ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76

32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్-2(చివరిభాగం )

హేతుత్వం (కాసువాలిటి)గ్రీకుల కాలం నుండి వస్తున్నపదమే .న్యూటన్ కాలం లో దాని ప్రభావం పెరిగింది .ఏదైనా కొంత సమాచారం ఇస్తే జరుగబోయే దాన్ని ఊహించి (ప్రిడిక్ట్ )కార్య కారణ సంబంధం ఆధారంగా చెప్పవచ్చు.గ్రహణాలు ఎప్పుడేర్పడేది ముందే చెప్పవచ్చు .కాని కాజువాలిటీ దీన్నిదాటి చాలా ముందుకు వెళ్ళింది .చేతిలోంచి విసిరే పావులని ఆచేయి అన్నికోణాలను అర్ధం చేసుకొంటే చెప్పవచ్చు .మనిషి భవిష్యత్తును గతం లో  అతని భౌతిక మానసిక స్తితిని అధ్యయనం చేసి చెప్పవచ్చు . అలాగేఖచ్చిత౦  గా ఆకాశం లో నక్షత్రాల లోని సూత్రాలను ఎలా చెప్పగాలిగారో అలాగే పరమాణువు లోని వాటినీ చెప్పవచ్చు .మనిషి మెదడు లో నాడీ స్పందన ప్రారంభం ఆగిపోవటం లను బట్టిఅతని కొత్త ఆలోచనను పసిగట్ట వచ్చు .

అసంభావ్య సూత్రం కాజువాలిటి కున్న అడ్డంకుల్ని తొలగించింది .ఫిలసాఫికల్ ఆలోచన చర్చకు దానినుంచి స్పెక్యులేషన్ కు దారి తీసింది .కొందరు సైంటిస్ట్ ల దృష్టిలో మన సాధారణ విశ్వం’’ పరమాణువుల చాన్స్ మోషన్’’ వలన మార్పు చెందింది .ఐన్ స్టీన్ లాంటి వారు ‘’దేవుడువిశ్వం తో  పావుల ఆట ఆడడు ‘’(God lays dice with the universe )అని నమ్మారు .ప్లాంక్ ఈ ఇద్దరి భావాలలో మధ్యేమార్గాన్ని అనుసరించాడు .కాజువాలిటి కి కొత్త పాజిటివిజం కు మధ్య ఉన్న తగాదా ఫిలసాఫికల్ ఆలోచనలకేకాక ,సైన్స్ కు ఉన్న వాస్తవ బాధ్యతలకూ చాలా అవసరం అని భావించాడు .తన ‘’క్వాంటం దీరీ ‘’ని నీరు గార్చటానికి ఒప్పుకోలేదు .ఆయన ‘’ఇప్పటికి సైన్స్ సామాన్య మానవ ఆలోచనలను మించి ముందుకు వెళ్ళింది .ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల పరిధి కూడా దాటి అభి వృద్ధి చెందింది .ఇలా ఇదే వేగం తో ఇవే శక్తి సామర్ధ్యాలు ,ముందు చూపు తో ముందుకు వెళ్లి నా ప్రక్రుతిలోని మిస్టరి ని  చేదించ లేము . దీనికికారణం ఇప్పటివరకు మనం చూసిన విరుద్ధత (డి స్క్రేపెన్సీ)ప్రక్రుతికి కాజువాలిటి  ప్రిన్సిపుల్ కి మధ్య ఉన్నదికాదు  .మనం గీసిన ప్రక్రుతి చిత్రానికి ,వాస్తవం గా మనం చూస్తున్న ప్రకృతికి మధ్య ఉన్నది మాత్రమె అన్నాడు ప్లాంక్ ..

మాక్స్ ప్లాంక్ కున్న నిజాయితీ, ఆలోచనలు, నమ్మకాలను గుర్తించి ఆయన్ను ‘’సైంటిస్ట్ లకే సైంటిస్ట్ ‘’అని గౌరవమిచ్చారు .సమకాలీనులేకాక అన్ని దేశాలవారూ ప్లాంక్ ను అభినందించారు .1918లో ప్లాంక్ కు నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మహా మేధావి ఐన్ స్టీన్ ,నీల్స్ బోర్ ,రూధర్ ఫోర్డ్, హీసేన్ బెర్గ్ లాంటి హేమా హేమీ సైంటిస్ట్ లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి అభినందించారు .ఇదొక చారిత్రాత్మక ఘట్టమే  అయింది ఆ నాడు .న్యాయం గా పై వారిలో ప్రతిఒక్కరూ ఆనాడు నోబెల్ ప్రైజ్ కు అర్హులే అంతటి కృషి చేసినవారే .కాని ప్లాంక్ కు  ఇవ్వాలన్న దానిలో ఎవరికీ ఆక్షేపణ లేకపోవటం గమనార్హం .

బిరుదులూ ,గౌరవాలు వచ్చి మీదపడుతున్నా అరవై ఏళ్ళకు ప్లాంక్ విచార గ్రస్తుడయ్యాడు.మొదటి ప్రపంచ యుద్ధం ఆయనకు వ్యక్తిగతంగా ,జనసామాన్యానికి కూడా విషాదం మిగిల్చింది .1916 వెర్దాం  యుద్ధం లో ప్లాంక్ పెద్దకొడుకు కారల్ చనిపోయాడు .రెండవ ప్రపంచ యుద్ధం మరీ సంక్షోభం కలిగించింది .రెండవ కొడుకు ఎర్విన్ జర్మన్ టెర్రరిజానికి బలైనాడు.విమాన దాడిలో ప్లాంక్ ఇంటిమీద బాంబులు పడి ,జీవితకాలం అంతా సాధించి దాచుకొన్నఅపూర్వ విలువైన గ్రందాలున్న  ఆయన స్వంత లైబ్రరీఅగ్ని జ్వాలలకు ఆహుతి పోయింది .వీటిని అన్నిటినీ భరించే శక్తి లేకపోయింది .కాస్సెల్ లో లెక్చర్ ఇస్తూ విమానదాడి నుండి రక్షించుకొనే  షెల్టర్లో కొన్ని గంటలు ఉండిపోవాల్సోచ్చింది .1945 మే నెలలో ఒక అమెరికన్ జీపు చూసి ఆయన్ను కాపాడి అమెరికా ఆక్రమిత సురక్షితమైన గూటెన్  బెర్గ్ కు తీసుకొని వెళ్ళింది .ఇక్కడే మాక్స్ ప్లాంక్4-10-1947న 90  జన్మ దినోత్సవానికి  కొన్ని నెలలముందే  ప్రాణాలు విడిచాడు .  సుదీర్ఘకాలం ,ఆదర్శవంతమైన సమర్ధమైన జీఎవితం గడిపాడు ప్లాంక్ .ఆయన  జీవితకాలం లోనే తన క్వాంటం మెకానిక్స్ ఫిజిక్స్ ను డామినేట్ చేయటం చూసి ఆనందించిన అదృష్టవంతుడు ప్లాంక్ .ఆయన క్వాంటం మెకానిక్స్ గగుర్పొడిచే సత్యం .అది భౌతిక శాస్త్రాన్ని ఫిలాసఫీ ని బాలన్స్ చేసి, విశ్వవ్యాప్తమైంది .

పది ఉత్తమ విజ్ఞానశాస్త్ర గ్రంధాలు రచించాడు ప్లాంక్ .’’నమ్మటం అంటే సత్యాన్ని గుర్తించటమే .సైన్స్ అభి వృద్ధి చెందుతున్నకొద్దీ మిరకిల్స్ క్రమక్రమగా వెనకడుగు వేస్తాయి .మత విశ్వాసాలు బాగా ఉన్నా ఏదోఒక దేవుడు అంటే అభిమానం నాకు లేదు ‘’అన్నాడు .ప్లాంక్ నేతృత్వం లో కైజర్ వేల్హాం సొసైటీ నాజీయిజానికి వ్యతిరేకం గా పోరాడలేదు .అమ్మోనియా ను కృత్రిమం గా  ఉత్పత్తి చేసిన జ్యూ  అయిన  హేబర్ శాస్త్ర వేత్త విషయం లో ఉదారంగా వ్యవహరించమని ప్లాంక్ హిట్లర్ ను కోరినా ఆనియంత అంగీకరించలేదు . ఆ తర్వాత .కొన్ని నెలలకే హేబర్ చనిపోయాడు .ఏడాది తర్వాత కైజర్ వేల్హాం సొసైటీ ప్రెసిడెంట్ గా హేబర్ కు తగిన స్మ్రుతి చిహ్నాన్ని ఏర్పరచాడు .ఎందరో జ్యూయిష్ సైంటిస్ట్ లకు తన సంస్థ లో పని చేయటానికి ఒప్పించి పని చేయించిన సమర్ధుడు ప్లాంక్ .1938లో ప్లాంక్ 80వ జన్మ దినానికి ‘’మాక్స్ ప్లాంక్ మెడల్ ‘’ఏర్పాటు చేసి ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ లూయిస్ డీ బ్రొగ్లీ కి ఇచ్చాడు . 38తర్వాత ప్రష్యన్ అకాడెమి  స్వాతంత్ర్యం కోల్పోవటం తో  నాజీల వశమైంది .ప్లాంక్ పూర్వీకులు తాము పదహారవ వంతు జ్యూలం అన్నారుకాని ప్లాంక్ ఒప్పుకోలేదు .

1933లో ప్లాంక్ కు 74 ఏళ్ళ వయసులో జర్మనీలోని ప్లాంక్ కు తెలిసిన ఎందరో జ్యూయిష్ స్నేహితులు ,బంధువులను పదవులనుండి నాజీలు తప్పించాఋ . కొందరు  ఇతర దేశాలకు వెళ్లి పోవటమో జరిగింది .కొందరిని ఒప్పించి సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని నచ్చ చెప్పి  ఇక్కడే పని చేయించాడు .కాని బహిరంగం గా నాజీలను వ్యతిరేకించలేదు .మాక్స్ ప్లాంక్ సోసైటీఏర్పరచి అధ్యక్షుడై నాడు . అదే 83సోసైటీలుగా అభివృద్ధి చెంది ఎన్నో శాస్త్రీయ పరిశోధనలకు నెలవైనాయి.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-9-10-15-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.