విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు

విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు

విశ్వనాధ సత్యనారాయణ ,పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు చిన్న తమ్ముడు రామ మూర్తి త్రయాన్ని బండరుజనం ‘’కర్తా కర్మా క్రియ ‘’అనేవారట .మొదటి ఇద్దర్నీ రామ లక్ష్మణులనేవారు .వారి అనుబంధం అంత గొప్పగా గాఢం గా ఉండేది విశ్వనాధ వ్యాసునికి వ్రాయసగాడైన గణపతి వెంకటేశ్వర్లు .ఇది మరీ దగ్గర సంబంధం .ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని వెంకటేశ్వర్లుగారు అక్షర బద్ధం చేశారు వారికి విశ్వనాధ భార్య వరలక్ష్మిగార్లు సాక్షాత్తు  సీతా రాములే .గురువు వెంకట శాస్త్రి గారు బందరు భైరవ ప్రెస్ లోనే కాపురం పెట్టారు .వారిభార్య మహా లక్ష్మమ్మగారు దొడ్డ ఇల్లాలు .సోదరులు హోటల్ లో భోజనం చేసేవారు .ఒక రోజు వీరు భోజనానికి వెడుతుంటే ఆమె అడ్డగించి ఆ హోటల్లో మసూచికం ఉన్నవాల్లున్నారు వెళ్ళద్దు అని బ్రతిమిలాడి అన్నం వడ్డించి పెట్టి తినిపించింది అప్పటినుంచే విశ్వనాధ కవితా తపస్వి అయ్యాడని అంటారు వెంకటేశ్వర్లు గారు .

రామ మూర్తిగారు వదిన ను తల్లిగానే భావించాడు .’’నాకేమో వాళ్ళ మీద రుస రుస ఉండేది ‘’అన్నాడు వెంకటేశ్వర్లు గారు .రామమూర్తికి ‘’పంచ కోశాల్లో ఎక్కడ వెతికినా వాళ్ళ మీద మాతా పితృ భావమే తప్ప మరొక భావం లేదు .విశ్వనాధ వీరిద్దరి గురించి కల్ప వృక్ష పీఠికలో రాశాడు .’’నన్ను గురించి రాసిన దానిలో కొంత అతి శయోక్తి ఉన్నాదని నా భయం .రామమూర్తి’’ . గురించి రాసింది అక్షరాలా నిజం ‘’అని కితాబిచ్చారు శ్రీ వెం గారు .’’మా అన్నకూ నాకు సోదర సంబంధం కంటే గురు శిష్య సంబంధం ఎక్కువ .తానూ కృష్ణాపత్రికలో పని చేశానని శ్రీ ముట్నూరి తనను కమ్మచ్చు తీర్చినట్లు తీర్చి దిద్దారని  వెంకటేశ్వర ఉవాచ .ఇంటిదగ్గర అన్నగారు తానూ రాసిందల్లా చదివి వినిపించేవాడు .’’అయన సర్వ రచనకు నేను ప్రధమ శ్రోతను .నాకు బద్ధకం గా ఉన్నా విని తీరాల్సిందే .ఆయన చెప్పే విమర్శలనన్నిటినీ ముందు నాకే వినిపించేవాడు .తానూ చదివే గ్రంధాలన్నీ నా చేత చదివి౦చి వినేవాడు .హ్యూగో రాసిన ‘’లారాబిలే ‘,త్రీ మస్క్క్వి టీర్స్’’,టాల్ స్టాయ్ నవల ‘’వెందేట్టా ‘’నవల ఆయనతో బాటే నేనూ చదివా .భారతిలో సంస్కృత నాటకాలపై రాసిన విమర్శలన్నీ ఇంటి దగ్గరే చదివాను ‘’అని చెప్పుకొన్నారు వెంకటేశ్వర్లు .

‘’వేయి పడగలు మా బాబు మొదలైనవన్నీ విశ్వనాధ చెబుతుంటే వెంకటేశ్వర్లె రాశారు .వీటివల్ల తానూ ఎంతో సారస్వత లాభం పొందానని గర్వించారు .తాను పెద్దగా ప్రాచీన సాహిత్యం చదవ లేదని ,తిరుపతికవుల సాహిత్యం అన్నగారి సాహిత్యాలే తనను పండితుని  చేశాయని నిజాయితీగా చెప్పుకొన్నారు .’’నేను అన్నగారి కంటే ఎక్కువ పండితుడను ‘’అను కొనేవారిది భ్రాంతి మాత్రమె ‘’అన్నారు నిష్కర్షగా .అన్నగారి జీవితం అంతా స్నేహిత బృందం తోనే గడిచి పోయింది. వీరందరూ ఆయన నవలలో పాత్ర ధారులై చిరంజీవులయ్యారు .ఆయన సౌజన్యం అదీ ..దీనికి బందుగణానికి కన్నేర్రగా కూడా ఉండేదట .దారిద్ర బాధ అనుభవిస్తూ కూడా తమ్ముడి సంసారం తో బాటు తన సంసారాన్నే పోషించాడు విశ్వనాధ .ఆ కాలం లో కిన్నెరా సాని నర్తన శాల ,కోకిలమ్మ పెళ్లి అచ్చు వేసి సంసారాన్ని పోషించాడు .ఒకసారి స్నేహితుడు బెల్లంకొండ రాఘవరావు గారింటికి పమిడిపాడు వెళ్ళాడు .ఆయనభార్య కనకమ్మగారూ కవిత్వం రాసేవారు . భోజనం విస్తళ్లలో వడ్డించింది .విశ్వనాధ స్నానాల గదిలో ఉన్నాడు యెంత సేపటికీ బయటికి రావటం లేదు .రాఘవ రావు వెళ్లి చూస్తె తడి బట్టలతో గోడ వంక చూస్తూ ఏకాగ్రభావం లో ఉండిపోయాడు .నెమ్మదిగా ఇహలోక స్పృహ లోకి తెచ్చి భోజనానికి కూర్చోబెట్టారు .

తండ్రిలాగానే  విశ్వనాధ నిత్య రామ మంత్రోపాసాకుడు .నేషనల్ కాలేజిలో ప్రమోదకుమార చటర్జీ చిత్రకళాధ్యాపకుడు బాపిరాజుగారాయన శిష్యుడు .ఆయన వేసిన ‘’త్రిశూలం ‘’చిత్రం చూసి ఉప్పొంగిపోయిన విశ్వనాధ ‘’నాకు రాజ్యం ఉంటె ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చేసేవాడిని ‘’అన్నాడు .ఎంతో ఆనందించిన చటర్జీ కాలేజి వదిలి వెళ్ళేటప్పుడు విశ్వనాధను పిలిచి ‘’మీరు రాజ్యం పోగొట్టుకోనక్కరలేదు .ఈ త్రిశూలం మీకు బహుమతిగా ఇస్తున్నాను ‘’అంటే గుండె ద్రవించింది విశ్వనాధకు .త్రిశూలం పేరుతొ నాటకం రాసి ఆ త్రిశూలాన్నే ముఖ చిత్రంగా వేయించి కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఒక సారి మా బాబు నవల రాస్తూ ‘దాన్ని గురించి తనకేమి తెలిసిందో చెప్పమని అన్న తమ్ముడిని అడిగాడు ‘’నవలలో కధానాయకుడికి తండ్రితనం పాములవాడిలో ,తల్లితనం రంగమ్మలో బందించావు అదీ నవలలో గొప్పతనం ‘’అని చెబితే సంతృప్తిగా తల ఊపాడు అన్న .అంతకు ముందువరకు తమ్ముడి అభిప్రాయం పై గొప్పగా సదభిప్రాయం అన్నకు ఉండేదికాదట .అప్పటినుంచి తమ్ముడేది చెప్పినా మౌనంగా అంగీకరించేవాడు అన్న విశ్వనాధ .

బందర్లో గురుభాగవతుల సుబ్బారావు గారు సబ్ రిజిస్త్రార్ గా ఉండేవారు గొప్ప సాహిత్యాభిమాని విశ్వనాధకు వీరాభిమాని .ఎప్పుడు విశ్వనాధ ‘’శ్రీ కృష్ణ సంగీతం ‘’లో పద్యాలు చదివి వినిపించినా పులకించిపోయి సాష్టాంగ ప్రణామం చేసేవారు .ఉభయ భాషా ప్రవీణకు కడుతూ అన్నగారి వద్ద కాదంబరి చెప్పించుకొన్నారు వెంకటేశ్వర్లు గారు అప్పటికే వరలక్ష్మిగారు గుంటూరుకాపురం లో జబ్బు పడి  మంచాన పడిచనిపోయారు. ఆబాధలోనూ కాదంబరి బోధ చేశాడు .’’నీకు సంస్కృతం బాగా వచ్చురా ‘’అని పొంగిపోయాడు తమ్ముడి విద్వత్తుకు .తమ పూర్వీకుల కధను వీరవల్లడు నవలగా రాసి గొర్రెపాటి బాల కృష్ణ అనే కొడుకులాగా చూసుకొనే శిష్యుడికి  అంకితమిచ్చాడు విశ్వనాధ .బాల కృష్ణ అకస్మాత్తుగా చనిపోయాడు ఆ వార్త  న0దమూరు లో ఉన్న విశ్వనాధకు తెలిసి పడిన దుఖాన్ని గురించి చెబుతూ ‘’మా అన్న దుఃఖం పట్టలేక పందిట్లో పడి దొర్లి దొర్లి ఏడ్చాడు .ఇలాంటి దుఖాన్నే మా వదిన పోయినప్పుడు పడటం చూశాను మళ్ళీ ఇప్పుడే ‘’అన్నారు వెంకటేశ్వర్లు .

అన్నగారు రెండవ భార్య తో బెజవాడలో కాపురం పెట్టారు ఈమె కాపురానికి రాగానే విశ్వనాధ సుడి తిరిగింది .అన్నీ కలిసొచ్చాయి దరిద్రం దూరమైంది గౌరవాదరాలు పెరిగాయి బిరుదులూ సత్కారాల జోరు హెచ్చింది అంతా చిన్నవది కాలు పెట్టిన వేళా  విశేషమేనన్నారు తమ్ముడు .సమష్టికాపురమే అప్పటిదాకా. ఇదీ రెండు మూడేళ్ళు సాగి తర్వాత ఎవరి దారి వారిడైంది .వెంకటేశ్వర్లుగారికి 40 ఏళ్ళు వచ్చేదాకా అందరిదీ ఉమ్మడి కాపురమే. తండ్రితర్వాత అన్ని కుటుంబ బాధ్యతలూ విశ్వనాదే భుజాలపై వేసుకొని నిర్వర్తించాడు .తనను ‘’పండిత రాజ మౌళి ‘’అని అవతారికలో రాస్తే తమ్ముడు హడలిపోయి బతిమిలాడి ‘’పండిత కీర్తనేయుడు ‘’అని మార్పించారు వెంకటేశ్వర్లు .తమ్ముడు ‘’కాళిందీ పరిణయం ‘’రాస్తే దానికి ముందుమాట అన్నగారిని రాయమంటే తమ్ముడు కాపురమున్న వరంగల్ కు వెళ్లి చదవగా విని ‘’నేను యుదిష్టి రంబగు నిభ్రుత తతేజమను ‘’పద్యాన్ని విని ‘’యెంత గొప్ప పద్యం రాశావురా !’’అని అభినందించాడు విశ్వనాధ .కల్ప వృక్ష యుద్ధ కాండను తమ్ముడు స్వంత ప్రెస్ లో ముద్రించి అందించాడు .’’మా అన్నగారు యెంత సంపాదించాడో అంతకు మించి దాన ధర్మాలు చేశాడు .లేమి దశలో ఆదుకొన్న వారి రుణాలన్నీ తీర్చి ఈ లోకాన్ని వదిలాడు .కొల్లిపర సూరయ్యగారు ఉయ్యూరుదగ్గర కపిలేశ్వర పురం నివాసి .మంచి స్నేహితుడు .సూరయ్యగారు బతికి ఉండగానే ఆ ఊరు వెళ్లి కొడుకులకు తలొక వెయ్యి రూపాయలూ ఇచ్చి వచ్చాడు .రాఘవ రావు గారి ఋణం మూడింతలు చెల్లించాడు అన్న ‘’అని వెంకటేశ్వర్ల్ రాశారు .తమ్ముడు ‘’పరా ప్రాసాదం ‘’కావ్యం రాసి అన్న విశ్వనాధకు అంకితమిచ్చాడు .

కరీం నగర్ ప్రిన్సిపాల్ గిరీ తర్వాత ‘’అన్నగారు మా వాడు కాకుండా పోయారు .ఏదో అంతర్ ద్రుష్టి ,ఏదో ఆత్మ వత్వం ఆయనలో కనిపించేది అంతర్ముఖ లక్షణాలు గమనించాను .ఏదో అశాంతిగా ఉందని అంటే పంచాక్షరీ జపం కోటిసార్లు చేయమంటే సంవత్సరన్నరలోపే పూర్తీ చేశాడు .ఏం చెయ్యమంటావు మళ్ళీ అని అడిగితె శాంత్యర్ధం మరో యాభై వేలు చేయమంటే అయిదారు నెలల్లోనే పూర్తీ చేసి ఆశ్చర్య పరచాడు .ఎవడో గంధర్వుడు ఈ ఉపాధిలో ప్రవేశించాడేమోననుకోన్నాను .’’అన్నారు వెంకటేశ్వర్లు .కరీం నగర్ ఉద్యోగం నుంచే నిత్య యోగాభ్యాస నిత్య   జపాలు అభ్యాసమైనాట విశ్వనాధకు .’’అయన కావాలని మంత్రించి విభూతి ఇస్తే యెంత రోగమైనా ,యెంతఆపదైనానా వెనుకాడేది ‘’అని నిజాయితీతో చెప్పారు తమ్ముడు .\

చివరి దశలో సంగీతం పైన మనసుపోయి కొడుకు పావనికి జొన్న విత్తుల సుబ్బారాగారు వచ్చి సంగీతం నేర్పిస్తుంటే ఈయనకూ వచ్చేసింది .ఆయనతోనే త్రిశూలం నాటకం లో ‘’శివ గిరి విభో ‘’పాటకు స్వరరచన చేయించారు . .‘’మోయు తుమ్మేదనాడు నారాయణ రావు గారి సంగీతం లో ,చిన్నతనం లో హరినాగ భూషణం గార  వాయులీనం లో లీనమైతే ఇప్పుడు పూర్ణ సరస్వతీ రూపుడైన ఆయన ఆత్మలో సంగీతం మోగటం సహజమే నని పించింది .’ఏతత్సామ గాయాన్నాస్తే హా ఊహా ఉహా ఉ ‘’అని అని తైత్తిరీయంఅన్నది అది అన్నగారిపట్ల రుజువైంది ‘’వెంకటేశ్వర్లుగారు .’

‘’మా అన్నగారు కవిమాత్రుడుకాడు .కవితను దర్శన స్థాయికి అందజేసిన మహానుభావుడు .ఆయనతో సమానుడు ఒక్కడే ఉన్నాడు –భవ భూతి ‘’మా అన్నగారు పూర్ణ పురుషుడు ‘’ఇదీ ఆ అన్నదమ్ముల అనుబంధం .

ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.