నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)
అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦ పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం
అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కున్జరుడు .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి కొత్తవారినేవ్వరినీ ప్రోత్సహించానివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వె ల్లాలకవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగా రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,శృంగార శేఖర భాణంకూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డి త్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .
భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం చారు చంపూ ప్రబంధం ”.
అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చవర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .
ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యాప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –
”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేతశ్రుమ్ఖలితం
రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-15 -కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్