నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
9-మరిగంటి అప్పల దేశికులు (1790)
శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన మరి గంటి వారు నల్గొండజిల్లా నివాసులు .తర్వాత రాష్ట్రమంతా వ్యాపించారు .తెలుగు సంస్కృతాలలో బహు గ్రంధాలు రచించారు .కుతుబ్ షాహి ,విజయనగర పాలకుల పోషణలో ఉన్నా ఈ కవులు ఒక్క రచనను కూడా ఆ రెండు రాజ వంశీయులకు అ౦కితంచేయక పోవటం మహా విశేషం .తమ ఇస్ట దేవతలకు మాత్రమె అంకితమిచ్చారు .అనుముల నివాసి అయిన మరి గంటి నరసింహా చార్య(1700)తెలుగులో చాలానూ సంస్కృతం లో ‘’శతవైరి వైభవాదివకరం ‘’ఛందో గ్రంధాన్ని రాశాడు . ఈయన మనవడు ,వేంకటాచార్య కుమారుడు అప్పలదేశికుడు నరసింహ పురం లో నివసించాడు .లక్ష్మీ నృసింహ స్వామికి పరమ భక్తుడు .
అప్పల దేశికులు సంస్కృత లఘుకావ్యాలు చాలా రాశాడు .అందులో ముఖ్యమైనవి 1-శ్రీరామ పాద స్తుతి 2శ్రీ గోదా స్తవం 3శ్రీ అర్వపల్లి లక్ష్మీనరసింహ స్తోత్రం 4నరసి౦హాస్టోత్తరం 6స్థంభ గిరి లక్ష్మీ నరసింహ స్తోత్రం .
శ్రీరామ పాద స్తుతి 28శ్లోకాల లఘుకావ్యం .ఒకటి రెండు శ్లోకాలు మచ్చుకి
‘’చిత్రం యాత్ర శిలాతలే సుఘటితం రామేణ పాద ద్వయం –సాక్షాల్లక్ష్మణవారుణాస్త్రవిభావజ్జాతం చ శీతం పయః
సీతాయాః కరుణా కటాక్ష విభవత్సంపాదితాస్సంపదో-మిత్రే రత్న వృతౌ నృసింహ నగరే జీవేయ మాయుశ్శతం’’
అర్వేపల్లి లక్ష్మీ నృసింహస్తోత్రం లో స్వామి ఉగ్ర ,శాంత స్వరూపాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకాలు కమనీయం
తుండ త్వండ త్తరంగ రావసిత భర పరిష్వంగ నిస్తండలింగ –ద్రుండం గందానుగా త్రున్గ్రం గగనగ గాంధర్వ గర్వ మహోర్మిం
దీప్యత్ స్వేతాత పత్రం మణిమకుటలసన్మస్తకం యుక్త పార్శ్వం –లక్ష్మీ క్షమాజ ముఖాబ్జాస కరుణా చరణం పూర్నిమాచంద్ర వక్త్రం –సర్వోత్తంసంసమస్తాభరణవిలసితం కోటి సూర్య ప్రకాశం
నేత్రానంద ప్రదం తం మహా హ్రిది కలయే అర్వపల్లీ నృసింహం .
నరసింహ స్తోత్రం 27శ్లోకాల నక్షత్ర మాలిక .బీజాక్షర నిక్షిప్తం .
‘’శ్రీ వత్సాంకం త్రినేత్రం శశి సమ ధవళం చక్ర హస్తం సురేశం –వేదాంగో వేదనాదః వినుత సురపతి ర్దేవ రూపః పరేశః ‘’శ్రీ గోదాస్తవం’’నుండి ఒక ఉదాహరణ
‘’కనక లతికా స్నిగ్ధం ముగ్దాంబుజాయతలోచనా –మమృత లహరీ భోగ్యం యోగ్యం మురారి మహో రసః ‘’
అప్పలదేశికులు ఎన్నో తిరునామాలు, మంగళ హారతులు సంస్కృతాంధ్రాలలో రాశాడు .శ్రీ వైష్ణవులలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి .
10-దశకుమార కదాసార కర్త -అప్పయా మాత్య (15శతాబ్దికి పూర్వం )
దండి దశకుమార చరిత్ర కు శ్లోక రూపకావ్యమే అప్పయామాత్యుని ‘’దశ కుమార కదా సారం ‘’.ఇది మూడు పరిచ్చేదాలలో ఉంది .199అనుష్టుప్ శ్లోకాలో రాశాడు .ఇందులోని అయిదు భాగాలు మూడు పరిచ్చేదాలుగా మలిచాడు .రాజవాహనుని చరిత్రతో పూర్తీ అవుతుంది .మొదటి పరిచ్చేదం లో మొదటి భాగం లోని పూర్వ పీఠిక ఉంది .రెండవ పరిచ్చేదం లో రెండు నాలుగు భాగాల కద ఉంటుంది .మూడవ దానిలో అయిదవ భాగ కద ఉంది .కవిత్వం సరళంగా సుందరంగా అందంగా ఉంటుంది .కవి పేరుతప్ప మిగిలిన వివరాలు తెలియ రాలేదు .విజయనగర రాజ మంత్రి అయి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .ఆంద్ర నియోగి బ్రాహ్మణుడు అని పేరును బట్టి ఊహ
కావ్యాన్ని ‘’శ్రీ వాగుమాం పరం శాంత మేక వీరం మహేశ్వరీం-సంపత్సంహిత్య సౌభాగ్య సమ్యక్ సిధ్యర్ధ మర్యయే ‘’అని మొదలు పెట్టాడు .ఆయనే చెప్పినదాన్ని బట్టి కవి సనాతన ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు .ఏకవీరా దేవి భక్తీ కాకతీయుల కాలం లో ఎక్కువగా ఉండేది .ఆకాల సాహిత్యం ,శాసనాలు దీనికి రుజువు .ఖచ్చితం గా మనకవి ఫలానా కాలానికి చెందినవాడు అని చెప్పలేముకాని 15శతాబ్దికి పూర్వం ఆని చెప్పచ్చు .సాంద్రమైన దశకుమార చరిత్రను అతి సరలాఆ భాషలో రాశాడు అప్పయామాత్య .మధురపదజాలం ముగ్ధ మనోహరంగా ఉంటుంది .కావ్యం చివరలో
‘’రమ్య కాంతేగృహే సార్ధం ప్రియయా రాజవాహనః –విహారన్ వల్లభ్యసుగోస్టచామాభ్య రదనా పూర్వక మేష పృస్టః
చతుర్దశానాం జగతాం ప్రపంచం సంక్షేపతః స్పష్ట ముదాజహార
ఇతి శ్రీ మదప్పయా మాత్య విరచితే దశ కుమార కదా సారే సోమదత్త కధాకధనం నామ తృతీయః పరిచ్చేదః ‘’
11-యదుగిరి భూషణ చంపు కవి-అప్పలాచార్య
శ్రీశైల కుటుంబానికి చెందిన లక్ష్మీ ,రాఘవాచార్యుల కుమారుడే అప్పలాచార్య.తిరుపతి నివాసి .’’యదుగిరి భూషణ చంపు ‘’రాశాడు .యదుగిరి అనే మెల్కోటే అనే వైష్ణవముఖ్య క్షేత్ర పవిత్రతను ఇందులో వర్ణించాడు .గీర్వాణా౦ ద్రాలలో గొప్పకవి .వీర రాఘవ శిష్యుడు .కవికాలం తెలియదు .కావ్య ప్రారంభ శ్లోకం –
‘’శ్రీమానబ్జాభవాదిమస్తక తటన్యస్తప్రశ స్త ప్రభా –వాస్తుస్నిగ్దా చిరత్న రత్న మకుటా సంగో లసత్ప్రన్నగః ‘’
గురువు వీరరాఘవుని పై చెప్పిన శ్లోకం చూద్దాం –
‘’శ్రీ భాష్యామృత పూరితం గురుతరం శ్రీ వైష్ణవైశ్చాతకైః-నిత్యం సేవితమాత్మ సస్యాని కరనాత్యంతతాపోద్రుతాం –దిన్వంతమ్రసవత్తయా హృది భజే శ్రీ రాఘవా స్వామినం ‘’
చివరి శ్లోకం -‘’సాదురన్న హృదయ౦గమోజ్జ్వలం భాను కూటనిభనాయకో జ్జ్వలం
మాననీయ గుణ బంధ పోషణం రాజతే యదుగిరీశ భూషణాం’’.
ఆశ్వాశా౦త గద్య లో –‘’ఇతి శ్రీ త్సేందవ కన్దరదేవా లబ్ధ సంస్కృతాంధ్ర భాషా చతుర్విధ కవితా ధురంధరస్య ,శ్రీ వేంకటాద్రి నివాస చరన కమల కిమ్కరస్య ,శ్రీ మద్వీర రాఘవ గురు చరణనీరజ భ్రున్గస్య శ్రీ శైలాన్వాయ దుగ్ధ సింధు జస్య ,శ్రీ రాఘవార్య తనూజస్య ,శ్రీ లక్ష్మీ గర్భ శుక్తి కా మణోరప్పలాచార్యస్య ,క్రుతిషు యదుగిరి భూషణాఖ్యం చంపూ కావ్యం సమాప్తం .
12-ప్రహసన కర్త -బొమ్మకంటి అయ్యలనాధుడు (17వ శతాబ్దం )
బొమ్మకంటి అయ్యలనాధుడు లేక తిరుమలనాధుడు ‘’కుహనా భైక్షవ ప్రహసనం ‘’రాశాడు.దీనిని రాజ శేఖర పట్టణం లో స్వామి గోపికా రమణుని ఉత్సవాలలో ప్రదర్శించే వారు .ముస్లిం నాయకుడు అహ్మద్ ఖాన్ వేశ్య చంద్ర లేఖ పై వ్యామోహాన్ని ఎండగట్టే వ్యంగ్యాత్మక రచన .ఇందులో ఒలికే హాస్యాన్ని చవి చూద్దాం.
‘’వేదనామ మ్రుతప్రదాన సమయే సంప్రాప్తకాంతక్రుతిః-లీలావిక్రమ వల్గితస్తన భరే భాస్వద్విభూషావలిః
సాన్తర్హస్వవచః ప్రపంచ తురస్నిగ్దా ల్లసా లొకనైః-పశ్యన్నాస వవంచితా సుర గణోనారాయణః పాతునః ‘’
సూత్ర దారికి నటి కి మధ్య సంభాషణలలో రచయిత గురించి కొంత తెలుస్తుంది .చివరలో షండ భిక్ష సంభాషణ ఉంటుంది .
షండ-‘’భో భో గృహాంతరాలస్తితా చంద్ర లేఖా కుపితోతిగ్రుహాన్నిర్గతో హ్మదుఖానః –తదదా భవద్విర వహితైః స్థాతవ్యం
భిక్షు –వత్స కోయమాను రణానమివాహ్మదుఖాన ఘంటాయః ‘’ఈభాషణం లో ఖాను మోహించింది చంద్ర లేఖ అని తెలుస్తుంది
తెలుగులో కూచిమంచి జగ్గకవి రాసిన ‘’చంద్ర లేఖా విలాపం ‘’మన అయ్యలనాదునికి ప్రేరణగా కనిపిస్తుంది .ముస్లిం పాలకులు ఆంధ్రాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత రాయ బడిన ప్రహసనం గా దీన్ని భావిస్తారు .కనుక అయ్యలనాధుడు 17వ శతాబ్దికి చెందిన వాడని చెప్ప వచ్చు .బొమ్మకంటివారు గొదావరీ తీరంలోని తెలగాణ్యబ్రాహ్మణులు . ఇదే ఇంటిపేరుతో ఖమ్మం జిల్లాలో నియోగులు కూడా ఉన్నారు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 19-11-15-ఉయ్యూరు