గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు

510 –శ్రీ యామవరం రామ శాస్త్రి (19 ౦౦

మెదక్ జిల్లా కాకుమాను గ్రామం లో జన్మించిన శ్రీ రామ శాస్స్త్రి రామకృష్ణ పండితుని మనవడు ,.కుటుంబం లో అందరూ కవి పండితులే .కాకుమాను రామ శాస్త్రి గా ప్రసిద్ధులు .శ్రీ విఠల చంద్ర మౌళి వద్ద వేదాంతాన్ని ,పినతండ్రి కృష్ణ శాస్త్రి వద్ద సంస్కృత కవిత్వాన్ని అభ్యసించారు .దొంతి సంస్థాన విద్వాంసుడు వెంకట పౌన్దరీక యజ్వ దగ్గర కావ్య శాస్త్రాలు నేర్చారు .

పాతికేళ్ళ వయసులోనే(19 19 ) రామశాస్త్రి’’ చిత్ర కవిత్వానికి ‘’ఆకర్షితులయ్యారు .25 0 శ్లోకాలతో నాలుగు భాగాలుగా ,18 ఖండాలుగా ‘’గురు స్తుతి ‘’కావ్యం రాశారు .కాని మొదటిభాగం లో 88 శ్లోకాలు మాత్రమె తెలుగు అచ్చులో అచ్చు అయ్యాయి .మొదటిభాగం లో 5 ఖండాలున్నాయి అవి-ప్రణవాదిశ్లేష ఖండం ,బ్రహ్మాది శ్లేష ఖండం ,బృహస్పత్యాది శ్లేష ఖండం ,సంకీర్ణ శ్లేష ఖండం ,చిత్ర శ్లేష ఖండం .గురువు యొక్క గొప్పతనాన్ని శ్లేష ,యమక ,అనుప్రాస ,ఏకాక్షర ,ద్వ్యక్షర కవిత్వాలలో చెప్పారు .చిత్ర కవితకు గొప్ప ఉదాహరణగా ఈ కావ్యం ఈ ఇరవయ్యవ శతాబ్దం లో శాశ్వతంగా నిలిచింది .ఇన్ని రకాల శ్లేష లను ప్రయోగించటం వలన ‘’శ్లేష యమక చక్ర వర్తి ‘’బిరుదు పొందారు .కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం –

విష్ణువును గురువును శ్లేషలో వర్ణించే శ్లోకం –‘’పరతవ బుద్ధ్యా చ  ప్రవిస్టాన్-దసస్వ సుదర్శనాభ్యాం-స్వరస్తాన్ గురుః పుణ్య జనాన్ సుసత్వాన్ –కుర్వన్ స దామోదర తాముపైతి ‘’

మరోశ్లోకం లో గురువును స్త్రీని శ్లేష లో పోలుస్తూ చెప్పారు –‘’అభ్రా మధ్యా నయజ్నా త్య సమస్త నమితా సుహృత్ –ప్రాతివ్రత్య పరా పాతత్ –భామేవ హ్యక్రుతి ర్గురేః’’

ప్రశ్నోత్తర మాలి కి ఒక ఉదాహరణ –‘’కోపమాన్ విహీనః స్యాత్ ?(కోప మాన విహీనః స్యాత్ )

‘’సద్గురొఃకా మహాత్మా ?(సద్గురేః కా మహాత్మతా )

చిత్ర శ్లేష ఖండం నుంచి ఒక ఉదాహరణ –పామావాంశ్చ పరాజితః –సుసమితౌ కాపాలికా సన్మతా

విస్టఃకోపమాలా శ్యాస్చ పశుభౌ –లబ్ధ్వా విపద్వి జ్జనితం –కృత్వా తాపాప రాయ ణాన్శ్రిత జనాన్ సర్వోపకారీ మహా

పాపాత్మా పది తోశిరే పరహితత్వం త్వం భావాప్యామలః ‘’

ఇందులో’’ ప ‘’అక్షరం ఉన్నప్పుడు ఒక శబ్దం తీసేస్తే వేరొక శబ్దం వస్తాయి ప ఉంటె చెడు అర్ధం తీసేస్తే మంచి అర్ధం రావటం ఈ చిత్ర కవిత్వ లక్షణం .

ఈ విధంగాఇరవై వ శతాబ్ది లో  ద్వ్యర్ధి ,యమక కావ్యాలురాసిన కవులు  చాలా అరుదుగా మెదక్ జిల్లాలో ఉన్నారు

51 1-శ్రీ గౌరీ భట్ల రామ కృష్ణ శర్మ

మెదక్ జిల్లా తోగూటమండలం .వెంకట్రావు పేటకు చెందిన కృష్ణశర్మ గారు మహా పండితులు .అవదానాలలో  చేయి తిరిగినవారు .సికందరాబాద్ లోనిలాల్గుడి లో ఉన్న  తూములూరి శివ రామ కృష్ణ శర్మ మునిసిపల్ సంస్కృత విద్యాలయం విద్యార్ధి .అక్కడే మహా గురువులవద్ద  సిద్ధాంత కౌముది ,పంచ మహాకావ్యాలు అవధాన విద్యా నేర్చారు .ప్రసిద్ధ అవధానిగా పేరొందారు .సంస్కృతాంధ్రాలలో చాలా అవధానాలు చేసి సమర్ధతను చాటారు .’’కవి శార్దూల కిశోరం ‘’బిరుదును శ్రీ యాదగిరి గుట్ట దేవాలయం లో శ్రీ ఖండవల్లి నరసింహ శాస్త్రి ,శ్రీ మల్లాది దక్షిణా మూర్తి శాస్త్రి గారల సమక్షం లో అందుకొన్నారు .సంస్కృతం లో విస్తృత రచన చేశారు . ‘’సహ బాల మానస పూజ ‘’అనే 10 8 శ్లోకాల భారతం ను యమకం లో రాశారు .మచ్చుకి ఒకటి –

‘’విలాపనం  లపనం మామ మామిమాం –కలయ పాలయ పార్ధ కుటుంబినీం

స్వస్తితే స్తితోగ్రపరా భవత్ –నిస్త భారత భార వహ ప్రభో ‘’

51 2 –మహాత్మా అప్పల విశ్వనాధ శర్మ (19 ౩౦ -20 ౦౦ )

యశోదా ,నారాయణ బాబుల సుపుత్రులే విశ్వనాధ శర్మగారు .మెదక్ జిల్లా మార్కూర్ లోని  పాండు రంగాశ్రమం లో జన్మించారు .’’పాండురంగ సుప్రభాతం ‘’ను ద్రాక్షాపాకం లో రాశారు .’’రాదా కృష్ణ సంవాదం ‘’కూడా రచించారు –ఒక ఉదాహరణ శ్లోకం –

‘’నీతం నవ నవ నీతం నీతం నీతంచ కిం తేన –ఆతపాతా పితా భూమై మాధవ మాధావ మధావ

శ్రీ రసారామ ప్రహ్రుత్య శండ్యా స్వీకృతం యది పలాయనంతట్-మానసే మమ  నితాంత తమసే నంద నందన కిమహో నిలీయసే ‘’

51 3 –శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ (19 40

సిద్ధిపేట ప్రభుత్వ  జూనియర్ కాలేజి తెలుగు లెక్చరర్ అయిన పద్మనాభ శర్మగారు ‘’అద్వైత గీత ‘’సంస్కృత రచన చేశారు .తెలుగు వ్యాఖ్యానమూ రాసి ‘’దర్శన ‘’మాసపత్రికలో ప్రచురించారు .గురుకుల విద్యాభ్యాసం తర్వాత అద్వైత వేదాంతాన్ని నేర్చారు .

కరీం నగర్ ,మందని లలో సంస్కృత విద్వాంసులున్నారు కాని సంస్కృత రచనలు చేసినట్లు కనిపించదు .

51 4 –శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (19 35

ధర్మ పురి లో శ్రీ లక్ష్మీ నరసింహ సంస్క్రుతకళా శాల ఉంది .ఎందరో దీనిలో చదివి గొప్ప పండితులయ్యారు .రచనలూ చేశారు .వారిలో రాజన్న శాస్త్రిగారు ప్రధములు .’’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ‘’రాశారు .’’సుమనోంజలి ;;ణి ‘’వసుమతీ సుధాకరం ‘’అనే సంస్కృత నాటకాన్ని రచించారు .ఈ నాటకం ‘’కుటుంబ నియంత్రణ ‘’విషయం  పై రాసినది .

ఇక్కడే సంగన భట్ల వారున్నారు వారు కూడా సంస్కృత కావ్యాలు రాసినట్లు తెలుస్తోంది .శ్రీ సంగణ భట్ల నరసయ్యగారు ధర్మ పురి సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేసి చాలా గ్రంధాలు రచించారు

51 5 –శ్రీ మామిడి పల్లి సాంబయ్య (19 ౦౦-19 70)

వేములవాడకు చెందిన  సాంబయ్య గారు నూట ఎనిమిది శ్లోకాలతో ‘’వేములవాడ రాజ రాజేశ్వరి  శతకం ‘’రాశారు . ‘’సుప్రభాతం’’కూడా చేశారు దీని మకుటం ‘’లెంబాల వాటిక విభో తవ సుప్రభాతం ‘’

51 6 –శ్రీ త్రిగుళ్ళ శ్రీహరి శర్మ (19 50

శర్మగారు వేములవాడకు చెందినవారు .అక్కడిసంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నారు .సంస్క్రుతకావ్యాలు చాలా రాశారు .సంస్కృతం లో అవధానాలూ చేశారు .

51 7 –శ్రీ కోరుట్ల కృష్ణమాచార్య

కరీం నగర్ జిల్లా కోరుట్ల సంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయిన కృష్ణమాచార్య గారు మూడు సంస్కృత కావ్యాలు రచించారు . శ్రీ వైష్ణవ తత్వాన్ని వర్ణించే ‘’గురువంశ మహా కావ్యం [‘’,రాశారు .మెల్కోటే లో ఉన్న రామ ప్రియ దైవానికి బీబీ నాంచారి కి ఉన్న ప్రేమను వివాహాన్ని వర్ణిస్తూ ‘’సంపత్ కుమార సంభవం ‘’కావ్యం రాశారు .కాళిదాసు మేఘ సందేశానికి అనురూపంగా ‘’మనః సందేశం ‘’రాశారు .

51 8 –శ్రీ కొల్లేగల్ ఆర్ .సుబ్రహ్మణ్యం (19 29

కర్ణాటకలో కొల్లేగల్ అనే వ్హిన్న గ్రామానికి చెందినవారు .హైదరాబాద్ లో స్థిర పడ్డారు .ఆంధ్రప్రదేశ్ లో గొప్ప సంగీత విద్వాంసులుగా పేరుపొందారు . సంగీత విద్యను శ్రీ బాలక్కవాదివరద రాజ అయ్యంగార్ ,శ్రీ ఆర్ బాల కృష్ణ ల వద్ద నేర్చుకు న్నారు .శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో దీక్షగా ‘’ఉంచ వ్రుత్తి ‘’చేస్తూ భక్తిగా పాల్గొంటారు .అన్నిభాషలలో గొప్ప పాండిత్యమున్నవారు .సంస్కృత తెలుగు కన్నడ ,తమిళ  భాషల్లో ఎన్నో కృతులు రాశారు .హిందీ మలయాళం లలోనూ కొన్ని కృతులు చేశారు .మొత్తం మీద 45 0 కృతులు చేసిన ఘనత వీరిది .

ఇక్కడి తోఆంద్ర ,తెలంగాణా లలో స్వాతంత్ర్యానంతర గీర్వాణ కవుల గురించి రాయటం పూర్తీ అయింది .

మనవి –ఏదో సరదాగా మొదలు పెట్టిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’మొదటి భాగం లో 1 4 6 కవుల గురించి రాసి పుస్తకం గా తెచ్చిన విషయం మీకు తెలుసు .రెండవ భాగం ప్రారంభించి 1 4 7 నుంచి 4 0 0 వరకు అంటే 2 5 4 మంది సంస్కృతకవులను గూర్చి రాశాను .మూడవ భాగం లో 4 0 1 నుండి 5 1 8 వరకు అంటే 1 1 8 మంది స్వాతంత్ర్యానంతర గీర్వాణ కవులను పరిచయం చేశాను .అంటే సంస్కృత కవుల ను శ్రీ శంకరాచార్యులవారితో ప్రారంభించి,అన్ని రాష్ట్రాల ,అన్ని సమీప దేశాలలో,అన్నికాలాల్లో  ఉన్న కవులను ,  దాదాపు నిన్నటి మొన్నటి వరకు సంస్కృత రచనలు చేసిన వారందరి గురింఛి అంటే మొత్తం 5 1 8 కవుల గురించి  రాసిన అదృష్ట వంతుడిని .అది నా పూర్వజన్మ సుకృతం మా తలిదండ్రుల ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వాముల  సంపూర్ణ అనుగ్రహం ,సాహితీ బంధువుల తోడ్పాటు అని సవినయంగా మనవి చేస్తున్నాను .ఇంత విస్తృత రచన చేయగలనని నేను భావించలేదు .అన్ని ప్రక్రియలను ,అన్నికాలాల వారిని పరిచయం చేసినందుకు మహదానందంగా ఉంది .చదివి ప్రోత్సహించిన వారికి, నాకు కావలసిన విషయాలను గ్రంధ రూపం గా అందజేసిన సహ్రుదయులందరికి మరొక్క సారి వినయాంజలి ఘటిస్తున్నాను .,ఇప్పుడు రాసినది అంతా  సమగ్రం, సంపూర్ణం కాదని ,కేవలం ప్రాధమిక విషయాలేనని ,ఇంకావారిని గురించి రాయవలసింది ఎంతో ఉండవచ్చని , రాయవలసిన వారు ఇంకా ఉండిపోయి ఉండవచ్చు నని , సకృత్తుగా ఇంకెవరైనా మిగిలిపోతే  వారి విషయాలు తెలిస్తే వారిని గూర్చి కూడా రాయగలనని తెలియ జేస్తున్నాను . .ప్రస్తుతానికి ఇంతే .సెలవు –

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -౩1 -9-15 –కాంప్- మల్లాపూర్ -హైదరాబాద్

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.