‘’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -8

‘’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -8

91-‘’నో సంరబ్దానై వభీతాన భూతా –భర్తుర్వామామ్కేనిశాణ్ణా యదా వత్

దేవ్యా  దిస్టైశక్తి సైన్యై ర్వితున్నో –భండ శ్చిత్రంవిఘ్న యంత్రం తతానః ‘’

తా-అంతటి భండుడితో యుద్ధం అని భయం కాని కంపం కాని లేని దేవి భర్త వామాంకం పై కూర్చునే ఉండి సైన్యం తో భీకర యుద్ధం చేయించింది .వాడు చిత్రమైన విఘ్న యంత్రాన్ని పెట్టించాడు .

92-‘’యంత్రస్యాన్య ప్రాభావాత్సం బభూవు –శక్త్యాస్థానం సర్వ కార్యేషు విఘ్నాః

తాభిర్విజ్న స్తావిభో రైక్షతాస్యం –కామేశీ సా తక్షణే భూద్గణేశః’’

తా-ఆ యంత్రం దేవి కార్యాలకు విఘ్నాలు కలిగిస్తోంది .పాలుపోక అమ్మవారు అయ్య వారి ముఖం వైపు సాభిప్రాయంగా చూడగానే గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు .

93-ప్రుస్టాకార్యం కిం మయే త్యేతకేన  -భంజా రాతే ర్విఘ్న యంత్రం దురంతం

ఇత్యాదిస్టః ప్రేక్ష జఘ్నే వదేన –తేనా భూత్తద్విశ్లధం తన్మనశ్చ’’

తా-‘’నాతొ ఏమిపని ‘’? అని అడుగగా అమ్మ  ‘’విఘ్న యంత్రాన్ని విచ్చిన్నం  చేయమన్న’’ది .కాలితో ఒక్కతన్ను తన్నగా అది ముక్కలై పొడి పొడి అయింది .రాక్షసుని మనసూ విరిగిపోయింది .

94-‘’సన్నదాన్వా ఆగతా న్భండ పుత్రా –న్సంఖ్యాతీతానాహనత్తీ ప్రసంఖ్యే

బాలా బాలా యౌవ రాజ్యే పదస్థా-మాతా నందత్తాంకృతిం సంస్తు వంతీ’’

తా-యువరాజ పదవిలో ఉన్న ప్రౌఢ అయిన బాలలేక్కలేని భండుని కొడుకుల్ని సంహరించింది ఈపనికి జగన్మాత బాలను భేష్ అని మెచ్చింది .

95-‘’దుర్ధర్షం భందాను జాతం విషంగం –మంత్రిన్యంబా శామలాఖ్యా వదీత్సా

తద్దుస్టం తస్యాను జాతం విశుక్రం –వారాహ్యాభ్యా భండ నాదా హనద్ధిః’’

తా-భండుని తమ్ముడు విషండుని మంత్రిని శ్యామలాంబ చంపింది .వాడికంటే దుర్మార్గుడైన తమ్ముడు విశుక్రాసురుడిని దండనాద అయిన వారాహి మట్టు పెట్టింది .

96-‘’కర్మభ్యా౦ ద్వాభ్యాంతయోస్సంతు తోష –సమ్రాజ్నీ తేహ్యభ్యనందన ద్ద్రుశోక్త్యా

భండే నైవోత్పాదితౌ స్వేచ్చయా మూ –స్రష్టా౦ సాభ్యాం స్వాను జన్మ త్వ బుద్ధ్యా ‘’

తా-ఈ రెండు పనులకు రాజ రాజేశ్వరి సంతోషించింది .స్వయంగా రాక్షసులని సృష్టించే సామర్ధ్యం ఉన్న భండుని చేత తోడబుట్టిన వారు అనే భావం తో మళ్ళీ పుట్టించటం లేదు .

97-‘’మాయావీస్రస్టాసృజత్తత్క్షణేన –రక్షో నాదో రాక్షసాన్సోను కాదీన్

భూతాన్ భవ్యాన్ సర్వ నారాయణారీన్ –తేనాజ్ఞప్తా ఏకదాతే భిజగ్ముః

తా-మాయ సృష్టికర్త అయిన వాడు పూర్వపు రాక్షసులైన సోమక హిరణ్యాక్ష హిరణ్య కశిపుడుమొదలైన వారెందరినో సృష్టించాడు .వాడి ఆజ్ఞతో వాళ్ళంతా శక్తి సైన్యంపై విరుచుకు పడ్డారు .

98-‘’లోకానాం మాతా హసంతీహిదృష్ట్వా తాన్ హస్త ద్వంద్వ్వా౦ గు ళీనాం నఖేభ్యః

సౌ సృష్ట్వా నారాయణ స్యా వతారాన్ –తేభ్యః ప్రాదోద్యోద్దుమద్దా పినద్ధాన్ ‘’

తా-ఆ రాక్ష బలాన్ని చూసి నవ్వుతూ లోకమాత లలితా త్రిపురసుందరి రెండు చేతులలోని పది వ్రేళ్ళ గోళ్ళను విదిల్చి నారాయణుని పది అవతారాలను సృష్టించి ,వారందర్నీ యుద్ధం చేయమని ఆజ్ఞా పించింది .

99-‘’రక్షాం స్మేతాన్యాసు జీవేశ వ్రుత్తి –ప్రాయైః ప్రాయో హన్యమానాని వేశుః

జాతా  విష్ణోర్మూర్తి  భేదా స్తదైవ-దేవ్యా దృష్టా నిర్ర్వ్యాణి స్శ్రమా శ్చ’’

తా-భండ సృష్టిని నారాయణ దశాక్రుతి సృష్టి పూర్తిగా నశింప జేసింది .విష్ణు అవతారాల పరాక్రమాన్ని దేవి అభినందన పూర్వకం గా ప్రసన్న దృష్టితో చూసింది .దీనితో వారికి గాయాల బాధ లేకుండా పోయింది .

100-‘’ఆత్మీయానాం నాశ మార్తిమ్చ వీక్ష్య –భండః కోపాదస్త్ర శస్త్రై ర్వవర్ష

దేవీ మేవ స్వాత్మనా ఖ్యేత్య సాపి –ప్రత్య స్త్రైస్తం వారయామాన త౦చ’’

తా-తనవారు చచ్చి దేవి సైన్యం హెచ్చుతుంటే వాడికి మండి స్వయంగా యుద్ధానికి దిగి అస్త్రశస్త్రవర్షం కురిపించాడు .

Inline image 1 Inline image 2

సశేషం

శ్రీ దుర్గాష్టమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-15

 

\తా

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.