు శ్రీ గోరంట్ల వెంకన్న .జీవితం అంతా గీర్వాణ సేవకు , విద్యా సాంస్కృతిక సేవలో గడిపిన వదాన్యుడు .ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లో 1871 లో వెంకన్న జన్మించాడు భాగ్య నంతుడు .వీరన్న పున్నమ్మల కుమారుడు .సంస్కృత విద్యాలయాలలకు సంస్క్రుతకవిపండి తులకు విద్యాలయాల స్థాపనకు చేతికి ఎముక లేకుండా దానం చేసిన అభినవ కర్ణుడు .ఒంగోలులో హైస్కూలు ,ఓరియెంటల్ స్కూలు , తిమ్మ సముద్రం లో సంస్కృత కళాశాల స్థాపించిన వదాన్యుడు విద్యాభిమాని .విద్యార్ధులందరికీ ఉచిత భోజన వసతులు కలిపించిన మహనీయుడు .వేటపాలెం లో ‘’సరస్వతి నికేతన్ ‘’అనే గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించాడు దీనికి ఉన్న పేరు దేనికీ రాలేదు .సంస్కృత విద్యా వ్యాప్తికి ఆయుర్వేద వ్యాప్తికి ౩౦౦ ఎకరాల స్థలాన్ని ట్రస్ట్ కు రాసిచ్చిన మహా దాత . టంగుటూరి ప్రకాశం పంతులుగారి ముఖ్య అనుయాయి .గాంధీగారికి వెంకన్న దాతృత్వం తెలిసి తిమ్మ సముద్రం వచ్చి చూసి అభినందించాడు .తుఫానులో సర్వస్వం కోల్పోయిన వారందరికీ గృహాలు కట్టించి ఇచ్చాడు హరిజనులకు నివేశనస్తలాలను అందజేశాడు .యావదాస్తినీ ప్రజాసేవకు సంస్కృతభాషా వ్యాప్తికి రాసిచ్చి సన్యాసం స్వీకరించి అతి పవిత్ర జీవితాన్ని గడిపి మహా దాత గోరంట్ల వెంకన్నగారు 1947 లో డెబ్భై ఆరవ ఏట పరమ పదించారు .
ప్రకాశం జిల్లా కవులు సమాప్తం –తరువాత చిత్తూరు జిల్లా కవుల్ని పరమర్శిద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29 -9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ .