దైవ చిత్తం -4
శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం
పేజి 21,పేరా -2
ప్రతి పరిశీలకుడిదడు స్వయం గా తనతో పాటు తీసుకు వెళ్ళిన గడియారం తో కాలాన్ని కొలిచి రికార్డ్ చేసుకోవటం గమనించబడింది .ఈ గడియారాలు ఒకే తీరుగా ఉన్నప్పటికీ అవి రికార్డ్ చేసే కాలాలు ఒకే మాదిరిగా లేవు .
శాస్త్రిగారి విశ్లేషణ –భారతీయ లాజిక్ అనబడే తర్క శాస్త్రం పూర్వమేమనం అనుసరించే గంటలు ,రోజులు మన కను రెప్పల తెరవటం మూయటం లతో ,సన్ డయల్ మొదలైన వాటిద్వారా కనుగొనే వారని తెలియ జేసింది .కాలం ను ‘’విభువు ‘’అంటారు .అంటే అఖండం అని అర్ధం .అన్నం భట్టు రాసిన తర్క సంగ్రహ గ్రంధం లో ‘’అతీతాది వ్యవహార హేతు హు కాలః ,సా చైకో విభు రనిత్యహః ‘’.కాలం జరిగిన ,జరగా బోయే దాని వ్యక్తీకరణకు కారణమవుతుంది .కాని అది అఖండం .సర్వ వ్యాపకం .విభు అంటే అదే .
పేజి 23,పేరా 1
కాలం పూర్తిగా వేరైనది,ఆకాశం కంటే స్వతంత్ర మైంది కాదని ,దానితో కలిసే ఉంటుందని దీనివలననే స్పేస్ టైం అనేది ఏర్పడుతుంది
వ్యాఖ్య –భారతీయ వేదాంతులు కవులు భగవంతుని ఈ కింది విధంగా స్తోత్రం చేశారు –
‘’భగవానుని రూపం అనంతమైన విశ్వం .అది దేశ కాలాల చేత విభజింప బదేదికాదు .దేశ కాలా భేద్యం .ఆత్మతో మాత్రమె పరమాత్మను చూడగలం .అనుభవించగలం .ఆయనను సృష్టిలో కనిపించే ప్రతి ఉత్కృష్ట వస్తువుతో పర్యాయ పదంగా అర్ధం గా భావిస్తారు .భారతీయ సాహిత్యం లో ఈ రెండిటిని కలిపే చెప్పారు .సత్యం పై వారికున్న తపన ఈ రెంటి విషయమై తీవ్ర ఆలోచనకు గురిచేసి దేవుడు వీటికి అతీతుడు అని స్పష్టంగా నిర్ణయించి చెప్పాయి .దీనికి సంబంధించిన భర్త్రుహరి కవి సంస్కృత శ్లోకం –
‘’దిక్కాలా ద్యా నవ చిన్నానత చిన్మాత్రా మూర్తయే –స్వాను భూత్యేక మనయ నమస్సంతాయ తేజసే ‘’
దీని అర్ధం –భగవంతుడు దేశ ,కాలాలకు సంబంధించిన వాడు కాదు.వాటి చేత విభ జింప బడే వాడూ కాదు .ఆయన సర్వ విజ్ఞానానికి మూర్తి మత్వం .ఆయనను ఎవరికి వారు స్వయంగా అనుభవం తో(స్వానుభవం తో )మాత్రమె తెలుసుకొని దర్శించగలరు . జ్ఞానం ,దానికి ఆవలి దానితో మాత్రమె ఈ అనుభూతి పొందగలం .ఆయన భక్తులకు ఆ అనుభవం ,ప్రశాంతి అనుగ్రహించే ఆయనకు ప్రణామాలు .
దిక్-ఆకాశం (స్పేస్ ),కాలం -టైం .ఈ రెండూ వ్యావహారికం లో ఉపయోగ పడేవి .అన్నంభట్టు తంత్ర సారం లో వీటికి చక్కని నిర్వచనాలు చెప్పాడు
కాలం –‘’అతీతాది వ్యావహార హేతు హు కాలహ-సా చికో విభుర్నిత్యః
ఆకాశం (స్పేస్ )దిక్-‘’ప్రాచ్యాది వ్యావహార హేతు హు దిక్.-సా చైకా విభ్వీ నిత్యాచ ‘’
ఆకాశం కూడా అనంతమైనదే –అఖండమే అంటే విభు .మనకున్న 8,లేక 10దిక్కులు మన నిత్య జీవిత వ్యవహారం లో ఉపయోగించేవే .దిక్ కూడా అనంతమే కాదు నిత్యమై శాశ్వతమైనదే .కనుక దేశ కాలాలు అభేద్యమై శాశ్వతమైనవి .కనుక రెండూ వేరు వేరుకాదు .రెండూ ఒక్కటే .ఈ విషయాన్ని మన తర్క పండితులు వేలాది సంవత్సరాల క్రితమే స్పష్టంగా తెలియ జేశారు .
పేజి -28,పేరా -1
‘’ఉదాహరణకు –సూర్యుడు ఇప్పుడు ఈ క్షణం లో ప్రకాశించటం మానేశాడు అంటే ,అది అప్పటికప్పుడు భూమిపైనున్న వస్తువులపై ప్రభావం చూపదు .ఎనిమిది నిమిషాల తర్వాతే దాని ప్రభావం భూమిపై కనిపిస్తుంది .కారణం సూర్య కిరణాలు భూమికి చేరటానికి 8నిమిషాలు పడుతుందని మనకు తెలుసు .అలాగే మన విశ్వానికి అత్యంత దూరం లో ఉన్న గెలాక్సీ ల కాంతి అవి కొన్ని మిలియన్ సంవత్సరాలకు ముందు విడుదల చేసిన కాంతి మాత్రమె అని మనం గ్రహించాలి .సుమారుగా 8వేల మిలియన్ సంవత్సరాల క్రితం కాంతిగా శాస్త్రజ్ఞులు భావించారు .ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం ఎప్పుడో పూర్వం ఉన్న విశ్వం అన్న మాట యదార్ధం .
పేజి 32,పేరా -3
సాధారణ సాపేక్ష సిద్ధాంతం లోని ఒక ఊహ ఏమిటంటే –భూమిలాంటి అతి భార పదార్ధాల వద్ద కాలం నెమ్మదిస్తుంది .కాంతి శక్తికి దాని ఫ్రీక్వెంసి కి (పౌనః పున్యం)కు ఉన్న సంబంధమే దీనికి కారణం .శక్తి పెరిగితే ఫ్రీక్వెంసి పెరుగుతుంది .కాంతి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి క్షేత్రానికి కి పైన ప్రయాణిస్తే ,అది కొంత శక్తిని కోల్పోయి ,దాని ఫ్రీక్వేన్సికూడా తగ్గిపోతుంది .కనుక దీనికి పైన ఉన్నవారికి కింద ఉన్న చోట ప్రతిదీ ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది .
శాస్త్రీజీ భాష్యం –అందుకే మన వేద వేత్తలు భూమి మీది నెల ,సంవత్సరం మొదలైన వాటికీ పిత్రులోక ,దేవలోక వాసుల వారి కాలానికి చాలా తేడా ఉన్నట్లు గమనించి చెప్పారు .భూమిపై ఒక నెలకాలం పిత్రులోక వాసులకు ఒక పగలు ,ఒక రాత్రి మాత్రమె .ఇక్కడి ప్రతి పక్షం అక్కడ రోజులో సగం మాత్రమె .దేవలోక వాసులకు భూలోకపు సంవత్సరం ఒక్క రోజు మాత్రమె .అందుకే పితృ తర్పణం ప్రతి నెలకో సారి ,దేవతల ఉత్సవాలు సంవత్సరానికి ఒక సారి చేస్తారు .
పేజి 33,పేరా -2
న్యూటన్ సూత్రాలు ఆబ్సల్యూట్ పొజిషన్ ఆఫ్ స్పేస్ కు స్వస్తి చెప్పాయి .రిలేటివిటి సిద్ధాంతం ఆబ్సల్యూట్ టైంకు మంగళం పాడింది .ఒకే ఈడున్న ఒక జంట కవలపిల్లలను ఉదాహరణగా తీసుకొందాం .అందులో ఒకడు దూరంగా ఒక పర్వతాగ్రాన పెరుగుతున్నాడని, రెండవ వాడు సముద్ర తీరం లో పెరుగుతున్నాడని భావిద్దాం .కొన్నేళ్ళ తర్వాత చూస్తె మొదటి వాడు రెండవ వాడికంటే ఎక్కువ వయసు పెరిగినట్లు గ్రహిస్తాం .వాళ్లిద్దరూకలిస్తే మొదటి వాడు రెండవ వాడికంటే పెద్దవాడు అనిపిస్తాడు .వయో భేదం ఇక్కడ చాలా తక్కువగా ఉండచ్చు .కాని ఇందులో ఒకడు చాలాకాలం చాలా దూరం లో స్పేస్ షిప్ లో కాంతి వేగం తో సమానంగా ప్రయాణించి వచ్చాడని అనుకొంటే ,వీడి వయసు భూమి మీద ఉన్న వాడి వయసుకంటే చాలా తక్కువగఉన్నట్లు ,చిన్నవాడుగా ఉన్నట్లు అనిపిస్తుంది .దీనినే ‘’ట్విన్స్ పారడాక్స్ ‘’అంటారు .ఇది ఒక ఆభాస (పారడాక్స్ )మాత్రమె నని ఆబ్సల్యూట్ టైంపై అవగాహన ఉన్నవారికి తెలుస్తుంది .. .దీరీ ఆఫ్ రిలేటివిటి లో ఒకే రకమైన ఆబ్సల్యూట్ టైం అనేది ఉండదు .కానిదీనికి బదులు ప్రతి వ్యక్తీ తన కాలాన్ని తానున్న ప్రదేశం ,ప్రయాణించే విధానం తో గణన చేసుకొంటాడు .
శాస్త్రి గారి భాష్యం –ఈ విషయాలన్నీ మన వేదవేత్తలు ముందే తెలుసుకొని దేవతలుసాపేక్షంగా అమరులు అని చెప్పారు .దేవతలకు అంతం ఉంది కాని వారు జీవితకాలం కల్పాలతో కలిసి ఉంటుంది .దీనికి కారణం వారు మర్త్య లోకానికి ఎంతో సుదూరం లో ఉండటమే .బహుశా ఈ దూరం మీడియం అంటే వాహిక ,లేక ఫేజ్ మార్పు అయి ఉండచ్చు .ఇది ఒక కణం పదార్ధం గా మారటానికి పట్టే కాలం అని చెప్ప వచ్చు .భూలోకం లోనే స్వర్గ లోకం ఉంది అని వేదం చెప్పింది –‘’అంతర్హితోహి స్వర్గ లోకో మనుష్య లోకాత్ –(యజుర్వేదం -6 వ కాండ -1వ అనువాకం )
కనుక స్వర్గ లోకం మీడియం లో ఉన్నది మాత్రమె అని స్పష్టమైంది .ఇది దూరానికి (స్పేషియల్ )సంబంధించిందికాదు .కారణం స్వర్గం-మర్త్య లోకమైన భూమికి చెప్పలేనంత దూరం లో ఉండటమే .ఇది మీడియం డిఫరెన్స్ మాత్రమె .అందుకే దేవతల ఆయుర్దాయం మానవ ఆయుర్దాయం కంటే ఎక్కువ .
భూమిపై ఉన్న ఒక రాయి ,ఒక కణం ఒక మూలకం గా (దేవతలు ) మారటం తోపోల్చి ఈ వాహిక దూరాన్ని అర్ధం చేసుకో వచ్చు .అంటే పదార్ధ స్థితులలో వచ్చే మార్పు అన్నమాట .అంటే ఘన పదార్ధానికి ,వాయు పదార్ధానికి ఉన్న భేదం లాంటిదన్నమాట .భారతీయ వేద విజ్ఞానం(మెటా ఫిజిక్స్ ) ప్రకారం పదార్ధం లోని అతి సూక్ష్మ కణం పరమాణువు కాదు –తన్మాత్ర మాత్రమె .ఒక ప్రోటాన్ శిధిలం కావటానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది .దీనిని బట్టి దేవతలు మానవులకంటే అత్యంత ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారో అర్ధమవుతుంది .ఇదీ మర్త్యులకు దేవతలకు జీవితకాలం లో ఉన్న భేదం (బహుశా పరమాణువు )
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
–