g దైవ చిత్తం -6
శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం
నాలుగవ అధ్యాయం –అనిశ్చిత సూత్రం
పేజి -56,పేరా -2
కాంతి తరంగ సముదాయమే అయినప్పటికీ మాక్స్ ప్లాంక్ ప్రతిపాదించిన క్వాంటం ప్రతి పాదన ననుసరించి కొన్ని సందర్భాలలో కాంతి కణ సముదాయం గా ప్రవర్తిస్తుంది .అది కొన్ని పాకెట్ లు గా(క్వా0ట్స్ ) వెలువడుతుంది ,హరించుకు పోతుంది .
వ్యాఖ్యానం –ఈ అధ్యాయం పూర్తిగా సా0కేతికపరమైనది,కణాల ద్వంద్వ ప్రవృత్తులను గూర్చి చెప్పటం (ఈ ప్రపంచాన్ని ఏర్పరచే ప్రాధమిక కణాలు ప్రోటాన్ ,న్యూట్రాన్ లతో ఉంటాయి )అవి కణాలుగా ,తరంగాలుగా ప్రవర్తిస్తాయనటం అంతా సాంకేతికమైన భావనలే .ఇందులో భారతీయ సాహిత్యం కణ సిద్ధాంతాన్నిబిందు సిద్ధాంతంగా చెప్పి కొంతవరకు ఆమోదించింది .కాంతి బిందు సమూహం ఆ సముదాయమే కాంతి పుంజం అని చెప్పింది .ఈ కాంతి పుంజమే తరంగామా ?.
వేద భావనలో తరంగ సిద్ధాంతం కూడా ఉంది .ఇది కాంతి ధ్వనులకు మాత్రమె కాక,ప్రపంచం లోని కదిలే ,మారే ప్రతి వస్తువుకు వర్తిస్తుంది అన్నది .
ఇదే ఛందస్(రిథం ) సూత్రం – ప్రపంచ గమనాన్ని నియంత్రించేవి సప్త ఛందస్సులు .అవే గాయత్రి ,త్రిష్టుప్ ,జగతి ,ఉష్ణిక్, సక్వరి ,అనుష్టుప్బృహతీ మొదలైన ఛందస్సులు .సృష్టిలో ప్రతిదీ లయ బద్ధం గా (రిథమిక్ )కదులుతుంది .ప్రతిదీ ముందుకు తరంగాలుగా ,వర్తులంగా జరుగుతూ పోతుంది .ఉదాహరణకు కాలం సంవత్సరాల ఆవర్తనం తో ముందుకు కదులుతుంది .ప్రతి ఏడాదిని ఒక తరంగం గా భావిస్తే 60సంవత్సరాల ఆవృత్తి ఒక సరళ రేఖగా ఒక తరంగ సముదాయం అవుతుంది ప్రతి ఏడాదికి ఋతువులు అదే సమయం లో ఏర్పడటం జరుగుతుంది .కాని అవి ఒకే మాదిరిగా ఉండవు .కారణం అవి స్పేస్ లో మరొక మెట్టు ముందుకు జరిగిపోవటమే .కనుక దీనిని బట్టి వేదం కణ సిద్ధాంతాన్నీ ,తరంగ సిద్ధాంతాన్నీ రెండిటినీ సమర్ధించింది అని తెలుసుకోవాలి .ఇదిఅనంతమైన టైం ,స్పేస్ ల సృస్టులకు (కల్పాలు )కు తుది గా భావి౦చి౦ద న్నమాట .
పేజి 66-
ఇది వరకటి అధ్యాయం లో మనం చర్చించినట్లు తరంగ ,కణ సిద్ధాంతాల నుపయోగించి విశ్వం లోని ప్రతి వస్తువు కాంతి,సాపేక్షత తో సహా అన్నిటినీ కణాల నాధారంగా నే వివరించాలి .
ఈ అధ్యాయం క్వాంటం మెకానిక్స్ ,గ్రావిటీ ల ను కలిపిసమగ్ర పరచి ప్రవచించే సిద్ధాంతాల కోసం ఆశిస్తూ ముగింపు పలకటమైంది .
అయిదవ అధ్యాయం –మూల కణాలు ,ప్రక్రుతి శక్తులు
పేజి -64,పేరా- 2
ఈ ఎలక్ట్రాన్లు పరమాణువు లోపలి నుండే వెలువడుతున్నాయని వెంటనే గమని౦చ డమైంది .1911లో బ్రిటీష్ భౌతిక శాస్త్ర వేత్త ఎర్నెస్ట్ రూధర్ ఫోర్డ్ –పదార్ధం లోని పరమాణువు లో అంతర్నిర్మాణం ఉందని రుజువు చేశాడు .
శాస్త్రిగారి వ్యాఖ్య –దీనినే కాణాదుని వైశేషిక దర్శనం లో ‘’అణు ‘’అని పిలిచాడు .అణువు విభజింప బడదు కానిపరమాణువు అనే పదాన్ని వాడి ,విభజన జరుగుతుందని సూచించాడు భారతీయ నాగర కత లో భాగమైన బౌద్ధ మతం లో శక్తి స్పేస్(ఆకాశం ) లో కనిపించని రూపం లో ఉంటుంది అని చెప్పింది .దీనికి ముందే భారతీయ బ్రహ్మ సూత్రాలలో సృష్టి కర్తలేక బ్రహ్మం అంటే స్పేస్ అని చెప్ప బడింది .దీనికి సంబంధిన మంత్రం –‘’ఆకాశవత్ సర్వ గతా హ ,నిత్యహ’’.బ్రహ్మం లేక సృష్టికర్త ఆకాశం లాగా అనంతం ,తుది లేనిది అని భావం .దీన్ని బట్టి చూస్తె మన పూర్వీకులు పదార్ధం యొక్క చివరి స్థితి ఆకాశమే అని ,అన్ని పదార్ధాలు శక్తి నుండే ఆవిర్భ విస్తాయని అది మానవ నేత్రానికి ద్రుగ్గోచారం కాదని చెప్పారు .అతి వినయం గా ఒక విషయం చెబుతున్నాను –వేద సాహిత్యం ఈ పరమాణువు మొదలైనవన్నీ భౌతిక పరమైనవి(మెటీరియలిజం ) కనుక దానిపై ద్రుష్టి పెట్టలేదు .
పేజి -68,పేరా-2
క్వాంటం మెకానిక్స్ ను ,స్పెషల్ దీరీ ఆఫ్ రిలేటివిటిలకు స్థిరమైన (కన్సిస్తంట్ )రూపాన్ని ఇచ్చి సిద్దాన్తీకరించిన మొదటివాడు డిరాక్ .ఎలక్ట్రాన్ కు స్పిన్ 1/2 ఎందుకు ఉన్నదో,అది ఒక వలయం పూర్తీ చేసే సరికి ఒకే మాదిరిగా ఎందుకు ఉండదో గణిత0 ఆధారంగా వివరించాడు . ఎలక్ట్రాన్ కు ఒక భాగ స్వామి అంటే యాంటి ఎలక్ట్రాన్ లేక పాజిట్రాన్ ఉండి ఉండాలని ఊహించాడు .1932లో కనుగొన బడిన ఈ విషయాన్ని ‘’డిరాక్ సిద్ధాంతం ‘’అన్నారు దీనికే ఆయనకు 1933లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .దీనిని బట్టి ప్రతికణానికి వ్యతిరేక కణం అనేది ఒకటి ఉంటుంది అని అర్ధమయింది ఈ యాంటి పార్టికల్ ఉండటం వలన అది అంతరించి పోగలదు .ఈ కణాలను మోసే శక్తులు ,యాంటి పార్టికల్స్ కూ సమానమే .ఏతా వాత తెలియ వచ్చేదేమిటంటే –వ్యతిరేక ప్రపంచాలు ,వ్యతిరేక మనుషులు ,కూడా యాంటి పార్టికల్స్ వలన ఏర్పడుతాయని .నీ యాంటి వ్యక్తిని కలిస్తే పొరబాటున కూడా వాడికి షేక్ హాండ్ ఇవ్వద్దు .ఇస్తే ఇద్దరూ పెద్ద మిరుమిట్లు గొలిపే కాంతి లో అంతరించి పోతారు .
శాస్త్రీజీ వ్యాఖ్యానం –ఇదంతా వేదం లో చెప్పినట్లు దేవతలకు అసురులకు సంబంధించిన విషయం గా అనిపిస్తోంది కదూ. కణాలు దేవతలైతే వ్యతిరేక కణాలు యాంటి పార్టికల్స్ రాక్షసులు .దేవతలు యజ్ఞాలు చేస్తారు .’’యజ్ ‘’ అనే సంస్కృత ధాతువు నుండి యజ్ఞం అనే మాట వచ్చింది .దీని అర్ధం ‘’సంఘటీకరణం ‘’.అంటే అన్నిటినీ కలపటం .ఈ ప్రపంచం పంచ భూతాల చేత సంఘటితమై ఏర్పడింది కనుక ‘’ప్రపంచం’’అంటారు .ప్రపంచం అనే మాటలో ‘’పంచ ‘’అనేది ముఖ్య మైనది ‘’.ప్ర’’అనేది ఉప సర్గ .కావాల్సిన భావాన్ని స్పష్ట పరచటానికిఉప సర్గ ను ఉపయోగించారు .దేవ దానవుల అనాదికాల యుద్ధాల గురించి ఎన్నో కధలూ గాధలూ మన వేదసాహిత్యం లో ఉన్నాయి .
పేజి 69,పేరా- 2
కణాల వాహికలైన శక్తులు పదార్ధ కణాలతో పరస్పర మార్పు పొంది ప్రభావం ఉన్నా రూపం లేని (వర్చువల్ ),యదార్ధ కణాలు అనిపించని వాటిగా ఉంటాయి .వీటిని సూటిగాపార్టికల్ డిటేక్టర్ తోకూడా గుర్తించలేము .అవి ఉన్నాయని వాటి ప్రభావం వలన మనకు తెలుసు కాని చూడలేం. ఇవి పదార్ధ కణాలమధ్య శక్తి జనకాలౌతాయి . కణాలలో స్పిన్ 0,1లేక 2కూడా ఉన్నాయి .ఇవి కొన్ని సందర్భాలలో నిజమైన కణాలలాగా ఉంటాయి .అప్పుడు వీటిని మనం .కనిపెట్టి చూడగలం .అప్పుడు అవి ఒక భౌతిక శాస్త్ర వేత్త (క్లాసికల్ ఫిజిస్ట్ )చెప్పే కాంతి లేక గ్రావి టేషనల్ తరంగాలుగా మనకు దర్శన మిస్తాయి .పదార్ధ కణాలు ఒక దానితో ఒకటి సంఘర్షణ చెందినపుడు ఆభాస కణ శక్తి వాహికలు ఒక దానితోనొకటి మార్పు చెందినపుడు ఇవి ఉద్గారం చెందుతాయికూడా .రెండు ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ బలం ఏర్పడటానికి కారణం ఎప్పటికీ మనకు గోచరించని కనిపెట్ట బడని ఆభాస ఫోటాన్ ల మధ్య మార్పు మాత్రమె .ఒక వేళ ఒక ఎలక్ట్రాన్ రెండవ దానికంటే వేగం గా ప్రయాణిస్తే వాస్తవ ఫోటాన్లుమార్పు చెంది కాంతితరంగాలుగా కని పిస్తాయి .
శాస్త్రి గారి వ్యాఖ్యానం –స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావి సైంటిస్ట్ లు ఇప్పడున్న స్థితి లో ప్రపంచం లోని ఇంకా కొన్ని కణాలను సైన్సు డిటెక్టర్ ద్వారా గుర్తించి చూడలేక పోతోందని ,కాని సిద్ధాంత రీత్యా అవి ఉన్నాయని తెలుస్తోందని తెలియ జెప్పారు .ఈ వర్చువల్ కణాలు పదార్ధ నిర్మాణం లో కీలక పాత్ర పోషిస్తున్నాయి .కనుక మనం వీటిని దేవతలతో పోల్చుకోవచ్చు .ఒక మంత్రం ‘’పరోక్ష ప్రియా ఇవహి దేవాహ’’ అనేది ఉంది . దీని అర్ధం దేవతలు మానవ దృష్టికి గోచరం కాకుండా రహస్యం గా (పరోక్షం గా )ఉంటారు .అందుకే వేదాలు పితృ కర్మల విషయం లో శ్రాద్ధ కర్మలు చేయమని చెప్పింది .పితృదేవతలు మానవ కంటికి కనిపించరని ,తర్క ప్రకారం వారు ఉన్నట్లు (లాజికల్ గా )చెప్పగలమనీ దీన్ని తిరస్కరించ లేమని తెలియ జేశాయి .కనుక నాస్తికులు ,హేతువాదులు ఇప్పటికైనా ప్రపంచం లో ఉన్న ప్రతిదానినీ ఈ కళ్ళ తో చూడలేము అని గ్రహించాలి .వీళ్ళు దేవుడిని తమకళ్ళ ఎదురుగా తీసుకొచ్చి చూపింఛి నమ్మించ మంటారు .అని ఒక చెణుకు చెణికారు శాస్త్రీజీ .
సశేషం
క్రిస్మస్ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.