నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
6-అభిరామ రాఘవ నాటక కర్త అనపోతనాయకుడు (1361-1383)
రాచకొండ వెలమ రాజ్య స్థాపకుడు అనపోత నాయకుడు 1361లో జన్మించి 1383లో మరణించాడు .మొదటి సింగమ నాయకుని కొడుకు .కాకతీయ ప్రతాపరుద్రుని వద్ద పనిచేశాడు .సింగన రసార్నవ సుధాకర కర్త సర్వజ్ఞ సింగ భూపాలుని తండ్రి .అనపోతునికి ‘’సోమకుల పరశురామ ‘’.’’జల్లిపల్లి రణ క్షోణిభారతీక మల్ల ‘’త్రిభువనిరాయక ‘’,’’ఖడ్గ నారాయణ ‘’బిరుదులున్నాయి . అనపోతుడు మహా కవి పోషకుడు మాత్రమె కాదు తానూ గొప్ప కవే .’’అభిరామ రాఘవ ‘’నాటక కర్త .ఇందులో కొన్ని శ్లోకాలు మాత్రమె సింగన మొదలైన వారు ఉదాహరించారు .వాటినో సారి చూద్దాం
‘’హంత సారస్వతం చక్షుః కవీనాం క్రాంత దర్శినాం –అతిరస్య ప్రవర్తేత నియతార్యషు
‘’విద్వానసౌ కలావానపి రసికౌ బహువిధ ప్రయోగజ్ఞః-ఇతి చ భవంతం విద్గో నిర్యూడం సాదు తత్వయా సర్వం ‘’
7-నరసింహ విజయ వ్యాయోగ కర్త -దేవులపల్లి అన్నపూర్ణేశ్వర శర్మ
దేవులపల్లి సుబ్బరాయ కుమారుడే అన్నపూర్ణేశ్వర శర్మ .కౌ౦డిన్యస గోత్రీకుడు .నూజివీడు జమీ౦దారిలోని శోభనాద్రి వాసి .’’నరసింహ విజయ వ్యాయోగం ‘’నాటకం రాశాడు.ఇతని కాలం గురించి తెలియదు .ఈ నాటకం లో మూడవ వంతు భాగమే దొరికింది .ఉన్న పదిహేను పత్రాలలో ౩,5,7,10,11,15మాత్రమె లభించాయి .మూడవ పత్రం లో నటి ,సూత్ర దారుల సంభాషణ ఉంది .ఇందులో కవిజీవితాన్ని చెప్పాడు .ఈ కొద్ది భాగాలలోనే కవి మేధస్సు, కవిత్వ సౌరభం తెలుస్తుంది .లభించని పత్రాలలో ఏమి ఉందొ తెలియదు .హరికి సురాచార్యుడు హిరణ్య కశిపుని చేతిలో సూర్యుడు పొందిన పరాభవం వివరించాడు .రంగ దాసుడికి శోభనాచల మహాత్మ్యాన్ని గురించి వసంత వివరిస్తుంది .వసంత కుసుమారుడు గరుడ వాహన విశేషాలను వివరిస్తాడు.నారదుడు నరసింహావతార ఆవిర్భావాన్ని వివరించాడు .-
‘’తచ్చా లాస్య స్తంభ తొంభోధరణి కర సముజ్జ్రుమ్భ గంభీర రావః –శుమ్భా జ్రుమ్భ ద్విషద్విండధర దలనాజ్జ్హృమ్భ దంభోలికేళిః-వీక్షా రూక్ష స్ఫులితంగక్రుమ్భిత దితిసుతా ధ్యక్ష సూతే స్సమక్షం –రక్షా మీక్షా న్వల క్షధృతి వితాతినృహర్యక్ష రూపోక్షరో భూత్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-15-ఉయ్యూరు
‘
‘’
—