’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5
61-‘’నేముం పద్భు వ్య స్తువం శ్చక్రుకర్చా –ప్రౌదక్షిణ్య ప్రక్రమేణ ప్రతేయుః
ప్రాంజల్య ద్ధా బంధ సంబద్ధ హస్తాః-సర్వేతాం విజ్ఞాపయామాసు రర్ధ్యం ‘’
తా-అందరూ ఆ దేవికి ప్రణామం చేశారు. పూజించి కొనియాడారు, ప్రదక్షిణ చేశారు .దోసిలొగ్గి ప్రార్ధనగా విన్న వించు కొన్నారు .
62-‘’స్త్రీ స్వాతంత్ర్యం నైవ శాస్త్రం సహేత-విద్యే దేవ్యం బోద్వ హస్వా నురూపం
పాల్యా ఏతే భండ మోహ ప్రముగ్దా –దేవా యేతత్కార్యమోంనిర్వహస్వ ‘’
తా-‘’వివాహం కాని స్త్రీకి స్వాతంత్ర్యం లేదు .నీకిష్టమైన వాడిని వివాహ మాడు .భండుని చేత భంగపడ్డ దేవతలకు నువ్వ్వు ఏలిక కావాలి .దేవకార్యం నువ్వే చేయాలి ‘’అన్నారు .
63-‘’ఏకీ కృత్య శ్వే ద్రుశౌ సోదపశ్యత్ –సద్యో జాతో జః పురాణస్స ఏకః
ఇచ్చా ప్రాప్త స్సోపి కామేశ్వరో భూత్-ఉద్వా హ్యైనం సా ప కామేశ్వరీత్వం ‘’
తా-ఆ దేవి రెండుకళ్ళు ఊర్ధ్వ ముఖం చేసి ‘’పుట్టుక లేనివాడు ,ఏకమేవాద్వితీయం ఐనవాడు అయిన నల దేవుడు సద్యో జాతడైనాడు .ఇచ్చ తో లభిస్తాడు .శరీర సంబంధ ఇచ్చ ఉన్నవాడు .అలాంటి సద్యోజాతుడు కామేశ్వరుడనే పేరుతొ పిలువ బడుతున్నాడు .పూర్వం కామేశ్వరీదేవి ఆయనను పెళ్ళాడి కామేశ్వరి అయింది .’’అన్నది .
64-‘’తాధ్యా మాజ్ఞప్తో సృజ స్చ్రీ పురంత –త్త్వస్టాధ్యానాత్మన్మయీ భూయ భూయః
తన్మధ్యస్త స్వాసనస్ధ స్సభర్తు –ర్వామా౦కే సా సన్ని షణ్ణా వ్యరాజత్ ‘’
తా-కామేశ్వరీ కామేశ్వరుల చేత ఆజ్ఞాపి౦పబడిన ‘’త్వష్ట ‘’శ్రీ పురాన్ని నిర్మించాడు .అక్కడ భవనం లో బ్రహ్మాసనం లో కూర్చున్న భర్త కామేశ్వరుని వామాంకం పై కామేశ్వరి కూర్చుని ప్రకాశించింది .
65-‘’ప్రాక్సర్వేశానాపి భూయోభి షిక్తా –దేవీ దేవై ర్విశ్వ విశ్వాది రాజ్యే
శ్రీ శ్రీమత్సి౦హాసనేశ్వర్యభూత్సా –పంచ బ్రహ్మా జిహ్మ మంచాది రూఢా’’
తా-పూర్వం సర్వేశ్వరి ఉన్నా కూడా ఇప్పుడు నేడు మళ్ళీ సమస్త విశ్వ సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిగా అభిషేకింప బడింది .స్వాదిస్టాన ,మణిపూరక ,అనాహత ,ఆజ్ఞా ,సహస్రార,అనే చక్రాలకు అధిదేవతలైన బ్రహ్మ విష్ణు ,రుద్రా ,ఈశాన సదాశివులు అనే మంచాన్ని అధిష్టించింది .
66-‘’శ్రీ మాతా రాజ్ఞీ మహాత్యంబికేతి-వాగ్దేవ్యస్తాం నామభి స్తుస్టు వుర్హి
కోటీ భి ర్లక్షై స్సహస్త్రై శ్శతైర్వా-శాక్తేయానాం సంవదంతీ పురాణీ’’
తా-అప్పుడు వాగ్దేవతలు ‘’శ్రీమాతా ,మహామతి ,రాజ్ఞి ,అంబిక ,అనే కోటానుకోట్ల నామాలతో కొనియాడారు .
67-‘’గాదా విజ్ఞానార్ధ మేతల్లి ఖామి –చిత్రీ కర్తుం నో కవిత్వా త్తగర్వాత్
తస్మిన్కార్యే లేఖినీ పత్ర మష్యా-దిప్రాప్తవ్యం సాధనం చాస్మి వ్రుద్ధిః’’
తా –కధకోసమే రాశాను .కవిననే గర్వం తోకాదు .అలాంటివాటికి కాగితా’’
లు సిరాలుకావాలి .ఒక వేళ వాటిని నాకు అందించినా నేను ముసలి వాడినైపోయాను .వర్ణించటానికి అలవికాని దేవికి నమస్కృతి .
68-‘’మీ మాంసా యామాత్ర కి౦చి ద్వదామి-రాజ్ఞః కామేశో మహాత్యేవ రాజ్ఞీ
ప్రస్టుం దూరే పాణిని ర్యౌవ రాజ్యే –బాలా మ౦బాం కిం పదే నాహ్వ యామః
తా-కొంచెం సందేహం వచ్చి అడుగుతున్నా .కామేశ్వరుడు రాజుకనుక ఆమె రాజ్ఞి అయింది .మహా మతి అయిన రాజ్ఞి ని మహా రాజ్ఞి అనీ పిలవవచ్చు .మరి యువతి గా అభిషిక్తమైన్దికనుక బాలాంబ ను యేమని పిలవాలి ?అవివాహిత .రాజు లేడుకనుక రాజ్ఞి కూడా కాదు .స్త్రీ కనుక రాజా అనరాదు .ఈసందేహాన్ని తీర్చమని పాణిని ని అడుగుదామంటే ఎక్కడో దూరం లో ఉన్నాడు .నేను ముసలాదడిని కనుక నేర్చి౦ది అంతా మర్చే పోయాను .పెద్దలు నన్ను క్షమించాలి .
69-‘’సందేహో త్రాష్యేష మాత శ్రుణోషి-ప్రాక్సంభూతా సాకధం స్యాత్తు బాలా
పాశ్చా జ్జాతా త్వం కదంస్యాస్త దంబా-విజ్ఞా వ్యాసొక్తిః కదం వాన్వయం తి’’
తల్లీ ! త్రిపుర సుందరీదేవీ !ఇంకో సందేహం .బహిర్యాగ కుండం లో ముందే పుడితే బాల ఎలా అవుతుంది ?అంతర్యాగ కుండం లో తర్వాత పుట్టిన నువ్వు ఆమె తల్లి ఎలా అయ్యావు ?యెంత గొప్ప పండితుడైనా వ్యాసమహర్షి ఈ చెప్పిన ఈ మాటలను ఎలా సమర్ధిస్తాడు ?
7౦-‘’తేషాం నామాన్యేవ తానీతి వాద-శ్చే ద్రాజ్య .వ్యత్యా సవాదో ర్ద వాన్కిం
ఇత్ధం మా వాదీ స్స్సకుప్యేత కృష్ణో –మైవం బ్రూయా వ్యాస హూతిస్తదర్దా ‘’
తా-బాలమ్మ ,లలితమ్మ ,అ౦బమ్మ అనే ఆమె పేర్లు సంజ్ఞా పదానికి అర్ధం ఎందుకు అనే వాదం మున్డుపుట్టింది యువరాజు మహా రాజవటం తో దీన్ని ముడి పెట్టద్దు .గీతాచార్యుడు కృష్ణుడికి కోపమొస్తుంది అనద్దు .అందుకే నమ్మా నేను ముందే చెప్పాను నీకు .వ్యాసుడిని పిలి పించు తల్లీ అని . వి న్నావు కాదు .ఆ మహర్షి పద్దెనిమిది పురాణాలు రాసి విసుక్కోకుండా అడిగిన వారందరికీ విస్తరించి చెప్పి తృప్తి పరుస్తున్నాడు .గీతా చార్యుడు 18వ అధ్యాయం లో సంగ్రహం గా చెప్పి దులిపేసుకున్నాడు .మళ్ళీ అడిగితె ఆర్జునుడిని దులిపి నట్లు నన్నూ దులిపెస్తాడేమోననే భయం వేస్తోంది ‘.
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు