’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -11
126’’మాతా తాతస్సా సమయా మహేశః –సర్వ స్వాస్య ప్రాక్ప్రభూతా వ భూతాం
కామేశ స్సత్వంచ కామేశ్వరీతి –స్వేచ్చా పర్యాయేణ శబ్దేన చోహే ‘’
తా-సర్వ ప్రపంచాని కంటేముందేపుట్ట్టిన మాయ- తల్లి ,మహేశుడు తండ్రి .ఆయన కామేశ్వరుడు అయితే నువ్వు కామేశ్వరివి .కామం అంటే ఇచ్చ అని లోక వ్యవహారం .
127-‘’మాయేశౌ భూత్వా ప్రపంచం ప్రసూతౌ –కామేశా భూత్వా వివోడుం ప్రవ్రుత్తౌ
రుద్రో భూత్వా ప్రాక్స దాక్షాయణీ౦ త్వాం-పశ్చాత్తాం త్వాంపార్వతీం చోపయేమే’’
తా-ఇచ్చా రూప మాయ ,శుద్ధ మాయా ప్రతి బింబ భూతుడైన ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించారు .కామేశ్వరావతారం లో పెళ్లి చేసుకోవాలను కున్నారు .కామేశ్వరుడే రుద్ర రూపం లో దక్షుని కుమార్తె వైన నిన్ను పెళ్ళాడాడు .ఆ దాక్షాయణి తర్వాత పర్వ త రాజ పుత్రిక పార్వతి అయి ఆయన్ను వివాహం చేసుకొంది.
128-‘’ఆత్మానం స్వేశాన మీషద్వి వర్జ్య –పాద క్షేపం మాతరోం మాకరోషి
పాతి వ్రత్యం వర్ణ నీయం తవైవ –సూతాస్మాం స్తే నైవ సంభూయ భూమ్నా ‘’
తా-సత్యాత్మ స్వరూపుడు అయిన ఈశానుడి ని విడిచి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు .అందుకే పాతివ్రత్యానికి నిన్నే ముందు చెబుతారు .’’భూమ ‘’ఆకారం అయిన ఈశ్వరునితో నిత్యం ఉంటూ ,అప్పుడూ ,ఇప్పుడూ కూడా మమ్మల్ని కని పెట్టుకొనే ఉంటున్నావు .
129-‘’బి౦బాదారా శుద్ధమాయా పితామ –హ్యాస్మాకం మాతాహి సత్వ ప్రధానా
రాజస్యాం తస్యా మజో భూత్స్వయం భూః-ఈశ స్యైవా భూద్వి రాట్చక్తి భాగః ‘’
తా-‘’ఈశుని ప్రతి బింబా నికి ఆధార మైన గుణ వ్యవస్థ లోకానికి’’ నాయనమ్మ ‘’అయింది .ఈశ్వరునితోకలిసి సత్వ ప్రధాన మాయవైన నువ్వు మా అందరికి’’ తల్లి’’ వైనావు .రజో గుణ ప్రధాన మైన నీలో స్వయంగా’’ విరించి ‘’ పుట్టి బ్రహ్మ మొదలైన పేర్ల తో సృష్టి కర్త అయ్యాడు .ఆ ఈశ్వరుని శక్తి భాగం విరాట్టు అంటే విష్ణువు అయినాడు .
130-‘’సృ ష్ట్యా మస్యాం సాస్త్ర్యు మేశః పుమాని –త్వన్వేత్వేవ శ్రోత శీర్ష ప్రసంగః
ఆదౌ సూక్ష్మా స్థూల రూపా తతస్సా-సృష్టి ర్జ్నేయాసర్వ మూలం త్వమేవ ‘’
తా-ఈసృష్టి క్రమం లో ఆడవాళ్ళందరూ ఉమా స్వరూపులు .మగవారు ఈశ్వర స్వరూపులు .’’ఉమా మహేశ్వర ఉపనిషత్ ‘’చెప్పింది కూడా దీనితో సరిపోతోంది .మొదట ఈశ్వరుని చేత ఇచ్చా శక్తితో ఏర్పడింది అక్రమ సృష్టి –సూక్ష్మ సృష్టి .తర్వాత క్రమంగా స్థూల సృష్టి అయింది అది .ఈ సర్వానికీ కారకు రాలవు నువ్వేకదా తల్లీ !
131-‘’మాయాం విజ్ఞాయ ప్రకారాకృతిం త్వాం-తద్వంతం తం చేశ మద్దా విచిం త్య
త్వద్వంద్వ స్యేదం సమిద్ధం ప్రతీకై –ర్విశ్వం వేదః ప్రాహసో న్వేతి చాత్ర’’
తా-ప్రక్రుతి రూపిని వైన నిన్ను మాయగా తెలుసుకొని ,ఆ మాయనే కలుపుకొని వ్యవహరిస్తున్న ఈశ్వరుని సత్యం గా భావించి ,మీ ఇద్దరి అవయవాలతో ఈ విశ్వం ప్రకాశిస్తోంది అని వేదం చెప్పింది .ఇక్కడకూడా వేద భావన సమన్వయము అయింది .
132-‘’తస్మాద్వక్తి త్వజ్జగంమాత్రు కాత్వం –లోక శ్శాస్త్రం సర్వ మూలం హి వేదః
సూక్ష్మే సర్గే నాస్తి మేళో న తాళః-దృష్టాశ్రోతా నాస్తి కోవా వివాహః ‘’
తా-నువ్వే జగాలకు మాతవు అని లోకం, శాస్త్రం, అన్నిటికీ మూలమైన వేదం ఘోషిస్తున్నాయి .అప్పటి సూక్షం సృష్టి లో ‘’మేళ,తాళాలు’’లేవు .వినేవాడు ,చూచే వాడు కూదాలేరు .భాజా భజంత్రీలు ,పురోహితుడు ,మంత్రం తంత్రాలు సాక్షులు ఎవ్వరూ లేరు కనుక ఆ వివాహం ‘’ఉత్తుత్తి బాంక్ లాగా ఉత్తుత్తి పెళ్లి ‘’అని అనుకోవాలి .
133-‘’క్షంతవ్యా మే మాతర జ్ఞాన వాణీ-భండం సంహర్తుం హియా వాతరస్త్వం
తస్మిన్కాలే దేవతా ప్రార్ధనేన –త్వద్ధ్యానేనా విర్భవ న్నూఢవాం స్త్వాం ‘’
తా-అమ్మా ! నా అధిక అజ్ఞాన ప్రసంగాన్ని క్షమించు .భండాసుర సంహార సమయం లో దేవతల కోరిక పై నువ్వు శివుని ధ్యానించగా నీ నాధుడే వచ్చి నిన్ను ‘’మళ్ళీ పెళ్లి ‘’చేసుకున్నాడు .
134-‘’నిత్యం వేదే షూచ్య మాన స్సయజ్ఞ –ఉద్వా హాభ్యోయ౦ తదాది ప్రసిద్ధః
కల్పాం శ్చక్రుః కల్ప కారా అనూచ్య –వేదాన్లోకం కౌతుకం చాను సృత్య ‘’
తా-నిత్యం వేదం చెబుతూనే ఉన్నా ,నీ పెళ్లినాటి నుండి వివాహం అనేది ఒక యజ్ఞం గా లోకం లో సుప్రసిద్ధమైంది .వేదాన్ని అనుసరించీ ,లోకా చారాన్ని బట్టి కల్ప కారులైన ఆపస్తంభుడు మొదలైన వారు వివాహ విధానాన్ని శాస్తోక్తం గా రచించారు .
135-‘’గౌరీ కల్యాణం చ సీతా వివాహ –మాప్యన్నేషాం దేవతానాం మహా౦శ్చ
ప్రత్యబ్దం కుర్వంతి భక్తా స్వాభక్త్యా –తేనేదం విశ్వం స కళ్యాణ మాసీత్ ‘’
తా-గౌరీకళ్యాణం అని సీతా కళ్యాణం ఇతర దేవతలకూ కళ్యాణాలు భక్తులు భక్తీ శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాలు అప్పటి నుంచీ చేస్తున్నారు .స్త్రీ పురుష వివాహాలు కల్ప సిద్ధాలు .ఇదే ఇప్పుడు దేశమంతా అనుసరించి భాజా భజంత్రీలతో హోరేక్కిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-15-ఉయ్యూరు