ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80

 

  1. వ్యావహారిక సత్తా వాద వేదాంతాన్ని ప్రచారం చేసిన అమెరికన్  సంస్కర్త – జాన్ డ్యూయి

అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రైతు, నిర్భయ ఉదారవాది, ప్రాగ్మాటిజం ప్రచారకుడు విద్యా సాంఘిక సంస్కర్త ,ఫిలాసఫర్ జాన్ డ్యూయి అమెరికా రాజకీయాలను, సంస్కృతిని ఆధునిక విద్యనూ ప్రభావితం చేసిన ఆలోచనాపరుడు. అమెరికా ప్రజలు ఆయనను ప్రగతిశీల విద్య విధాన స్థాపకుడు అంటారు. డార్విన్ కు విలియం జేమ్స్ కు అనుచరుడు. విధానాలను స్పష్టపరచడమే కాక   వ్యాప్తికి ధర్మయుద్ద్ధం చేసినవాడు. డార్విన్ లాగానే జ్ఞానం ముందే ఏర్పడిన భావాల పై ఆధారపడి ఉండదని, జీవాత్మక యదార్దాలపై ఆధారపడి ఉంటుందని అన్నాడు. విలియం జేమ్స్ వలెనే  నిరంకుశాధికారం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వ్యావహారిక సత్తా వాదం (ప్రాగ్మాటిజం ) ను బలపరచాడు. వ్యవహారంలో ఉన్నవాటిని ప్రశ్నించలేదు. ఆలోచన, పదార్ధం రెండూ కూడా ఒక చలనశీల విధానం అని, తర్కం అనేది వృద్ధి చెందుతున్న ఒక విధానమని తత్వ శాస్త్రం ,వాస్తవ విషయ జనిత సంగ్రహాల సమాహారం కాదని, దానికి ఒక సాంఘిక పునాది ఉంటుందని కనుక అది సాంఘిక శక్తిగా భావించాలని అన్నాడు.

 

జాన్ డ్యూయి    అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో బర్లింగటన్ పట్టణంలో 20-10-1859లో జన్మించాడు. అదే సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ‘’ ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్’ ప్రచురించటం ఒక  యాదృచ్చిక సంఘటన. నాలుగు రోజుల తర్వాత జాన్ బ్రౌన్ హార్పర్స్ ఫెర్రీ పై దాడి చేసాడు. క్రీ.శ. 16౦౦ నుండి ఇతని కుటుంబం అమెరికాలోనే ఉంది. తండ్రి ఒక కిరాణా షాపు నిర్వహించేవాడు. తల్లి ఒక వేర్మార్మర్ కుమార్తె. ఆమె పూర్వీకులు కేప్ గాడ్ రైతులు. చిన్నతనం నుంచి పుస్తకాలలో కూరుకుపోఎవాడు. పుస్తకాలతోనే  అతని ఆట. 20 ఏళ్ళు రాక ముందే వెర్మాంట్ యూనివర్సిటీ నుండి పట్ట భద్రుడయ్యాడు. వెంటనే పాఠాలు బోధించాడు. పెన్సిల్వేనియాలోని ఆయిల్ సిటీ లో మొదట ఉద్యోగంలో చేరి తర్వాత తన సొంత రాష్ట్రంలో అక్కడి గ్రామీణ స్కూళ్ళలో బోధన చేసాడు. కొన్నేళ్ళ తర్వాత తత్వ శాస్త్రాన్ని ముఖ్య విషయంగా ఎంచుకుని జాన్స్ హాప్కిన్స్ లో చేరి 25 ఏళ్లకే డాక్టరేట్ పొందాడు. తన విద్యార్థిని అయిన యాలిస్ చిప్మన్ ను పెళ్లి చేసుకున్నాడు. మిచిగాన్ యూనివర్సిటీ లో  ఇన్ స్టక్ట ర్ గా చేరి 1888 లో మిన్నెసోటా యూనివర్సిటీలో తత్వ శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు. 35 వ ఏట చికాగో యూనివర్సిటీలో  తత్వ శాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు.  రెండేళ్ళ తర్వాత దాని’’ లాబరేటరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ‘’కు డైరెక్టర్ అయ్యాడు. అది  ప్రయోగాత్మక విద్యా విధానం కోసం ఏర్పడిన స్కూల్. నిజాలు, గణాంకాలు ఆలోచనలు పిల్లలపై వారికి ఆసక్తి కలిగేవరకు బలవంతంగా రుద్దరాదని అనే ఆశయంతో ఈ స్కూల్ నడుస్తోంది. జాన్డ్యూయి   పిల్లవాడి వర్తమాన అనుభవాన్ని సుసంపన్నం చేయాలని  స్పష్టంగా తెలియని భవిష్యత్తు కోసం వారిని ఇబ్బంది పెట్టరాదని భావించాడు. అతని ఆశయం’’ పని చేస్తూ నేర్వడం’’ (లెర్నింగ్ బై డూయింగ్). భవిష్యత్తుకోసం విద్య బోధించడం కాక ఇప్పటి జీవితాన్ని అర్థవంతం చేసేట్లుగా విద్య ఉండాలని చెప్పేవాడు. దీనిపై అప్పుడు వాదోపవాదాలు ఉండేవి.  “The new spirit in education forms the habit of requiring that every act be an outlet of the whole self” అనేది అతని వాదం. సనాతన భావాలకు విరుద్ధంగా ఆయన చెప్పేవాడు. తన భావాలను ఆయన మొదటి గ్రంథం’’ ది స్కూల్ అండ్ సొసైటీ’’లో విస్పష్టంగా వివరించాడు. ఆయన 40 వ ఏట ఇది ప్రచురించబడింది.

 

45 వ ఏట చికాగో యూనివర్సిటీకి రాజీనామా చేసి కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేరి అక్కడే జీవితమతా చిరస్మరణీయమైన సేవలు అందించాడు. ఆయన శిష్యుడు, సహాయకుడు మాక్స్ ఈస్ట్మన్’’ సాటర్ డే రివ్యూ ఆఫ్ లిటరేచర్ ‘’లో ఆయన రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ లాగా ఉండేవాడని వర్ణించాడు. సమతలమైన జుట్టు, నల్ల మీసాలు కాంతివంతమైన కళ్ళతో తరగతి గదికి వచ్చేవాడు. ఆయన స్ఫూర్తినిచ్చే ఉపన్యాసకుడు కాదు. పాఠాలు మార్పు లేకుండా మూస విధానాలు ఉండేవి. ప్రేరణ కలిగించేవి కావు. కొలంబియా యూనివర్సిటీ తత్వ శాస్త్ర అధిపతి ఇర్విన్ ఎడ్మండ్ ఈయన బోధన మొదటిసారి విని చాలా నిరాశ చెందాడు. కానీ అయన విషయ పరిజ్ఞానం చాలా లోతైనదని ఆయన మేధా పరిణతికి ఆశ్చర్య పడ్డాడు. ఆయన చెప్పేదంతా సృజనాత్మక తత్వ శాస్త్రమే.

50 వ ఏట “How we think” పుస్తకం రాసాడు. కూతురు ఈవ్లిన్ తో కలసి ‘’స్కూల్స్ ఆఫ్ టుమారో’’రాసాడు. ‘’డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్’’ అనే ఈయన రాసిన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. 61 వ ఏట’’ రి కన్స్ట్రక్షన్ ఇన్ఫిలాసఫీ ‘’ రాసాడు. తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేని వారికి వెలుగు మార్గం చూపే కరదీపికగా దీనిని భావిస్తారు. పిల్లలకు వారి భావాలను బయటకు చెప్పే స్వాతంత్ర్యం ఇవ్వాలని వారి స్వేచ్చకు భంగం కలిగించరాదని చెప్పేవాడు. ఒకసారి ఈయన నర్సరీ స్కూలుకు పర్యవేక్షణకు వెళ్ళగా అక్కడ ఆయన కొడుకు ఒక పెద్ద కుర్రాడి చేత తన్నులు తింటూ నేల మీద అసహాయంగా పడివుండటం చూసాడు. అక్కడే ఉన్న ఒక ఉపాధ్యాయుడు “ఇది మా అభివృద్ధి విద్యా విధానం” అని నవ్వుతూ అన్నాడు. వెంటనే డ్యూయి ‘’ప్రపంచంలో దుర్మార్గం చాలా ఉందని దానికి తన కుమారుడు ఎదిరించటానికి   సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. ఇంకొకసారి ఆయన ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళగా క్లాసు గోలగోలగా ఉండగా ఒక కుర్రాడు పుస్తకాన్ని తదేక దీక్షగా చదువుతుండటం చూసాడు. అక్కడ ఉన్న టీచర్ ‘’అతన్ని మీరు క్షమించాలని,అతను స్కూల్ లో చేరి ఒక వారమే అయ్యింది.’’అన్నాడు అంటే   ఇతను కూడా ,వారిలాగానే  అల్లరి చేసేవాడుఅనే అర్ధం వచ్చేట్లు అన్నాడు ‘’మీ విద్యా సంస్కరణలు ఇలా ఏడ్చాయి ‘’అని దెప్పి పొడవటం అన్నమాట .. ఇలాంటి సంఘటనలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. వయస్సు పెరిగిన కొద్దీ ఆయన శక్తిసంపన్నుడు అయ్యాడు. 50-60- ఏళ్ల మధ్యలో చాలా చురుకుగ్గా ఉన్నాడు. న్యూయార్క్ నగరంలో ‘’టీచర్స్ యూనియన్ ‘’ఏర్పడడానికి కృషి చేసాడు. రాజకీయంలో ప్రవేశించాడు. ఉదారవాదులలో ప్రముఖుడయ్యాడు. “పార్టీ కంటే వ్యక్తికీ ఓటు వేయండి” అనే నినాదాన్ని ప్రచారం చేసాడు. జపాన్ పర్యటించి టోక్యోలోని ‘’ఇంపీరియల్ యూనివర్సిటీ’’లో  ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన శిష్యులైన చైనా విద్యార్థులు ఆయనను పట్టుబట్టి చైనాకు తీసుకెళ్ళాడు. అక్కడ రెండేళ్ళు పెకింగ్ లో, నాంకింగ్ లో ఉపన్యాసాలిస్తూ ఉన్నాడు. 65-70 ఏళ్ల మధ్య టర్కీ, మెక్సికో, రష్యా సందర్శించి అక్కడి విద్య ప్రయోగాలను నిర్దేశించాడు. 78 వ ఏట ఒక తీవ్రమైన వివాదాస్పద సంఘటనలో ఇరుక్కున్నాడు.

సోవియట్ ప్రభుత్వం లియాన్ ట్రాటస్కీ అనే ప్రవాసంలో ఉన్న అతనిపై చేసిన ఆరోపణలను పరిశోది౦చటానికి ఏర్పడిన కమిషన్ కు నాయకత్వం వహించాడు. స్టాలిన్ అనుచరులందరినీ అక్కడి ప్రభుత్వం చంపేస్తోంది.   ట్రాటస్కీ చాకచక్యంగా తప్పించుకుని మెక్సికో వెళ్ళిపోయాడు. కానీ అక్కడ దారుణంగా హత్య చేయబడ్డాడు. ద్యూయి తటస్థంగా ఉన్నాడు. తాను ట్రాటస్కయిట్ కానీ స్టాలినిస్టూకాదని  మాస్కో వారి సాక్ష్యాన్ని , అవతలి వారి సాక్ష్యం విన్నతర్వాత మాత్రమే అ౦గీకరిస్తామని చెప్పాడు. కమిషన్ ట్రాటస్కీ కి తీవ్రవాదం, ఫాసిజం తో అమబంధం లేని అమాయకుడుఅని ,, నిర్దోషి అని తీర్పిచ్చింది. కనుక అతనిపై ఆందోళనలు తగవని అది ఒక కుట్ర అని చెప్పింది. కమ్యూనిష్టులు అతనిని తీవ్రంగా రెచ్చ గొట్టినా ఆయన కలవరపడలేదు. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా రక్షించాలని ఆయన ధ్యేయం. జీవితం చరమాంకంలో ఆయన భయాలకు ఎర అయ్యాడు. ఎనభైలలో కూడా తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి జంకలేదు. ఎనభై ఐదు లో కూడా ప్రజాస్వామ్య విలువలకోసం తీవ్రపోరాటం చేస్తూనే ఉన్నాడు. 1946లో చికాగో, డెట్రాయిట్ లో కార్మిక నాయకులతో కలిసి పీపుల్స్ పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘’పీపుల్స్ లాబీ’’కి అధ్యక్షుడయ్యాడు. అమెరికాలోని’’ రెండు పార్టీలు’’ పెద్ద వ్యాపార సంస్థలు అన్నాడు. ప్రభుత్వాదికారం ధనస్వామ్యం చేతిలో కాక ప్రజలకు దక్కాలి అని ప్రచారం చేసాడు. 1946లో రాసిన’’ ప్రాబ్లంస్ ఆఫ్ మెన్’’ లో తన అభిప్రాయాలను పొందుపరచాడు. దీనిని సమీక్ష చేసిన ఆల్విన్ జాన్సన్ అనే న్యూ స్కూల్ ఫర్ సోషల్ రిసర్చ్ అధ్యక్షుడు  ‘’ తత్వశాస్త్రంలోనూ రాజకీయంలోనూ గొప్ప ప్రతిక్రియకు తోడ్పద్దాడని అన్నారు. తత్వ శాస్త్రాన్ని సమూలంగా మార్చాలని భావించాడు. ప్రస్తుత ప్రపంచం ప్రజాస్వామ్యానికి చెందినదని భావించాడు. ప్రజాస్వామ్యం కాలం కోసం ఆగకూడదని ఊహాగానాలపై ఆధారపడకూడదని అన్నాడు. 87లో ఆయన చూపు, ఆలోచనలకు ఏమాత్రం పదును తగ్గ లేదు. మరింత ద్రుఢపడ్డాడు. భార్య చనిపోయిన 20 ఏళ్ళ తర్వాత, 88ఏట తన వయస్సులో సగం వయస్సును రోబర్తా గ్రాంట్ అనే విధవ స్త్రీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య వలన ఆరుగురు పుడితే అందులో ఇద్దరు బాల్యంలోనే చనిపోయారు.ఏడవ వాడిని పెంచుకున్నాడు. తర్వాత ఇంకొక ఇద్దరినీ యుద్ధ శరణార్ధులను దత్తత తీసుకున్నాడు. తొంభై వ  పుట్టినరోజున అనేక సన్మానాలు, గౌరవాలు, డిన్నర్లు, ప్రపంచవ్యాప్త ప్రశంశలు అందుకున్నాడు. ఆయన అభిమానులు తొంభై వేల డాలర్లను కానుకగా అందించారు. ఆ ధనాన్ని తన అభిమాన విద్యా ప్రణాళికల అమలుకు ఖర్చు చేశాడు ..

తొంభై ఒకటవ ఏట కిందపడగా మోకాలు విరిగింది. త్వరగా కోలుకుని ‘’ఏల్స్’’ అందచేసిన గౌరవ పట్టాను స్వయంగా తీసుకున్నాడు. 1952  వసంత కాలంలో న్యుమోనియా వచ్చి తీవ్రమై 93 వ ఏట 2-6-1952 న జాన్ డ్యూయీ మరణించాడు.

ఆయన రచనలు స్టయిల్ కంటే విషయానికి ప్రాధాన్యం ఉండేది. ఆయన ప్రకటనలు సంక్లిష్టంగా పునరుక్తితో ఆకర్షణీయంగా ఉండేవి కావు. ఆయన రాసిన ముప్పై ఎనిమిది పుస్తకాలు, ఎనిమిది వందలపైగా రాసిన వ్యాసాలలో కొట్టవచ్చేటట్లు ఒక వాక్యమూ కనిపించదని ,’’కోటబుల్ కోట్స్ ‘’ఉండవని విమర్శకులు అంటారు. కానీ అంతర్గర్భంగా తీవ్రమైన,  ఆలోచనా సంపన్నమై ఉంటాయని తెలుస్తుంది. “Dewey calls for intellectual pioneering toward wider horizons”. ఆయన తత్వ శాస్త్రాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కానీ ప్రతివారూ దానిని అనుసరిస్తారు. “His philosophy grows out of common experience and can be tested by it. It is applicable not only to college professors but to travelling salesmen, plumbers, farmers, clerks. His pulse beat quickens to the drums of humanity’s blundering march toward freedom.” ఆయన –స్థిరం గా  మంచితనానికి అవకాశమున్న చెడ్డతనానికి మధ్య విభజనరేఖ గీయటానికి ఇష్టపదేవాడు కాదు. ఆయన దృష్టిలో చెడ్డవాడు అంటే  “The bad man is the man who, no matter how good he has been, is beginning to deteriorate to grow less good.  అలాగే మంచివాడు అంటే “The good man is the man who, no matter how morally unworthy he has been, is moving to become better”. జీవితాన్ని నిర్వచి౦చ లేమని అది ఎప్పటికి చివరిది కాదని అది ఎప్పుడూపురోగామిస్తూనే ఉంటుందని   అన్నాడు. అలాగే “Not perfection has a final goal, but the ever enduring process of perfecting maturing refining is the aim of living”అని చెప్పాడు. మనం ఉన్న ప్రపంచం అన్నిటికంటే ఉత్కృష్టమైనది అనుకోవటం నిరాశావాద౦  యొక్క విరక్తత అని అన్నాడు. ప్రజాస్వామ్యం, సమాజం జాన్ డ్యూయి కి అతి ముఖ్యమైన విషయాలు. నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాడటానికి అమెరికాలోని ‘’యా౦కీలను’’ సన్నద్ధం  చేయటమే ఆయన ధ్యేయంగా జీవించాడు. అతని దృష్టిలో తత్వ శాస్త్రం అంటే “is a catholic and far sighted theory of the adjustment of the conflicting factors of life.”

డ్యూయీ రె౦డిటికి ప్రాదాన్యమిచ్చాడు .ఒకటి స్కూల్స్ ,రెండవది పౌర సమాజం .విద్య చెప్పే వారు ఎప్పటికప్పుడు స్వయం సమర్ధం అవ్వాలన్నాడు లేక పొతే కాలం కంటే వెనక బడతారని చెప్పాడు .టీచర్ నిరంతర విద్యార్ధి గా ఉండాలని సూచించాడు .ఇదే విద్యా నాణ్యతను పెంచుతు౦దన్నాడు .అందుకే కొఠారి ‘’విద్యార్ధి వ్యక్తిత్వ వికాసం  క్లాస్ రూమ్ లోనే తీర్చి దిద్దబడు తుంది ‘’అన్నాడు .టీచర్ ఎడ్యు కేషన్ కు ఎక్కువ ప్రాదాన్యమిచ్చాడు .జర్నలిజం సంఘాన్ని తీర్చి దిద్దటం లో ప్రముఖ పాత్ర పోషించాలన్నాడు.పబ్లిక్ ను ఎలివేట్ చేసే పని వారిదే నంటాడు .మానవత్వమంటే మహా మక్కువ ఉన్న డ్యూయీ ఆ సంబంధ కార్యక్రమాలనేన్నిటిలోనో చురుకుగా పాల్గొన్నాడు .  ‘’humanism means not a contraction of human life ,an expansion in which nature and the  science of nature are made the willing servants of human good.’’అని మానవత్వాన్ని నిర్వచించిన మేధావి..విద్యా స్వేచ్చ కోసం అయిన్ స్టీన్ తో కలిసి ‘’ఇంటర్ నేషనల్ లీగ్ ఫర్ ఎకాడేమిక్ ఫ్రీడం ‘’ లో అమెరికా తరఫున సభ్యుడైనాడు .1940లో హోరేస్ కేల్లెన్ తో కలిసి బెర్ట్రాండ్ రసెల్ కేసు కోసం అనేక వ్యాసాలూ రాశాడు .టీచర్ల వ్యక్తిత్వ రక్షణకోసం ,కమ్యూనిస్ట్ ల నీడ పడకుండా స్వేచ్చాయుత ఉపాధ్యాయ ఉద్యమ నిర్వహణ చేశాడు  ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్  ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’ఏర్పరచాడు .1939లో ‘’’లీగ్ ఫర్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ ‘’కి అధ్యక్షుడయ్యాడు .’’కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడం ఫ్రంట్ ‘’కు డ్యూయీ ,బెర్ట్రాండ్ రసెల్ కార్ల్ జాస్పర్స్ మొదలైన వారు ‘’ఆనరరీచైర్మన్ ‘’హోదా పొందారు .

 

యూని వర్సిటి ఆఫ్ ఒశియో , పెన్సిల్వేనియా ,ఏల్,రోమ్ లు  గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. బ్రూక్లిన్ ,న్యూ యార్క్ లలో ఆయన పేర హైస్కూల్స్ ఏర్పడ్డాయి .గ్రీన్ బే , బార్రింగ్ టన్ లలో డ్యూయీ  పేరిట ‘’ఎకాడేమి ఆఫ్ లెర్నింగ్’’సంస్థలేర్పడ్డాయి .

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-15-ఉయ్యూరు ,

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.