ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే
నిన్న బుధవారం 30-9-15 రాత్రి 9-30 కుమీ కేంద్రం నుండి ప్రసారమైన డా .శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు రాసిన ”తూర్పు -పడమర ”నాటిక ఈ కాలపు ఆలోచనల కు అద్దం పట్టింది .సర్వమ్ తెలిసిన జ్ఞాన వృద్దు శ్రీ రామలింగేశ్వర రాగారి సమగ్ర సదవగాహనకు రూపంగా నిల్చింది . బి టెక్ పాసై ఒక్క గానొ క్క కూతురు అమెరికా కు పై చదువులకు తలిదండ్రులకు తెలియ కుండానే అప్ప్లై చేయటం సీటు రావటం ఆమెతో బాటే అప్ప్లై చేసి సీటు సాధించిన కూతురి తండ్రిద్వారా ఈ తండ్రికి విషయం తెలియటం ఇంటికొచ్చి ముగ్గురు మధన పడటం ఈ నాటి మధ్య తరగతి కుటుంబ స్తితిని సూచించింది పెళ్ళిచేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుందని ,తెలిసినవాదికిస్తే ఇబ్బంది ఉండదని తలిదండ్రుల భావన అయితే స్వశక్తితో ఎదగాలని కూతురి ఆలోచన .ఇన్దులొ ఎవరిదీ తప్పుకాదు . చివరకు వారిలో వారే సమస్యను అన్నికోణాలలో ఆలోచించి పరిష్కరించుకోవటం ,కొంత రాజీ పడటం బాగుంది .
అలాగే అమెరికా లో ఉండే రెండు తెలుగు కుటుంబాల అంతర్మధనం ,అక్కడ ఆడపిల్ల పెరిగిపెద్దడైతే మనమాట వినదేమోనని ,ఇష్టం వచ్చినవాడిని ముక్కూ మొహం తెలియనివాడిని చేసుకొంటుం దేమో ననే భయం తో ఇండియాకు వెళ్ళిపోదామన్న ఒక తండ్రి ,అది తప్పుడు అభిప్రాయమని వారించిన పక్వ బుద్ధిగల భార్య ,అదే సమయం లో కుటుంబాన్ని అదేకారణా లతో ఇండియా పంపించేసి ,అక్కడ పిల్లల అనారోగ్యం ఆ వాతావరణానికి ఇమడ లేకపోవటం గుర్తించి అది తప్పు అని తెలుసుకొన్న మరో తండ్రీ . ఇండియా అయినా అమెరికా అయినా మనిషి బుద్ధిలో పురుగు తోలిస్తే చేసేదేమీ లేదని ,అమెరికాలో డేటింగ్ సమస్య ఉంటె ఇండియాలో” మృగాళ్ళు ,,నిర్భయ ఉదంతాలు ”సర్వసామాన్యమని తెలుసుకోవటం మంచి ముగింపు . దేశం కాని దేశం లోనూ సహాయ సహకారాలు అందించే సహృదయులు ఉంటారని తెలుసుకోవటమూ స్నేహ తలిదండ్రులకు అది ఊరట కలిగించి భార హృదయం తోనైనా చివరికి నిండుమనసుతో అమెరికా పంపటం ”ఆల్ ఈజ్ వెల్ దట్ ఎంద్స్ వెల్ ”గా నాటిక ముగించటం ”సీసండ్ రైటర్” రావు గారికే చెల్లింది . సంభాషణలు పదునుగా సందార్భానికి తగినట్లు ,పాత్రల మనోభావాల సూచికలుగా నిండుగా ఉన్నాయి అందరూ సమర్ధంగా నటించి మెప్పించారు . దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనిపించింది మంచి నాటిక ప్రసారం చేసినందుకు అభినందనలు .
గాంధీ జయంతి శుభాకాంక్షలతో
-దుర్గా ప్రసాద్-1-10-15 -కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్
—