ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -86
37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ-3(చివరి భాగం )
నలభై లలో సంగీత విమర్శకుడిగా ఎన్నో పత్రికలకు డేబూసీ రాసేవాడు .ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత ‘’మాన్శార్ క్రోచ్ –యాంటి డిలేటేంటీ’’పేరుతొ ప్రచురితమైనాయి .’’ఐబీరియా ‘’ను చూసి విన్న తర్వాత ఆయన ప్రతిభ తెలుసుకొని విమర్శనాస్త్రాలు సంధించటం మానేశారు .స్పానిష్ సంగీతాన్ని స్పెయిన్ వారికంటే డెబూసీయే చాలా గొప్పగా రాశాడని మెచ్చారు .నలభై రెండేళ్లకే బాగా అలసిపోయాడు .శారీరక మానసిక౦గా క్లేశం పొందాడు. ఈ వయసులోనే ‘’ప్రిల్యూడ్స్’’తో బాటు 12అసాధారణ ‘’ఎట్యూడ్స్ ‘’ రాశాడు. ఇవి శాశ్వత కీర్తిని తెచ్చాయి .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయిన తర్వాత ఇక సంగీతం చేయటం మహా కష్టం అనిపించింది .కాని మిలిటరీ జర్మనీ దాస్టీకాన్ని,సంస్కృతీ వ్యతిరేకతను నిరసిస్తూ కొద్దిగా రచనలు చేశాడు .ఆయన సంతకాన్ని ‘’క్లాడీ డేబూసీ ,మ్యుజీషి యన్ ఫ్రాన్కైస్ ‘’అని చేసేవాడు .1916తర్వాత రాయటం మానేశాడు .చాలాకాలం బాధను ఒంటరిగా సహించాడు .కాని’’నడుస్తున్న శవం ‘’గా అయిపోయినప్పుడు మాత్రం ఆయనకు కేన్సర్ సోకిందని తెలిసింది .జర్మన్ సైన్యం పారిస్ మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు దాక్కో టానికిసురక్షిత ప్రాంతానికి వెళ్ళే ఓపిక కూడా ఆయనకు లేదు .చివరికి తప్పని పరిస్తితులలో అత్యవసరంగా ’’మలాశయం(రెక్టం)కు ఆపరేషన్ చేయి౦చు కొన్నాడు .కాని కోలుకోలేకా పోయాడు .25-3-1918న విపరీతమైన విమాన దాడులు బాంబుల వర్షం సమయం లో సంగీత జ్ఞాని క్లాడే అషిలీ డెబూసీ 52 ఏళ్ళకే మరణించాడు .
డెబూసీ సంగీతం నిరసన ,మిరుమిట్లు గొలిపే ఆశ్చర్యంతో కలిసి ఉంటుంది .సంగీత మార్గ దర్శి అనిపిస్తాడు .శబ్దం లో స్వచ్చతను ఆయన సాధించాడు .మాధుర్యం చాలా సున్నితంగా,పారదర్శకంగా ఉంటుంది .వెండి జలతారు మిరుమిట్లు గోచరిస్తాయి .ఎక్కడా ఆగటం ఉండదు. నిరంతర సంగీత స్రవంతి గా ఉంటుంది .’’దిఆర్గాన్ ట్యూనర్ స్కేల్ ‘’ను ఉపయోగించటం అతని ప్రత్యేకత .అందులో ఆరు నాదాలు దర్శనమిస్తాయి .ఎక్కడా క్రమం తప్పదు .సాంకేతికత లో ఎన్నో అద్భుతాలు కనిపెట్టాడు .అవి సంగీత చరిత్రలో మైలు రాళ్ళు గా నిలిచి పోయాయి .ఆయన చూపిన ‘’సమాంతర శ్రేణులు ‘’అంతంత మాత్రం గా వినేవారిని తట్టి లేపి స్పూర్తి కలిగిస్తాయి .జెట్ స్ప్రింగ్ లాగా నాట్యమాడి ఉర్రూత లూగిస్తాయి .ఆస్కార్ థామ్సన్ ‘’the determining factor in the musicof atleast the first third of the twentieth century because of the doors he opened and the restraints he cast aside ‘’ అన్నమాటలు అక్షర సత్యాలే .
డెబూసీ తో సంగీత హోరు ఆగిపోయింది .జిగి బిగి మిశ్రమ వాద్యాల రణగొణ ధ్వనులకు మంగళం పాడాడు .శృంగార అ౦గారాన్ని ఆర్పేశాడు .అనుభూతి వాదానికి (ఇమ్ప్రేషలిజం) తేర తీశాడు .మానసికానందాన్ని సమకూర్చాడు .అది తర్వాత వారికి మార్గ దర్శనం చేసింది .సంగీతం లో ఇమ్ప్రేషనిస్ట్ అవతారం ఎత్తినవాడు డెబూసీ .ఇతని ప్రభావం రావెల్ డ్యూకాస్ , రస్సెల్ పై అధికం .ఫ్రాన్స్ లో ఒక కొత్త ఉద్యమ యుగం ఆరంభమై విశ్వ వ్యాప్తమైంది .దీనికి పారిస్ ప్రధాన కేంద్రమై నిలిచింది .కాని ఇమ్ప్రేషనిజం అనే పదాన్ని గుణాన్ని తన సంగీతానికి పెట్టటం ఆయనకు నచ్చేదికాదు .
మద్య యుగపు సంగీతం నుంచి డెబూసీ ఎన్నో విలువైన విషయాలను ఏరికోరి తెచ్చుకొన్నాడు .ఫ్రెంచ్ క్లేరియన్ సంగీతకారులైన కూపెరిన్, రామూ ల సంగీతం అంటే మహా ప్రేమ .బాష్ ,చోపిన్ ,లిసాజీల ప్రభావమూ ఈయనపై ఎక్కువే .ఆయనకు ‘’పాశ్చాత్యేతర ‘’సంగీతం అభిమానమైంది .ప్రాచీనమైనది ప్రాత్య సంబంధమైనది అయిన సంగీతాన్ని ఆరాధించాడు .జావా వారి సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చాడు .వాళ్ళ గాంగ్స్,మెటల్లో ఫాన్స్ వాద్యాలపై మోజు .ఆయనకు సాహిత్యం విజువల్ ఆర్ట్(ద్రుశ్య కళ) లపై ఆసక్తి ఎక్కువ .మొదట్లో ఫ్రెంచ్ సింబాలిజం ఉద్యమ ప్రభావం లో ఉన్నాడు .వాళ్లకు వాస్తవికత ప్రక్రుతిలపై మోజు లేక పోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు .వచన కవిత్వ ప్రభావం ఉండేది .స్టీఫెన్ మలార్మే గొప్ప ప్రభావం కలిగించాడు .సంగీతానికి తన కవిత్వానికి దగ్గర సంబంధం ఉందని మలార్మే చెప్పేవాడు .దీనితో మలార్మే కవిత ‘’ఆఫ్టర్ నూన్ ఆఫ్ ఏ ఫాన్ ‘’కు సంగీత కూర్చాడు డెబూసీ.
తర్వాత నేచర్ కు దగ్గరయ్యాడు .తనమతం నేచర్ అన్నాడు .గూఢ మైన ప్రక్రుతి (మిస్టీరియస్ నేచర్ )నా మతం , దైవం అని చెప్పాడు .ఆచారాలుపాటిస్తూ పూజలు చేస్తూ కూర్చునే దానికన్నా ప్రకృతిని ఆస్వాదించటం వల్లనే మానసిక తృప్తి ఆనందం అనుభూతి లభిస్తాయని అన్నాడు. సముద్రం దగ్గర ఉండి సూర్యోదయ సూర్యామయాలను అవి పొందే అందమైన మార్పులు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది అన్నాడు .సమకాలీన పైంటర్-జేమ్స్ ఆబాట్ మెక్ నెల్ డెబూసీ పై పెద్ద ప్రభావాన్ని కల్గించాడు .
20వశతాబ్దాన్ని అత్యధిక ప్రభావితం చేసిన కంపోజర్ లలో డేబూసీ మొదటి స్థానం లో ఉంటాడు .’’his innovative harmonies were influential to almost every major composer of the 20th century particularly Mauris Ravel ,Igor travensky ,bela Bartok etc’’.జపానీస్ క౦పోసర్ ‘’టోరు టేకమిస్కి’’బాగా ప్రభావితుడైనాడు .జాజ్ సంగీతం లో మైల్స్ డేవిస్ ,డ్యూక్ ఎలి౦గ్ టన్ లను ప్రభావితం చేశాడు .సమకాలీన సౌండ్ ట్రాక్ కంపోజర్ జాన్ విలియమ్స్ వగైరాలపై ప్రభావం అధికం .
మరో ప్రముఖునితో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-15-ఉయ్యూరు