81-”కిం కుర్వం త్యుత్సాహ హీనా నివ్రుత్తా -స్తేనో భూత్త త్రైవ ద్రుశ్యో ప్యద్య శ్యా
వాణీ కాచి ద్దివ్య భీకా చ చక్షే -శ్రుణ్వత్స్వే తేష్వప్యానద్రుతే ”
తా-పాపం భటులు వాళ్ళెం చేయగలరు?నిరుత్సాహం తో వెళ్ళిపోయారు .ఇన్తలొ ఒక అ శరీరవాణి విని నిపించింది .
82-”భో మోహాత్మన్ భందచండ ప్రచండా-ప్రత్యక్ష బ్రహ్మాత్మ విద్యాననవద్యా
సన్నద్దా సీమంత సీమాంత దేశే -స్వధ్యా సీనాశాసితుం త్వాం దురంతం ”
తా-మొహాన్దకారా !చండ శాసన భండా ప్రత్యక్ష బ్రహ్మ విద్యాత్మిక లలితా దేవి ప్రత్యక్షంగా యుద్ధం చేయటానికి సిద్ధం గా ఉంది ,
83-”పాపాచారం గర్వ మేత త్సమస్తం -త్యక్త్వా జీవన్ జీవ తుల్యంశ వేన
యుద్ధా దేవ్యా దివ్య శక్తి ప్రతానై -ర్మ్రుత్వా రూప స్టిస్ట తుల్యంశివేన ”
తా-సర్వ గర్వాన్నిఒదిలెసి నిర్జీవిగాఉన్దు లేకపోతెదేవిదివ్యశక్తులతో పోరాడి రూప రహితంగా శివుడిలా ఉండు .
84-”వైధవ్యంకిం సాధయామ్య త్ర వృత్యా-ప్రగ్విష్ణౌ వ శక్తి సేనాను లీయే
యిత్యా భాష్య ప్రస్తితా విష్ణు మాయా -ద్రుశ్యానా భూత్క్వాపి కాపి ద్విరూపా ”
తా-ఇక్కడ విధవను అవటమో ,లేక నీ ముందే దేహం వదిలి విష్ణు వులోకాని,శక్తిసేనల్లోకానిలీనమైపోతాను .”అని పలికిరెండు రూపాలలో ఉన్న విష్ణుమాయ అదృశ్యమైంది .
85-”స్మ్రుత్వాదేవంతం శివంవాచికం తత్ -మాయా దేవ్యాస్తాం ప్రవ్రుత్తిం చ దృష్ట్వా
శ్రుత్వా కాశే వాచ మర్ధ్యాం స భండ -స్సన్నద్దో భూత్సర్వ సైన్యై ర్వదాయ ”
తా-ఇన్నివిధాలుగ చెప్పినా వినని, వినిపించుకోని బండుడుయుద్ధానికే సిద్ధమయ్యాడు
86-”భేరీ భంకారై ర్మ్రుగేంద్ర ప్రణాదై -ర్మత్తే భాశ్వా రావనై రట్ట హాసైహ్
సంరబ్దాం స్వాం సైన్య రాజిం గృహీత్వా -దైత్యో దేవ్యా శ్శక్తి సేనా సమభ్యైత్ ”
తా-భేరీల భం భం నినాదాలుదిక్కులు పిక్కటిల్లేట్లు సర్వసైన్యంతోదేవీ సైన్యాన్నిఎదిరించాడు .
87-”దేవీ స్థానం శక్తిసేనా సమాజం -యద్యద్రక్ష్య0తత్త దన్య త్పరీయ
జ్వాలా మాలిన్యా వ్రణోతిస్మ వహ్ని -ప్రాకారేణ స్వ ప్రభా భాసు రేణ ”
తా-సర్వ శక్త్యాత్మకంగా జ్వాలామాలిని చూడ రాని కాంతితో అగ్ని దేవతలా వచ్చింది .
88-”మాతం గౌఘై రాస సంపత్కరీయా-యాశ్వా రూడ్హా కోటి కోట్యశ్వ కోట్యా
ప్రాపు స్సర్వా ఆయుదీయా అమోఘా -శ్శక్తి వ్రాతా శ్చక్ర రాజారదేన ”
తా-సంపత్కరీదేవి ఏనుగుసేనతో, అశ్వా రూఢ శక్తిగుర్రపు దళం తో చక్ర రాజ రధాన్నిఅధిరొహించి సర్వాయుధ శక్తి సంపన్నంగా వచ్చింది.
89 -మంత్రిన్యంబా గేయ చక్రాది రూడ్హా -కోలై శ్చ క్రైహ్ స్యన్దనే దండ నాధా
ఆయాతా స్త్వైర్వాహనై రాయుధైశ్చ-బ్రహ్మాండేయా శ్శక్త యస్తా స్సమస్తాః
తా-గేయచక్ర రాదాన్నిఎక్కి మంత్రిణీ దేవి ,వారాహ చక్ర రధం పై దండనా శక్తి ,అలాగేమిగిలిన శక్తులన్నీ వారివారి ప్రత్యెక రదాలెక్కివచ్చారు .
గేయచక్రం ఏడ0 తస్తులతో ,కిరి చక్రం అయిదు అంతస్తులతో ఉంటాయి మంత్రిణి అంటే శ్యామలాదేవి .కిరి చక్రం పై వారాహిదేవి ఉంటుంది యుద్ధంలో ఈ మూడు రధాలు ఒక దాని వెంట ఒకటి ఉంటాయి ..
90-”సంతు స్తంబా భండ సైన్యాది సర్వా-ణ్యాని ఘ్నంతీ0శక్తి విక్రాంతి మైక్ష
నిత్యా వీర్యా టోప మాలోక యంతీ –సౌత్సు క్యాతా అస్తు అద్భావ భంగ్యా”
తాశక్తి సైన్యం భండాసుర సర్వసైన్యాన్ని హతంచేస్తుంటే శ్రీ మాతసిద్విలాసంగా నవ్వుతూ ,వారి పరాక్రమాన్ని మెచ్చుతోంది .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-15- కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్