నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
8- దృశ్య శ్రవ్య మిశ్రమ కావ్య౦ రాసిన – వడ్లమాని అన్నయ శాస్త్రి (
వాదూలస గోత్రీకుడు వడ్లమాని అన్నయ శాస్త్రి విశాఖ పట్నం సంస్కృత పాఠ శాలలో సంస్కృత పండితునిగా పని చేశాడు ‘’సీతారామ రాజాభ్యుదయం ‘’అనే చంపూ నాటకం రాశాడు .సాధారణం గా కావ్యాలు దృశ్యకావ్యాలు గానో శ్రవ్య కావ్యాలుగానో ఉంటాయి కాని ఈకవి దృశ్య శ్రవ్య మిశ్రమం చేసి రాశాడు .ఉపోద్ఘాతం లో నే కవి ఈ విషయం వివరించాడు ,’’సంతు ఖాలు భువి బహూని నాటకాని,అనేకాని చ కావ్యాని ప్రబందాస్చ బహువిధాః .తాద్రుష్పద్దతి వ్యతిరిక్తతాయాంపూర్వకల్పితదృశ్య శ్రవ్యత్వో భయ సంబంధ మిశ్రతయా వివిధ కావ్య రాసాని మగ్నానామపి బుధ నామాహృదకారిణీ భవే దియామితినిస్చినుమః ‘’.దీన్ని రాయటాన్ని సమర్ధించుకొన్నాడు కూడా .
ఇది మిశ్రమ కావ్యం అనటానికి రచయితలకు ,పాత్రలకు మధ్య జరిగే సంభాషణలు దృశ్య కావ్యం అని పిస్తే ,సుదీర్ఘ వర్ణనలు శ్రవ్య కావ్యం అని పిస్తుంది .ఈ చంపూ నాటకం లో నాలుగు స్తబకాలున్నాయి .మొదటిస్తభకం’’నాయక వ౦శాభి వర్ణనం ‘’ లో ‘’నాయకుడైన సీతా రామరాజు వంశాభి వర్ణనం ‘చేశాడు కవి .రామ రాజు కాకర్ల వంశస్తుడు .ఆలమండలో ఉండేవాడు .ఇది విజయనగర ప్రభువు ఆనంద గజపతి రాజు పరిపాలనలో ఉండేది .కాకార్ల వంశం వారు విజయ నగర రాజు కు సైనికాధికారులు .రామ రాజు పూర్వీకుల వర్ణన కూదాచేశాడు కవి .రెండవ స్తబకం’’కృతి సమర్పణం ‘’ లో హరిహర రాజ పట్టాభిషేక వర్ణన ఉంది .మూడవది ‘’యువ రాజ విలాసం ‘’లో సీతారామ రాజు చేసిన త్యాగం ,అయన వివాహం ,పట్టాభి షేకం రాజు మంత్రి కొడుకుతో వింధ్యగిరి పర్యటన ఉంటాయి .నాలుగవ స్తబకం ‘’సమ్మేళనం ‘’లో సీతారామ రాజు పుణ్య క్షేత్ర సందర్శనం ,ఇతర రాజులపై యుద్ధాలు విజయాలు ,అంతం లో తండ్రీ కొడుకుల సమాగమం ఉన్నాయి .ఈ కావ్యం లో శాంతరసం ఉందని కవే చెప్పాడు.
పండిత ప్రకాండుల ప్రశంసలు అందుకొన్నాడు కవి అన్నయ శాస్త్రి .ఇది అతి అరుదైన సంస్కృత చంపూ కావ్యం .కవి కవిత్వ ప్రతిభకు కొన్ని ఉదాహరణలు చూద్దాం .
‘’ఆస్తి ఖల్వాఖిల వసుంధరా వలయ ప్రతి నిధిః సహస్ర రధసవిలాస గమన సముచితా విశంక తరధ్యాపయ పదిక జన సతత సంచరణ మసృణిత విపులోపల ఫలక ధటితఘంటా సంతత క్రేత్రు జన సముదయ బహు ముఖారవ పూరణ జనిత ప్రతిధ్వానతయా అనపేక్షిత ‘’ఇలా సాగే కమ్మని కవిత్వం .చివరలో ‘’శ్రీ మదానంద గజపతి మహా రాజేన పరిపాలయ మానస్య మహా మండలస్య శ్రీమత్చలమండనగరీ’’అని పూర్తీ చేశాడు .
రెండవ స్తబకం లో ‘’ అహో అస్య శశి మృతోః-సౌభాగ్యం తదాహి –అల్పావశేష తదన్కా పటలీతరూణాం నత్యన్త్య మండన వతీ వినితేవ భాతి ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-11-15-ఉయ్యూరు