దైవ చిత్తం -7
శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు కు నా స్వేచ్చానువాదం
పేజి -69,పేరా -2od)
‘’చివరగా భౌతిక శాస్త్ర వేత్తలలో ఎక్కువ మంది ఒక ఏకీకృత సూత్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు .ఆ సూత్రం ఆ నాలుగు సూత్రాలు ఒకే శక్తికి ఉన్న నాలుగు విభిన్న అంశాలుగా వివరించవచ్చని అనుకొన్నారు .ఇదే ఈ నాటి భౌతిక శాస్త్ర లక్ష్యం గా కని పిస్తోంది .ఇటీవలే మూడు రకాల శక్తుల ఏకీకరణ విజయ వంతమైంది .ఈ విషయాన్ని ఈ అధ్యాయం లోనే వివరిస్తాను. మిగిలిన దాని విషయమై తర్వాత ఆలోచిద్దాం ‘’అన్నాడు సైంటిస్ట్ స్టీఫెన్ హాక్ .
వివరణ –వేదం ఈ సూత్రాలను ఎప్పుడో ఏకీకృతం చేసింది .ఇవే గురుత్వాకర్షణ ,విద్యుదయస్కాంత శక్తి ,బలహీన న్యూక్లియర్ శక్తి ,శక్తి వంతమైన న్యూక్లియర్ శక్తి .వీటిని దైవీ శక్తులుగా పేర్కొన్నది అందుకే ప్రతి శక్తినీ దేవతా స్వరూపంగా భావించి చెప్పింది. ప్రతి వస్తువు లేక దైవ శక్తి వీటిని కలిగి ఉన్నట్లు చెప్పి ,ఆహ్వానించి పూజించేట్లు చేసింది .ఈ సంయుక్త శక్తిని అది దేవతగా చెప్పింది .ఉదాహరణకు రవి చంద్ర భూమీ మొదలైనవి .ఇందులో ప్రతిదీ ఒక దేవతయే .కారణం ఈ దేవత నాలుగు శక్తులను ఏకీకృతం చేసి తనలో ఉంచుకొని ,వాటితో విభిన్న కార్యాలను చేయిస్తుంది .గ్రావిటి,విద్యుదయస్కాంతం ,పదార్ధాన్ని బంధించి ఉంచే న్యూక్లియర్ ఫోర్స్,రేడియో యాక్టివిటి ,అనేవి ఇవే .వీటినే తర్వాత శక్తి కి ప్రతీకగా ఒకోసారి పరస్పర ఖండన ,వ్యతిరేకతలున్నా భావించారు .
ఒక ఋగ్వేద సూక్తం ‘’ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహు హు ఔతో దివ్యహ –సుపర్ణో గరుత్మాన్ ఏకం –సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం –యమాన్ మాత రిష్వాన మాహుహు ‘’
ఈ సత్యాన్ని ఇంద్ర ,మిత్ర ,వరుణ ,అగ్ని ,సుపర్ణ ,యమ ,మాత రిశ్వ అంటే వాయువు గా పిలుస్తారు. కాని సత్యం ఒకటే .వివిధ నామాలతో పిలువ బడుతోంది .ఈ ఏకీకృత శక్తి నే వేదం ‘’సత్ ‘’అన్నది .అందుకే వేదం ‘’ఏక మేవా ద్వితీయం బ్రహ్మ ‘’అంటే సృష్టి కర్త ఒక్కడే .రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు అని అర్ధం .
పేజి 70,పేరా-1
సూర్యునికి భూమికి మధ్య ఉన్న ఆకర్షణ శక్తి –ఈ రెండు పదార్ధాల మధ్య గురుత్వాకర్షణ పరస్పర మార్పు వలన ఎర్పడేదిగా పరిగణింప బడుతుంది .ఈ మార్పు చెందిన కణాలు వర్చువల్ పార్టికల్స్.అవి తప్పని సరిగా గణింప దగిన ప్రభావాన్ని కలిగిస్తాయి .ఇవే భూమిని సూర్యుని చుట్టూ తిరిగేట్లు చేస్తాయి .వాస్తవ గురుత్వాకర్షణలు క్లాసికల్ ఫిజిసిస్ట్ ల దృష్టిలో గురుత్వాకర్షణ తరంగాలు .ఇవి బలహీనం గా ఉండి,కని పించ నంత ,లేక గుర్తింప బడ నంత గా ,ఇంత వరకు గమనింప బడనివిగా ఉన్నాయి .
శాస్త్రి గారి కామెంట్ –కనుక చివరికి సైన్సు వర్చువల్ పార్టికల్స్ ఉన్నాయనే నిర్ణయానికి వచ్చింది .గెలాక్సీల కదలికలు ఈ కణాల పరస్పర మార్పు వలన జరుగుతాయని నిర్ణయానికొచ్చారు .దీనివలన దేవతలు అంటే శక్తులు కంటికి కనిపించవని తేలింది. ఇది భౌతిక వాదుల పిడి వాదానికి సరైన సమాధానం .చూడబడని వాటిని ఎవరు ఎలా చూడ గలరు ?ఇవి అనుభవైక వేద్యాలే .దీనికి సమాధానంగా యజుర్వేద మంత్రం ఉండనే ఉంది యజుర్వేదం లో ఒకటవ అనువాకం లో ఆరవ కాండలో యజ్ఞం చేసే యజమాని ఒక దీక్ష తీసుకోవాలని ,దీక్షా వస్త్రం గా అతి స్వచ్చమైన తెల్లనివి ధరించాలని ,ధరించే ముందు ఆ వస్త్రానికి వేద మంత్రాలతో నమస్కరించాలని ఉంది –
‘’సోమస్య తనురసి ,తనువం మే పాహి –నక్షత్రాణాం అతీక సాత్ పాహి ‘’—దీని అర్ధం –ఓ!స్వచ్చ వస్త్రమా !నువ్వే సోమ అనగా చంద్ర రూపానివి .నా శరీరాన్ని రక్షించు .నన్ను నక్షత్రాల మహా కాంతి శత్రువు నుండి కాపాడు .
అంత రిక్ష పదార్ధాల అదృశ్య శక్తుల ఆకర్షణ బలాలను వేదం ఎప్పుడో గుర్తించి చెప్పింది .భౌతిక వాదులు వేదాలను నమ్మక పొతే సైన్సును నమ్మినా ఇదే అభిప్రాయానికి రావటం ఖాయం .
పేజి 75,పేరా -3
యాదృచ్చిక (స్పాంటేనియస్ )ప్రోటాన్ శిదిలత ను ఇంతవరకు ఎవరూ ప్రయోగాలలో పరిశీలించలేక పోయినా ,ప్రోటాన్ జీవితకాలాన్ని ఉజ్జాయింపుగా పది మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ సంవత్సరాలుగా ఊహించారు .అంటే ఒకటి తర్వాత ౩1 సున్నాలున్నమాట .ఇది సరళ ఏకీకృత సిద్ధాంతం చెప్పిన కాలం కంటే ఎక్కువ .ఇంకా ఎన్నో పరిశోధనలలో ఈ కాలం పెరిగిందేకాని తగ్గ లేదు .ఇంకా సున్నితమైన ప్రయోగాలు మహా పదార్ధాలున్న వాటిపై జరిపి నిగ్గు తేల్చాలి .
శాస్త్రి గారి వ్యాఖ్యానం –ప్రధానం గా పంచ భూతాత్మక దేవతలు ,సాపేక్షంగా అమర్త్యులు .హాకింగ్ చెప్పిన కాలం అంటే ఒకటి తర్వాత 31సున్నాలున్న సంవత్సరాలు దేవతలా జీవిత కాలం .అందుకే వేదం దేవతల జీవిత కాలం కల్పాలతోఅంతమౌతుంది అని చెప్పింది .కనుక వారిని ‘’త్రిదశులు ‘’అన్నది అంటే –వారెప్పుడూ ౩౦ ఏళ్ళ వయసున్న వారుగానే బలీయంగా కనిపిస్తారు . కారణం ప్రళయం దాకా పంచ మూలకాలు మొదట్లో యెంత శక్తి వంతంగా బలం గా ఉంటాయో చివర్లోనూ అలాగే ఉండటం .ప్రోటాన్ శిధిలం కావటానికి పట్టే కాలాన్ని దీనితో పోల్చి చెప్పచ్చు .ఇదే అనంతకాలం లో తుది సమయం .ప్రోటాన్ శిధిలం అవటం అనే సంఘటన అని అర్ధం చేసుకోవాలి .
పేజి 78,పేరా 3
పదార్ధ కణాలు ,గురుత్వాకర్షణ బలాలు మిగిలిన వాటిపై పెత్తనం చేస్తాయి .అందుకే గురుత్వాకర్షణవిశ్వ పరిణామాన్ని నిర్ణ యించేదిగా ఉంది .
శాస్త్రీ జీ భాష్యం –ఇదంతా విష్ణుమూర్తి దశావ తారాలలో ఒకటైన వరాహావతారాన్ని గుర్తుకు తెస్తుంది .వేద ఖగోళం లో ద్వాదశ రాశులలో ఒకటి అయిన కన్యా రాశి లో జరిగింది వరాహవాతారం .ఇదే ఆధునికులు చెప్పే వరాహ నక్షత్ర కూటమి (బోర్ కాన్ష్టి లేషన్ ).విష్ణువు ఆదివరాహ రూపం లో హిరణ్యాక్ష రాక్షసుడిని వదించటానికి ముందు ,భూమికి ఆకారమే లేదు .ఈ మహా కూటమి గురుత్వాకర్షణ బలం వలన భూమికి గోళాకార ఆకృతి ఏర్పడింది .వరాహవతార విగ్రహాన్ని చూస్తె వరాహం కోరపై పై వర్తులాకార విశ్వం కనిపిస్తుంది .దీని వలన అంతకు ముందు భూమికి ఆకారం లేదని ,అందుకే పరిణామం జరగటం ఆలస్యమైందని సూచిస్తోంది .అప్పుడు దేవుడు లేక సృష్టి కర్త భూమి రూపం దాల్చాలని ,అప్పుడే దానిపై జీవావిర్భావం జరగాలని నిర్ణయించాడు .
అందుకే ఆయన ఈ కూటమిని సృష్టించి అయస్కాంత క్షేత్రం ఎర్పడేట్లు చేశాడు .హిందువులకు శ్వేత వరాహ కల్పం ను గుర్తించగలరు .దీని అర్ధం తెల్ల వరాహం నుండి ప్రారంభమైన సృష్టి అని భావం .
సశేషం
క్రిస్మస్ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.
–