ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84

37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ

సంగీతం పతనమై పోయిందని అనుకోవటానికేమీలేదు .  ఆధునిక సంగీతం లో నాలుగు విభిన్న జాతీయ స్రవంతులున్నాయని తెలుసుకోవాలి .అందులోరిచార్డ్ వాగ్నర్  తీవ్రమైన వాద్య ఘోషతో దద్దరిల్లే జర్మనీ సంగీతం ఒకటి .ఆ తర్వాత దీన్ని మరీ బలోపేతం చేసిన రిచర్డ్  స్ట్రాట్ ధోరణి తోబాటు ‘’ట్వెల్వ్ నోట్’’పద్ధతిలో ప్రసిద్ధమైన ఆర్నాల్డ్ స్కూన్ బెర్గ్ సంగీతం .  రెండవది   రష్యాకు చెందిన ‘’ఇగార్ స్ట్రావెన్ స్కి బూర్జువా సెంటి మెంట్ ను కాదని ’ ప్రాధమిక ,క్లాసికల్ లతో  సమ్మేళనమైన సంప్రదాయం .దీనితోబాటు డిమిట్రి  స్టాస్ట కోవిస్కి మరియు సెర్జీ ప్రోకోఫీవ్ ల సి౦ ఫనీలు .అమెరికా సంగీతం జానపదం  ,జానపద నాట్యం  నీగ్రో స్పిరిట్యు వల్స్ ,ప్రాంతీయ జాజ్ మొదలైన స్థానిక విషయాలనుండి ఆవిర్భవించింది .సంగీతం సౌందర్య సౌరభాన్ని తెచ్చిన ఘనత ఎరిక్ స్టేటీ,మారిస్ రావెల్ దక్కితే దాన్నినిర్దుష్టంగా సుసంపన్నం చేసిన ఖ్యాతి ఫ్రెంచ్ సంగీత కారుడు క్లాడ్ ఏషిలీ డెబాసి కి లభించింది .డేబాసీ సంగీతానికి కొత్త రంగులు ,హంగులు పొంగులు సోయగాలు ,సున్నితత్వం అద్ది ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ  సంగీతానికీ కొత్త వరవడి సృష్టించాడు  .

డేబాసీ ప్రభావం ఒక్క సారి  ఏర్పడినది కాదు ..క్రమానుగతంగా వచ్చింది .22-8-1862 నఫ్రాన్స్ దేశం లోని పారిస్ కు దగ్గరలో ఉన్న  సెయింట్ జేర్మాన్ లేయీ లో పుట్టాడు .క్లాడ్  ఏషిలీగా చర్చ్ లో పేరు నమోదైంది .కాని యవ్వన దశలో తానే ‘’డేబాసీ ‘’తగిలించుకొన్నాడు .దీనికి కారణం తన వంశం చాలా ఉన్నతమైనదని తెలియ జేయటానికే .ఏషిలీ అనేదాన్ని 30వ ఏడాది వరకు ఉంచుకున్నాడు .పేరుకే గొప్ప కాని ఊరు దిబ్బ .సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు .తరతరాలుగా చిన్న వ్యాపారస్తులు .అయిదుగురు సంతానం లో మనవాడు పెద్దోడు .కుటుంబం నడిపే చైనా షాప్ లో ఒక చిన్న గదిలో పుట్టాడు ఈ భవిష్య సంగీత సామ్రాట్ .తండ్రి మాన్యువల్ డేబాసీ కి ఒపేరా సంగీతం అంటే బాగా ఇష్టం,ఎందరో సంగీత కర్తలతో మంచి పరిచయాలున్నాయి . .ఇది కొడుకుకు కూడా అబ్బాలని ఆరాట పడేవాడు

కుర్ర డేబాసీ పియానో వాయించటం లో ఘటికుడని తెలిసి ,ఇక అతని చదువు సంగతి పట్టించుకోకుండా వదిలేశాడు .స్కూల్ కు పంపకుండా అతడు ‘’బాల మేధావి ‘’అని భావించి  తనతోబాటు ధియేటర్లకు సంగీత కచేరీలకు వెంట బెట్టుకొని తిప్పేవాడు .దీనితో చాలా ఏళ్ళు ఆతను సంగీతం కూరుస్తున్నా అందులో పరిపూర్ణత సాధించలేక పోవటం తరచూ తప్పులు చేయటం జరిగాయి .గురువు వద్ద నేర్చిన విద్యలేకపోవటమే కారణం .తప్పు తెలుసుకొని మొదటిసారిగా పియానో పాఠాలు నేర్పించాడు .దీనికి ఫీజు అతని కుటుంబ స్నేహితుడు అంటోనీ ఆరోసా చెల్లించేవాడు .ఈయనే మనవాడి ‘’గాడ్ ఫాదర్ ‘,ఆంట్ గారి  ప్రేమికుడు కూడా . కాని ఆరోసా ఆమెను తిరస్కరించటం తో స్పాన్సర్ షిప్ కోసం వేరొక అండను వెతుక్కోవాల్సి వచ్చింది.అదృష్ట వశాత్తు మన కుర్రాడు మేడం మాట్ డీ ఫ్లార్విల్ ద్రుష్టి లో పడ్డాడు .ఈమె చోపిన్ శిష్యురాలేకాక డేబాసీ కి ఆరాధనీయుడైన కవి పాల్ వేరలీన్ కు అత్తగారు కూడా .ఆమె మూడేళ్ళు మనవాడికి సంగీత పాఠాలు చెప్పింది .ఆమె నేర్పిన సంగీత విద్యలో పరిపూర్ణుడై ,11వ ఏట నే ‘’పారిస్ కన్సర్వేటరి’’  లో చేరటానికి అర్హత పొందాడు  .

ఈ కన్సర్వేటరి  లో 11 సంవత్సరాలున్నాడు .కొంత అసంతృప్తి ,కొంత సంతృప్తి తో ఇక్కడ గడిపాడు .హార్మానిక్ ప్రోగ్రేషన్స్ లో స్వేచ్చగా ప్రవర్తిస్తూ పాతవాటి బదులు తేలికైనవి కని పెడుతూ ,,సంగీత సంప్రదాయ విరుద్ధమైన వాటికి   స్వర రీతులను రాస్తూ ఉన్నాడు .  ఆతను చేసే ప్రయోగాలన్నీ తప్పుల తడకలన్నారు సంప్రదాయజ్నులు .అతనిలో ప్రతిభ ఉంది కాని పెడ దారి పడుతోంది అన్నారు .శబ్దాలను సృష్టించటం లో అప్పటిదాకా ఉన్న పాత పద్ధతులపై విభేదించాడు .మూల సిద్ధాంతమే తప్పు అన్నాడు .పియానో కళాకారుడిగా గొప్ప ప్రవీణుడు ,సాంప్రదాయానికి వ్యతిరేకి ,నవీన ద్రుష్టి ఉన్నవాడు .అతని సహచర విద్యార్ధి గేబ్రియల్ పీర్నీ ‘’డెబాసీ అద్భుత కళాకారుడు .అందర్నీ ఆశ్చర్యం లో ముంచేస్తాడు ,కాని వికారం అనిపిస్తుంది .దీనికి కారణం భయమో ఏదో ఉందని పిస్తుంది ‘’అన్నాడు .పియానోను చాలా ఫ్రీగా ముతకగా వాడేస్తాడు .కష్టమైన స్వర సమ్మేళనం వచ్చినప్పుడు చాలా గట్టిగా శ్వాస పీల్చేవాడు .బీతోవెన్ ఇతన్ని తప్పించుకోనేవాడు .ఎవరేమన్నా 14 ఏళ్ళకే అద్భుత ‘’చాపిన్ ప్లేయర్ ‘’అని పించుకున్నాడు డెబాసీ.పదిహేనవ ఏట పాటలకు  సంగీతం సమకూర్చాడు .ఇవి సాంప్రదాయ సెలూన్ ధోరణిలో ఉండేవి .

17 వ ఏట సంగీత విద్య కు తాత్కాలికం గా అంతరాయం కలిగి౦ది .సంగీత గురువు శిష్యుడికి   రష్యాలో ని సంపన్న గృహిణి నదేజా వాన్ మెక్ నుండి ఆహ్వానం వచ్చేట్లు సిఫార్సు చేశాడు .ఆమె టేకై కోస్కికి ఎన్నో ఏళ్ళుగా అతన్ని చూడకుండానే  ఆర్ధికం గా సాయ పడుతోంది .ఆమెతో బాటు సంగీత త్రయం ఉంటారు .ఆమె ఎక్కడికి వెడితే వీరినీ తనతో బాటు తీసుకొని వెళ్ళేది .రష్యా రావటం తో డెబాసీ సంగీత ప్రపంచం అకస్మాత్తుగా విస్త్రుతమైనది .మాస్కో లో మనవాడు బోరోడిన్ కూర్చిన ఆటవిక డాన్స్ ట్యూన్లు ,రిమ్ స్కి కోర్సకోవ్ కూర్చిన ఆకర్షణీయ స్వరాలు ,టకై కో విస్కీ ఆత్మ వేదనా రాగాలు,తూర్పు దేశాలకు చెందిన అపరిపక్వ ధోరణులు విన్నాడు .గ్రీకుల ఆరు మూల స్వరాలు ,ఇంపు చెడని చైనా నిరంతర సంగీతం ఆస్వాదించాడు .వెనిస్ లో తన నాహ్వానించిన మెక్ గారి సౌజన్యం తో ప్రఖ్యాత సంగీతనిది’’ రిచార్డ్ వాగ్నేర్’’ ను కలుసుకొనే అదృష్టం పొందాడు .వియన్నాలో ‘’ట్రిస్టాన్ అన్డైసోల్డీ’’సంగీతానికి పరవశించి పోయాడు .

తిరిగి ఫ్రాన్స్ చేరి కన్సర్వేటరిలో ఒక చెవితో ప్రయోగాత్మక హార్మనీలు ,రెండవ చెవితో ‘’ప్రిక్స్ డీ రోమ్’’కు సంగీతం సమకూర్చాడు .సంగీత ప్రదర్శనాకారుడిగానే  పొగడ్తలు పొందుతున్నాడు .సహకార వాద్యానికి మొదటి బహుమతి అందుకొన్నాడు .కాని సృజనకు దూరమై పోతున్నానేమో ననే అనుమానం ఉండేది .’’హార్మని పరీక్ష లో డజను తప్పులు చేశాడని ఇన్ స్ట్ర క్టర్లు వేలెత్తి చూపారు .అవి కావాలనే చేశానని సమాధానం చెప్పాడు .’’శృతి విరుద్ధ స్వరాలను ఎందుకు వదిలెయ్యాలి ?వాటికీ స్థానం కల్పించవచ్చు కదా ? తప్పేమిటి ’’అని ప్రశ్నించాడు డెబాసీ.అకాడెమీ వాళ్ళ గుండెల్లో బాంబు పేల్చాడు .తర్వాత ఒక న్యాయ నిర్వహణాధికారి ఇతని వ్రాత ప్రతులను రెండిటిని పరిశీలించి అంతటి ప్రతిభావంతుడు ఇలాంటి  తప్పులు చేయరాదన్నాడు .డెబాసీ ఏంతో సంతోషించాడు .చివరికి బిగ్గరగా ‘’నేను నా స్వంత సృజన చేశాను ‘’అని అరిచాడు .డేబాసీ  మొదటి సారిగా ప్రచురితమైన తన సంగీత రచన ‘’నూటిస్ డీ ఎటాలిస్’’ను  మేడం మేరీ సైంటీ  కు అంకితమిచ్చాడు .ఇప్పటినుంచి డెబాసీ ఆర్టిస్ట్ ల, బోహీమియన్ ల సర్కిల్ లో చేరాడు . ఇందులో మేడం వాస్నిర్ ప్రముఖ పర్షియన్ ఆర్కి టెక్ట్ భార్యకూడా ఉంది .అందం చందం కోయిల స్వరం ఉన్న ఆమెతో మన 19ఏళ్ళ డ్రీం బాయ్ ప్రేమలో పడ్డాడు .తలిదండ్రులకు గుడ్ బై చెప్పి , వాస్నిర్ సన్నిధానం లో కి ప్రవేశించాడు ఈప్రేమ పిపాసి .

సశేషం

 

Inline image 1

ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-15-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.