గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ

486 –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని (18 88-19 50 )

కడప జిల్లా జమ్మలమడుగు నివాసి శ్రీ దుర్భాక వారు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారితో కలిసి జంట అవధానాలను ‘’రాజశేఖర-వెంకట కవులు ‘’పేరుతొ చేశారు .శాతావదానమూ నిర్వహించింది ఈ జంట .రాజశేఖరం గారు ‘’రాణా  ప్రతాప సింహ చరితము ‘’కావ్యం రాసి ‘’వీర ప్రబంధ పరమేశ్వర ‘’చారిత్రిక కవితాచార్య  ‘’బిరుదులూ పొందారు .సంస్కృతం లో ఒకే ఒక్కటి ‘’కామేశ్వరీ స్తోత్రమాల ‘’రాశారు .’’ఉత్తర రఘు వంశం ‘’కూడా రాశారు కాని పూర్తీ చేయలేదు

48 7 –శ్రీ అవధానం చంద్ర శేఖర శర్మ(19 14-19 9 6 )

కడపలోని కలశపాదుకు చెందినశర్మగారు ప్రొద్దుటూరు లోని శ్రీమళయాళ స్వామి వారి ఓరియెంటల్ కాలేజి లో పనిచేశారు .’’దేవీ సువర్నమాలా స్తోత్రం ,కన్యా తీర్ధ దేవీ సుప్రభాతం ,కల్గ్హత సిద్దేశ్వర సుప్రభాతం ,రసా వీటి వీర భద్ర సుప్రభాతం ‘’సంస్కృతం లో రాశారు .

488 –శ్రీ అయ్యల సోమయాజుల నరసింహ శర్మ (19 13

కావ్య క వాసిష్ట గణపతి ముని బంధువే  నరసింహ శర్మ .ప్రొద్దుటూరు ప్రాచ్య కళాశాలలో పని చేసి ‘’పాండవ దార్త్ర రాష్ట్ర సంభవం ‘’అనే గణపతిముని కృతికి సంస్కృత వ్యాఖ్యానం రాశారు .

489 –శ్రీ భూపతి సుబ్రహ్మణ్య శర్మ (19 38-20 02)

శర్మగారి గీర్వాణ రచనలు –‘’భద్రాచల రామ సుప్రభాతం ,షిర్డీ సాయినాధ సుప్రభాతం ,శ్రీ కృష్ణ రక్షణం అనే నాటకం .ఈ  నాటకం లో కృష్ణ దేవరాయల వైభవ చరిత్ర ఉంది .

490 –శ్రీ ఇచ్చం పాటి శఠ కోపాచార్య (19 28 -19 9 2 )

తమిళ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందినవారు .ప్రొద్దుటూరు మళయాళ స్వామి కాలేజిలో పని చేసి గొప్ప పేరుపొందారు .సంస్కృత భాషా వ్యాప్తికి అనన్య సేవలందించారు .రాసిన వ్యాసాలూ కవితలు అన్నీకలిపి ‘’సుర వాణీ మణి  హారం ‘’గా వెలువరించారు .ఇందులో పద్య మణి ,గద్య మణి,ద్రుశ్యమణి అని మూడు భాగాలున్నాయి .మొదటి భాగం లో ‘’హయగ్రీవ లహరి ,సూక్తి ముక్తావళి ,అమరావాణీ  ప్రశస్తి ,శ్రీ సువర్ణ హారం ,ఆర్తి విజ్ఞప్తి ,మహాదేవీ వింశతి ,శ్రీ బగలా నక్షత్ర మాల ,కృపా రాజ్ఞీ ,భారత భూ వైభవం ,సూక్తి సుధానిధి ‘’ఉన్నాయి .రెండవ భాగం లో-‘’భక్తిమార్గ ప్రాశస్త్యం ,గురు శుశ్రూషయా విద్య ‘’ఉన్నాయి మూడవ దానిలో 5 నాటకాలున్నాయి-ధ్రువ విజయం ,కుచేల విజయం ,ప్రహ్లాద విజయం ,శ్రీ రామ విజయం ,భారతీ విజయం ‘’

కర్నూలు జిల్లా

491 – శ్రీ శ్రీధర పరశురామ శాస్త్రి (18 8 8 -19 6 5 )

కర్నూలు జిల్లా కరివెన ఆగ్రహారానికి చెందిన శాస్త్రి గారు విశ్వపతి సుబ్బమాంబ ల  కుమారుడు .తండ్రిగారు మొదటి గురువై కావ్య ,వ్యాకరణ శాస్త్రాలు నేర్పారు . సర్వజ్ఞ స్వాత్మానంద  సంయమీం ద్రుల శిష్యులై ,మరింత విజ్ఞానం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పుల్లేటికుర్రు చేరి చదివి ,బెంగాల్ లో హరనాధ తారక సిద్ధాంత శిరోమణి భట్టా చార్యులవద్ద న్యాయ శాస్త్రం నేర్చారు .తిరిగి వచ్చి ఆత్మకూరు హైస్కూల్ లో తెలుగుపండిట్ గా పని చేశారు .

శాస్త్రిగారి గీర్వాణ కృతులు -1-సింధు కౌస్తుభం –కలియుగం లో వాజపేయ యాగము ఎలాచేయాలో వివరించారు .2-ఇందిరా నందనం –నాట్య ,అలంకార శాస్త్ర విషయాల వివరణ చేశారు .౩-భట్ట తాత్పర్య భూషణం –శక్తివాడంపై చర్చ చేశారు అలంకార వక్రోక్తి మున్నగువానిపై రాశారు .ఈయన తమ్ముడు చంద్ర శేఖరుడు ‘’శ్రీరామ మందహాసం ‘’అనే సంస్కృత మహా కావ్యం రాశారు .

4 9 2 –శ్రీ పుల్లా పంతుల వెంకట రామ శర్మ

గొప్ప సంస్కృత విజ్ఞాని. ఆజన్మ కవి .గద్వాల్ సంస్థాన0 లో పదమూడుఏళ్ళ కే  ఆశుకవిత్వం చెప్పి మెప్పించారు కర్నూల్ మునిసిపల్ హైస్కూల్ తెలుగు పండిట్ గా ఉన్నారు .లెక్కలేనన్ని అష్టావధానాలు చేశారు .శర్మగారి సంస్కృత రచనలు –గజేంద్ర మోక్షం పద్ధతిలో ‘’రాజ రాజ కావ్యం ‘’రాశారు ‘’శ్రీ రాఘవేంద్ర ప్రభాత స్తవ రత్నమాల ‘’,రాశారు

493–శ్రీ బచ్చు సుబ్బారాయుడు (19 02 -19 75)

బనగాన పల్లిలో ‘’ఔకు ‘’గ్రామం లో పుట్టిన రాయుడుగారి తలిదండ్రులు పార్వతమ్మ ,నాగయ్యలు .రాచర్ల శ్రీనివాసాచార్యులు గారి వద్ద సంస్కృతం అభ్యసించారు .సంస్కృతం లో ‘’సీతా రావణ సంవాదఝరి ‘’రాసారు .దీనికి ఒక నేపధ్యం ఉంది .మైసూర్ సంస్థా నకవి చామ రాజ రామ శాస్త్రి ‘’సీతా రావణ సంవాద ఝారి ‘’అనే శ్లేష కావ్యం రాశాడు .ఇందులో సీతా రావణులమధ్య సంభాష ణనలున్నాయి .రామ శాస్త్రి  దీన్ని వంద శ్లోకాలలో రాస్తానని యాభై రాయగానే చనిపోయాడు .తన కావ్యాన్ని ఎవరైనా పూర్తీ చేస్తే కృతజ్ఞత ప్రకటిస్తానని మరణానికి ముందు చెప్పాడు .మన సుబ్బారాయుడుగారు దీన్ని సవాలుగా తీసుకుని పూర్తీ చేసి కవికి ఆత్మ శాంతి కలిగించాడు .

ఇదికాక ‘’శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సుప్రభాతం ‘’,స్తవ మంజరీ ‘’కూడా రాశారు .

494 –శ్రీ పండిత పద్మనాభాచార్యులు (19 25-19 9 2 )

ఆత్మ కూరులో 19 25 లో పుట్టిన శ్రీ ఆచార్యులవారు ఆనంద తీర్ధ నాగాంబ లకుమారుడు .సంస్కృత వ్యాకరణ శాస్త్రం లో ఇటీవల కాలం లో వీరంత గొప్ప పండితులే లేరని పించారు .సర్వ శాస్త్ర పారంగతులు .మహా మహోపాధ్యాయులైన గురువులవడద్ద తర్క వ్యాకరణ మీమాంస వేదాన్తాలను నేర్చారు .కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి ఆత్మకూరు వచ్చినప్పుడు ఆచార్యుల వారింటికి వచ్చి ‘’ద్వైతా ద్వైత చర్చ ‘’చేసారు .అంతకు పూర్వం కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి పద్మనాభా చార్యుల వారింట ‘’న్యాయామ్రుతాద్వైత సిద్ధి ‘’పై చర్చించారు అంతటి మహా పండితులు ఆచార్యులవారు .

వీరి సంస్కృత రచనలు –‘’పరిభా  షేందు  శేఖర వ్యాఖ్య ,’’, శబ్దేందు  శేఖర వ్యాఖ్య ,న్యాయ కుసుమాంజలి వ్యాఖ్య ,పంచ సూక్తి వ్యాఖ్య ‘’చాలా ప్రసిద్ధమైనవి .’’అద్వైత తత్వ చంద్రిక ‘’అనేవీరి అపూర్వ గ్రంధం సర్వ జనామోదం పొందింది .పాణిని విద్యాలయం స్థాపించి ప్రిన్సిపాల్ గా పని చేశారు కంచి కామ కోటి పీఠంసహాయం తో వేద పాఠ శాల స్థాపించారు .వీరి కుమారుడు ఆనంద తీర్ధ వ్యాకరణ వేదాంత పండితులు

495 –శ్రీ పత్రీ రాఘవ శర్మ

కందుకూరు వాసి .’’శివ సహస్ర నామ స్తోత్రం ‘’కు వ్యాఖ్యానం రాశారు .

496 –శ్రీ మంకాల కృష్ణ శాస్త్రి

కరివెన వారి ఆగ్రహారానికి చెందిన శాస్త్రిగారు గొప్ప వైయాకరణులు .’’అహోబిల సుప్రభాతం ‘’రాశారు .

4 9 7 –శ్రీ కానాల నల చక్ర వర్తి (19 53

ఆత్మకూరుకు చెందిన కానాల వారు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం లో పని చేస్తున్నారు .సంస్కృత విద్యపై  బహుగ్రంధ రచన చేశారు .వారి రచనలలో ‘’శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ మళయాళ యతీంద్ర శతకం ,వాల్మీకి మహర్షేః-విప్లవాత్మక భావః ‘’,ఆటవిక బాలకః ‘’ముఖ్యమైనవి .

కడప కర్నూలు కవులు సమాప్తం –వరంగల్ వెడదాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ -9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.