ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3
హాం రేడియో ఆకర్షణ ఏమిటి?
ఏమిటి అంటే లైసెన్స్ పొందిన ఆపరేటర్లు అన్ని స్థాయిల ,అన్నిమతాల అన్నిజాతుల ,అన్ని దేశాల వాళ్ళూ ఉన్నారు .ఆడామగా భేదం లేదు .మోర్స్ కోడ్ ద్వారాలేక ఒక చేతిలో ఇమిడే మైక్రోఫోన్ కు తగిలించి HF, V H F ,UH f కమ్యూనికేషన్ పరికరం ద్వారా ఈ హామ్స్ ప్రపంచం లో ఏ మారు మూల ప్రాంతాల వారితోనైనా ఈ వైర్లెస్ రేడియో ద్వారా మాట్లాడుకొంటారు ,సందేశాలు పంపుకొంటారు .కొంతమంది ఔత్సాహికులు విద్యార్ధి దశలోనే స్వంతంగా తయారు చేసుకొన్న transponders ,transceivers ను కూడా ఉపగ్రహాలు ప్రయోగించే ISRUl లాంటి సంస్థలు స్పేస్ లోకి కూడా పంపుకొంటారు .సైన్సు ,టెక్నాలజీ స్కిల్ ఉపయోగించి ఆర్ధికంగా లాభించే ఉద్యోగాలు సంపాదిస్తారు .ప్రజా సేవ చేసిన సంతృప్తి , ,నైపుణ్యం సాధించిన అనుభూతి కలుగుతాయి .
హుద్-హూద్ భీభత్సం లో హామ్స్ చేసిన సేవ
2014 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని పారిశ్రామిక నగరం విశాఖ పట్నం తో సహా రెండు జిల్లాలు హుద్ హూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన సంగతి మనకు తెలుసు .అప్పుడు పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ తో బాటు అన్ని కమ్మ్యూనికేషన్ వ్యవస్థలు పని చేయకుండా పోయాయి .నవ్యాంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ హాం ఆపరేటర్లను అర్ధించారు సహాయం చేయమని .వెంటనే స్వచ్చందంగా స్పందించి ధన ప్రాణ నష్టాన్ని హాం ఆపరేటర్లు నివారించారు .
టాం జోస్ ప్రత్యేక సేవలు
అందులో ముఖ్యంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 16ఏళ్ళ ‘’టాం జోస్ ‘’వెంటనే హైదరాబాద్ నుండి విశాఖ చేరి అక్కడ పోలీస్ కంట్రోల్ రూము లో తన హాం పెట్టుకొని అనేక పోలీస్ స్టేషన్ లలో ఉన్న హాం ఔత్సాహికులతో ఏంతో నైపుణ్యంగా పని చేసి ప్రభుత్వాధికారుల ,ప్రజల మీడియా వారి తో సహా అభిమానం ,మెప్పూ పొందాడు .కాలేజికి 7రోజులు సెలవు పెట్టి టాంస్వచ్చంద సేవ చేసి ప్రభుత్వ మన్నన పొందాడు మన దేశాంతో సహా అమెరికా ,కూడా టాం సేవలను గుర్తించి ఘనం గా సన్మానించాయి .పత్రికలూ ,టెలివిజన్ చానళ్ళు టాం సేవను ప్రస్తుతించి ప్రత్యెక వ్యాసాలూ రాసి ఇంటర్వ్యులు జరిపి ప్రసారం చేశాయి సినీ నటుడు నాగార్జున నిర్వహించిన ‘’మేము సైతం ‘’కార్య క్రమం ద్వారా’’మాస్టర్ టాంజోస్-VU3TMO ‘’ సేవలు విశ్వ వ్యాప్తంయ్యాయి .దేశ విదేశాలలోని ఎందరో ప్రముఖులు టాం పై అభినందన వర్షం కురిపించారు .
టాం,సూరి లకు అమెరికా జర్మనీలలో లో ఘన సన్మానం
టాం ను తీర్చి దిద్దినశ్రీ సూరి శ్రీరామ మూర్తి ని ,N I A Rవ్యవస్తాపకులను 2015 మే నెలలో జరిగిన అమెరికాలోని ఒహాయు రాష్ట్రం ‘’డేటన్’’పట్టణం లో జరిగిన 55వ ‘’వార్షిక హామ్స్ సమావేశం ‘’(Annual Hams vention )వారి యూత్ ఫోరం లో ప్రసంగి౦చవలసినడదిగా ఆహ్వానించారు. టాం జోస్ , శ్రీ సూరి లను 25,౦౦౦మంది హామ్స్ పాల్గొన్న సభలో ఘనంగా సత్కరించి అభినందించారు .అక్కడి అంతరిక్ష యాత్రికుడు టాంను ప్రత్యేకంగా ఆహ్వానించి విందు ఇవ్వటం చారిత్రాత్మక విషయం .వ్యోమగామిమాస్టర్ టాంతో సంభాషించి తన అనుభవాలను వివరించాడు ఈ రెండు సంఘటనలు టాం జీవితం లో మరపు రాని ఘట్టాలు .చిరస్మరణీయాలు .స్వచ్చంద సేవకు ఎంతటి గుర్తింపు లభించిందో చూశారు కదా .
జర్మనీ దేశం లోజరిగే ’’ హాం రేడియో ఈవెంట్ ‘’ లో పాల్గొన్న 17,౦౦౦ మంది హామ్స్ సమక్షం లో సూరిని టాంజోస్ లను ను మర్చి పోలేని రీతిగా సన్మానించారు. అక్కడ టాం మాట్లాడి తన అనుభవాలను తెలియ జేశాడు .ఇంటర్ మొదటి ఏడాది విద్యార్ధి టాం జోస్ 16ఏళ్ళ వయసులో అంతర్జాతీయంగా ఇంత గొప్ప గుర్తింపు పొంది , సన్మానింప బడటం ఊహించలేని విషయం కదా .అలాగే హాం వ్యవస్థాపక నిర్వాహకులైన శ్రీమతి భారతి VU 2 R B I ,శ్రీమతి యామిని VU 2 Yam,శ్రీ రాం మోహన్ సూరి VU 2 M Y H ,కుమారి భానుమతి VU2BLవగైరా’’ హాం కుటుంబం అంటే సూరి కుటుంబం’’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది .
బహుమతి భారతి
శ్రీమతి భారతి ప్రపంచం లోని అయిదు లక్షల హామ్స్ తో ఇంట్లో ఉన్న హాం రేడియో ద్వారా అనేక ప్రోగ్రాములు నిర్వహిస్తున్నారు NI A Rనిర్వహించే కార్యక్రమాలలో భాగస్వామిని అవుతున్నారు .ఆడవారి ప్రత్యెక వింగ్ (ఫిమేల్ హామ్స్ )లో భారతి మొదటి రాంక్ లో ఉన్నారు .దీనివలన ఆమె అనేక దేశాలలోపర్యటించారు , సన్మానాలు అందుకొన్నారు .భారత రాష్ట్రపతి ,ప్రధాని తో సహా పలు సంస్థలు ఆమెని సత్కరించాయి .ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే –భారతి తెలుగుమీడియం లోనే బి ఎస్ సి డిగ్రీ ,బి ఎడ్ చదివారు . చిన్న వయసులోనే హాం లైసెన్స్ పొంది రెండు మూడేళ్ళలోనే ప్రపంచం లోని హామ్స్ తో మాట్లాడగలిగారు .ఆధునిక టెక్నాలజీ స్కిల్స్ ను ఆమె సాధించి అందరినీ ఆశ్చర్య పరచారు .డిజిటల్ టెలివిజన్ ,సాటి లైట్ టెక్నాలజీ లో కూడా అనుభం సాధించి ,ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అనేక దేశాలలో జరిగే హాం ఈవెంట్ లలో పాల్గొని మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న మహిళా మాణిక్యం శ్రీమతి భారతి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు
.