‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4
41-‘’వక్రోక్తిభ్యో నాదరా ద్వి ప్రవృత్తే –ర్మాత్సర్యాత్సా నిర్భయా సంస సార
మిష్టం క్షారం సౌనకం వా తదాసీ –తస్యా పీష్ణ౦ విష్ణుమాయా విలాసః ‘’
తా –ఎత్తి పోడుపులాడుతూ ,అనాదరంగా భయం లేకుండా విపరీత వింత ప్రవర్తనతో ఆమె వాడితో ప్రవర్తిం చింది .తీపి ,కారం ఉన్న పానకం లావిష్ణుమాయ చేత ఈ పద్ధతీ వాడికి నచ్చింది
42-‘’విజ్ఞాయాసౌ కార్య కాలం చరంతీ –తంచి క్షే పాంధౌ యదోద్దేశమేవ
శాస్త్రం శాస్త్రం నోపకుర్యా త్ప్రసక్తే –ప్రారబ్దే నీశస్య ధాతా విధాతా ‘’
తా-కావాలనే కన్య వాడిని కామపు రొంపిలో దింపి లేవ కుండా చేసింది .ప్రారబ్ధం వాడిని అసమర్దుడిని ,శస్త్ర విహీనుడిని చేసి౦ది .విధాత రాతకు తిరుగులేదు కదా.
43-‘’ఇత్ధం వృత్వా సంవ్యతీతా శ్శతాబ్ద్యః –పౌనః పున్యాత్పంచషాఆప్య విత్తాః
దేవోద్దిస్ట స్సక్రతుః ప్రాప పూర్తిం –పూర్ణానంద స్తద్గణోగ్నింపరీతః ‘’
తా-విష్ణుమాయావిలాసం తో భండుడుయుద్ధానికి వస్తూ తిరిగి ఇంటికిపోతూ ఐదారు శతాబ్దాలు గడిపేశాడు దేవతల యజ్ఞం ఈ లోపు పూర్తయింది .ఆనంద సంతోషాలతో దేవతలు ఆ పవిత్ర యాగాగ్ని ని చూస్తూ ఉన్నారు .
44-‘’అగ్నౌ తేజ స్తేజసి భ్రాజమానం –స్వారుణ్యం తస్మి న్ప్రభా భాసమానా
వ్యక్తి ర్బాలా బాలబాలా సమేతా –విశ్వా రాధ్యా సాధ్వనీ రావి రాసీత్ ‘’
తా-హోమాగ్ని కుండం లో కొత్త వెలుగు కనిపించింది .అందులో యెర్రని ఎరుపుదనం తో బాటు ఒక బాలిక ప్రౌఢ లైన కన్యల పరివారం తో ఆవిర్భవించి౦ది .అర్వణం లేకుండానే ఉపాసించ దగిన పరోక్ష బ్రహ్మ విద్య ఆమెయే .
45-‘’ప్రాదక్షణ్య ప్రక్రమేణాభిజగ్ముః-ఉచ్చైర్నాదం స౦వదంతో జయోక్తీః
భక్త్యా భువ్యస్టాంగ యోగం ప్రణేము-ర్బుద్దో ర్దిస్టాన్ స్తోత్ర పాఠాన్ప్ర పేఠుః’’
తా-దేవతలు అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ ఆదేవికి ప్రదక్షిణ చేస్తూ జయజయ ధ్వానాలు చేశారు .అందరూ భక్తితో సాష్టాంగ ప్రణామ౦ చేశారు . స్తోత్రపాఠాలు పఠించారు.
46-‘’మాతః కాసిత్వం కుతోత్ర ప్రయాతా –కార్యం కిం తే నార్య మార్యంత్వమేభిః
అస్మాం స్త్రాతుం విష్ణు నోద్దిస్ట యాగా –దావిర్భూతా చేజ్జయో జస్ర మస్తు ‘’
తా-‘’అమ్మా !నువ్వెవరు ?ఎక్కడినుండి ఇక్కడికొచ్చావు ?మాతో నీకేమైనా పని ఉందా ?మాకోసం శ్రీ మహా విష్ణువుచే పంపబడిన దేవతవా ?నీకు జయం ‘’అన్నారు .
47-‘’విద్యా మూలే హేపరోక్షా జ విద్యే –మాలా గ్రంధాభీష్ట నిర్భీతి హస్తే
సర్వా రుణ్యేఫుల్ల కల్హార సంస్థే-మాతః పాహి ప్రాణి లోకం ప్రసన్నం ‘’
తా-విద్యా మూలమైన పరోక్ష బ్రహ్మ విద్యా స్వరూపిణీ !పుస్తకం జపమాల ,వరదహస్తం ,అభయ హస్తాలతో కనిపిస్తున్న దేవీ! ఎర్రకలువ పువ్వు లో కూర్చున్న బాలా౦బా ,ఆపన్నులమైన మా ప్రాణికోటిని కాపాడు .
‘’48-‘’బాలే బాల ప్రాభవే బాధ్యమానా –నస్మాన్భండే నాను రేణారి ణాత్వం
త్రాహి త్రాహి హ్యాపదబ్దేః పరం త్వాం-పారం ప్రాప్తో విశ్వ సిత్యంత రాత్మా ‘’
తా-లోక కంటకుడైనా భండుని నుండి మమ్మల్ని కాపాడు .నిన్ను చూస్తె మమ్మల్ని తరింపజేసే నౌకలాగా ఉండివిశ్వాసం కలిగించావు .
49-‘’ఏవం రూపా దేవతా ఆహ మాతా –విష్ణుద్దిస్ట స్యాధ్వర స్యాస్మి సిద్ధిః
నాలం సాహం భండ మోహం నిహంతుం-మన్మాతా స్తే త్రాహరిష్యా మ్యహంతాం’’
తా-యాగ బాల ‘’విష్ణు సంకల్ప యజ్ఞానికి నేను సిద్ధి రూపం .అంతమాత్రాన భండుని అజ్ఞానాన్ని పూర్తిగా నశింప జేయలేని దానిని .దానికి మా అమ్మ సమర్ధురాలు .ఆమెను పిలుస్తాను ‘’అన్నది .
50-‘’ఏతత్గ్రంధం సార్ధ మద్దా పఠిత్వా-జప్త వ్యోమే మాలయా మంత్రం రాజః
అంతర్యాగం సాధయిష్యామ్యహం వ –స్తేనాశేషారిస్ట మూల ప్రహాణిః’’
తా-నా చేతిలో ఉన్న గ్రంధాన్ని అర్ధం తో కూడా బాగా చదివి జపమాలతో ఆ మంత్రాన్ని జపించాలి .దానితో అంతర్యాగ సాధన జరుగుతుంది .అప్పుడు మీకున్న సర్వ అరిస్టాలు తొలగిపోతాయి భయం లేదు నేను వరమిస్తాను .
51-‘’నోచేదంగం కర్మ కాండ కార్యాగ్ని తప్తం –యోవాకోవా నాల ముచ్చై రూపాస్తేః
త్యక్త్వో పాస్తిం సాధకో నైతి గమ్యం –తత్సర్వం వస్సాద యామ్యస్మి దేవాః’’
తా-ఈ స్తూల శరీరం కర్మకా౦డలలోని నిప్పుతో కాలకుండా ,ఆ పొగలో ఉక్కిరి బిక్కిరికాకుండా ,ఆ అగ్నిని రాజేయ కుండా ఎవరైనా ఎంతటివాడైనా జప తప ఉపాసనలకు అర్హుడు కాదు .ఉపసనే గమ్య స్థానానికి చేరుస్తుంది .ఇదంతా మీకు సాధించి పెట్ట టానికే నేనొచ్చా .
52-‘’ఇత్యుక్త్వా తాస్వాహ్ని కుండే తిశీతే –సంశుద్దాంగా న్సాధకా న్సా గృహీత్వా
ఉత్త స్థౌసా వ్యోమ్ని భూతాది చక్రం –భిత్వా౦తర్ధామా భయే నోజ్జగామ ‘’
తా-ఈ విధంగా పలికి బాల పుణ్య విశేషం తో పరిశుద్ధయై చల్లగా ఉన్న అగ్ని గుండం నుంచి ,సాధకులను దేవతలను వెంట బెట్టుకొని ఆకాశానికి యెగిరి చక్రాలన్నీ చేదించుకొని అండ పిండ బ్రహ్మాండాలు దాటి వెళ్లి పోయింది .
53-‘’బ్రహ్మా౦ డేస్మిన్ చక్ర సోపాన పంక్త్యా –తీర్త్వా మార్గం దివ్య దేశే నిషన్ణా
ధ్యాయ౦తీసోపాహ్వయ ద్దేవ మంత-స్సంస్థం సొపి ప్రాదు రాసీత్తదైవ ‘’
తా-బ్రహ్మాండాలు దాటి దివ్య ప్రదేశం లో దేవి ధ్యాన ముద్ర లో అంతర్గతుడైన దేవుని ధ్యానిస్తోంది .అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు .
54-‘’అంతర్యామీ కార్య మాహేత్య ప్రుచ్చత్ –నత్వా స్తుత్వా ప్రాదిశ త్సాపి బాలా
ఏతే దేవాః కర్మ కాండేగ్ని శుద్ధాః-కుర్వీ శైతాంశ్చిచ్చుచిం ప్రాపితవ్యాన్ ‘’
తా-ఎందుకు పిలిచావని బాలను ఆయన ఆడిగితే వినమ్రంగా స్తుతి చేసి ‘స్వామీ దేవతలంతా కర్మకా౦డాగ్ని చేత శుచులై వచ్చారు వీరికి చిదగ్నిని పొందేట్లు చేయండి ‘’
55-‘’అంతర్యాగం త్వం కురుష్వేతి నున్నః –కర్తవ్య త్వేనాన్య నిశ్చిత్య ధీరః
దీక్షా దక్ష శ్చిత్త మాజ్యం జుహావ –చిత్యా చిత్యగ్నౌ సృచా సర్వ గోసౌ ‘’
తా-బాల కోరిక తీర్చటానికి ఆయన స్వయంగా యజ్న దీక్ష పొంది చిత్త వ్రుత్తిఅనే స్రుక్కు తో ,చిత్తం అనే నెయ్యిని గ్రహించి జ్ఞానాగ్నిలో హవనం చేశాడు .ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు కనుక అది అందరి యజ్ఞం అయింది .
56-‘’చిత్యో పాత్తం చిత్తా మాజ్యం చిదగగ్నిః-స్వీ చక్రే తో యోగ ఏషో మనస్కః
నాన్య చ్చ్రవ్యం దృశ్య మన్య న్నగమ్యం-నాస్త్యే వైక శ్చిద్ఘనో చిన్నిమిత్తం ‘’
తా-చిత్తిచేత గ్రహింప బడిన చిత్తం అనే నేతిని అగ్ని గ్రహించి,తన రూపం తో కమ్మేసి ‘’అనమస్క యోగం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఆ స్తితిలో ఇక వినటానికి వేరొకటి లేనే లేదు .నిరంతర చిత్పదార్ధం ఒక్కటే మిగిలింది .
57-‘’చిత్యగ్నౌ మగ్నం మనో నాస్తి వాస్తీ –త్యేతత్ప్రుచ్చే త్కంక ఏతద్బ్రవీతి
ఆశ్వత్దామ్నో హాని మద్దాయ ఊచే -సప్రస్టవ్యో భారతే ధర్మ రాజః ‘’
తా-చిదగ్నిలో మగ్నం అయిన చిత్తం ఉందా పోయిందా ?దీనికి సమాధానం చెప్పాలి అంటే భారత కధలోకి వెళ్ళాలి .అశ్వత్ధామ హతః ‘’అన్నాడు ధర్మ రాజు ద్రోనణుడిని అర్జునుడు ఓడించటం కోసం .ఇందులో సత్యం ఏమిటో ధర్మ రాజునే అడగాలి .ఇక్కడ శ్వత్దామా అంటే గుర్రం లాగా పరిగెత్తే మనసు .గురువు ద్రోణుడు అడగ్గా శిష్యుడు ‘’అశ్వత్దామ అహతం కున్జరరూపమైన వ్రుత్తి హతం అయింది అని లౌక్యంగా సమాధానం .ఇది ప్రశ్నోత్తరలలాగా నడిచిన విషయం ఆని శ్రీ రాఘవ నారాయణుల మహా భాష్యం .
58-‘’యడ్దృశ్యం తత్కల్పితం వేదం ఊచు –తత్సాక్షిత్వంతత్ర సంలీన మేవ
అస్త్యే వైకః శూన్య తాయా విపక్షీ –యత్కధ్యే తా త్రాస్తి తచ్చిద్విలాసః ‘’
తా –కనిపించేదంతా కల్పితమే అంటుంది వేదం .బ్రహ్మ సాక్షిత్వం కూడా అందులోనే కలిసిపోయింది .శూన్యత్వానికి ప్రతి పక్షం గా ఒకటి ఉండనే ఉంది .ఆ దీపం దగ్గర సర్వాభావం భాసిస్తుంది ఇదే చిద్విలాసం ,సత్యం .
59-‘’తూష్ణీ కామాస్తే యదానీం సురౌఘో –దేశం కాలం భూత తత్కార్య జాతం
విస్మ్రుత్యాసీ త్సంభవంతీ చిదగ్నౌ-దృష్టా శక్తిః-కావ్య రూపా తిరూపా ‘’
తా-అలాంటి సమయం లో అన్నీ మరచి దేవతలు ఉండగా రూపం లేనిది కనుక ఒక అద్భుత శక్తి అతి లోక సుందరిగా చిదగ్ని నుండి ఆవిర్భావిస్తూ వారికి దర్శన మిచ్చింది .
60-‘’సర్వేశానా పాత యంతీ చిదగ్నౌ-దేవాంస్తానా ధ్మాత మాలిన్యచిత్తాన్
చిద్భానేనా భాతతత్వ ప్రకాశాన్ –సద్య శ్చక్రే జ్ఞాన వీర్య క్రియా ద్యాన్(dhyaan ) ‘’
తా-శక్తి స్వరూపిణి అయిన ఆసర్వేశ్వరి దేవతల్ని చిదగ్నిలో పడేసి మనోమాలిన్యాలను వదిలించి జ్ఞాన బల సంపన్నులను చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-15-ఉయ్యూరు