నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి
శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1955న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం ఎలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బ గారు .కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం ఏ చదివి పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి నలుగురు కుమారులు –శ్రీ గోవర్ధన సుందర దాస్ ,సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ యజ్ఞేశ్వర దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది . .
గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి 1983-88 కలం లో తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశారు .
శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లో మాణిక్య ప్రభ రాశారు .1995మాదూర్ గడాధరో మత భేద విమర్శ ,రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళు రేడియో ప్రసంగాలు చేశారు .
ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే కే డిలో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు వక్తలు గా ఉన్నారు .సంప్రదాయ న్యాయ మీమాంస శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .
1670కాలపు వాడైన నాగేశ భట్టు భట్తోజీ దీక్షితుల భారతీయ పంచాంగం ప్రకారం కాల ,తిది నిర్ణయం పై సంస్కృత రచన చేశారు .మాణిక్య ప్రభు తర్కామృతం పై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’సంస్కృత వ్యాఖ్యా విభూషితం తధా మణిప్రభ హిందీ వ్యాఖ్య సంవలితం ‘’రాశారు దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ తో కలిసి వ్యాఖ్యానం రాశారు .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .16౦౦ కాలం వాడైన మధురానాద తర్క వాగీశుని ‘’మాధురి ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గదాదరి ‘’,13వ శతాబ్దికి చెందిన గణేశుని ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురి గదాధర్యో మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ ప్రచురించింది .రామరుద్రి రాసిన నవ న్యాయ సిద్ధాంతం పై రామ రుద్ర భట్టు రాసిన వ్యాఖ్యానం పై ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’రాశారు. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడా సితి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని వారణాసి లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .
‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .
మరో ప్రముఖునితో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15-ఉయ్యూరు
‘