ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -91

39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –3(చివరి భాగం )

ఫోర్డ్ సామ్రాజ్యం బాగా విస్తరించాక విశేష అధికారాలను పొందాడు .కనుక తప్పులు చేయటానికి సాహసి౦చ లేదు .జరిగిన తప్పులన్నీ ఆయనపై ప్రభావం ఉన్నవారి వల్ల జరిగినవే ననే ఆరోపణ వచ్చింది .ఒకరిపై ఒకరిని ఉసి గొల్పి వినోదించే మనిషి ఫోర్డ్ ,యెంత ప్రాముఖ్యమైన వ్యక్తీ అయ్యాడో అంత డేంజర్ కూడా అయ్యాడు .కంపెనీలో పని చేసే అత్యున్నత స్థాయి ఆఫీసర్లను కింది తరగతి స్వీపర్లను పీకి పారేసినట్లు తీసిపారేశాడు .అలాంటి వారిలోఫోర్డ్ తో మొదటినుంచి పని చేసి కంపెనీ వ్యాప్తికి అన్ని విధాలా తోడ్పడి,వర్కింగ్ బ్రదర్ లా ఉన్న  జీనియస్ జేమ్స్ కజిన్స కూడా  ఉండటం బాధాకరం . అలాగే ప్రొడక్షన్ సూపరిన్టే౦ డెంట్,విల్లో ర న్ లో వార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన  హార్లేస్ సోరెంసన్ కూడా ఉన్నాడు .ముఖ్య బిజినెస్ సెక్రెటరి ,ఆంతరింగుకుడుఎర్నెస్ట్ లీ బోల్డ్ ను కూడా ‘’ఫైర్’’చేశాడు. కాల్చాడు అని కాదు  తీసేశాడని అర్ధం .ఫోర్డ్ దగ్గరున్న అతి ముఖ్యమైన నలుగురిలో బాడీ గార్డ్ ,స్క్రీనింగ్ ఏజెంట్ అయిన హారీ బెన్నెట్ ను ఒక్కడినే తన దగ్గర ఉంచుకొని మిగిలిన ముగ్గురికి ఉద్వాసన పలికాడు ఫోర్డ్ మహాశయుడు .ఫోర్డ్ చనిపోయేదాకా ఇతనున్నాడు .ఫోర్డ్ చనిపోయాక అప్పటికే ఫోర్డ్ ఎస్టాబ్లిష్ చేసిన సర్వీస్ ను తాను స్వీకరించానని  చెప్పాడు .ప్రతివాడూ మరోకరిని చెక్ చేసేవారని,ఉద్యోగుల్లో అయిదుగురిలో ఒకరు గూఢ చారి లేక సర్వీస్ మనిషి  ఒకరు ఉండేవారని,టాయ్ లెట్లకు వెళ్ళినా వెంబడిం చేవారని ,ఫోర్డ్ కంపెనీలో ఫోర్డ్ కు తెలియ కుండా ఏ చిన్న విషయమూ జరగదని బెన్నెట్ చెప్పాడు .

చాలాకాలం చాలా సమస్యలకు తన దగ్గర సమాదానాలున్నాయని ఫోర్డ్ నమ్మాడు .విద్యా గంధం లేని వ్యవహార దక్షుడు ,శక్తి వంతమైన పారిశ్రామిక వేత్త,అధిక సంపన్నుడైన ఉత్పత్తిదారుడు అన్నిటా తానె అయిన వాడైపోయాడు .రాజకీయాలు కూడా ఒక పరిశ్రమ . కనుకమిచిగాన్ నుంచి సెనేటర్ గా పోటీచేశాడు ఆయన రిపబ్లికన్ అయినా ఆ పార్టీ నామినేషన్ సాధించలేక పోయాడు .డేమోక్రాటిక్  టికెట్ పొంది ముగ్గ్గు లో దిగాడు .ఓడిపోయాడు .కాని తల వంచుకో లేదు .ప్రత్యర్ధి కదలికలు గమనించటానికి రాహస్య ఏజెంట్ లను ఏర్పాటు చేసి ,అతని అవినీతి బాగోతం బయట పెట్టి ,అతని రాజీనామాకు పట్టు బట్టాడు .కాని సాగ లేదు .కొడితే ఏనుగు కుంభ స్థలమే కొట్టాలనుకొని ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలనుకొన్నాడు .ఫోర్డ్ పత్రిక లో ‘’the next president of the United States will be a man who can read a blue print and who understands the problems of production and how to keep men employed ‘’అని ప్రకటించు కొని బిల్డప్ ఇప్పించు కొన్నాడు  .రాండాల్ఫ్ హార్స్ట్ పేపర్లు వెన్ను దన్నుగా నిలిచాయి ‘.’’ది లిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’అని ఆకాశానికి ఎత్తేశాయి .ఫోర్డ్ ను ఏదో ఒక పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టక పొతే అయన స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడి గెలుస్తాడు అనే అభిప్రాయం వ్యాపింప జేశాయి .ప్రతివారూ ఫోర్డ్ వైపే ఉన్నారు .వ్యవసాయ దారుల ట్రాక్టర్లు ఆయనవే .ప్రొహిబిష నిస్ట్ లు ,పెసిఫిస్ట్ లూ ,పని చేసేవారుఅయన వైపే . ,ఫోర్డ్ కార్లు వాడేవారు దేశ జనాభాలో చాలా ఎక్కువ మందే ఉన్నారు .ఇలా మాంచి ఊపులో రాజకీయం నడుస్తుండగా ఫోర్డ్ అకస్మాత్తుగా తానూ ప్రెసిడెంట్ పదవికి పోటీ దారును కాదని ,తన ఆలోచనను విరమించుకొంటున్నానని సంచలన ప్రకటన చేశాడు  .ఫాక్టరీ లో జరిగిన సంఘటనలు ,ఆయనకు చరిత్రా సంస్కృతులపై నమ్మకం లేక పోవటం లేక అవి తెలియక పోవటం ఫోర్డ్ లోపాలని ఆయన ‘’అవివేకి ‘’అని ‘’చికాగో ట్రిబ్యూన్ ‘’పత్రిక ఆరోపిస్తే ఫోర్డ్ దానిపై మిలియన్ డాలర్లకు డామేజ్ సూట్ వేశాడు .ఆ పత్రిక సాక్ష్యాలుగా బెనెడిక్ట్ ఆర్నాల్డ్ ఎవరో ఫోర్డ్ కు తెలియదని ,1812 యుద్ధం రివల్యూషన్ అన్నాడని ,ఆయన ‘’   history is bunk ‘’అన్నాడని చూపాయి . ఫోర్డ్ కేసు గెలిచాడు.కాని ప్రిస్టేజ్  డామేజ్ కింద ఆయనకు దక్కినది కేవలం ‘’ఆరు పెన్నీలు ‘’మాత్రమె అంటే కోర్టు’’ ఆయన పరువు విలువ 6 పెన్నీలు ‘’అని అభిప్రాయ పడిందా ?దీనితో  అహం మరీ దేబ్బదిన్నది .ఉడికిపోయాడు.అవమానం పాలైనాడు .దీని నుంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .వర్తమాన క్రూర వాస్తవాన్ని గమనించాడు . గతాన్ని అర్ధం చేసుకున్నాడు .

గతం తవ్వుకొన్నాడు బాల్యపు స్మృతులు గుర్తు తెచ్చుకొన్నాడు .పాత నాగలి, కత్తి,కొడవలి చేతి శ్రమ ,నెమ్మదిగా నడిచే పల్లె జీవితం జ్ఞాపక మొచ్చాయి .  గ్రామ సీమలు కరెంట్ లేకుండా సరైన దారి సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయని గమనించాడు .మర్చి పోయిన కాలానికి చెందినస్మ్రుతి చిహ్నాలను సేకరించి భద్ర పరచాడు  .ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ కళ్ళముందు ప్రదర్శించాడు .భవిష్యత్ తరాలకు స్పూర్తి కలిగించాడు .పాత కాలపు నాట్యాలను సంగీతాన్ని వెలుగు లోకి తెచ్చాడు .ఫాక్టరీలో డాన్సింగ్ పార్టీలు ఏర్పరచి వాటి వివరాలను ముందుగానే బుక్ లెట్ లలో ముద్రించి తెలియ జేసేవాడు .పాతతరం వయోలిన్ వాద్య కారులను కలిసి వారి సాయం తోఅమెరికాలో ఉన్న  పూర్వకాలపు వయోలిన్ లన్నిటినీ సేకరించి భద్రపరచాడు . .అందులో అమరాటి,,స్త్రాడివారి,గుర్నేరి మొదలైన ప్రసిద్ధులు తయారు చేసిన వయోలిన్ లను కొన్నాడు. వాటికీ అయిదు వేల డాలర్లు ఖర్చు చేశాడు .ఒక పెద్ద మ్యూజియం కట్టించి అందులో అన్నిరకాల వాహనాలను ,ఈజిప్ట్ వారి చారియట్లు జపాన్ వారి జిన్ రిక్షాలు ,వేలోసి పీడియోలు,సైకిళ్ళు ,బగ్గీలు ,బస్సులు ,బాండ్ వాగన్లు ,రైళ్ళు ,ఇంజన్లు ,ఆటోలు అన్నీ సేకరించి అందులో ఉంచాడు .ఫిలడెల్ఫియా లోని లాండ్ మార్క్ అయిన ఇండి పెండేన్స్ హాలు  నమూనాను కట్టించాడు. ఇలాగే అమెరికాలో ఉన్న అన్నిరకాల విశేష కట్టడాల నమూనాలను కట్టించాడు .తన ముఖ్య స్నేహితుడు ఎలెక్ట్రిక్ బల్బ్ లిజెండ్  థామస్ ఆల్వా ఎడిసన్ మెన్లో పార్క్ ,న్యు జెర్సీ లలో  ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక సంస్థలను తరలించి తన మ్యూజియం లో సురక్షితం గా ఉంచాడు .లాంగ్ ఫెలో కవితో అమరమై నిలిచిన వేసైడ్ఇన్ ను తలుపుల దగ్గరనుంచి అన్నిటినీ మార్చి సర్వాంగ సుందరం చేశాడు .మాసాచూసేట్స్ స్కూల్  హౌస్ ను పునర్నిర్మించాడు .స్టీఫెన్ సి ఫాస్టర్ పుట్టిన చోటు ను ఒక రకమైన దేవాలయం గా మార్చాడు .పెన్సిల్వేనియా   లో జన్మించిన మెక్ గఫీ కాబిన్ ను తెచ్చి ఇక్కడ జాగ్రత్త చేశాడు .లింకన్ వాడిన ముతక కప్ బోర్డ్ ను తెప్పించి మ్యూజియం లో ఉంచాడు .దియేటర్లో కాల్పుల్లో చనిపోయేముందు లింకన్ కూర్చున్న కుర్చీని భద్రపరచాడు .ఫోర్డ్ సేకరణ దాహం తీరలేదు .తను చదివిన గ్రీన్ ఫీల్డ్ విలేజ్ ని అందులోని 90నిర్మాణాలను అందమైన కట్టడాలుగా మార్చి తన తీపి గుర్తులకు జ్ఞాపకాలుగా మలచాడు .ఆధునికత విస్తరించిన స్పీడ్ జీవితం కంటే ప్రశాంతమైన పాత రోజులే నయం అన్న విషయం రుజువు చేశాడు

వర్తమాన భూతకాలాల వారధిగా ఉండాలనుకొని చేసిన ప్రయత్నాలు పూర్తికాలేదు ఫోర్డ్ జీవితం పై అనేక గ్రంధాలు వెలువడ్డాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృక్పధం .’’ది వైల్డ్ వీల్ ‘’అనే పేరుతొ గారేట్ గార్రేట్ రాశాడు .ఎనభై వ ఏట ఫోర్డ్ జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణించింది .కాని  బుర్ర పాదరసం గానే పని చేసింది .తను బలవంతంగా బయటికి నెట్టేసిన జీనియస్ ,ఆంతరంగికుడు ఉక్కు గుండె సూప రిండెంట్ పై ఆధారపడిన వాడు సోరేస్మన్ ను గురించి ఆలోచించి విచారించాడు .’’let us go over  and ask Charlie about this ‘’అన్నాడు .82 లో ఫోర్డ్ రిటైర్ అయ్యాడు .రిటైర్ మెంట్ ను ఏర్పాటు చేశాడు .అతని రాక పోకలని జాగ్రత్తగా గమనించేవారు .కుటుంబ సభ్యులు కాకుండా బయటి వారెవరూ ఆయన్ను కలవకుండా జాగ్రత్త పడ్డారు .ఎనభై నాలుగవ ఏడు సమీపిస్తున్న సమయం లో 7-4-1947న మెదడులో రక్తనాళాలు తెగిపోవటం వలన ఫోర్డ్ మరణించాడు .రోగ్ నది రోగ్ లాగా ఉచ్చ నీచాలు తెలియ కుండా వరదలతో  పోటెత్తి ఫోర్డ్ ఇంట్లో కరెంట్ పోయింది .ఇదే చివరి పారడాక్స్ .యంత్ర శక్తి కి ప్రతి రూపమై యంత్ర కాంతిని దశ దిశలా వెదజల్లిన  ఫోర్డ్ తాను ఆ నాడు చీకటి గదిలో  లో  పుట్టి నట్లుగానే ఇప్పుడు అదే చీకటిలో మరణించాడు .ఇదే పారడాక్స్.అతని మరణం లో అక్కడ వెలిగింది మినుకు మినుకు మంటూ వెలిగే  నూనె దీపం ,కొన్ని వెలుగు తున్న కొవ్వొత్తులు మాత్రమే .

Inline image 1  Inline image 2

Inline image 3   Ford   in germani

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.