మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -9

 

101-‘’తంబా తీత్య ప్రస్తితాస్తన్యసేనా-సంరంబోత్దా ఆసురీర్నిర్ద దాహా

కల్పాన్తేష్వీశ్వః పశూనాం జగంతి-భస్మీకుర్యాద్యేన  శస్స్త్రేణతేనః ‘’

తా-కల్పాంతం లోపశుపతి అయిన  శివుడు లోకాలను సమూలంగా దహించినట్లు  ఈశ్వరి భండాసుర సైన్యాన్ని సమస్తాన్నీ పాశుపతాస్త్రం తో దహించే సింది .

102-‘’సర్వాత్మీయానాం ప్రనాశం సమీక్ష్య-దేవీ మేవాభ్యద్రవ చ్చూన్య కేన

సాప్యేనంకామేశ్వరేణా భి జఘ్నే-భండం శూన్యాసుం సశూన్యం దదాహ ‘’

తా-అంతా కోల్పోయినవాడు కామకం అనే తన పట్టణం తో సహా దేవిపైకి వచ్చాడు .భవానీ దేవి వాడిని కామేశ్వరమనే అస్త్రం తో కొత్తగా వాడినీ వాడి పట్టణాన్ని  కాల్చి  బూడిద చేసింది  .

అస్త్రాలలో కామేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం కంటే శక్తి వంతమైనది .అమ్మవారి నామాలలో ‘’కామేశ్వరాస్త్ర ‘’అని ఉంది .భండుడు మొహానికి, శూన్యనగరం శూన్య వాదానికి ప్రతీకలు అని గ్రహించాలి .దేవుడిని చూపించి శూన్యవాదాన్ని చిత్తు చేసింది అనీ భావం .

103-‘’బ్రహ్మోపేంద్రాదయ స్స్మస్తువంతి-విస్మేరాస్యా విక్రమ ప్రక్రమర్ధిం

దేవా స్స్వస్థాస్సుస్తితాశ్చాన్యలోకాః –సోయం కామేశాన పత్నీ,ప్రసాదః ‘’

తా-త్రిమూర్తులు మున్నగు దేవతలు దేవి పరాక్రమాన్ని కొనియాడారు .లోకాలన్నీ స్వస్థత చెందాయి .శూన్యవాదం నశించి మనో బుద్ధీ మొదలైన ఇంద్రియాలు సువ్యవస్తితమై సాధకులు నిర్వృతి పొందారని అంతరార్ధం .

104-‘’గాదా సేయం వర్నితా విస్తరేణ-స్వీయే గ్రందే వ్యాస భట్టార కేన

లోకోద్దారార్ధం హి నారాయణేన –సంగృహ్యేయం ప్రస్తుతార్ధం మయోక్తా ‘’

తా-వ్యాసమహర్షిగా జన్మించిన నారాయణుడు బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో చాలా విస్తారంగా దీన్ని రాశాడు .నేను సంగ్రహం గా చెప్పాను అంతే.అన్నారు శాస్త్రీజీ .

105-‘’అంతర్యామీ వ్యాస నారాయణో సౌ –సర్వ త్రాస్తేసనాస్తే మయ్యహో కిం సనాస్తే

మాతస్త్వంమే జాగ్రతి స్వప్న సుప్త్యోః-ప్రత్యా సన్నా లక్ష్యసే భాగ్య మేతత్ ‘’

తా-వ్యాస నారాయణుడు సర్వాంతర్యామి .అలాంటి వాడు నా యడల ఉండడా?అమ్మా !నువ్వు నాకు మెలకువలోను ,కలలోను ,నిద్రలో కూడా సన్నిహితంగా ఉంటున్నావు .ఇదే నా భాగ్యం .

106-‘’నామం నామం త్వాం చ బ్రవీమి –స్థాతవ్యం వామాభి ముఖ్యేన మేం బ

ఉద్వాహే తే లోక మాతృత్వ కార్యే (కీర్తౌ )-పౌర్వా పర్యం తద్వి మ్రుస్టవ్య మత్ర’’

తా-నీకూ వ్యాసునికి పదే పదే నమస్కరిస్తూ మళ్ళీ అడుగుతున్నాను .నీ వివాహం ,లోకాలను కనటం లలో ఏది ముందు ?వివాహం నాటికే దేవాసురులతో ఉన్న ప్రపంచం ఉందికదా .మరి ఆ ప్రపంచాన్ని ఈ అమ్మ ఎలా కన్నది ?అని సందేహం .

107-‘’ఈశ స్స్రస్టా లోక జాలస్య తాతః –పత్నీ తాత స్యా౦బి కైవ ప్రజానాం

ఇత్ధం గౌర్యా లోక మాతృత్వ మూచే –సర్వజ్ఞో సౌ కాళిదాసః కవీశః ‘’

తా-అన్నిలోకాల్ని సృష్టించిన ఈశ్వరుడు వాటికి తండ్రి అవుతాడు కదా .తండ్రి పెళ్ళాం ప్రజలకు తల్లి అవుతుందికదా .అని మహా కవి కాళిదాసు పార్వతీ దేవి యొక్క లోక మాతృత్వాన్ని సమర్ధించాడు .

108-‘’శక్త్యా యుక్త శ్శక్తఏతత్ క్రియాసు –నో చే దీశ స్స్పందితుం చాప్య శక్తః

ఇత్యాచార్యా స్శంకరశ్శన్కరోయం-వ్యాచ స్టేద్ధా డిండిమం వాద యన్నోన్’’

తా-శక్తితో కూడిన శివుడు సృష్టి స్తితి లయ కారకు డౌతాడు .శక్తి లేకపోతె ఆయన వలన ఏ పనీ జరుగదు అని సాక్షాత్తు శంకరావ తారమే అయిన శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు కనుక తిరుగు లేదు .

109-‘’వేదో మూలం వ్యాస వాచాం న చేత్స-మంత్రం ద్రస్టానో వదేత్కించ నాపి

వేద వ్యాసోక్త ప్రభావ ప్రపంచే –హ్యూహా పోహే సాధయే త్సత్కవీశః ‘’

తా-మంత్ర ద్రష్ట వ్యాసుడు చెప్పిన ప్రతిదానికి వేదమే మూలం .వారి వాక్కుల ప్రభావం తో ఊహా పోహాలను మేళవించి సత్కవి కావ్య రూపం లో ప్రపంచానికి తెలియ బరుస్తాడు .

110-‘’వేదస్త్వమే దృశ్యసే భాగ్య యోగాత్ –వ్యాసో మౌనీశశ్చ  సర్వత్ర గోస్తి

యుష్మ స్సాన్నిధ్యం ప్రకల్ప్య ప్రాసాదాత్-ప్రశ్నంతస్యా వ్యుత్తరం వర్ణ యామి ‘’

తా-అసలు వేద వాణివి నువ్వేకదా తల్లీ !నా అదృష్ట వశాన కలలోను , నిజంగాను  కన్పిస్తున్నావు .ముని ముఖ్యుడు వ్యాసుడు ఈశ భావం తో సన్నిహితుడయ్యే ఉన్నాడు .మీ ఇద్దరి సమక్షం లో నేను సంధించిన ప్రశ్నాస్త్రానికి నేనే ఉపసంహారం చేసి వివరిస్తాను. దయ చేసి వినండి మీ రిద్దరూ ‘’అన్నారు శాస్త్రిగారు .

సశేషం

మహర్నవమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-15-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.