’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12

136-‘’బాలా లాపాన్వత్స లత్వాన్నిశమ్య –భక్త్యా స్తిక్యా చ్చోచ్య మానాన్ మదీయాన్

పాపం భంక్త్వా యత్ప్రదేయం ప్రదేహి –మాతర్వ్యానం చాపి ప్రుచ్చా మితేగ్రే ‘’

తా-భక్తీ ,ఆస్తిక బుద్ధి లతో నేను పలికిన వెర్రి మొర్రి మాటలను బిడ్డమీద ప్రేమ ఉన్న తల్లిలాగా విని నా పాపాలు పోగొట్టి నాకేది ఈయాలని పిస్తే దాన్ని ఇవ్వు .నీ సముఖం లోనే వ్యాస భట్టారకునితో రెండు మాటలు మాట్లాడతాను .దాన్నీ విను తల్లీ !.

137-‘’స్వామిన్ వేదవ్యాస భట్టార కర్షె –సాక్షాద్విష్ణో  దేహిమే సంప్ర బోధం

శిష్యస్యాజ్ఞ స్యాత్మ వాణ్యాం పురాణ్యాం-మద్విజ్ఞానే నోచ్యమానం శ్రుణుష్వ’’

తా-వేదం విభజన చేసి ,సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారమైన వ్యాస మహర్షీ !అజ్నుడైన ఈ శిష్యుడికి ప్రబోధం చేయి .నువ్వు చెప్పిన పురాణాలలో ,నా బుద్ధికి తోచిన వాటిని ప్రశ్నోత్తర రూపం లో విను .

138-‘’గౌరీ కళ్యానేర్చితో విఘ్న రాజ –ఇత్యాస్తే తేతత్పురాణ ప్రప౦చే

ఐతత్కాలం నో సజాతః కధం వా-కుర్వా తేస్మా మూ అజాతస్య పూజాం ‘’

తా-గౌరీకళ్యాణ  సమయం లో ఆ దంపతులు గణపతి పూజ చేశారని పురాణం లో ఉంది .అప్పటికి పార్వతికి గణపతి పుట్ట లేదు కదా .పుట్టని వాడికి పూజేమిటి మహాత్మా ?

139-‘’ఇత్యాదీ న్ప్రశ్నా న్సముత్దా పయంతి –లోకా స్తేషా ముత్తరం కిం వదామః

తూష్ణీం స్థాతుం శక్ను వంతో న కిం వా –వచ్మో యుక్తా యుక్తతే కః ప్రవేద ‘’

తా-ఇలాంటి ప్రశ్నలు లోకం లో కో కొల్లలున్నాయి .వాళ్లకు ఏం  సమాధానం చెప్పాలో తెలియటం లేదు .వాళ్ళ నోరు మూయించటానికి నాకు తెలిసిన సమాధానమేదో చెబుతున్నాను  .అందులో సత్యా సత్యాలు యుక్తా యుక్తాలు  నాకు తెలియదు .సత్యాన్ని తెలుసుకోవటం ఎవరి తరం ?

140-‘’శ్రుణ్వే తన్మే త్రోచ్య మానం సమాధిం –విష్ణ్వీశాది స్థూల సర్గో యదా భూత్

సర్వే దేవా స్సర్వ లోకా న్సమస్త౦ –భూత ప్రాయం భూత మే వేతి మన్యే ‘’

తా-నేను చెప్పే సమాధానం విను స్వామీ !శివ ,విష్ణు ,బ్రహ్మా దుల స్థూల దేహ సృష్టి ఎప్పుడు జరిగిందో ,అప్పుడే సర్వ లోకాలు ,సర్వ దేవతలు ,సమస్తభూత జాలం ఏర్పడింది ఒకదానినొకటి పోలి ఉన్నాయి .

141-‘’తుల్యే దేహే వ్యావహారం విహారం –లోకా యోగాః పారమార్ధం గృణంతి

యోగీంద్రాణాం సాను భూతిర్నవేద్యా –తే మన్యంతేస్మత్ప్ర వృత్తిం హి తుచ్చాం’’

తా-అందరి దేహాలూ ఒకటిగానే ఉన్నా ,లౌకికులు వ్యావహారిక విషయాలనే గ్రాహి౦చారు .యోగులు మాత్రం ఇందులో పారమార్ధిక మార్గాన్ని అనుసరించారు .యోగుల అనుభావమేమిటో మనకు తెలియదు కదా. మనం వాడుకొనే పధ్ధతి తుచ్చం అని వారి అభిప్రాయం .

142-బ్రహ్మాండం పిండాండ  కేత్రా స్తి గూఢం-షట్సప్తా స్టౌవాత్ర చక్రాణి సంతి

ఆదిక్షాంతా స్తద్దల స్థాహి దేవ్యః –మధ్యే సూక్ష్మా కుండలినాఖ్య శక్తిః’’

తా-ఈ స్వల్ప మానవ శరీరం లో బ్రహ్మాండం అంతా గూఢం గా ఉంది ఇందులోనే ఆరు ,లేక ఏడు లేక ఎనిమిది చక్రాలున్నాయి .ఆ చక్రాల దళాలలో అ నుండి క్ష వరకు అక్షరాలు అమ్రుతాది శక్తి రూపం లో ఉన్నాయి .ఈ చక్రాల మధ్య కుండలిని అనే శక్తిగల నాడి వ్యాపించి ఉంది .

143-‘’ఊర్ధ్వం వాలం శీర్ష మానీయ చాద –శ్శేతే స్మాకం పృష్ట వంశేషు సోహిః

యోగీడాయాం పింగలాయాం చ  వాయు –మా పూర్యాత్రో త్దాపయంత్య౦త రాతాం’’

తా- ఆ కుండలినీ శక్తి తకకి౦దు గా తోక పైకి ఉంచి మన వెన్నెముకలో నిద్రిస్తోంది .దాన్ని వెన్నుపాము అంటాము .యోగాభ్యాసం చేసేవాడు దానికి అటూ ఇటూ ఉండే ఇడ,పింగళఅనే నాడులలో గాలి గట్టిగా పూరించి ,మధ్యలోని కుండలినీ శక్తిని కదిలిస్తాడు .

144-‘’ఊర్ధ్వం శీర్షం వాల  మూలం తధాధః-క్రుత్వోత్తిస్ట త్యజ్జ్వలాత్మా సుసుమ్నా

వాయుర్వహ్నీ భూయ సాకం తయోద్యన్ –మూర్ధానం సన్నాద భీమం ప్రయాతి ‘’

తా-ఈ రెండు నాడులలో నిండిన గాలి ప్రేరేపి౦పగా తలపైకి తోక కిందికి ఉండేట్లుగా మహా ప్రకాశం తో ఆ కు౦డలిని జ్వాలలను ఎగిసేట్లు చేస్తుంది .ఆ గాలి అగ్ని రూపాన్ని పొంది ,సుషుమ్న తో ఎగసి నానా విధ నాదాలతో భయంకరంగా సాధకుని మూర్ధ స్థానానికి చేరుతుంది .

145-‘’’’తన్మార్గే చక్రాణి పశ్యేత్క్రమేణ –యోగీ భాగ్యా ద్రాజ మార్గే   నిశాయాం

గచ్చన్ దీపే నాట్ట కుడ్యే పతంతీం-చాయాం తత్రత్య  ద్రుమా దేర్య దా చ్ఛే’’

తా-ఇలా నాదమయం అయిన యా కుండలిని తో సహస్రానికి వెళ్ళే మార్గం లో రాత్రి వేళ దీపం తీసుకు పోతున్నప్పుడు దారిలో ఉన్న మేడల గోడల,పై చెట్ల నీడలు చూసినట్లు సాధకుడు అదృష్ట వశాన ఆ చక్రాలను దర్శిస్తాడు .

146-‘’మూలాధారం చక్ర మాదౌ తదీశో-విఘ్నేశాన స్తస్య పుష్టి ర్హి శక్తిః

చత్వార్యే తత్ప్ర కాణ్యే షు దేవ్యో –వశ్ష స్సస్తా వశిన్యాది సంజ్ఞా ‘’

తా-మొదట్లో మూలాధార చక్రం కని పిస్తుంది .దీనికి గణపతి అధికారి .గణపతి శక్తి’’ పుష్టి దేవి ‘’అనే పేరు కలది .ఇందులోని  నాలుగు దళాలలో  అవే’’ వ ,శ ష ,స ‘’అనే అక్షరాలు’’ వశిన్యాది ‘’శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటాయి .

147-‘’వాణీ బ్రహ్మాదిష్టితం యత్త దూర్ధ్వ్యం –స్వాధి స్టానం చక్ర మాస్తే షడశ్రం

బాలా ద్యంతా వర్ణకా స్త ద్దలేషు-బందిన్యాద్యా శ్శక్తయ స్సన్ని విస్టాః

తా-దానిపై సరస్వతీ శక్తి తో కలిసి బ్రహ్మ చేత అధిస్టిం ప బడిన ‘’స్వాదిస్టానం’’ అనే ఆరు దళాల చక్రం ఉంటుంది .ఆ దళాలలో ‘’బ ,భ ,అ ,య ,ర,ల ‘’అనే వర్ణాలు ‘’బందిన్యాది శక్తులు ‘’గా నిత్యం నిలిచి ఉంటాయి .

148-‘’తస్మా దూర్ధ్వం స్యా న్మణీపూరకాఖ్యం—లక్ష్మీ శ్శక్తిర్విష్ణు రత్రా ధి దేవః

డాద్యాః ఫాంతా అక్షరా అత్ర దేవ్యో –డాకిన్యా ద్యాస్స్యు ర్దశ స్వశ్ర కేషు ‘’

తా-దీనిపైన(నాభి దగ్గర ) మణిపూరకమనే చక్రం ,దాని అధిదేవత విష్ణువు ఉంటారు .ఇక్కడ లక్ష్మీ దేవియే శక్తి .ఈ కమల దళాలలో’’ డ,ఢ,ణ,త,ధ.ద,ధ,న,ప,ఫ’’అనే అక్షరాలూ 15దళాలలో’’ డాకిన్యాది శక్తులుగా’’ ఉంటాయి .

149-‘’తస్యాప్యగ్రే నాహతం ద్వాదశారం –శక్తిః పార్వత్యత్ర దేవా శ్శివ శ్చ

తస్యా రేషు స్యుః కఠాద్యంతవర్ణా-స్సర్వా దేవ్యః కాలరా త్ర్యాదయ స్తాః’’

తా-మణిపూరకం పైన హృదయ స్థానం లో ‘’అనాహతం ‘’అనే పేరుతొ 12అంచుల చక్రం ఉంది ..దీనిలో శక్తి పార్వతి శివుడు దేవుడు..దాని అంచులలో ‘’క ఖ ,గ ఘ ,జ్ఞ,చ, ఛ జ ,ఝ ,జ,ట,ఠ ‘’అనే ఆగమ ప్రసిద్దాలైన 12అక్షరాలుంటాయి .ఇవే’’ కాలరాత్రి’’ మొదలైన ఆగమ ప్రసిద్ధ  శక్తులు .

150-‘’కంఠ స్థానే షోడ శారం త దూర్ధ్వం –జీవో దేవః ప్రాణ శక్త్యా సమేతః

అశ్రేష్వస్య స్యు స్స్వరా స్షోడశర్ణా—స్తాఏ వైషాం శక్త యశ్చా మృతాద్యాః’’

తా-అనాహతం పైన క౦ఠ స్థానం లో (గడ్డం కింద )16అంచుల చక్రం ఉంది .దీని అధిదేవత జీవుడు ప్రాణశక్తితో ఉంటాడు .అంచులలో ‘’అ ,ఆ,ఇ,ఈ, ఉ, ఋ,ఋాఆలు ,ఆలూ ,ఎ,,ఏ ఐ, ఒ,ఓ,ఔ,అం,అః’’అనే 16అక్షరాలూ (అచ్చులు )’’అమృతం ‘’మొదలైన శక్తులుగా ఉంటాయి .

151-‘’ఆజ్ఞా చక్రం ద్వ్యశ్ర మంతర్భ్రువో ర్య-త్తస్మిన్నిచ్చా శక్తి రీశః పరమాత్మా

పత్ర ద్వంద్వే హ క్ష వర్ణౌక్షమావ –త్యేకాచాన్యా హంస వత్యేవ శక్తీ ‘’

తా-రెండు కను బొమల మధ్య రెండంచుల ‘’ఆజ్ఞా చక్రం ‘’ఉంటుంది .ఇందులో ఇచ్చయే శక్తి రూపంగా ఉంటుంది .దీనికి అధికారి పరమాత్మ .రెండు దళాలలో’’ హ ,క్ష’’అనే రెండక్షరాలుండి’’ క్షమావతి ,హంసవతి ‘’అనే శక్తులను కలిగి ఉంటాయి .

152-‘’మూర్ధ న్యాస్తేయం సహస్రార సంజ్న-శ్చక్ర శ్శ్శ్రేస్టో  మోక్ష శక్త్యా గురుశ్చ

సర్వే వర్ణాస్సర్వ దేవాస్స్వశక్తి- ప్రోతా స్స్ఫీతా అత్ర యోగా వసంతి .’

తా-‘’మాడు’’ లో ‘’సహస్రారం’’ అనే ఉత్తమమైన చక్రం ఉంది .ఇక్కడ’’ గురుమూర్తి’’ అధిస్టించి ఉంటాడు .అక్షరాలన్నీ తమ శక్తులతో కలిసి ,ఆయా దేవత లంతా ఈ చక్రం లో ఉంటారు .యోగాభ్యాసకులు ఇక్కడే నిద్రిస్తారు .

153-‘’దృశ్యాదృశ్యం చా స్టమం చక్ర మూర్ధ్వే –మూర్ద్నః పీఠే స్వాంగుళీ నాం చతుష్కే

ద్రష్టుం దూరాద్యోగినా మప్య శక్యం –శక్తి శ్శక్తో వా పరం బ్రహ్మ మూలం ‘’

తా-సహస్రారం పైన ఎవరి చేతి వ్రేళ్ళ తో నాలుగు అంగుళాల లెక్కలో బెత్తెడు దూరం లో ‘’పీఠం’అనే చక్రం ఉంది .సహస్రారం లో ఉన్న యోగులకు కూడా చూడశక్యం కానిది .ఇక్కడ సర్వ కారణమైన పర బ్రహ్మ స్వరూపం ఉంటుంది .అది శక్తియో ,శక్తి మంతుడో ఎవరూ చెప్పలేరు .

154-‘’తస్మిన్ దేశే శక్తి మచ్చక్త్య భేదాత్ –బ్రహ్మై వేదం శక్తి రేవే య మిత్ధం

ద్రష్ట్రూణాం ద్రుష్టి ప్రభే ధాన్మతాని –శాక్తే యాదీ న్యానిరాసన్ హితాని ‘’

తా-ఇక్కడ శక్తికి ,శక్తి మంతుడికి అభేదమే .దీనినే ‘’బ్రహ్మం ‘’అనీ ,’’శక్తి ‘’అనీ పిలుస్తారు .చూసే యోగుల దృష్టి భేదాన్ని బట్టి శాక్తేయం ,వైష్ణవం శైవం మొదలైన మతాలూ ఏర్పడ్డాయి .

155-‘’శక్త్యంశో మాతాత్ర తాతః పుమంశః –చిచిచ్చక్తీ అగ్ని శక్తీ వ రూఢే

సా మాయా మాయీ స కామేశ్వ రోయం –కామేశీ  సా పార్వతీ సా స ఈశః ‘’

తా-ఈ చక్రం లో శక్తి రూపంగా కని  పించే భాగం తల్లి .పురుష రూపంగా కనిపించే భాగం తండ్రి  .అగ్నీ దాని శక్తి ఐన వేడి లాగా చిద్రూపం, శక్తి రూపం గూఢ మైనవి .శక్తి రూపం’’ మాయ’’ .పురుష రూపం ‘’మాయి ‘’.మాయియే కామేశ్వరుడు .మాయ కామేశ్వరీ దేవి .కామేశ్వరే పార్వతీదేవి .కామేశ్వరుడే పరమేశ్వరుడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-15-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.