ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-2
పులిట్జర్ తో పోటీ –ఎల్లో జర్నలిజానికి నాంది
అనుకొన్నది సాధించగానే కొత్త పధకానికి తేరా తీశాడు రాండాల్ఫ్ .సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ పత్రికాధి పత్యం చేబట్టాక ఎనిమిదేళ్ళకు ‘’న్యూ యార్క్ మార్నింగ్ జర్నల్ ‘’ను కొన్నాడు .అతని ధ్యేయం రెండు సెంట్లకు అమ్మే పులిట్జర్ పత్రిక ‘’ది న్యు యార్క్ వరల్డ్ ‘’అమ్మకాలను అధిగమించటమే .మనవాడు తెలివిగా తన పత్రిక వెలను ఒక్క సారిగా ఒకే ఒక పెన్నీ కి తగ్గించేశాడు .మొదట్లో విపరీతమైన నస్తాలోచ్చినా క్రమంగా నిలబడి లాభాలు సాధించాడు .పత్రికను తీర్చి దిద్దటం లో డబ్బు కేమీ ప్రాధాన్యం లేదని ప్రకటనలు గుప్పించేవాడు .ప్రత్యర్ధి పులిట్జర్ పత్రికలో పని చేస్తున్న ‘’మాంచి బుర్ర ‘’ఉన్న మనుషుల్ని,ఆర్టిస్ట్ లను రెట్టింపు జీతం తో ఆకర్షించి తన పత్రికలో చేర్చుకున్నాడు .స్టీఫెన్ క్రేన్ ,ఎడ్గార్ సాల్ట స్,జేమ్స్ యి ఫోర్డ్ ,రిచార్డ్ హార్డింగ్ డేవిస్ వంటి దిగ్దంతులను చేర్చుకున్నాడు .వీరిని సెయింట్ పీటర్స్ బర్గ్ కు జార్ చక్రవర్తి పట్టాభిషేకం చూడటానికి పంపాడు .ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ ను విక్టోరియా మహా రాణి జూబిలీ ని వర్ణించి రాయటానికి లండన్ పంపాడు . తన పత్రిక సాహిత్యానికే ప్రాధాన్యం ఇస్తోందన్న అపోహ తొలగించటానికి మొదటి 16పేజీలను రంగుల్లో కార్టూన్లు జోకులు ఫాషన్లు కధలతో ముంచెత్తే శాడు .మరో 8పేజీలను కామిక్స్ కు కేటాయించాడు .తనది ‘’ఇంద్ర ధనుస్సు పేపర్ ‘’అని ప్రకటించేవాడు .వరల్డ్ పత్రికలో వచ్చే కామిక్ కేరక్టర్ కు ప్రత్యర్ధిగా ‘’ఎల్లో కిడ్ ‘’పాత్రను సృష్టించి వదిలాడు .అప్పటినుంచే ‘’ఎల్లో జర్నలిజం ‘’అనే పేరు బయల్దేరింది .పులిట్జర్ ఎడిటర్ ను లొంగ దీసుకొని ‘’ఈవెనింగ్ జర్నల్ ‘’మొదలు పెట్టాడు.సంపాదకీయాలతో అంతర్జాతీయం గా పేరు పొందిన ఆర్ధర్ బ్రిస్బేన్ ను చేర దీయటం తో ‘’బ్రెయిన్ డ్రెయిన్’’పూర్తయింది .మొదటి మూడు పేజీలను ఆశ్చర్యం లో ,హెచ్చరికలు చేస్తున్నట్లు తయారు చేయించాడు .ఈ విషయం లో తన పత్రిక ఎలా ఉంటుందో ఆయన మాటల్లోనే చూద్దాం ‘’when you looked at the first page you said ‘’Gee whiz’’ .When you swathe second page ,you gasped ‘’Holy Moses ‘’,.And when you glimpsed the third page you exclaimed ‘’Good God Almighty ‘’ఇలా పాఠ కులలో విపరీతమైన మొహం మోజు కలిగించి తనపత్రిక వైపుకు మళ్ళించాడు చాకచక్యంగా .
యుద్ధం చేయిస్తానన్న రాండాల్ఫ్
హార్స్త్స్ వంచన ఆలోచనలతో స్పానిష్ అమెరికన్ యుద్ధం నిజానికి ఆయన దాని సృష్టి కర్త కాకపోయినా కలిసి వచ్చింది .అమెరికా క్యూబా తరఫున యుద్ధాన్ని ప్రారంభించటానికి రెండేళ్ళ ముందే యుద్ధ భీభత్సాన్ని గగుర్పొడిచే వ్యాసాలతో భయానక దృశ్యాలతో పేపర్ నిండా రాయిన్చేవాడు .గవర్నర్లకు తెలిగ్రాములిచ్చేవాడు .ఏయే రాష్ట్రాల వారు ఎంతమంది వాలంటీర్లను నావికా యుద్ధానికి ,పద సైన్యానికి సమకూర్చగలరనిగవర్నర్లనందర్నీ ఆరా తీశాడు .ఆర్టిస్ట్ ఫ్రెడరిక్ రేమింగ్ టన్ ను హవానా పంపి ఆర్టికల్స్ రాయించాడు .రేమింగ్ టన్ హవానా లో తనకేమీ పని లేదని అంతా పరమ ప్రశాంతంగా ఉందని ,యుద్ధ వాతావరణం అసలు కనిపించనే కనిపించటం లేదని తానూ అమెరికాకు తిరిగి వచ్చేస్తానని తెలియబర్చాడు యజమానికి .’’అక్కడే ఉండు .చిత్రాలు పంపు .నేను యుద్ధం చేయిస్తాను ‘’అని చెప్పి అక్కడే ఉండమన్నాడు .క్యూబా విముక్తి ఉద్యమం లో ముఖ్యమైన అంశం అమెరికా క్యూబాతో చేసే వంద మిలియన్ డాలర్ల వ్యాపార ఇబ్బందులే .క్యూబా షుగర్ ఎకానమీ ఒక్కసారి కుప్ప కూలి పోయింది .దీనికంతటికీ ముఖ్య కారణం స్పెయిన్ ,క్రూర స్పెయిన్ దేశమే నని హార్స్త్స్ ,పులిట్జర్ లు తమపత్రికలలో ఢంకా బజా ఇంచేవారు .ప్రజల్ని మభ్య పెట్టేవారు .యుద్ధాన్ని గురించి ఊదర కొట్టేవారు చివరికి అది తుస్సుమనగా ‘’అవర్ పెట్ వార్ ‘’అన్నాడు రాండాల్ఫ్ .దీనికీ ఒక కధనం ఉంది -.
ఐల్ ఆఫ్ పైన్స్ కు చెందిన ఇవాంజేలీనా సిస్నేరాస్ అనే విప్లవ వీరుని కూతుర్ని పీనల్ కాలనీ నుంచి కాపాడటానికి ప్రయత్నం చేశాడు .దీన్ని తన పత్రికలలో బోల్డ్ లెటర్స్ లో సంచాల వార్తాకధనాలుగా ప్రచురించి ఏదో ఆమెకు మహోపకారం చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు .జెనరల్ కు ముడుపులు చెల్లించి కదా బిగువుగా నడపటానికి కృషి చేశాడు .ఇదంతా తన గొప్పతనమే అని రంగు పూశాడు మసిపూసి మారేడు కాయ చేశాడు ఇలా కొత్త తరహా జర్నలిజానికి నాందిపలికాడు .ఆపాప కస్టాలు పడినట్లు ఆమెకుఆడవాళ్ళ నుంచి సాను భూతి ని వరదలా పారించాడు .
యుద్ధ పన్నాగాలపై ద్రుష్టి సారించాడు .అతని ఏజెంట్లు డిప్లమాటిక్ లెటర్స్ ను తారుమారు చేసేవారు .హవానా హార్బర్ లో యుద్ధ నౌక ‘’మైన్’’ ఊహించని విస్ఫోటనం లో ధ్వంసానికి గురి అయినప్పుడు హార్స్త్స్ 50వేల డాలర్ల నజరానాను ఆ విధ్వంసకుడిని పట్టిచ్చిన వాదికిస్తానని ప్రకటించాడు . యుద్ధ రంగం ఎక్కడ ఉందొ కనుక్కోవటానికి తన స్వంత యుద్ధ నౌకను పంపాడు . అనుమానాస్పదు లైన స్పానిష్ నావికులను పట్టుకోవటానికి ఒక సారి తానె అక్కడికి వెళ్ళాడు .స్పెయిన్ నౌకలు అడ్డ దారిలో ఫసిఫిక్ కు చేరటానికి అతిపెద్ద స్టీం షిప్ ను సూయజ్ కెనాల్ లో ముంచే ప్రయత్నం చేస్తుంటే అడ్డంకి కలిగించే ప్రయత్నం చేశాడు . ఒక రకంగా ఇది అంతర్జాతీయ కట్టు బాటును అతిక్రమించటమే .
పేపర్ పవర్
హార్స్త్స్ పత్రికలూ నిలబడ్డాయి ,సర్క్యు లేషన్ పెరిగింది .ఇప్పుడు హార్స్ట్ ఒక శక్తి కేంద్రమై పోయాడు .పత్రికా సామ్రాజ్యం ఏర్పరచాలని నిర్ణ యించాడు .దీనితో కొత్త గోల్స్ కు ,విస్తృతమైన పరిదులకోసం ప్రయత్నింఛి సాధించిన తన విజయాలకు ద్రుఢత్వం చేకూర్చాలను కొన్నాడు .దీనికి నందిగా ఒక్క నెల రోజుల్లోపుననే చికాగో లో ‘’అమెరికన్ ‘’పత్రికను 4-7-1900లో డెమొక్రాట్ కన్వెన్షన్ లో అతను తన అభ్యర్ధిగా విలియం జెన్నింగ్స్ బ్రియాన్ ను ప్రకటించే ముందు స్థాపించాడు ..మరింత బలపడి ‘’చికాగో రికార్డ్ హెరాల్డ్ ‘’పత్రికను కొనేశాడు .ఇక వరుసగా బోస్టన్ అట్లాంటా ,వాషింగ్టన్ ,డెట్రాయిట్ ,సియాటిల్ ,రోచెస్టర్ ,ఓక్ లాండ్ , .లాస్ ఏంజెల్స్ ,సిరాక్యూజ్ బాల్టిమోర్ ,పిట్స్ బర్గ్ ,ఒమాహా లలో కొత్త పత్రికలూ పెట్టటం కాని ఉన్నవాటిని స్వాధీనం చేసుకోవటం కాని చేసి తన పత్రికా సామ్రాజ్య పరిధిని అతి విస్తృతం చేసుకొన్నాడు .1929లో సుమారు అరవై వయసులో25 పెద్ద పత్రికలను 18 అతి కీలకమైన పెద్ద సిటీలలో నెలకొల్పాడు. అనుకొన్నది సాధించాడు .
లేబర్ సానుభూతి-వారికే వ్యతిరేకి
అతని విధానాలు చాలా కఠినంగా,అభి వృద్ధి నిరోధకం గా ఉండేవి .ఒకప్పుడు లేబర్ కు గొప్ప సాను భూతి పరుడుగా,ఆసరాగా ఉన్నవాడు ఇప్పుడు ధన గర్వం తో దురహంకారి అయాడు .’’డబ్బు లావు’’ చేసినకొద్దీ మరింత బిగిసి రైట్ రియాక్షనరీ గా మారాడు .బిగ్ బిజినెస్ కు బిగ్ బాస్ అని పించుకొన్నాడు .పబ్లిక్ వెల్ఫేర్ ను కార్పోరేట్ సంక్షేమానితో సమం చేశాడు .1919లో చట్టానికి సహకరించిన వారి ,చట్టాన్ని అమలు పరచే పౌరుల హక్కులకు బాసటగా నిలిచాడు .పోలీసులను కూడా సమ్మె చేయమని సలహా ఇచ్చేవాడు అప్పుడు .అప్పుడాయన ‘’every thinking human being admits the right of ordinary employees to organaize and to quit work when conditions are un satisfactory and to betaken back when conditions are amended ‘’ . అని నీతులు బోధించాడు .కానీ అదే వ్యక్తీ 15 ఏళ్ళ తర్వాత లేబర్ యూనియన్ లతో పోట్లాడాడు న్యూస్ పేపర్ గిల్డ్ ను వ్యతిరేకించాడు .పూర్వం తానూ సమర్దిన్చినవాటి నన్నిటినీ ఇప్పుడు వ్యతిరేకించాడు .ఇప్పుడు’’ కొత్తా పేపర్ దేవుడి’’అవతారం ఎత్తి ‘’strikes should be out lawed and complete machinery to enforce their suppression should be fully established and fearlessly operated ‘’అని కొత్త నీటి వాక్యాలు పలికాడు .రెండు నాలుకల ధోరణి అంటే ఇదే .స్ప్లిట్ పెర్సనాలిటి .అని పించాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-15 -ఉయ్యూరు