ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89

39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్

అమెరికాను చక్రాలపై నడిపించిన ఘనుడు ,మెకానిక్ ,’’దిలిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’హెన్రీ ఫోర్డ్ 30-7-1863లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు డియర్ బార్న్లో జన్మించాడు . .కొడుకు రైతు  కావాలని తండ్రికోరిక .స్కూల్ కు వెళ్లేముందు వచ్చిన తర్వాత ఫోర్డ్ ను పల్లె జీవితానికి అలవాటు చేశాడు .అయినా జీవితం చరమ భాగం లో ఏ భూమిని ప్రేమించలేదో అక్కడే మళ్ళీ మట్టి మనిషి అయ్యాడు .ఫోర్డ్ కార్ల ఉత్పత్తిలో మెస్సయ్య అయి కీర్తిగడించాక ఈ విషయమైరాస్తూ  ‘’మా డైరీ ఫాంను అచ్చంగా  ఒక ఫాక్టరీ నడిపినట్లుగానే  నడిపాం ‘’అన్నాడు .యవ్వనం లో అంత నెమ్మదిగా నడిచే గుర్రాలు ,ఆవుల మధ్య గడుపుతానని అనుకోలేదు .అప్పుడే  కనీసం అప్పటికి కంటితో చూడనైనా చూడని ట్రాక్టర్ల నమూనాలు గీసేవాడు .తల్లి ఉపయోగించే కుట్టు పని సూదులను స్క్రూ డ్రైవర్లు గా మలచేవాడు .పుస్తకం అడ్డం పెట్టుకొని మెకానికల్ ఆటవస్తువుల  కు  టింకరింగ్ ను చేసేవాడు రహస్యంగా .14ఏళ్ళకే వాచ్ ని విప్పి అందులోని భాగాలను బయటికి తీసి మళ్ళీ చక్కగా  అమర్చ గలిగేవాడు .డెట్రాయిట్ లో 16 వ ఏట పగటిపూట ఒక మెకానిక్ షాప్ లో వారానికి రెండున్నర డాలర్ల జీతం తో అప్రెంటిస్ గా పని చేశాడు .సాయంత్రాలలో ఒక జ్యూయలరీ లో ,అంతే జీతానికి పని చేశాడు .రెండేళ్ళ తర్వాత ఒక ఇంజెన్ షాప్ లో ఉద్యోగం వచ్చింది .వయసు 19లో మళ్ళీ ఫాం హౌస్ బాయ్ అయి ‘’సింగిల్ సిలెండర్ స్టీం ఫా౦ ట్రాక్టర్ ‘’ను స్వయం గా రూపొందించాడు .అదిపని చేసి౦దికాని పొలం లో ప్రక్కకి తిరగటానికి చాలినంత సామర్ధ్యం ఉన్న  బాయిలర్ ను తగిన ప్రసర్ తో తయారు చేయలేక పోయాడు .కొడుకు క్షేత్రపాలకుడుగా ఉన్నాడన్న సంతోషం తో తండ్రి  ఫోర్డ్ కు 40 ఎకరాల వుడ్ లాండ్ పొలం ఇచ్చాడు .దీనిలో ఒక సా మిల్ ను ఏర్పరచి పొలం లోని చెట్లను నరికించి రద్దు ముక్కలని అమ్మేశాడు .అప్పటికి అయ్యగారి వయసు 21మాత్రమే .

24ఏళ్ళకే పెళ్లి చేసుకొని హెన్రి డెట్రాయిట్ లో కాపురం పెట్టాడు .అకడ’’ ఎడిసన్ ఇల్ల్యూ మినేటింగ్ కంపెని ‘’ ఉద్యోగి అయ్యాడు .రెండేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఇంజినీర్ అయ్యాడు .డెట్రాయిట్ ఆటో మొబైల్ క్లబ్ లో చేరి మొదటి ఆటో మొబైల్ ను తయారు చేశాడు .సన్నగా పొడుగ్గా పలచగా ఉండేవాడు .నిశిత ద్రుష్టి ఉన్నకళ్ళు  .నొక్కుకు పోయినట్లుండే ముఖం .వాషింగ్టన్ ఇర్వింగ్ గీసిన’’ ఇచాబాడ్ క్రేన్ ‘’లా ఉండేవాడు .కొంగలాంటి చూపు .అన్నిటినీ పసికట్టే నేర్పు ఉండేవి .ఫోర్డ్ ప్రేమనంతా యంత్రాలమీదే కురిపించాడు .యంత్రం లోని ప్రతిభాగం ఆయన్ను ఆశ్చర్యపరచి ఉత్తేజం కల్గించేది .యంత్రారాధకుడై పోయాడు .’’అంతర్దహన యంత్రం ‘’(కంబస్చన్ ఇంజిన్ )తో ప్రయోగాలు చేశాడు .ఇంటికి కూడా తీసుకొని వెళ్లి వాటి సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నం చేసేవాడు .33వ ఏట అందవికారంగా ఉండే గుర్రం లేని బండీని ఇంజన్ తో’’ గా’సోలీన్ బగ్గీ ‘’ని నడిపి అందరకీ ఆశ్చర్యం కలిగించాడు .దీని తర్వాత అనేక రకాల కార్లు తయారు చేశాడు .కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయి .చివరగా ఒక ‘’రేసింగ్ కార్ ‘’ను తయారు చేసి రేసింగ్  పోటీలో స్వయం గా నడిపి పాల్గొన్నాడు .ఈ అనుభవాన్ని వర్ణిస్తూ ‘’నేనే స్వయం గా ఒక మైలు దూరం ఐసు మీద నా రేసింగ్ కార్ నడిపాను .ఈ రేస్ ను జీవితం లో మరచిపోలేను .ఐసు మీద పగుళ్ళుఉండేవి . ఆ పగుళ్ళలో నా కారు యెగిరి గంతేసేది గాలిలో .అది మళ్ళీ యెట్లా మంచుమీదకు వచ్చేదో నాకు అర్ధమయ్యేదికాదు .గాలిలో లేనప్పుడు జారిపోతున్నానేమో అనిపించేది .ఏమైతేనేం విజయవంతంగా నడిపి రేస్ గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించాను ‘’అని ‘’మై లైఫ్ అండ్ వర్క్ ‘’అనే జీవిత చరిత్రలో రాసుకొన్నాడు ఫోర్డ్ .తానొక ‘’గ్రేటెస్ట్ డేర్ డెవిల్ డ్రైవర్ ‘’అనిపించుకొన్నా కార్ డ్రైవింగ్ పై వ్యామోహ పడలేదు .తేలిగ్గా ఉదాసీనంగా అదొక అడ్వర్ టైజ్ మెంట్ గా’’ లైట్ తీసుకున్నాడు ‘’.40వ ఏట 1903లో స్వంతంగా కార్ల కంపెనీ స్థాపించాడు .స్టాక్ హోల్డర్లు గా ఇద్దరు లాయర్లు ,ఒక బుక్ కీపర్ ,ఇద్దరు మెషీన్ షాప్ యజమానులు ,ఒక గుమాస్తా ,షాప్ నిర్వహించే ఒక మనిషి గాలిమరలు తయారు చేసే ఆయన  తో మొదలు పెట్టాడు .గ్రాస్ కాపిటల్ 25వేల డాలర్లు .అయిదేళ్ళ తర్వాత ‘’మోడల్ టి’’కారు(TLizz) ను రోడ్దేక్కింఛి అమెరికా ప్రజల్ని కాలినడక నించి తప్పించి కారులో దూసుకు పోయే స్థితిని కల్పించాడు ఫోర్డ్ .

నమ్మ శక్యం కాని విపరీతమైన లాభాలోచ్చి పడ్డాయి .దీనికో చిన్ని ఉదాహరణ .ఆర్గనైజర్లలో ఒకడైన జేమ్స్ కజిన్స్ కు  రోసేట్ట అనే సిస్టర్ ఉంది .జాగ్రత్తగా గడుపుతూస్కూల్ టీచర్ జీవితాన్నిగడుపుతూ ఎట్లాగో రెండు వందల డాలర్లు నిలవ చేసింది .రిస్క్ తీసుకొని అందులో సగ౦  అంటే వంద డాలర్లు ఫోర్డ్ కంపెనీలో పెట్టు బడి పెట్టింది .1919కి ఆమె పెట్టుబడిపై ఆమెకు మిలియన్ లో మూడవ వంతు అంటే మూడు వందల యాభై వేల డాలర్లు లభించాయి కళ్ళు తిరిగే రాబడి విని మూర్చ పోయే విషయం .ప్రతివాడు ఫోర్డ్ తయారు చేసిన’’ టి లిజ్  ‘’కారును చూసి మొదట్లో నవ్వారు .ఒక జోకు కూడా వదిలారు ‘’ఆ ఏం లేదురా !ఎవడో పల్లెటూరి రైతుబైతు పగిలిన బాయిలరూ ,తుప్పుపట్టిన వాష్ టబ్ ఫాక్టరీకి ఇచ్చి ఉంటాడు ఈయనేమో రెండు రోజుల తర్వాత వాటితో కొత్త ఆటో మొబైల్ చేసి రైతుకు రవాణా చేశాడు .మిగిల మెటల్ ఖరీదు 20డాలర్లు కట్టి రైతుకు పంపి ఉంటాడు ‘’ఇలా బోల్డు కధలు ప్రచారంయ్యాయి .ఇలా అంటూనే అందులో ఎక్కి అందరూ తిరిగారు .ఫోర్డ కొత్త  ఇంజన్ల సృష్టికర్తకాడు,ఆర్గనైజరూకాడు .కాని నిరంతర ప్రయోగాలు చేసేవాడు అవి హిట్ అవచ్చు ఫట్ అవచ్చు .ఆయనొక కూర్పరి (అసెంబ్లర్ ) .కానిఅతని ఈ ఇన్వెన్షనరీ  కూర్పు ఆలోచనే  ,కార్ల ఉత్పత్తిలో విప్లవం తెచ్చింది .శతాబ్దాల జనాల జీవన విధానాన్నే మార్చేసింది .అతి వేగం గా కార్లను ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరకు అమ్మటం ఫోర్డ్ ప్రత్యేకత .ఈ కార్లు ‘’డబ్బు చేసిన ‘’మనుషులకోసం కాదు .సామాన్య పనీ పాటా చేసుకొనే జనం కోసమే .అంతకు ముందెప్పుడూ కారు ముఖం చూడని కారు ప్రయాణ సుఖం అనుభవించని ,స్వంత కారు లేని వారి కోసమే .వర్కర్ల జీతాలు పెంచి కారు ధర తగ్గించాడు ఫోర్డ్ .దీనికి తగిన గొప్ప ప్రతిఫలం పొందాడు .15మిలియన్ల టిలిజ్ కార్లను ఉత్పత్తి చేసి అమ్మాడు .అందులో చాలాభాగం కేవలం 290 డాలర్లకే అమ్మాడు .ధర తగ్గటం తో మార్కెటింగ్ పెరిగింది .అలా వ్యాపారం అనంతంగా సాగింది .రోడ్డుమీద కనిపించే ప్రతి రెండు కార్లలో ఒకటి ఫోర్డ్ కారే అవటం ఆశ్చర్య కరం .కారులో కొన్ని లోపాలున్నాయి వాటిని సరి చేయాల్సిఉంది .అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు .లోపలి డిజైన్ బట్టి కారు ధర ఉండేట్లు చూశాడు .దీనితర్వాత ‘’మోడల్ A’’కార్లను తయారు చేయటం మొదలెట్టి రోజుకు ఆరు వేలు తయారు చేశాడు .అమరిక ,కన్వేయర్ బెల్ట్ ,స్పీడ్ అన్నీస్వంతంగా అమర్చారు .

సశేషం

Inline image 1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.