ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79

34-‘’ఫ్రీ విల్ ‘’ను ప్రవచించిన ప్రముఖ ఆధునిక  ఫ్రెంచ్ తత్వ వేత్త –హెన్రి  బెర్గ్ సన్

హెన్రి బెర్గ్ సన్ తండ్రి  పోలాండ్ దేశీయుడు తల్లి ఇంగ్లాండ్ దేశీయురాలు ,పూర్వీకులెవరూ గాలిక్ రక్తం లేనివాళ్ళే .వీరంతా  జ్యూయిష్ వ్యాపారస్తులు . హెన్రి తండ్రి కళలవైపు మొగ్గు చూపాడు .గొప్ప సంగీత విద్వాంసుడు అవటం తో స్వంత ఊరు వార్సా వదిలిపెట్టి  బ్రిటన్ చేరి ఐరిష్ వంశానికి చెందిన ఇంగ్లీష్ జ్యూయిష్ యువతి కేధరీన్ లేవిన్సన్ ని పెళ్లి చేసుకొన్నాడు .కొడుకు హెన్రి 18-10-1859లో పారిస్ లో పుట్ట్టినప్పటికీ ఇరవై ఒకటవ ఏడు వరకు సామాన్య ఫ్రెంచ్ దేశీయుడిగానే ఉన్నాడు .ఇతని ఇంగ్లీష్ ఉచ్చారణ చూసి తోటి విద్యార్ధులు టిపికల్ ఇంగ్లీష్మన్ అనుకొనేవారు .ఈకోల్ నార్మేల్ సుపీరియర్ లో  బయాలజీ ,సైకాలజీ  చదివాడు . జాన్ స్టువర్ట్ మిల్ బోధించే ఫ్రీ థాట్ కు ,ఇండక్షన్ విధానానికి ఆకర్షితుడై హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పిన ‘’ఫస్ట్ ప్రిన్సిపుల్ ‘’ను మెచ్చుకున్నాడు.‘’.శాస్త్రీయ పరిణామ భాషలో వాస్తవాన్ని వివరించలేము అని అనుమాన పడ్డాడు .

18వ ఏట ఒక గణిత సమస్య ‘’అన్నేల్ డీ మేధమేటిక్ ‘’పత్రిక లో పడింది .అది ప్రభావితం చేసింది  గణిత శాస్త్రజ్ఞుడు అవుదామనుకొన్నాడు .గణితం లోని కఠిన నియమాలు ,ఖచ్చితమైన సైన్స్ ,ఊహాత్మక  సాహిత్యం లలో దేన్నీ ఎంచుకోవాలో యువ హేన్రికి అర్ధం కాక రెండిటిని కలపాలని నిర్ణయానికి వచ్చాడు .ఫిలాసఫీ రచయిత ఆవాలను కొన్నాడు .పూర్వపు గ్రీకు ఫిలాసఫర్ల పై ఆసక్తి పెరిగింది .జీనో చెప్పిన ‘’బీయింగ్ ,బికమింగ్ ‘’,హెరాక్లిటస్ బోధించిన ఫ్లూయిడ్ యూని వర్స్స్  మనసుకు బాగా పట్టాయి .వీటిని తరువాత కాలం లో సుసంపన్నం చేశాడు .మనిషి వేదాంతం వలననే జీవించలేడుఅని గుర్తించి ,ఫిలాసఫీ బోధన,తిండి పెడుతుంది అని తెలుసుకున్నాడు .గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ‘’లైస్ ఆఫ్ క్లేర్మాంట్ ఫెర్రాండ్ ‘’లో టీచర్ గా చేరి విద్యార్ధులను బాగా ఆకర్హించాడు .ప్రతి విషయం పైనా  నిగ్గు తేల్చే విధానాన్ని అనుసరించాడు .

30 వ ఏట బెర్గ్సన్ రెండు పరిశోధనా గ్రంధాలను రాసి ప్రచురించాడు. అందులో చాలా ముఖ్యమైన మొదటి గ్రంధం “Time and Free will”. ఎనిమిది ఏళ్ల తర్వాత ఆయన చదివిన పాత స్కూలులో ఉద్యోగం పొందాడు. అప్పుడు తీవ్రమైన ఆలోచనా విధానం కల “మేటర్ అండ్ మెమరీ” గ్రంధాన్ని ప్రచురించాడు. 1900లో కాలేజి డి ఫ్రాన్స్ లో ప్రొఫెసర్ అయ్యాడు. ఇందులో ముప్పై ఏళ్ళు పని చేసాడు. ఆయన ఉపన్యాసాలు అందరినీ ఆకర్షించేవి. ఒక ఫిలాసఫర్ అంతగా ప్రాచుర్యం పొందటం ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ప్రఖ్యాతి విపరీతంగా వ్యాపించింది. అన్ని చోట్లా ఆయనను అభినందించారు, అనుకరించారు, ఆహ్వానించి సన్మానించారు. తరచుగా ఇండ్లు మారుస్తుండేవారు. అందుకని “వా౦డరింగ్ జ్యూ” అనేవారు. స్త్రీలు ఆయన ఉపన్యాసాలంటే క్రేజీగా హాజరయ్యేవారు. ఆయన చెప్పే “క్రియేటివ్ ఇవల్యూషన్”,” చైతన్య స్రవంతి (ఎలాన్ వైటల్)” బాగా ఆకర్షణగా ఉండేవి. వేదాంతమంటే తనలో తాను తొంగి చూసుకోవడమని చెప్పేవాడు. ఈ మాటలను అందరూ అన్ని చోట్లా చెప్పుకుని ప్రాముఖ్యతను తెచ్చారు. 50 వ ఏట టెయిన్ అండ్ రెనాన్ అనే చోట ఉండి ఫ్రాన్స్ దేశంలో సృజనాత్మక ఆలోచనా పరుడుగా కీర్తిపొందాడు. కొత్త భావాల వ్యాప్తికి ప్రపంచంలో గొప్ప ప్రేరణ కల్గించిన  మేధావిగా గుర్తింపు పొందాడు. 52వ ఏట ఆయన రాసిన time అండ్ freewill, matter అండ్ memory, క్రియేటివ్ ఇవల్యూషన్ ఒకే సారి ఇంగ్లీషులో అనువాదం పొంది విడుదల అయ్యాయి. అమెరికా, ఇంగ్లాండ్ లలో ఆయనకు కొత్త శిష్యులు ఏర్పడ్డారు. పురుషులు ఆయన భావ తీవ్రతకు ఉత్తేజపడితే, స్త్రీలకు  ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన దాంపత్యం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగింది.

50 లలో బెర్గ్సన్ సంచార ఉపన్యాసకుడుగా మారాడు. ఆక్స్ఫర్డ్, లండన్, బర్మింగ్హాం, బొలోనా, న్యూ యార్క్ లలో చిరస్మరణీయ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. దానితో శ్రోతలకు ఆయన ప్రవచనాలు పరమ ఆసక్తిగా ఉండేవి. 55 వ ఏట ఫ్రెంచ్  అకాడమీకి ఎన్నిక అయ్యాడు. 62 లో కాలేజి డి ఫ్రాన్స్ కు  రాజీనామా చేసాడు కానీ ‘’ఆనరరీ  ప్రొఫెసర్’’ గా ఉండిపోయాడు. 68లో బెర్గ్సన్ కు “in recognition of his rich and life giving ideas and resplendent art with which they are presented” కు గాను’’ నోబెల్ బహుమతి’’ లభించింది. వయస్సు పై బడుతున్న కొద్దీ మత భావాలకు మరీ దగ్గర అయ్యాడు. 70 వ ఏట కాథలిక్ గా మారి దానిని “The complete fulfillment of Judaism” అని ప్రకటించాడు. కానీ యాంటీ సేమిటిక్ ఉద్యమాలప్రభావం వలన , జర్మనీ ఫ్రాన్స్ లలో మతంపై ఒక కొత్త ఆలోచన రావాలి అని భావించాడు. దౌష్ట్యం ఆయన్ను కలచి వేసింది .రాబోయే  రోజుల్లో బాధితులలో తానూ ఒకడిగా ఉండాలని అనుకున్నాడు. ఈ దౌష్ట్యం ఫ్రాన్స్ లో 1940 ఫ్రాన్స్ పతన౦  తర్వాత జరిగింది. ‘’విచీ’’ ప్రభుత్వం యూదులందరినీ వారి ఉద్యోగాల నుండి తప్పించింది. బెర్గ్సన్ జోలికి పోలేదు. దీన్ని ఆయన స్వప్రయోజనం గా  భావించలేదు. 80 ఏళ్లకు మరీ బలహీనుడై ఏమాత్రం రాజీ  పడకుండా  విశ్రాంత జీవితాన్ని గడిపాడు. ఫ్రాన్స్ లోని యూదులందరినీ పేర్లను నమోదు చేసుకోవాలని బలవంత పెట్టినా ఈయన జోలికి రాలేదు. దాన్ని ఆయన అవకాశంగా భావించకుండా రిజిస్ట్రేషన్  ఆఫీసువెళ్లి ,  క్యూలోగంటల తరబడి  నిలబడి తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. దీనితో విపరీతమైన నీరసం వచ్చి తట్టుకోలేక పోయాడు. అననుకూలమైన ఆ వాతావరణంలో ఆయన గంటలు తరబడి నిలబడి ఉండటం వలన ఆరోగ్యం దెబ్బ తిన్నది. కానీ మానవత్వ గౌరవాన్ని ఆయన ప్రపంచానికి చాటాడు. అదే ఆయన చావుకు దగ్గరకు తెచ్చింది. ఊపిరి తిత్తులు దెబ్బ తిని, రక్త నాళాలు కుంచించుకునిపోయి  4 – 1-19 41 న ఆ జ్ఞాన వయో వృద్ధ ఫిలాసఫర్ హెన్రీ బెర్గ్సన్ తుది శ్వాస వదిలాడు.

బెర్గ్సన్ భావాలు విప్లవాత్మకమైనవికావు. కానీ ఆయన వివరించే విధానం ఆశ్చర్యంగా దిగ్భ్రమ కలిగించేవిగా ఉంటాయి. వేదాంతం అంటే  పారిపోయే జనాలకు ఆయన మాటలు రస గుళిక లయ్యాయి ..  సంభ్రమాశ్చర్యాలలో ముంచేవి. సామాన్య జీవికి గుణాత్మక మార్గాన్ని చూపెట్టిన మహానీయుడాయన. నేతి- నేతి వాదాల జోలికి పోకుండా సూటిగా వేదాంతాన్ని బోధించిన అద్వితీయుడు. ప్రతి వ్యక్తీ ఒక కొత్త జీవి అని సృజన శీలి అని నమ్మాడు. ఆయన జీవితంలో ప్రతి క్షణం ఒక కొత్త అవకాశానికి వేదికగా ఉండేది. స్వేచ్చా ఆలోచనలకు ఆయన పెద్ద పీట  వేశాడు. డార్విన్ సిద్ధాంతాన్ని కొత్త ఆలోచనలతో పరిణామ క్రమంగా బోధించాడు. అందుకే బెర్నార్డ్ షా ఆయన చెప్పిన ఎలాన్ వైటల్ ను ప్రాణ శక్తి (లైఫ్ ఫోర్స్ ) అన్నాడు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ, వ్యాపిస్తూ కొత్త రూపాలను పొందుతూ నిస్తేజంగా చలన రహితంగా ఉత్సాహ రహితంగా ఉండే వాటిని వ్యతిరేకించింది.    జడత్వాన్ని వదిలించింది. జీవితం అంటే అడ్డు లేని నిరంతర చర్య అన్నాడు. అనుమాన రహితమైన పోరాట పటిమ కల విధానం అంటాడు. దేవుడు కూడా ఒక చోట స్థిరపడి ఉండే శక్తి కాదన్ననాడు. తను చేసిన సృష్టితో పాటు దేవుడు కూడా పెరుగుతాడు అంటాడు. ‘’దేవుడు రెడీ మేడ్ ‘’వస్తువు కాదన్నాడు. “God is unceasing life action freedom. Creation so conceived is not a mystery – we experience it in ourselves when we act freely” అని చెప్పాడు.

ఈ ఆరకమైన ఆలోచన వల్ల బెర్గ్సన్ పదార్థానికి ఒక కొత్త తేజాన్ని ఇస్తూ ఆధ్యాత్మికతకు దగ్గర చేసాడు. కనిపించే  వస్తువులను, అణువులను దాటి ఆయన ఆలోచనలు ఉండేవి. “He compared the potential energy held in the atom to the release of nuclear thought within the mind. He made a distinction between the brain, which is the calculating and measuring machine and the mind which remembers every thing and manifests itself in intuition, the source of all knowledge”అని సిద్దాంతరీకిస్తాడు బెర్గ్సన్. మానవ మెదడు ఆలోచనా యంత్రమని, అది లెక్కించి మదింపు చేసి విశ్లేషణ చేస్తుందని కానీ అది అనుభ వించ లేదని చెప్పాడు. భావాలకు స్పందించే శక్తి బాధ పడటం, ఓర్చుకోనటం అనేవి ఒక ఆత్మగత విధానం అన్నాడు. బాధ పడటం, ఒర్చుకోనటం అని మిగిలిన వేదాంతులు చెబితే బెర్గ్సన్ “intuition is the legitimate and noble province of the mind – indeed it is the only means for perceiving the heart of things” అని స్పష్టంగా చెప్పాడు. మనిషి లోని గతం వర్తమానంపై అధిక ప్రభావం చూపిస్స్తుంది అని అది అతని అంతరాత్మను ఎప్పుడూ వదలిపెట్టదని ఆయన రాసిన మేటర్ అండ్ మెమరీ లో చెప్పాడు. ఇదే ఒక ‘’సజీవ చైతన్య స్రవంతి’’ లాగా     ఉంటుందని అతని అభిప్రాయం.

 

కాలానికి ,అవధికి (duration )ఉన్న తేడాను కూడా బెర్గ్సన్ వివరించాడు. గడియారం చూపే కాలం వాస్తవ కాలం కాదంటాడు. వాస్తవ కాలం లోలక ఆవర్తనంతో ఏకీభవిస్తూ ఉన్నా గడియారం టైం తో సంభంద ఉండదు. దానికి హద్దులు లేవు. దానిని సంక్షిప్తీకరించలేము. అవధి (ద్యూరేషన్) గురించి చెబుతూ “Duration is the continuous progress of the past which gnaws (bite) into the future and which swells as it advances, “for the past in its entirety is prolonged into the present and abides there actual and acting. Duration is the essential pulse of our being”. “అంతర్ జ్ఞానం అంటే వ్యక్తీ అసలు రూపం, అతని  ఆత్మ, అతని  అనంతమైన సృజనాత్మక మేధ” అన్నాడు బెర్గ్సన్.   అతని వ్యాసాలలో భాగాలు కేలిడియో స్కోప్ లో చూస్తున్న అనుభూతి నిస్తాయి. గందరగోళపరిచే కాల్పనికత ఉండదు. వాక్యాలన్నీ మాటల ప్రవాహాలే, పారదర్శకాలే. సునిశిత హాస్య స్ఫోరకాలే. కంటిని గురించి చెబుతూ బెర్గ్సన్ అందులో అనేక భాగాలున్నాయని, కార్నియా, రెటినా, కటకం మొదలైన భాగాలు ఉన్నాయని అందులో ప్రతి భాగం పని అనంతంగా ఉంటుందని రెటీనా లో నాడులతో కూడిన మూడు పొరలు అనేక ధ్రువాల కణాలు ద్విద్రువ కణాలు చూపు కణాలు ఉంటాయని ఇందులో ప్రతి దానికి స్వయం వ్యక్తిత్వం ఉంటుందనీ కనుక దీనిని నిర్వచించటం కష్టం అని అంటాడు. “The mechanism of the eye is in short composed of an infinity of mechanisms. All of extreme complexity, yet vision is one simple fact. As soon as the eye opens the visual act is effected, this contrasts between the infinite complexity of the organ and the extreme simplicity of the function is what should open our eyes” అని మనిషి తెలుసుకోవలసిన అసలు విషయాన్ని ఎరుక పరచాడు.

బెర్గ్స్సన్ రచయత లందరికంటే గొప్ప సత్తా ఉన్నవాడు. ఏడిపిస్తాడు, కదిలిస్తాడు, ఊహను ప్రేరేపిస్తాడు. అతను ఫిలాసఫర్లలో కవి. అంతర్ జ్ఞానం -కారణాన్ని అధిగమిస్తుందని అంటాడు. బెర్గ్సన్ ప్రభావం సాహిత్యంలో మార్మికతను వేగవంతం చేసింది. “Bergson re-established the innate sense of wonder in a world where even the machine takes on mystical powers” అని అతని మార్మికతపై వ్యాఖ్యానిస్తారు. దీనిపై ఆయన స్పందన “Machinery will find its true vocation again, it will render services in proportion to its power of mankind which it has bowed still lower to the earth can succeed through it in standing erect looking heavenly wards.” మొత్తం మీద బెర్గ్సన్ సిద్దాంత సారాంశం “intuition and creation, life and memory, perception and religion are one, the immediate moment contains the entire past every thing- the accumulation of all ages  is now.”

1908లో బెర్గ్ సన్ లండన్ లో హార్వర్డ్ ఫిలాసఫర్ విలియం జేమ్స్ ను కలుసుకొన్నాడు .అయన ఇంగ్లీష్ అమెరికన్ మిత్రులందరికీ ఈ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ను పరిచయం చేశాడు .ఈ ఇద్దరూ అప్పటినుండి మంచి మిత్రులయ్యారు .బెర్గ్ సన్ను అభినదిస్తూ విలియం జేమ్స్ ‘’so modest and unpretending a man such a genius intellectually .I have the strongest suspicions the tendency which he has brought to a focus will end by ,prevailing ,and the present epoch will be a short of turning point in the history of philosophy ‘’అని రాశాడు .హెన్రి రాసిన తొలి రచనలపై జేమ్స్ ప్రభావం బాగానే ఉంది .తర్వాత బెర్గ్ సన్ ప్రభావం  జేమ్స్ పై పడి తనకున్న లాజిక్ ను క్రమంగా తగ్గించుకొన్నాడు .ఇటలీలోని బోలోనాలో జరిగిన నాలుగవ అంతర్జాతీయ వేదాంత సభలలో బెర్గ్ సన్’’ఫిలసాఫికల్ ఇంట్యూ షన్’’పై అద్భుత ప్రసంగం చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో ‘’ది పెర్సేప్షన్ఆఫ్ చేంజ్ ‘’పై గంభీరోపన్యాసమిచ్చాడు .ఫ్రెంచ్  పత్రికలలో అసంఖ్యాక వ్యాసాలూ రాసి ఉత్తేజ పరచాడు .1920లో కేంబ్రిడ్జి యూని వర్సిటి ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’బహూక రించి సత్కరించింది .

‘’ బెర్గ్ సన్అండ్ ఐన్ స్టీన్  యూని వర్స్’’అనే పుస్తకం రాశాడుకాని ఆయన భౌతిక శాస్త్ర పరిజ్ఞానం చాలలేదనే విమర్శను ఎదుర్కొన్నాడు .’’కార్టీషియన్ దీరీ’’ కి వ్యతిరేకంగా ‘’లాఫ్టర్ –(laughter ) పుస్తకం రాశాడు .హెన్రి పై ఇమాన్యుల్ కాంట్ ,బారుక్ ,స్పినోజా మొదలైన వారి ప్రభావం ఉంది .బెర్గ్ సన్’’ఎమిలీ బ్రీహీర్ ,మార్సెల్ ప్రాస్ట్ ,నికోస్ కజంట్ జకి మొదలైన వారిపై విశేషమైన ప్రభావం కలిగించాడు .

బెర్గ్ సన్ కోటబుల్ కోట్స్ కొన్ని -1-to exist is to change ,to change is to mature ,to mature is to go on creating oneself endlessly .

2-think like a man of action ,act like a man of thought’.

3-the present contains nothing more than the past ,and what is found in the  effect  was already in the cause .

Inline image 1   Inline image 2  Inline image 3  Inline image 4

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.