దైవ చిత్తం -5
శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం
పేజి -33,పేరా -3
‘’విశ్వం మార్పు చెందదని,అది ఒకప్పుడు ఉండేది ,అదిఎప్పటికీ ఉంటూనే ఉంది ‘’అని నిశ్చయంగా భావించిన విషయం లో మార్పు వచ్చింది .చలన శీల౦గా ,విస్తరిస్తున్నవిశ్వం ఎప్పుడో పూర్వం ఒక స్థిరమైన కాలం లో ఆవిర్భవించి ,భవిష్యత్తులో ఒక చోట ఆగిపోతుందనే భావన దీని స్థానం లో ఏర్పడింది .పరిభ్రమణ విషయం ముందు అధ్యాయాలలో వస్తుంది .కాలం గడిచాక అదే నా భౌతిక శాస్త్ర సిద్ధాంత పరిశోధనకు ప్రారంభ విషయం అయింది అన్నాడు హాకింగ్ .తానూ ,రోజేర్ పెన్ రోజ్ కలిసి అయిన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతప్రకారం విశ్వానికి మొదలు తుది ఉన్నాయని చూపాము .
శాస్త్రీజీ భాష్యం –ఇదే విషయాన్ని వేద కాల మహర్షులు ‘’కాస్మిక్ పంచాంగం ‘’లో తెలియ జెప్పారు .ప్రస్తుత యుగం మహా యుగాలలో శ్వేత వరాహ కల్పం లోని 28వది అయిన కలియుగం లో మొదటిపాదం .వేద ఖగోళం విశ్వానికి ఆరంభం ,అంతం కూడా ఉన్నాయని చెప్పింది. ఏదో వాళ్ళు కవితాత్మకంగా చెప్పిన దాన్ని ఇప్పటి పరిశోధనలకు ముడి పెడుతున్నావు ,అదేదో యాదృచ్చికం అని నన్ను మీరు అనవచ్చు . కాని ఇది మన మహర్షుల క్రాంత దర్శనానికి ఉదాహరణ అని వారి మేధో వికసనానికి పరాకాష్ట అని మర్చి పోరాదు .వారెప్పుడో మనో బలం టో అంతర్ దృష్టితో దర్శించి ప్రవ చించిన దానినే ఎన్నో ఏళ్ళ తర్వాత సైన్స్ పరిశీలించి చెప్పింది .ఇది ముమ్మాటికీ నిజం .
ఇక్కడ ఒక విషయం లో జాగ్రత్త పడాలి మనం .వేదాంత విషయమైన అద్వైతానికి మర్త్యలోకానికి చెందిన సైన్స్ కు ముడి పెట్ట రాదు .మన పూర్వీకులు ఈ రెండిటినీ వేర్వేరుగానే చూశారు .సూర్యోదయాన్ని విస్తృతంగా వర్ణించిన వేదం ,ఉపనిషత్ లో సూర్యుడు ఉదయించడు ,అస్తమించడు అనీ చెప్పింది . భూమి మాత్రమె తిరుగుతుంది అని చెప్పింది .ఖగోళ పంచాంగం వగైరాలు మానవులకు మాత్రమేనని గ్రహించాలి .గ్రహ గతులను తెలుసుకోవటానికి మాత్రమే అవి సహకరిస్తాయి .అంతేకాని ఈ ప్రపంచం మిధ్య అన్న అద్వైతానికి ఇది వర్తించదు .వేదాంత ఆలోచనలను నిత్య జీవిత విషయాలతో కలపరాదు .బ్రహ్మ సూత్ర భాష్యం శాస్త్రాలన్నీ భ్రాంతి నాధారంగా రాయబడినవి అని చెప్పింది .అందు చేత అవి ప్రకృతితో అనుభవాదారమైనవి (ఎమ్పెరికల్ )అని స్పస్టపరుస్తాయి .ఈ శాస్త్రాలు అంటే మన భాషలో సైన్స్ లు మానవ కంటికి దేవుడిని చూపించ లేవు .దీనికి కారణం చెప్పాలంటే ఇవన్నీమానవ సిద్ధాంత రచనలే కావటం వలన .
మూడవ అధ్యాయం -విశ్వ వ్యాపనం
పేజి -37,పేరా -1
‘’మనం ఒక గెలాక్సీ లో ఉన్నాం .అది ఒక లక్ష కాంతి సంవత్సరాల దూరం లో ఉండి,నెమ్మదిగా పరిభ్రమిస్తోంది .చుట్టగా (స్పైరల్ )బాహువులలోని నక్షత్రాలు కేంద్రం చుట్టూ అనేక వందల మిలియన్ల సంవత్స రాలకొక చుట్టూ తిరుగుతూ ఉంటాయి .
శాస్త్రి గారి మహా భాష్యం –ఈ స్థిర నక్షత్రాన్నే మన పూర్వులు ధ్రువ నక్షత్రం అన్నారు .దీని చుట్ట్టూ పాల పుంత లోని మిగిలిన నక్షత్రాలు తిరుగుతాయని చెప్పారు .బాగా అర్ధం కావటానికి సామాన్యులకోసం ద్రువుని కద గా చెప్పారు .ధ్రువుడు తపస్సు చేసి దీన్ని సాధించాడని అన్నారు .వివాహ మంత్రాలలో కూడా ఈ విషయం ఉంది .ధ్రువ నక్షత్రాన్ని నూతన దంపతుల మధ్య శాశ్వత శృంగార బాంధవ్యం ద్రుఢంగా,స్థిరంగా ఉండేట్లు చేయమని అర్దిస్తారు .కాలాన్ని స్పైరల్ గా భావించటం లో ఒక పరమార్ధముంది .సూర్యుని సమీపం లోని సింశుమార చక్రంతిరుగుతూ ప్రతి 60ఏళ్ళకు ఒక సారి ఉన్న చోటికి వస్తుంది.దీన్ని గమనించాలి .సంస్కృతం లో సింశుమార అంటే ఒక సముద్ర జీవి .చక్రానికి(స్పైరల్ కు ) 27 నక్షత్రాలు ఉంటాయి. వీటిని చంద్రుని భార్యలుగా భావిస్తారు .ఒక్కో నక్షత్రం లో చంద్రుడున్న నెలను ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారని మన ఖగోళ శాస్త్రం చెప్పింది .మృగశిరా నక్షత్రం లో చంద్రుడు పౌర్ణమి నాడు ఉంటె ఆ నెలకు మార్గశిరమాసం అని పేరు అలానే మిగిలినవికూడా .
పేజి 44,పేరా 2
‘’గురుత్వాకర్షణ యెంత బలీయమైనది అంటే స్పేస్ దానికదే ఒంగి పోయి భూమి ఉపరిత0 లాగా కనిపిస్తుంది ‘’.బహుశా సాగర మధనం మహా కూర్మం పైన ఉన్న గుల్ల మీద మంధర పర్వతం ఆని ఉండటాన్ని సూచిస్తుంది .
పేజి 47 ,పేరా -2
గేలాక్సీలు ఒక దానికొకటి దూరం జరిగిపోతే , నిరంతరం ఏర్పడే కొత్త పదార్ధం నుండికొత్త గేలాక్సీలు ఏర్పడి ఆ స్థానాలను భర్తీ చేస్తాయి .అందువలన అన్ని సమయాలలో ,స్పేస్ లోని అన్ని బిందువుల వద్దా విశ్వం మామూలుగానే మార్పు లేనట్లు కనిపిస్తుంది .
శాస్త్రీజీ వివరణ –ఈ స్థిర రూప సిద్ధాంతాన్నే బార్డి గోల్డ్ –బాయిల్ సిద్ధాంతం అన్నారు. కాని కొంతకాలం తర్వాత ఈ సిద్ధాంతానికి ‘’తూ నా బొడ్డు’’అని తీసిపారేశారు .ఈ విషయాన్ని భారతీయ మహర్షులు,ద్రష్టలు గణాలకు నాయకుడైన గణపతి కి ఉన్న సంబంధం తో చూపారు, రాశారు .ఇక్కడ గణాలు అంటే నక్షత్ర గణాలు అని అంటే గేలాక్సీలు అని అర్ధం .ఆయనకు నైవేద్యంగా పెట్టేవి బియ్యపు నూకతో చేసిన ఉండ్రాళ్ళు .అవే ఆయన కిష్టం .ఇవే నక్షత్రాలు .ఆయన బొజ్జ ఈ విశ్వమే .పాత తారల స్థానం లోనిరంతరం కొత్త నక్షత్రాలు సృష్టింప బడటం అంటే నక్షత్రాలు వాటిలో ఉండే పదార్ధం (మాస్ )హరి౦చు కొని పోవటమే .కొత్త తారల పుట్టుక గెలాక్సీలలోని అయస్కాంత క్షేత్రాన్ని సమ తుల్యతలో ఉంచటానికే .ఈ గెలాక్సీ లో ఉన్న ఒక్క నక్షత్రం ద్వంసమైనా చాలు గెలాక్సీ కుప్ప కూలి పోతుంది .అందుకే మన పూర్వీకులు గణేశ్వరుని ఈ నక్షత్ర సమూహ మూర్తిగా(ఎంబాడి మెంట్ ) చెప్పారు.మూర్తీభవించిన విశ్వం లోని నక్షత్ర కూట సముదాయమే వినాయకుడు అన్న మాట . అంటే ఆయన శరీరం లో నక్షత్రాలున్నాయని భావం .కనుకనే వినాయక చవితికి ఆయన శిరసుపై ‘’మహా రాజ లాంచనం’’అయిన ఛత్రం గా ‘’పాల వెల్లి’ ని’వెదురుపుల్లల’తో తయారు
’ చేసి రంగుకాగితాలతో అలంకరించి ఉంచుతారు .ఈ పాలవేల్లినే ‘’మిల్కీ వే’’అంటాం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-12-15-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .
.