(శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం
పేజి -11,పేరా-
కనుక అందుకని ప్రారంభ దశ కు చెందినసూత్రాలు ఉన్నాయి .
వ్యాఖ్య –పదార్ధ విషయం లో భారతీయ వేద భావాలకు ఇది తక్కువ స్థాయి లో కనిపిస్తుంది .పురాణాల ప్రకారం సృష్టి కర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ వేద విధి ననుసరించి సకల సృష్టినీ చేశాడు .ఆయన భూమిని సృస్టించ బోయే ముందు ‘’భూ ‘’అనే శబ్దాన్ని ప్రవచించాడు .అంతే -భువి సృష్టింప బడింది . బ్రహ్మ చేసే సృష్టికి ముందే భూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ?అనే సందేహం రావటానికి అవకాశం ఉంది . వేదాలు సార్వకాలికమైనవి అని వేదం చెప్పింది .అంటే వేద సూత్రాలు బ్రహ్మకు ముందే ఉన్నాయన్నమాట .బ్రహ్మ వాటిని పునశ్చరణ చేసుకొని ,సృష్టికార్యం యదా ప్రకారం చేశాడు .దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి ?అంటే జ్ఞానానికి స్పేస్ ,టైం లు విధేయత కలిగిగి ఉంటాయని (సబార్డినేట్ ).వేద పరిభాషలో జ్ఞానం అంటే భగవంతుడే .జ్ఞానం లేకుండా కాలం అనేది ఎప్పుడూ ఉండదు ,లేదు కూడా .అది కాలాతీతం భూత వర్తమాన భవిష్యత్ లన్నిటిలోనూ జ్ఞానం ఉంటుంది .దీనినే వేదం ‘’సత్యం ‘’అన్నది .’’సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ‘’అని ఉపనిషత్ చెప్పింది .అనంతమైన జ్ఞానమే పరమ పురుషుడు .ఆయన త్రికాలాలలోను ఉంటాడు అని వేదం యే అనుమానాలకు తావు లేకుండా పేర్కొన్నది .
పేజి 12,పేరా -2
ఇప్పుడు విశ్వం ఏక పక్షమైనది సర్వసత్తకమైనది (ఆర్బిట్రరి ),అది కొన్ని నిర్దుష్ట సూత్రాలకు లోబడి పని చేస్తుందని ,చివరికి పాక్షిక సిద్ధాంతాలను ,పూర్తీ గా ఏకరీతి సిద్ధాంతంగా మార్చి అధ్యయనం చేస్తేనే ఈ విశ్వం లో ఉన్నది అంతావర్ణించి చెప్పటానికి వీలవుతుంది .
శాస్త్రి గారి భాష్యం – ఈ ఏకీకృత సిద్ధాంతం రాబట్ట టానికి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధన తార్కికమైనదీ ,సా౦కేతిక పరమైనదీమాత్రమె అవుతోంది. ఈ యూని ఫైడ్ దీరీ (ఏకీకృత సిద్ధాంతం )సృష్టి ప్రారంభాన్ని,సృష్టి అంతాన్నివివరించటానికి బిగ్ బాంగ్ ,బిగ్ క్రంచ్ సిద్ధాంత౦ శరణు జొచ్చారు .భారతీయ వేదాంతం సృష్టికి కారణ భూతమైనదేమిటో(జగత్కారణం ) వివరంగా చెప్పింది .అన్ని సిద్ధాంతాలను కలిపి ఏక సిద్ధాంతాన్ని చేసి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలను చెప్పింది .సృష్టి ప్రారంభానికి ముందు ఎలా ఉన్నదో ,సృష్టి చేస్తే యే విధంగా కనిపిస్తుందో ,సృష్టి అంతం అయితే ఎలా దర్శన మిస్తుందో అన్నీ క్రిస్టల్ క్లియర్ గా వివరించారు .ఇదే అద్వైత సిద్ధాంతం .సృష్టికి ఆరంభం అనేదికాని అంతం అనేది కాని లేదు అని అతి సాధారణ మైన మాటలలో సుస్పష్టంగా వివరించి ఎరుక పరచింది అద్వైత సిద్ధాంతం .సృష్టి ప్రారంభం ,తుది అనేవి మన లౌకిక ద్రుష్టి లో మాత్రమె కనిపించే విషయం అన్నది .భగ వంతుడు లేక పరమాత్మ ఈ విశ్వంరూపం లో దర్శనమిస్తాడు అన్నది పరమోత్క్రుస్ట భావన .
ఈ విశ్వాన్ని చూస్తూ దేవుడిని చూస్తున్నాము అని భ్రమ పడుతున్నాం .ఇదే సృష్టి అనుకొంటున్నాం.దీన్నే రజ్జు –సర్ప భ్రాంతి అంటున్నారు .తాడును చూసి పాము అని భ్రమ పడటం అన్న మాట .తాడు మార్పులేని నిర్వికారమైనది .కాని పాముకు ఆది అంతాలున్నాయి . ఇలా భ్రమ పడటమే వేదాంత పరిభాషలో’’ అవిద్య’’ అంటారు .ఇంద్రియ నిగ్రహం కలిగి చూస్తె ఏకాత్మ భావన కలిగి విశ్వం పరమాత్మ దర్శన మవు తుంది దీనికి సాధన కావాలి .ఈ సర్వ సృష్టిగా భాసించే భగవంతుడు కాలాతీతుడు ,అనంతుడు ,అవినాశి ,ఆనంత శక్తి సంపన్నుడు .కనుక సృష్టి ప్రారంభ ,అంతాలపై కలిగే ప్రశ్నలన్నిటికీ ఇదే అత్యుత్తమమైన సమాధానం .
రెండవ అధ్యాయం –స్పేస్ అండ్ టైం
పేజీ -18,పేరా -2
నిజానికి న్యూటన్ శాస్త్రజ్ఞుడు ఆబ్సల్యూట్ స్పేస్ లేదు అన్నదాన్ని తిరస్కరించాడు .కాని అయన సూత్రాలలో ఇది ఇమిడే ఉంది .కానికాదంటాడు .ఈ రకమైన అతార్కిక నమ్మకానికి అందరూ ఆయన్ను ఖండించారు .అ౦దులో ముఖ్యంగా వేదాంతి ,భౌతికంగా కనిపించే వన్నీ ,స్పేస్ ,కాలం అన్నీ భ్రాంతి పూర్వకమైనవే అని నమ్మిన బిషప్ బర్క్లీ తీవ్రంగా విరుచుకు పడ్డాడు .
శాస్త్రిగారి వ్యాఖ్యానం –బిషప్ బెర్క్లీ ఒక్కడే పాశ్చాత్య వేదా౦తులలో భారతీయ వేదాంత భావన అయిన ‘’మాయ ‘’ను గుర్తించిన వాడు .ఈ భావన 2,500సంవత్సరాల కిందటిదే .పంచేంద్రియాలతో మనం చూసే ఈ దృశ్య ప్రప౦చం అంతా అసలైనదికాదు అనేది మాయా సిద్ధాంతం లో ముఖ్యమైన విషయం .అదొక భ్రాంతి అంటుంది .అసలు సత్యాన్ని దర్శించాల౦టే మామూలు భౌతిక జీవనం జీవించే వారికి సాధ్యం కాదు .ఇంద్రియాలను వశ పరచుకొని ,మనసును స్థిరంగా ఉంచి చూస్తేనే ఏకాత్మ భావన కలిగి సర్వం ఖిల్విదం బ్రహ్మ అనే ఎరుక కలుగుతుంది .పాపం న్యూటన్ మహాశయుడు గణిత ద్రుష్టి కోణం లో చిక్కుకొని సమస్యను పరిశీలించటం వలన సత్య దర్శనం చేయ లేక పోయి ఉండవచ్చు .సృష్టికి భిన్నమైన సృష్టి కర్తను చూడలేక పోయాడు .అందుకే ఆబ్సల్యూట్ గాడ్ ను నమ్మాడు .బర్క్లీ వేదాంతి కనుక ఈ పరిధి దాటి ఆలోచించి యదార్ధాన్ని చెప్పగలిగాడు .ఈ విశ్వం సరిహద్దులు లేని అనంతమైనది .అందులో ప్రతి బిందువు విశ్వానికి కే౦ద్రమే .విశ్వం లో స్పేస్ లో టైం లు ఒకదానికొకటి పెనవేసుకొని పాయింట్ ఆఫ్ సింగ్యులారిటీ ని తెలియ జేస్తాయి .
పేజి -19,పేరా -3
గాలిలో శబ్ద తరంగాలు వ్యాప్తి చెందినట్లు కాంతి తరంగాలు ఈధర్ లో ప్రయాణం చేస్తాయి .వీటి వేగం ఈధర్ కు సాపేక్షం గా ఉంటుంది .
శాస్త్రి గారి భాష్యం –ఈథర్ సిద్ధాంతాన్ని అయిన్ స్టీన్ లాంటి ప్రముఖ శాస్త్ర వేత్తలు ప్రక్కన పడేసి చాలా కాలమైంది .శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణం చేస్తాయి అన్న విషయం వేద సాహిత్యం లో ఉండనే ఉంది .మనకు కొత్తదేమీ కాదు .భారతీయ అతిప్రాచీన తర్క శాస్త్రం (లాజిక్ )లో శబ్దం ఆకాశం యొక్క (స్పేస్ ) గుణం అని ఉంది .అంటే ఆకాశం శబ్ద తరంగాలను సృష్టిస్తుంది , .పంచ భూతాలలో ఒకటి అయిన ఆకాశం (స్పేస్ )తర్వాత సృష్టింప బడిన ది గాలి అనే మరో భూతం .ఇదే శబ్దాని కి వాహకం గా ఉండిశబ్ద తరంగాలను ఆకాశం ద్వారా ప్రసారం చేస్తుంది .ఈవిషయాన్నే ఉపనిషత్ ‘’ఆకాశాద్వాయుః వాయోరగ్నిః ‘’అని చెప్పింది అంటే ఆకాశం నుండి వాయువు అంటే గాలి ,గాలి నుండి అగ్ని సృష్టింప బడినాయి అని అర్ధం .
పేజి -20,పేరా -2
ఏమైనా 1905లో ఒక ప్రముఖ పత్రిక ఇప్పటిదాకా ఎవరికీ తెలియని స్విస్ పేటెంట్ ఆఫీస్ లో పని చేసే గుమాస్తా ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ఈధర్ అనే మొత్తం భావన ఆనవసరం అనీ దీనీతో ఆబ్సల్యూట్ టైంఅనే అభిప్రాయాన్ని పరిత్యజించాలి (అబా౦డన్ )అని సూచించాడు .
శాస్త్రిగారి వ్యాఖ్య –వేద భావన లో కాలం ఆబ్సల్యూట్(పరిపూర్ణం ) కాదు .భారతీయులు కాని పాఠకులు విష్ణు మూర్తి అనంతుడని పిలువబడే ఆది శేషుడు అనే పాము తల్పం పైపాల సముద్రం పై శయనించి ఉన్నట్లు ఉండే చిత్రాన్ని చూసే ఉంటారు .ఇక్కడ పాల సముద్రం అంటే ఈ విశ్వమే .అదే అంతరిక్షం లోని పాలపుంత గెలాక్సీ అనే నక్షత్రసముదాయానికి చిహ్నం .శేషుడు కాలానికి ప్రతీక .సంస్కృతం లో శేషం అంటే మిగిలి ఉన్నది అని అర్ధం .సృష్టి అంతా లయం అయినప్పుడు కాలం ఒక్కటే మిగిలి (శేష )ఉంటుందని భావం .భారతీయ దార్శనిక పరిభాషలో కాలం చుట్టగా (స్పైరల్ )గా ఉంటుంది అని సరళ రేఖాత్మకం కాదని చెప్పారు .కనుక ఇక్కడ శేషుడు చుట్టలు చుట్టుకొని ఉండటం దీనినే సూచిస్తుంది .వేద జ్యోతిష సిద్ధాంతం ప్రకారం మన కు ప్రభవ, విభవమొదలైన 60 సంవత్సరాలున్నాయి. అవి ఒక ఆవర్తనం పూర్తికాగానే మళ్ళీ మొదలౌతాయి .అదీ మన ప్రత్యేకత .ఇదే యుగాలు , ,మహా యుగాలు ,కల్పాలు ,విషయం లోనూ జరుగుతుంది .భారతీయ వేద ఖగోళశాస్త్రం సృష్టి ప్రారంభం అంతాలతో కాలం అనంతంగా పునరా వృత్త మౌతుంది .దీనికి తుది అనేది లేనే లేదు .ఎందుకంటె మొదలు అనేది ఉంటేగా అంతం ఉండేది .కనుక సృష్టికి కాలానికి తుది మొదలు అనేవి లేనేలేవు అని నిర్ద్వందంగా భారతీయ ఖగోళ వేద విజ్ఞానం తెలియ జేసింది .కనుక పాశ్చాత్య భావన అయిన కాలం పరిపూర్ణం (ఆబ్సల్యూట్ )అనే దాన్ని భారతీయ వేద శాస్త్రాలు పరిగణన లోకి తీసుకొనే తీసుకోవు .
రచయిత శ్రీ ఎ.సి.పి.శాస్త్రి గారి ఆంగ్ల పుస్తక ముఖ చిత్రం జత చేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-15-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్