‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2
14-భ్రాస్ట్రే న్యంతం బీజ మేవా భవద్ది-భండాధీనం లోకజాలం నతాత్
సామ్నా రక్షే త్క్లేదయిత్వా య ఏత –న్నో పశ్యామ న్తం సమర్ధం త్వదన్యం ‘’
తా- ‘’భండాసురుని చేతికి చిక్కిన లోకాలన్నీ మంగలం లో వేయించబడే గింజల్లా మాడిపోయాయి .వాడి పీడ తొలగించి లోకాలను కాపాడే వాడు నువ్వు తప్ప వేరెవరూ కనిపించలేదు’’అన్నాడు నారదుడు .
15-‘’స్వామిన్పశ్య న్యంతరా చింతయే త్వా—కర్తవ్యమ్ స్యా దత్రకిం సంవిధానం
నాహం జానే క్వాపి లోకామయ౦ ప్రా –గిత్ధం హాజీ వంశ్చ కాలం విశాలం ‘’
తా-మనసులో ఆలోచిస్తున్నావా ,కళ్ళతో ఆలోచిస్తున్నావా ?తక్షణ కర్తవ్యమ్ ఏమిటి ?నేను చిరంజీవిగా ఉన్నా ఇంతటి ఘోరం పూర్వం ఎప్పుడూ చూడలేదు .
16-‘’ఇత్ధం వాచా శోచమానం మహర్షిం –ప్రేక్ష ప్రాహ ప్రస్తుతం లోక నాదః
దుస్టస్యా స్యోన్మూలనే స్యాదుపాయో-యస్తం వక్ష్యే సాధనీయ సత్వయైషః’’
తా-లోకబాదను తన బాధగా చెప్పిన నారదుని చూసి ‘’వాడిని చంపే విధానం వివరంగా చెబుతాను .విని ఆ ప్రకారం నువ్వే కద నడిపించాలి ‘’అన్నాడు హరి .
17-‘’కల్పం దాస్యా మ్యేక మేతేన దేవైః-కార్యో యాగ స్సత్వయా యాజ్ని కేన
చత్వారింశ ద్యోజనం కుండ మేకం –ఖాత్వా సమ్యచ్చైల రాజస్య సానో ‘’
తా-‘’ఒక కల్ప గ్రంధాన్ని నీకిస్తా .నువ్వ్వు అధ్వర్యుడివి గా ఉందడి దానిలో చెప్పబడిన ప్రకారం ,దేవతల చేత హిమాలయ సానువు మీద నలభై ఆమడల కుండం నిర్మించి విధి విధానంగా ఒక యాగం చేయించు ..
18-‘’జీవానాం తూష్ణీం స్థితిం బాధ తేయ –సోఢా కస్మా త్సప్త తంతు ప్రవృత్తిం
మాశంక స్త్వైవం మయా భ్యూ హితం తత్ –మాయా మయ్యౌ ద్వే సృజామ్యద్య కన్యే ‘’
తా-వాడు ఆటంకం కలిగిస్తే దేవతలు ఏం చేయగలరనే అనుమానం వద్దు .నేను విరుగుడుగా ఇద్దరు మాయావిను లైన కన్యల్ని సృష్టిస్తాను .
19-‘’మంత్రీ రాజా ద్వౌ తయో ర్మోహ మగ్నౌ –యస్మిన్కాలే సాధ్యతే యాగ యేషః
యాగ త్రాణ ప్రాణితం యజ్వ లోకం –విఘ్నం కృత్వా బాధితుం కస్సమర్ధః ‘’
తా-భండుడు,వాడి మంత్రి మోహ పరవశం తో కామం కైపెక్కి ఒళ్ళు తెలీకుండా ప్రవర్తించే టప్పుడు ఈ యాగ విశేషం నెరవేరుతుంది .సత్సంకల్పం తో ప్రారంభమైన ఈ యాగము వల్ల కలిగే రక్షణ ఆపటానికి ఎవరి సాధ్యమూకాదు .ప్రయత్నాలన్నీ క్రమంగా ఫలిస్తాయి .
20-‘’ఇత్యుక్త్వాతం ప్రాహిణో ద్దేవ తేజ్యా –సాకల్యార్ధం సృస్టవాన్ కన్యకే ద్వే
బోద్ధవ్యం యద్బోధ యిత్వా తయోస్స-ద్విడ్వశ్యార్దే ప్రేషయామాస సద్యః ‘’
తా –దేవతలు చేసే ఈ యజ్ఞానికి ఒప్పించి నారదుడిని విష్ణువు పంపాడు .అప్పుడే ఇద్దరు కన్యల్ని సృష్టించాడు .వారెం చేయాలో వివరించి పంపేశాడు .
21-‘’ప్రారబ్ధశ్శై లస్యమూర్ధ్న్యధ్వరోహం-దేవై ర్మౌనీ౦ ద్రై ర్యదోక్తం విరాజా
తన్మాయా మయ్యౌచ గత్వా కుమార్యౌ –భండోద్యానే గాతు ముచ్చైః ప్రవృత్తే ‘’
తా-విరాట్ పురుషుడైన విష్ణు మూర్తి ఆజ్ఞప్రకారం నారద ,దేవతలు హిమాలయం పై క్రతువు ప్రారంభించారు .విష్ణు మాయతో పుట్టిన ఇద్దరు కన్యలు భండాసుర వనం లో సుమధురంగా సంగీతం పాడుతున్నారు ..
22-‘’విష్ణో ర్మాయా వాగురాం భ్రుత్య దిస్టాం-అజ్ఞాత్వా తౌమార్గ యంతౌ మృగీవత్
గత్వా తస్యాం పేత తుర్దైవ యోగాత్ –ద్వౌ ద్వౌ పాణీ అగ్రహిస్టాం వినస్టై’’
తా-రాక్షరాజు ,మంత్రి ఈ వార్తను సేవకుల వలన విని విష్ణు మాయ అని తెలీక మొహం పట్టలేక కన్య లుండే చోటుకు వెళ్లి చెరొకరు వాళ్ళ చేతుల్ని పట్టుకొన్నారు .
23-‘’మామా మేమే త్యుచ్య మానౌచ తాభ్యాం –మేమే మేమే మేషవ ద్భాష మాణౌ
స్యాతాం భూతా విష్ణవ చ్చా స్వతంత్రౌ –దత్వా దేయా న్యర్ధ మానాం స్తదిస్టాన్ ‘’
తా-వద్దు వద్దు అని కన్యలు వారిస్తున్నా ఇదినాది ఇది నాది అని పోటీ పడుతూ మేకల్లా అరుస్తూ వాళ్ళు అడిగే ఇయ్యకూడని వారాల నన్నిటి ఇచ్చేసి దెయ్యం పట్ట్టిన వాళ్ళు లాగా బలవంతులైనా అస్వతంత్రులైపోయారు వారి చేతుల బందీలలో .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు