దైవ చిత్తం -2
(శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం )
మొదటి అధ్యాయం –మన విశ్వ దృశ్యం
మొదటిపేజీ –మొదటిపేరా
‘’బహుశా ప్రముఖ సైంటిస్ట్ బెర్ట్రాండ్ రసెల్ అనుకొంటా ఒక సారి ఖగోళ శాస్త్రం పై ఉపన్యాసం చేశాడు .భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో ,ఎలా సూర్యుడు అనేక నక్షత్ర సముదాయాల తో ఉన్న మన గెలాక్సీ కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తాడో వివరించాడు .ఉపన్యాసం అంతా విని చివరలో ఒక ముసలావిడ ఆయనతో ‘’మీరు చెప్పింది అంతా చెత్తగా ఉంది .ప్రపంచం నిజంగా సమతలం గ ఉండి,ఒక బలిష్ట మైన తాబేలు వీపు మీద ఆధార పడి ఉంది .’’అన్నది .అప్పుడు ఆ సైంటిస్ట్ ఆశ్చర్య కరమైన ఒక చిరునవ్వు చిందించి ‘’అలా అయితే ఆ తాబేలు దేని మీద నిలబడిం దమ్మా?’’అని ప్రశ్నించాడు .దాని కామె ‘’నువ్వు తెలివైన యువకుడివని అర్ధమైంది నాయనా.అదెప్పుడూ కిందనే ఉంటుంది బాబూ ‘’అన్నది చిర్నగవుతో,రసెల్ ను హేళన చేస్తూ విజయ విలాసంగా ‘’.
దీనికి శాస్త్రి గారి వ్యాఖ్యానం –భారత దేశం లో వ్యాపించి ఉన్న ఈ కూర్మావతార విశేష విషయం యూరప్ దేశాలలోకి ఎలా ఎప్పుడు పాకిందో ,ఆమెకెలా తెలిసిందో వింటే ఆశ్చర్యమేస్తుంది .భూమి ఆది కూర్మం వీపు మీద నిలిచి ఉన్నది అనేది మన కు అతి సామాన్యమైన విషయమే .తరతరాలుగా వింటున్నదే .సాహిత్యం లో ప్రాచీనమైనదైన భాగవత పురాణం లో సృష్టి కర్త దశావతారాలను ధరించాడని వర్ణించ బడింది .విష్ణు మూర్తి మొదటి అవతారం లో ‘’బృహత్ మీన రూపం’’ ధరించాడు .మీనం అంటే చేప .చేప కు పురాణాలు ‘’ధి ‘’ అనే సంజ్ననిచ్చాయి .ఆటే వివేకానికి చేప ప్రతీక అన్నమాట .విష్ణువు లేక సృష్టి కర్తకు శత్రువైన సోమకాసురుడు వేదాలను అపహరించి ధ్వంసం చేయ బోతే వాడిని చంపి వేదోద్ధరణ చేశాడు .అంటే బుద్ధి లేక వివేకం నశించకుండా రక్షించాడు .
రెండవ అవతారమే ‘’మహా కూర్మావతారం ‘’ దీని అవసరానికి సంబంధించిన ఒక కధ పురాణాలలో ఉంది .దైవానికి ఇస్టు లైన దేవతలు ,ఆయనకు శత్రువులైన అసురులు అనాదిగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు .ఇరువైపులా ఈ అనంతకాల యుద్ధం లో లెక్కకు మించి చనిపోయారు .చనిపోయిన దేవ, రాక్షసులను పునర్జీవితులను చేసే ఔషధం వైద్య విధానం అప్పటికి ఇంకా రాలేదు .దీనికోసం ఇరువైపులవారు సంప్రదించుకొని ,రాజీ పడి పాల సముద్రాన్ని మధిం ఛి చావు లేని అమృతాన్నిపొందటానికి అంగీకరించారు .మధించే కవ్వం గా మంధర పర్వతాన్ని ,మహా సర్పమైన వాసుకిని రజ్జువు అంటే త్రాడుగా ఎంచుకొని క్షీరసాగర మధనం ప్రారంభించారు .పర్వతం బరువు వల్ల సముద్రం లోకి కుంగి పోతోంది .ఏం చేయాలో తెలీక విష్ణువును ప్రార్ధిస్తే ,ఆయన కూర్మ రూపం ధరించి తన వీపు మీద మందరాన్ని ఆని ఉండేట్లు చేయించి మళ్ళీ చిలకటం ప్రారంభించమన్నాడు .ఇలా అమృతం సంపాదించటానికి ‘’వారింగ్ గ్రూప్స్ ‘’ఏకమై నాయి .ఆ తర్వాత హాలాహలం ,చింతామణి కల్ప వృక్షం చివరికి అమృతం రావటం మనకు తెలిసిన కధ యే .
ఇంతవరకు బాగానే ఉంది .ఈ పురాణ కధ ఐరోపా దేశానికి చేరిందని తెలిసి మనకు ఉత్సాహం గానే కాక ఆశ్చర్యం గా కూడా ఉంది .ఎప్పుడు ఎలా అక్కడికి చేరిందో తెలీదు మనకు .డేవిడ్ ఫ్రాలీ ,శుభాష్ కాక్ లు తమ ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ క్రేడిల్ ఆఫ్ సివిలైజేషన్ –(నాగరకత ఉయ్యాల అన్వేషణ కోసం ) అనే పుస్తకం లో ఈ కధతో బాటు మిగిలిన మన పురాణ గాధలు ఇండియానుండే యూరప్ చేరి ఉండ వచ్చు .
ఈ కూర్మావతార గాధ ప్రతీకాత్మకమైన కాస్మిక్ (అంతరిక్ష ) కధ .ఇందులో స్థిరరమైన సృష్టి పరిణామ సంఘటన నిక్షిప్తమై ఉంది .పాల సముద్రం అంటే ఆకాశం లోని నక్షత్ర సముదాయమైన మిల్కీ వే.(పాల పుంత )అని అర్ధం ..మధనానికి తాడుగా ఉన్న వాసుకి సర్పం గమనానికి సహకరించే దీర్ఘ వృత్తాకార (ఎలిప్టికల్)లేక వృత్తాకార మార్గానికి సంకేతం .ఈ పుస్తకం లోనే రా బోయే అధ్యాయాలలో గురుత్వాకర్షణ కంటికి కనిపించని బిందు సముదాయాలచేత పొందే మార్పు అని తెలుసుకొంటాం .మంధర పర్వతం అంటే అయస్కాంత ధృవం లేక మధనానికి సహకరించే పాల పుంత కేంద్రం .మధనం లో వెలువడిన హాలాహలం లేక గరళం ఆటే ఓజోన్ వాయువు .గరళం తర్వాత వచ్చిందే అమృతం అంటే ప్రాణ వాయువైన ఆక్సిజన్ ,నీరు .ఇదీ పాల సముద్రం చిలకటం లో ఉన్న ఆంతర్యం .ఈ కధను ఇంత వివరంగా చర్చించ టానికి కారణం –రాబోయే అధ్యాయాలలో స్టీఫెన్ హాకింగ్ శాస్త్రజ్ఞుడు’’ సృష్టి ఆశ్చర్యకరంగా వింతగా (సింగ్యులారిటి ) ‘’అని చెప్పే సిద్దాంతాన్ని వివరిచటం కోసమే .దీనినే ‘’సింగులారిటిఅన్నాడు .అంటే అంతరిక్షం లో ఒక బిందువు (పాయింట్ ఇన్ స్పేస్ ).అంటే టైం –స్పేస్ కర్వేచర్ (వక్ర రేఖ ) అనంతంగా మారిపోతుంది .స్పేస్ టైం ను వక్ర రేఖగానే భావిస్తారు కాని సరళ రేఖగా కాదు .ఇప్పటి ఈ పురాణ ప్రతీక కధనం సృష్టి,కాల ప్రారంభాలను వివరిస్తుంది .ఇందులో కూర్మాన్ని ఎందుకు ఎంచుకొన్నారు అనే ప్రశ్న రావటం సహజం .అది పైన ఉన్న గుల్ల (షెల్ )వలన గుల్ల నీటిపైభాగాన ఉంచుతూ నీటిలో ఈద గలుగుతుంది.అంతే కాక అది పాల పుంతకు ప్రతీకగా గ్రహించ బడింది .దాని వీపు వక్రంగా ఉంటుంది కనుక స్పేస్ మరియు కాలానికి ఉమ్మడి స౦కేతంగా తీసుకో బడింది . ఈ వక్రత అనంతం అనికూడా భావించే గ్రహించారు .మనం ఇప్పుడు మాట్లాడుకొనే స్పేస్ టైం వక్ర రేఖ రెండు పరిమాణాల(టు డై మన్షనల్ ) యూక్లిడ్ భావనా రేఖా చిత్రం (గ్రాఫ్ ). మహా కూర్మం లేక ఆది కూర్మం వీపు ను ఎంచుకోవటానికి కారణం టైం ,స్పేస్ లు సరళ రేఖా మార్గాలుకావని ,చక్రీయాలు (సైక్లిక్ )అనీ సూచించటానికే అని గ్రహించాలి .ఈ పుస్తకం లోనే తర్వాతి అధ్యాయాలలో ఈ స్పేస్ టైం కర్వ్ చాలా పెద్దదని ,అనంతమైనదని అప్పుడది ఒక సరళ రేఖగా గోచరిస్తుందని చెప్ప బడింది .అంటే స్పేస్, టైం ఒక సరిహద్దుగా ,సరళంగా (లీనియర్)ఉంటుందన్నమాట .వీటికి తగిన సరైన పదాలను ఈ క్రింద వివరించబడినాయి .
పేజీ 46పేరా 2
సైన్స్ లోని అన్ని సిద్ధాంతాలు స్పేస్ ,టైం లు సరళమైనదీ దాదాపు సమతల మైనదీ అన్న ఊహలపై ఏర్పడినవే.ఇవి బిగ్ బాంగ్ ఏకత్వం తో తెగిపోయి అక్కడ స్పేస్ ,టైం వక్రత అనంతం అనే అభిప్రాయం స్థిరరపడింది .
పేజీ -133-పేరా -2
ఈ విశ్వం ఎలా ఆవిర్భ వించింది అని ఊహించి చెప్పటానికి కాలం ప్రారంభం నాటి సూత్రాలు అవసరం .సాధారణ సాపేక్ష సిద్ధాంతం నిజమైతే ,రోజర్ పెన్రోజ్ చెప్పిన సింగ్యులారిటి సిద్దాతాలు,నేను రుజువు చేసిన కాలం ప్రారంభం లో ఒక అనంత సా౦ద్రత ,అనంత వక్ర రేఖలో ఒక బిందువు .ఈ పాయింట్ దగ్గర సైన్స్ కు సంబంధించిన సకల సూత్రాలు ఆగిపోతాయి (బ్రేక్ డౌన్ ) .
శాస్త్రి గారి వ్యాఖ్య
భారతీయ పురాణ కధనం ప్రకారంమహా కూర్మంలేక ఆది కూర్మం అంటే తాబేలు జీవులన్నిటిలో ఎక్కువ ముసలిది అదే స్పేస్ –టైం లకు ప్రతీక .అదే సృష్టి ప్రారంభానికి నాంది .స్పేస్ ,టైం లుఒక సరళ రేఖ కాక పొతే ,భూమి సరళ రేఖగా ఉన్న త్రిభుజా కార మంధర పర్వతం కూర్మం వీపుపై స్థిరంగా నిలబడేదికాదు .మధనానికి వీలు కలిగేదీకాదు .ఈ కధలో ఇన్ని ప్రతీకలున్నాయి .ఈ ప్రతీకల నాధారంగా మన పురాణాలు వేద విజ్ఞానాన్ని కదా రూపాలలో కరతలామలకం చేశాయి .వివరించే చెప్పే సామర్ధ్యం ఉన్న వారుంటే అంతా జుర్రుకొనే జుంటి తేనే .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-15కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్