గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 27-ఉదయ రాజు గంగాధర కవి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

27-ఉదయ రాజు గంగాధర కవి

దత్తాత్రేయ చంపు రాసిన ఉదయ రాజు దత్తాత్రేయుని కుమారుడే’’మద్ర కన్యా పరిణయ చంపు  ‘’రచించిన గంగాధర కవి . ఇతని కొడుకు లక్ష్మణ భోజరాజు అసంపూర్తి ‘’ రామాయణంచంపు  ‘’పూర్తీ చేశాడు .కరీం నగర్ జిల్లా శనిగరం నివాసి .నియోగి బ్రాహ్మణుడు ఇప్పటికీ ఈకుటు౦బం వారు కరీం నగర ,వరంగల్ జిల్లాలో ఉన్నారు .

‘’మద్ర కన్యా పరిణయం ‘’5 ఉల్లాసాల కావ్యం .శ్రీకృష్ణుడికి బృహత్సేనుడి కుమార్తె లక్ష్మణకు జరిగిన వివాహ వృత్తాంతం ఇది .కావ్యాన్ని కవి –‘’కళ్యాణ మవ్యహతమాతనేతు సంవ్యాన లీలా క్రుద భూద్రజస్యః-కర్ణానిలేనాహృతేంశు కాంతే,యో వల్లభాయాఃస్మిత పల్లవేన ‘’అంటూ ప్రారంభించాడు .తన తండ్రి దత్తాత్రేయ గురించి కొంత చెప్పాడు .కావ్యాన్ని పూర్తీ చేస్తూ –

‘’నందావా నిందావా మత్క్రుతి రేషాద్యయత్క్రుతోత్పన్నా –శైశవ వాణీవ పితుః నంద తనూజస్య నందినీ భూయాత్ ‘’

28-మహా మహోపాధ్యాయ మానవల్లి గంగాధర శాస్త్రి (1854-1914)

19వ శతాబ్దం లో మహా పండితకవి అని పించుకొన్న మానవల్లి గంగాధర శాస్స్త్రి సింహ శాస్స్త్రి కుమారుడు  కర్ణాటకలోని బెంగుళూరు దగ్గర యాసర గుట్ట లో 1854లో జన్మించాడు .తండ్రితో బాటు కాశీకి కుటుంబం వలస వెళ్ళి’’కావ్యాత్మ సంధానం’’రాశాడు తండ్రి దగ్గర ,రాజా రామ శాస్త్రి ,బాలశాస్స్త్రి ల వద్ద విద్య నేర్చాడు .1879లో కాశీ కాలేజిలో 25ఏళ్ళకే సంస్కృత ఆచార్యుడయ్యాడు 1887లో విక్టోరియా రాణీ జూబిలీ మహోత్సవాలలో మహా మహోపాధ్యాయ బిరుదు పొంది సన్మానం అందుకొన్నాడు .1914లో మరణించాడు  గంగాధరుని ఏడుగురు శిష్యులూ మహా మహోపాధ్యాయ బిరుదాన్కితులవటం ఆ గురువు విద్యా పాటవానికి మహా గొప్ప ఉదాహరణ .

గంగాధర శాస్త్రి –‘’వాక్య పదీయం ,’’వైయాకరణ సిద్ధాంత కౌముది ‘,ప్రౌఢ మనోరమ ,’’,శబ్ద రత్న ,’’,శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’,తత్వ బిందు ‘’,న్యాయ మంజరి ‘’,గౌతమ న్యాయ సూత్రాలు ,జైమిని మీమాంస సూత్రాలు ,కుమారిల భట్టు ‘’తంత్ర వార్తిక ‘’,లౌకిక న్యాయ సంగ్రహం ,జగన్నాధుని రసగంగాధారం వంటి ఉద్గ్రంధాలకు సంపాదకత్వ బాధ్యత త్తీసు కొన్నాడు

స్వయంగా ‘’అలి విలాసి  సంలాప’’గంగాధర శతకం ,తనగురువులైన రాజారామ శాస్త్రి ,బాల శాస్త్రి ల జీవిత చరిత్రలు రాశాడు .ఇన్నిటిలో లభ్యమైనది ఒక్క ‘’అలి విలాసి సంలాపం ‘’మాత్రమె .ఈ ఖండ కావ్యం లో 9 శతకాలున్నాయి .వెయ్యి శ్లోకాల సమాహారం .దీన్ని 1908లో రాసినట్లు చెప్పాడు .అనేక విభిన్న విషయాలను వీటిలో చెప్పాడు .తన ఉద్దేశ్యమేమిటో ఉపోద్ఘాతం లో చెప్పాడు .మొదటి శతకం శివుని గూర్చి చెప్పినది .-‘’విద్యా విద్యాత్ ఏవ యత్ర సతతం వేద్యో యో రాగిణాం-యమ వైద్యం మనసా ప్రపద్య విషత్యయా లేష్వభీకా బుధాః’’మంచి ఆలోచన రేకెత్తించే సుందర శ్లోకాలురాశాడు .-‘’సఫల్లవా న్తాంతవనోప యుక్తా మనర్హ పుష్పా వసరాభి సారం –శ్రితాం సుసంపన్నరవంశకుంతే  రిచరాత్త తారుణ్య ఫలామిమాందికం ‘’

గంగాధర కవి రాసిన ‘’హంసాస్టకం ‘’కు సోదరుడు రామశాస్త్రి తైలాంగ్ వ్యాఖ్య రాశాడు .ఇందులో శివునిపై ఉన్న మంచి శ్లోకం ఒకటి

‘’యః షండ వక్త్ర గజాననా ద్భుతా విష్కారణావ్యంజితా—అచిన్త్యో త్పాదన వైభవాం గిరి సుతాం మాయాంనిజంకే దధత్ ‘’

ఈ అష్టకం లో రెండు అర్ధాలు వచ్చేటట్లు రాశాడు హంస అంటే మానస సరోవర హంస అని ఒక అర్ధం ,హంస అంటే ఆత్మ అని మరో అర్ధం రెండినీ సమన్వయము చేస్తూ ప్రతిభావంతంగా రూపొందించాడు .ఇందులోని రెండు శ్లోకాలు చూద్దాం –

‘’బ్రహ్మాహం సత్స్వ రూపం చితి సుఖ మవిదన్ మాయయా క్షిప్య మాణా-తత్సంప కాన్రిపత్యై శరణ ముప గతః సద్గురూం జ్ఞాత వత్వం ‘అని మొదలుపెట్టి –

‘’శ్రావం శ్రావం తదుక్తిస్చిర తర మననా పాస్తదుస్తర్క జాలః –సాక్షాత్కారైక శోషా ద్విగలితనిఖిలోపప్లవో హంస ఏవ ‘’

ఆసుకవిగా ప్రఖ్యాతుడైన గంగాధర శాస్త్రి ఉత్తర భారతం లో ఎన్నోసంస్కృత  శతావధానాలు నిర్విఘ్నం గా నిర్వహించి కీర్తి గడించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.