ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )

ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )
చాలామందికి చాలా రకాల హాబీలుంటాయి .స్టాంప్ కలెక్షన్ ,నాణాలసేకరణ ఫోటోగ్రఫీ వగైరా .కాని వీటికి మించినదేమైనా ఉందా అనే ఆలోచన కొద్ది మందికే వస్తుంది .మన హాబీ సరదాకోసమే అయినా దాని వలన పరమ ప్రయోజనం కూడా ఉంటె అది చరితార్ధమవుతుంది .అప్పుడు కాలక్షేపమే కాదు ఆపదలో ఉన్న వారికి సహాయపడగలం అనే ధైర్య స్తైర్యాలు కలిగి సేవ చేశామనే సంతృప్తి వచ్చి మనసు ఆనందమయం అవుతుంది .ఏడాదిక్రితం విశాఖను అల్లల్లాడించిన హుద్ హూద్ తుఫాను భీభత్సం లో రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు మొదట్లో ఏమి చేయాలో పాలుకాక ఒక వాలంటరీ సంస్థను అర్ధిస్తే ఆ బృందం వెంటనే వెళ్లి పని ప్రారంభించి ఏంతో సేవ చేసింది .సేవ ఆటే శవాల్ని చేరవేయటమో అన్నం పొట్లాలు అందజేయటం వంటివి కావు. తుఫాను ఉద్ధృతి ,ఏవైపుకు వెడుతోంది ఎవరు ఎలా జాగ్రత్తపడాలి అనేవిషయాలను ప్రభుత్వానికి సలహాలిచ్చి మరింతమానవ హననం జరుగకుండా కాపాడింది .దీనినే ‘’హాం రేడియో సర్వీస్ ‘’లేక ఎమచ్యూర్ రేడియో ‘’అంటారు .ఇలాంటి విపత్కర పరిస్తితులలోనేకాదు హాయిగా ఇంట్లోకూచుని ప్రపంచ దేశాలలోని ఎందరెందరో ప్రధానులను రాస్త్రపతులను ,సైంటిస్ట్ లను సినీ స్టార్లను వారికి మనకు ఉన్న తీరిక వేళల్లో పలకరించ వచ్చు .వారి తో మన అభిప్రాయాలని పంచుకో వచ్చు .పూర్వం వచ్చిన దివిసీమ ఉప్పెనలో అంటార్కిటికా ఎక్స్ పెడిషన్ ,కేదార్ నాద్ వద్ద జరిగిన జలప్రళయం లో హాం రేడియో చేసిన కృషి అనితర సాధ్యమైంది. ప్రభుత్వాల మన్ననలు పొందింది .పని చేసిన హాం లకు ఎన్నో విలువైన బహుమతుల౦దు కొన్నారు .ఇదొక ‘’హాబీక్లబ్’’ .ఇందులో చేరటానికి అర్హత మన వయసు 12సంవత్సరాలు దాటటం మాత్రమె .విద్యార్హతా ఎంతున్నా ఏ ఉద్యోగం లో ఉన్నా ఉద్యోగం లేక పోయినా ఏహోదాలో పని చేస్తున్నా అందరూ దీనిలో సభ్యులు కావచ్చు .ఇది విశ్వవ్యాప్తమైన వాలంటరీ సంస్థ .
మనదేశం లో దీన్ని మొట్ట మొదట ప్రారంభించిన వాడు మా ఉయ్యూరు వాడు శ్రీ సూరి శ్రీరామ మూర్తి .మాతో బాటు హైస్కూల్ లో చదివిన మా జూనియర్ ,మా తమ్ముడి క్లాస్మేట్ .రెండు మార్కులు లెక్కల్లో తగ్గి ఎస్ ఎస్ సి తప్పినవాడు .తర్వాత పాసై డిఫెన్స్ లో చేరి మెట్ సెక్షన్ లో పని చేసి రిటైర్ అయి హాం రేడియో స్థాపించాడు .దీనితో అతనికిమాజీప్రధానులు ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గార్లతో అత్యంత సాన్నిహిత్యమేర్పడింది .వారి ప్రోత్సాహం తో హైదరాబాద్ లో హాం రేడియో వ్యవస్తను స్థాపించి అప్పటి నుంచి కృషి చేస్తున్నాడు .అతనిభార్య కొడుకు ,మరదలు అందరూ అందులో పని చేస్తూ ప్రపంచ ప్రఖ్యాత మైనారు .సూరి శ్రీరామ మూర్తి అనే పేరు పోయి ‘’హాం సూరి ‘’అయ్యాడు .అబ్దుల్ కలాం తో జోర్డాన్ రాజుతో ,అమెరికా ప్రెసిడెంట్ లతో హాం ద్వారా దగ్గరయ్యాడు .ఎందరో ఔత్సాహికులకు శిక్షణ నిచ్చి తీర్చి దిద్దాడు .ప్రతి ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ వ్యాప్త హాం ల సమావేశం లో పాల్గొంటాడు ఈ ఏడాది మే నెలలో కాలిఫోర్నియా లో జరిగిన సమావేశం లో సూరిని ఆసియా దేశ ప్రతిన్దిగా ఘనం గా సన్మానించారు .అతనిభార్యకూ అనేక సన్మానాలు జరిగాయి ఇద్దరూ ప్రపంచం లో ఎన్నో దేశాలు సందర్శించి హాం వ్యాప్తికి తోడ్పడ్డారు .మొన్న ఆది ,సోమవారాల్లోసూరి మా ఇంటికి వచ్చి చాలా సేపు ఈ విషయాలన్నీ చెప్పాడు .హాం ను ప్రతి స్కూల్, కాలేజిలో విద్యార్ధులకు నేర్పాలనే ఆశయ౦ అతనిది .అందుకని దాని కి సంబంధించిన పూర్తీ వివరాలు నాకు అందించాడు .నేను మీకు సరసభారతి ద్వారా ఈ రోజు నుండి ధారావాహిక గా అందజేస్తున్నాను .మన ఆకాశ వాణి ‘’బహుజన హితాయ –బహు జన సుఖాయ ‘’అనే ఆశయం తో పని చేస్తుంది .హాం ఆశయమూ అదే.
ఎమేచ్యూర్ రేడియో అంటే ?
ఎమచ్యూర్ అంటే ఔత్సాహికులు అన్నమాట .దీనికి కావలసింది ఉత్సాహం .ఉత్సాహం ఉన్న వారంతా ఔత్చాహికులే .ఈఎమచ్యూర్ రేడియోలను ఉపయోగించే వారిని అంటే ఆపరేటర్ లను’’హాంలు ‘’అంటారు .హాం అంటే సుత్తి అని సుత్తి వీరభద్ర రావు జంధ్యాల గుర్తుకు రానక్కరలేదు వీళ్ళు అందులో వీరభద్రరావు లాగా ‘’హామ్మర్ ‘’లు కాదు. కనుక కంగారక్కర్లేదు .హాం ను ఆపరేట్ చేసేవారిని హాం లు అంటారు అంటే హామ్మర్ అని అనరాదు .హామ్స్ అందరూ వైర్లెస్ తో పని చేస్తారు మరి దీనికి పంపే సాధనం ‘’వైర్లెస్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిటర్ ‘’,గ్రహించే సాధనం అంటే రిసీవర్ ఉంటాయి కదా .ఆ రెండిటితో హాం లు పని చేస్తారు .ట్రాన్స్ మిటర్ను ఎవరికి వారు స్వంతంగా తయారు చేసుకోవచ్చు .మన రేడియోనే రిసీవర్ గా వాడుకో వచ్చు చూశారా యెంత సింపుల్ గా ఉందొ వ్యవస్థ ?ఇదికాదనుకొంటే ‘’ట్రాన్స్మిటర్+రిసీవర్ గా ఉండేదాన్ని (ట్రాన్సీవర్)ను బజార్లో కొనుక్కో వచ్చు .ఇలా స్వంత రేడియో,త్రాన్స్మిటర్ వ్యవస్థను ఇంట్లోనే ఏర్పాటు చేసు కొని వాటితో మన దేశం లోను ,ఇతర దేశాలలోను ఉన్న 30 లక్షల మంది హాం లతో తీరుబడి ఉన్న సమయాలలో మాట్లాడుకోవటం ఒక హాబీ .హాం రేడియో వాడుకోవటానికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందాలి .చాలామందికి ఇది అత్యవసర సమయాలలో సేవ చేయటానికి (సర్వీస్ )ఒక సాధనమౌతుంది .హాం లకు ఉత్సాహమే ఊపిరి .తీరిక వేళల్లో ఒక గొప్ప హాబీ .ఈ అందమైన అభిరుచి కోసం కొంచెం ఖర్చు పెట్టాలి అంతే.హాం రేడియో ఏర్పరచుకొని హాం క్లబ్ లో సభ్యులైతే ఎందరందరో ప్రముఖులతో మాట్లాడుకోవచ్చు .సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ,కలాం వీరందరూ హాములే . (హామ్స్ ) .మిగిలిన విషయాలు ఈ సారి .
సశేషం
నవరాత్రి శుభా కాంక్షలతో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.