’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -10

 

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -10

 

111-‘’ఈశో విష్ణు సశ్రీ రుమావా ణ్యు మా జో –పీశ శ్శక్ర శ్చేశ ఈశా శచీద్యా

స్త్రీ సర్వోమా పూరుష స్సర్వ  ఈశః –ఇత్యూచే కోపి శ్రుతేర్మౌళి  భాగః

 

తా –విష్ణువు ,ఈశ్వరుడు ,లక్ష్మి ,పార్వతి ,వాణి,పార్వతి ,బ్రహ్మ ,ఈశ్వరుడు ,ఇంద్రుడు ,ఈశ్వరుడు శచీదేవి ,పార్వతి మొదలైన స్త్రీలందరూ పార్వతి ,పురుషులంతా ఈశ్వరులే .అని ‘’ఉమామహేశ్వర ఉపనిషత్ ‘’చెప్పింది .అమ్మా !వింటున్నావా ?

112-‘’ఏత త్పక్షే,జంతు జాలేషు సర్వే-ష్వంబాస్త్రీ వ్యక్తిః పుమాం స్తత ఏవ

ఏతాభ్యాం యత్సూయ మానం జగత్తత్ –సర్వే వాదా నిర్వివాదా స్థదా చేత్’’

తా-ఈ ఉపనిషన్మార్గం లో నడిచేవారికి జీవరాసులలో ఆడ రూపం లో ఉన్నవారంతా తల్లి ,మగ రూపం లోని వారంతా వారిని కనే తండ్రి ,వారి సంతానమే ఈ సర్వ జగత్తు అని తెలుసుకొంటారు .ఇలా అయితే వాదాలూ గీదాలు జాన్తానై అయి పోతాయి కదా !

113-తత్పక్షే వ్యుక్తా వుమేశౌ ప్రసిద్ధౌ –తా ద్రూప్యేణా రోప్యతేవిశ్వ మేతత్

సిద్ధం స్త్రీ పుం సస్య మాతా  పిత్రుభ్యం –ప్రాదాన్యే నై తత్వయీశే తధాపి’’

తా-ఆ పక్షం గా ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులని నిర్దేశించి ,ఆ ధర్మాన్ని స్త్రీ పురుషులకందరికీ ఆపాదించటం వలన ప్రజలకు తల్లి ఆడది, తండ్రి మగాడు అవుతుంది .కాని ప్రాధాన్యాన్ని బట్టి జగన్మాతవు నువ్వు తల్లివి ,జగత్పిత శివుడు కాక తప్పదు .ఇలా డొంకంతా తిరిగినా నా ప్రశ్న ప్రశ్న గానే ఉండిపోయింది .ఉమా మహేశ్వరుల వివాహ కాలానికి ఈ ప్రపంచం ఉండనే ఉందికదా .మరి దాన్ని ఎప్పుడు కన్నావు తల్లీ ! హద్దు మీరితే క్షమించు .

114-‘’సామాన్యోక్తాం కాళిదాసస్య వాచం –వైశిస్ట్యో క్త్యాశంకరార్యో న సేహే

అస్త్వం బాత్వం తాత పత్నీ శతానాం –సూతే యైకాసాప్రసూ స్స్యాత్ప్రజానాం’’

తా-కాళిదాసు చెప్పిన లోక సామాన్యాన్ని ,శాక్త మతాన్ని బట్టి విశేషం చెప్పి శ్రీ శంకరులు సహింప లేదు .తండ్రికి భార్యలు వందమంది ఉన్నా ,పిల్లలను కన్నదే తల్లి .

115-శాక్తా శ్రుత్యా జామితి స్పష్ట ముక్తాం-అన్యోక్తిభ్యో రూపణీ యాం నిరూప్య

యోగే నాన్యే నాధ్వనోపాస తేహి –ప్రత్యక్షం కేతన్మతం  నాద్రి యంతే’’

తా-శాక్తేయులు ‘’అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం సురూపాం ‘’అనే శ్రుతి వాక్యాన్ని బట్టీ ,మాటలతో నిరూపింప లేని స్వరూపాన్ని నిరూపించి యోగ, జప తపాదులు  మొదలైన వాటి చేత నిన్ను ఉపాసిస్తున్నారు .

116-‘’దృష్టా స్రస్టా మూల భూతౌ శివౌద్వా –వభ్యస్య న్స్త్రీపుంస వర్గం వితేనే

ఇత్యూచే గంగా కవిత్వ ప్రసిద్ధా –సిద్ధం యుష్మ త్సర్వ మాతా పితృత్వం ‘’

తా-‘’అన్నిటికీ మూలమైన పార్వతీ పరమేశ్వరులను చూసి స్త్రీ ,పురుషులుగా భావించి బ్రహ్మ అన్ని జాతుల జంతువుల్ని సృష్టించాడు’’ అని ‘’ప్రౌఢ కవయిత్రి గంగా దేవి ‘’చెప్పింది .ఎవరే రకంగా చెప్పినా మీ ఇద్దరు లోకాలకు మొదటి తలిదండ్రులు అనటం లో సందేహమే లేదు .

117-‘’ఏతత్సృత్యాం ప్రశ్న ఉత్పాదితో న్యః-స్వీ యోద్వా హి పార్వతీ చేశ్వర శ్చ

విఘ్నేశానాం పూజయా మాస తుర్హీ –త్యుత్పత్తేః ప్రాగ్యు జ్యతేర్చా కధం వా ‘’

తా-ఈ మార్గం లో వినేవారికి మరో సందేహం కలుగుతుంది .పార్వతీ పరమేశ్వరులు తమ వివాహ సమయం లో విఘ్నేశు ని పూజించారట .న్యాయంగా అప్పటికి గణ నాయకుడు పుట్టనే లేదు కదా !పుట్టని వాడికి పూజేమిటి నాన్సెన్స్!ఎలా సాధ్యమమ్మా ?

118-‘’ప్రశ్నో న్యోవాగ్బ్రహ్మ పత్నీ ప్రసిద్ధా –శ్రీ హర్ష స్తాం విష్ణు పత్నీం బ్రవీతి

శంభోః పత్నీ శాంభవీ త్యాగమేస్తి-సర్వేషాం వాయస్య కస్యా పి వేయం ‘’

తా-అమ్మా మరో డౌటు –సరస్వతి బ్రహ్మ భార్య అని ప్రసిద్ధం .విష్ణు పత్ని సరస్వతి అని శ్రీ హర్షుడు నైషధం లో రాశాడే .శంభుని పత్ని శాంభవీ అని ఆగమాలు ఆగమాగామ౦ గా ఎలు గెత్తి చాటు తున్నాయి కదా .మరైతే నువ్వేమను కోనంటే ‘’ఈ సరస్వతి అందరికీ పెళ్ళామా “”?లేక ఒకరికే భార్య యా ?(నీతో మాట్లాడుతున్నకొద్దీ సందేహాలు పుట్ట్టలో తేళ్ళులాగా బయటికోస్తున్నాయి ).

119-‘’పౌరాణ్యాం వాణ్యా మితి ప్రస్పురంతి-హ్యజ్ఞాతానా మక్ష రేచాక్షరేచ

ఆద్యే ప్రశ్నే సోత్తరే సోత్త రాస్యుః-సర్వే తస్తం ప్రస్తుతం ప్రార్ధ యామః ‘’

తా-పురాణాలలో ,చరిత్రలలో అన్వయ సరణి తెలియని వాళ్లకు పొట్ట నిండా సందేహాలే .ఈ చిక్కు ముడి విప్పుదాం .ముందు నా మొదటి ప్రశ్నకు అంటే ‘’నీ జగన్మాత్రుత్వం ‘’కు  సమాధానం దొరికితే మిగిలినవి అవే విప్పుకొంటాయి .

120-‘’బ్రహ్మశ్రీ వేద స్వరూపాయ వందే –వేద వ్యాసాయర్షయే శక్తి ధామ్నే

శక్తిం నౌమి ప్రాంజలి ప్రహ్వ దేహః –పాద క్ష్మా౦తే న్యస్య మూర్ధాన మర్దీ’’

తా-బ్రహ్మ వేదాల ప్రత్యక్ష శరీరం కలవాడు .శక్తి కూటం లో నిత్య నివాసి అయిన వేద వ్యాసునికి నమస్కరించి నాకు శక్తి కలగ జేయమని అర్ధిస్తున్నాను .

 

121-‘’వర్తేధాం మామాభి ముఖ్యేన దేవి –త్వం చాయం మౌనీ న నారాయణా౦శః

యుష్మద్వాత్సల్యా న్మయా త్రోచ్య మానాం-శ్రుత్వా బ్రూతంసాధువా సాదు వేతి’’

తా-అమ్మా ! నువ్వూ, నారాయణాంశ అయిన ఈ వ్యాసమహర్షి నాకు ఎదురెదురుగా ఉండండి .నేనడిగిన ప్రశ్నలకు నేనే సమాధానం చెబుతాను .అవునో కాదో మాత్రం చెప్పండి .

122-‘’ఏకం బ్రహ్మా స్త్యక్రియం నిర్వికారం –మాయా బీజే౦కూర శక్తిర్వ తత్ర

వాహనా వౌష్ణ్యం వాపి బింబన్నముష్యాం –శుద్దాయా మీశ స్సఐచ్చ ద్బహుత్వం ‘’

తా-సజాతీ విజాతీ స్వగత భేదం లేని నిష్క్రియ గల మార్పు లేని వస్తువు ఒకటి ఉంది .దానికి బాధ లేదు .అదే బృహత్వం లో బ్రహ్మ౦  అని మనం పెట్టుకొన్న పేర్లు .ఆ బ్రహ్మం లో అగ్నిలోని వేడిలాగా ,విత్తనం లో మొలిపించే శక్తిలాగా మాయ అనే ‘’రూపం లేని శక్తి’’ కనిపించకుండా ఉంది .ఆ మాయ శుద్ధ మైంది .దానిలో ప్రతి ఫలించిన బ్రహ్మం యొక్క ప్రతి బింబమే ఈశ్వరుడు .ఈ ఈశ్వరుడు సత్వ గుణంఉన్న మాయ తో  కలిసి అనేక రూపాలు పొందాలని భావించాడు .

123-‘’మాయాం చేమాం శంకరః ప్రాహ విద్వాన్ –సచ్చా సచ్చా భూదిదంసర్వ మస్యాః

సత్సాన్నిధ్యే  భాసతే స త్త ధైవ-లోకే సర్వేషాంస ఏష స్స్స్వభావః’’

తా-సర్వజ్ఞుడైన శ౦కరుడు ఈ శక్తినే మాయ అన్నాడు .సద సద్రూపంగా ఉన్న ప్రపంచం అంతా ఈ మాయ వలననే ఏర్పడుతుంది .సద్వస్తువు దగ్గరగా ఉంటె అసత్తు సత్తు లాగా భాసిస్తుంది .ఈ భాసనం దీపం దగ్గర ఇతర పదార్ధాలు కాంతితో కనిపించి నట్లుగా ఉంటుంది .

124-‘’మాయా బింబోష్యేష సర్వజన ఈశ-స్సత్వో ద్రేకా దిచ్చయోపేత ఐచ్చత్

నానా భావం సక్రమేణా క్రమేణ-భేజే హిత్యాహ శ్రుతి ర్ద్విప్రకారాత్ ‘’

తా-శుద్ధుడు, సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడు ,మాయలోని సత్వ గుణ ఉద్రేకం వలన ఇచ్చా శక్తి తో కలిసి నానాత్వం కోరాడు .వెంటనే ఈశ్వరుడు విశ్వ రూపాన్ని దాల్చాడు .మదహంకార  ,సూక్ష్మ ,స్థూల భూతాలను ఒక క్రమం లో సృష్టించాడని రెండు పద్ధతులలోశ్రుతి చెప్పింది .కనుక ఒకప్పుడు క్రమ సృష్టి ,మరొక్కప్పుడు సర్వ సృష్టి జరిగిందని భావించాలి .

125-‘’శుద్ధ మాయా బ్రహ్మ రూపా నిరూపా –తామాచార్యో బ్రహ్మ పత్నీం బ్రవీతి

బింబీ భూత స్తత్ర దేవః ప్రసూతే –సత్వన్నత్యా భిన్న రూపేచ్చ యేదం’’

తా-శుద్ధ మాయ- రూప రహితమైన నామం రూపం లేని పర బ్రహ్మానికి ‘’మహిషి ‘’అని శ్రీ శంకర భాగవత్పాదు లవారు వర్ణించారు .దానిలో ప్రతి బింబిం చిన దేవుడు సత్వ ప్రధానం కలిగి ఉండటం వలన వేరే రూపం లో ఉన్న మాయ లో ఉన్న గుణాలను తన వశం చేసుకొని తాను గుణ రహితుడైనా గుణమయమై కనిపించి మనతో ఒకాట ఆడుకొంటున్నాడు .అంటే సృష్టి చేస్తున్నాడు అని భావం .

 

 

సశేషం

 

Inline image 1

ne image 1

Inline image 2    Inline image 3    Inline image 4

విజయ దశమి ,అమరావతి శంకుస్థాపన శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-15-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.