నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
17-కవి కు౦జరుడు (1235)
అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుని శిష్యుడే కవి కుంజరుడు.అంటే కవులలో మద గజం అని అర్ధం .రాజ శేఖర చరిత్ర నీతిబోధక కావ్య నిర్మాత .దీనికే ‘’సభా రంజన ప్రబంధం ‘’అనే పేరుంది .కమ్మని కధలు చెబుతూ నీతి బోధ చేశాడు .ఇవి రాజశేఖర రాజాస్థాన కధలే .వీటిని రాజు సుబుద్ధికి వివరించాడు .కుంజర కవే అభినవ కాళిదాసు రాజశేఖరుని ఆస్థానకవి అని చెప్పాడు .రాజశేఖరుడు పినాకినీ తీర విద్యానగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు .కుంజర కవికావ్యానికినారాయణుడు వ్యాఖ్య రాశాడు .
కావ్యారంభం చేసినాక రాజుకు భా౦డవ్యుడికి జరిగిన సంభాషణ ఉంటుంది .
రాజు –స్కందే కృషీవల హలం కలయన్ క యాసి ?
భా౦డవ్య –గచ్చామి తే నికటమేవ విభో
రాజ –కిమర్దం ?
భాండవ్య—హ హంత కర్షణ పరాస్తవ వైరి భూషః
రాజ –(గద్యం నితంత సంతుష్ట స్తస్మే నిజ కర్ణా గతేస్వ కుండలే ప్రయచ్చత్
ఆశ్వాసాంత గద్యలో ‘’ఇతి శ్రీ కవి కుంజర కృతౌ రాజ శేఖర చరిత్రే సభా రంజన ప్రబందే ప్రధమోల్లాసః ‘’
కవి కుంజర ఇందులో 28కధలు 1-దుర్జయ 2-సూక్ష్మమతి 3-సారంగా 4 దైవజ్న వల్లభ 5 సోమ 6 కామలీల కవ యిత్రి 7 కాశీపతి 8 సానంద 9-రత్నాకర 10 కుటుంబ కవి మొదలైన శీర్షికలు పెట్టి కధలు వివరించాడు .ఈ పేర్లు అన్నీ అసలైన వో కాదో తెలియదు .కై ఇందులో శ్రింగార శేఖర ,మందర ,లలితపాల ,శ్రీకామ కమలాకర మొదలైన వారు అభినవ కాళిదాసు నేతృత్వం తో తమకు జరుగుతన్న అన్యాయానికి గాను దుర్జయుని దెబ్బ తీశారు .రాజుకు దుర్జయుని దురాలోచన తెలిసి బహిష్కరించాడు .
కుంజర కవి వెల్లాల కవి శిష్యుడు కనుక ,రామచంద్రకవి తరువాతి వాడుకనుక కాలం 1235 గా చెప్పవచ్చు .కవికి వచ్చిన బిరుదేకాని అసలు పేరు వేరుగా ఉండిఉంటుంది .రాజ శేఖరుని సమకాలీన రాజులు రాజేంద్ర చోళుడు ,పాండ్య రాజు విజయ వర్మ ,మాల్వలోని దారానగర రాజు ,సింహళ పాలకుడు ,కొంకణేంద్రుడు హూణ క్షోణిధరుడు మొదలైన వారున్నారని తెలుస్తోంది .దీనిని బట్టి చూస్తె అభినవ కాళిదాసు భోజరాజాస్తానకవి అనిపిస్తాడు .అక్కడినుండి రాజశేఖరుని ఆస్థానం చేరి ఉంటాడు .ఇవన్నీ ఊహాగానాలే .చారిత్రిక సత్యాలుకావు .వెల్లాల కవి భోజ రాజ ఆస్థానకవి అనటం అసంబద్ధమని పిస్తుంది .రాజ శేఖరుని దగ్గరకు రాకముందు మరొక దక్షిణ దేశ రాజు ‘’పుణ్య కోటి’’ ఆస్థానం లో ఉండేవాడినని ‘’అభి కవి ‘’స్వయంగా రాసుకొన్నాడు .కనుక కవి కుంజరునిరాజ శేఖర చరిత్ర ,రామ చంద్ర కవి ‘’ప్రక్రియ కౌముది ‘’కి తరువాత నే రాయబడింది అని అర్ధమౌతోంది .
18-కవి రాక్షసుడు (11 -13 శతాబ్దం )
గొప్ప లక్షణ గ్రంధ కర్త అని 14వ శతాబ్ది తర్వాతి తెలుగు లాక్షణికులు వ్యాకరణ కర్తలు ,అలంకార శాస్త్ర రచయితలూ . కవులచేత ప్రశంసి౦ప బడిన కవి రాక్షసుడు మహా కవి బహు గ్రంధ రచయిత.ఇతని రచనలు –కవి రాక్షసీయం ,ఆది నారాయణ చరిత్రం ,అనే తెలుగు రచనలు ,కవిరాక్షసీయం అనే ద్వ్యర్ధి కావ్యం ,సదార్ధ నిర్ణయం అనే నిఘంటువు సంస్క్రుతం లో రాసినట్లు చెప్పబడ్డాడు ..ఆంద్ర కవులు ఇతనికాల౦ 11-13శతాబ్దాల మధ్య అన్నారు .దాక్షారం నివాసి అన్నారు .రాక్షస నిఘంటువులో 67శ్లోకాలు మాత్రమె ఉన్నాయి .అసలు పేరు కాక బిరుదనామమే కవి రాక్షసుడు ‘ఈ బిరుదు రావటానికి కారణం కవే చెప్పాడు –
‘సాక్షరేషు భవతీహ జగత్యం సర్వ ఏవ హృది మత్సర యుక్తః –సాక్షరం కవి జనేషు తమేనం లోక ఏష ‘’కవి రాక్షస మహా ‘’
కవిరాక్షసీయం పై నాలుగు వ్యాఖ్యలున్నాయి .1-నాగ నారాయనుడి ‘’సిద్ధార్ధ దీపిక ,తెలుగుకవి లోకనాదుడురాసిన వ్యాఖ్యానం కాక అజ్ఞాత రచయితలవి మరో రెండున్నాయి .
కవి రాక్షసీయం 105 శోకాల గ్రధం .ప్రతి శ్లోకానికి రెండు అర్దాలుంటాయి .అందులో మొదటిశ్లోకం
‘’గుణ దోషో బుదో గృహ్నాన్ ఇందు క్ష్వేలా వివేశ్వరః –శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చాతి’’
చివరి శ్లోకం
‘’మహాన్ స ఏవ పురుషో యస్య సత్యానురోదినః –ఆక్షిప్త పారిజాతేన బాహునా రక్ష్యతే జగత్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11 15 –ఉయ్యూరు