దైవ చిత్తం -10
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
ఏడవ అధ్యాయం – బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు )అంత నల్లగా ఉండవు
పేజి -105,పేరా -2
మనం అనుకొనే ఖాళీ జాగా (ఎంప్టి స్పేస్ )పూర్తిగా ఖాళీ ది కానక్కర లేదు .అలాఉంటే గురుత్వాకర్షణ ,విద్యుదయస్కాంత క్షేత్రాలు మొదలైనవన్నీ శూన్యం అయి పోవాలి .
పేజి -106,పేరా -2
శూన్యం నుంచి శక్తి ణి ఉత్పత్తి చేయలేము .కణం లో మరో వ్యతిరేక కణం (యాంటి పార్టికల్ )ఉంటుందని తెలుసు .మొదటి దానిపై ధనాత్మక శక్తి , రెండవ దానిపై ఋణాత్మక శక్తి ఉంటాయి.
శాస్త్రీ జీ వ్యాఖ్య –ఈ అత్యంత ఉత్కృష్ట సాంకేతిక చర్చలు రేడియేషన్ ఉద్గారానికి దారి తీసింది .ఖాళీ గా కనిపించే ది నిజమైన ఖాళీ ప్రదేశం కాదు .అది కంటికి కనిపించని రుణ లేక ధనాత్మక శక్తి మాత్రమె .ప్రతి అవతార పురుషుడు ,లేక మహా సన్యాసి సమాధి అవటం ,వారు మహా శక్తిలో సంలీనం కావటం మనకు తెలుసు జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్య చివరకు శక్తి స్వరూపమైన పరమేశ్వరి సాన్నిధ్యం చేరారని మనకు తెలిసిన సంగతే .కారణం ఏ ద్రవ్య రాశి కూడా శక్తి లేక ప్రభవించదు . ద్రవ్య రాశి శక్తి పరస్పర వినిమయం అవుతాయి అనటానికి ఉదాహరణ .ద్రవ్య రాశి సృష్టి అంటే దేవుని కార్యమైన సృష్టి మాత్రమె .దీనికి సృస్తికర్తకైనా శక్తి అవసరమే .శంకరుల శివానంద ,సౌందర్య లహరి లలో ఈ శక్తిని ‘’చిచ్చక్తి ‘’అన్నారు .అంటే స్పేస్ మరియు శక్తి అంటే జ్ఞానం శక్తి అని భావం .జగద్గురువులు యెంత దాకా వెళ్ళారంటే –శివుడు శక్తి సహకారం లేకుండా ఒక్కడుగు కూడా ముందుకు వేయ లేడు.-‘’శివ శక్త్యో యది భవతి ‘’.శక్తి అనేది ద్వంద్వా తీతమైనది .అంటే ద్వంద్వానికి ఆవలిది .భౌతిక పరిభాషలో ధన ,రుణ శక్తులకు అతీతమైనది .ఇవి తెలివైన వారికే కాక సామాన్యులకు కూడా అర్ధమయే విశేషాలే .
పేజి-107,పేరా 2
బ్లాక్ హోల్ అతి చిన్నదైనప్పుడు ,(ఇది ఇంకా పూర్తిగా తెలియని విషయమే )అనుభవమైన ఊహ ప్రకారం మిలియన్ల సంఖ్యా లో ఉన్న హైడ్రోజెన్ బాంబుల విస్ఫోటనం తోసమానమైన ఒక బ్రహ్మాండమైన అంతిమ ప్రేలుడులో అది పూర్తిగా అదృశ్యమై పోతుంది .
శాస్త్రి గారి వ్యాఖ్యానం –దీనినే మనం పరంపరా గతం గా వస్తున్న ‘’భస్మాసుర కద ‘’తో పోల్చవచ్చు .విష్ణు మూర్తి మోహిని అవతారం దాల్చి భస్మాసురుడిని మొహించినట్లు నటించి వాడి చేతుల తోనే వాడి నెత్తి మీద చేతులు పెట్టుకొని భస్మమైపోయేట్లు చేసింది .రాక్షసులు బ్లాక్ హోల్స్ వంటివారు .వీటి స్పైరల్ కదలిక వలననే నక్షత్రాలు కదులుతాయి .గజా సురుడిని పెద్ద బ్లాక్ హోల్ గా భావించి ఇది వరకే చెప్పాను .ఈ రాక్షసులు సృష్టికి ఆటంకం కలిగిస్తారు .రాక్షసులను వ్యతిరేక అయస్కాంత శక్తులుగా భావించాలి .కారణం వారు ఎప్పుడూ సమీకృత దేవ కార్యాలైన యజ్ఞాలకు విఘ్నాలు కలిగించటమే .పదోత్పత్తి శాస్త్రాన్ని (ఎటిమలాజికల్ )బట్టి యజ్ఞం అంటే దేవ పూజ ,దానం ,సంఘటీకరణం .ఇదిసృష్టి కోసం అన్నిటినీ కలిపేది ,ఏకీకృతం చేసేది ,ఉండలు ఉండలుగా మార్చేది అని భావం . సంకర్షణం అంటే అయస్కాంత శక్తి .
ఎనిమిదవ అధ్యాయం –విశ్వానికి ఆరంభం ,దాని భవిష్యత్తు
పేజి -115,పేరా -1
అయిన్ స్టీన్ శాస్త్ర వేత్త దీరీ ఆఫ్ రిలేటివిటి ప్రకారం స్పేస్ టైం –బిగ్ బాంగ్ ఏకత్వం ( సింగ్యులారిటి )తోప్రారంభమైంది .అది అతిపెద్ద ఏకీకృత ప్రేలుడు(బిగ్ క్రంచ్ సింగ్యు లారిటి) తో అంతమౌతుంది .విశ్వం అంతా మళ్ళీ వినాశన మవటం లేక ఒకే సారి బ్లాక్ హోల్ లో ద్వంసమైపోవటం జరుగు తుంది .ఈ బిలం లో పడిన ప్రతి వస్తువుఒకే సారి నాశనమై పోతుంది. కాని గ్రావిటేషనల్ ప్రభావం బయట ఉంటుంది .ఇలాకాక క్వాంటం ప్రభావాన్ననుసరిస్తే పదార్ధ ద్రవ్య రాశి లేక శక్తి మళ్ళీ మిగిలిన విశ్వం లోకి ప్రవేశిస్తుంది .ఇది రాక్షసుల పునర్జన్మ లాంటిదే .బ్లాక్ హోల్ ఒకే సారి ఆవిరి యై అదృశ్యమై పోతుంది .క్వాంటం మెకానిక్స్ ఇలాంటి నాటకీయ ప్రభావం బిగ్ బాంగ్ క్రంచ్ సింగ్యులారిటిచూపగలదా?విశ్వావిర్భ తొలికాలం లో ను ఆ తర్వాత,గ్రావిటేషనల్ క్షేత్రాలు బాగా బలీయంగా ఉన్నప్పుడు ,క్వాంటం ప్రభావాలను విస్మరించ లేనపుడు అసలేమి జరిగింది ?అసలు ఈ విశ్వానికి మొదలు ,తుది ఉందా ?ఒక వేళ ఉంటె అవి ఎలా ఉన్నాయి ?
శాస్త్రీజీ భాష్యం –వీటినే పురాణాలు వేదాలు చెప్పాయి .సృష్టి జీవితాన్ని కల్పం (సృష్టి)అంటారు .దీన్ని మహా యుగాలుగా విభ జించారు .వాటిని యుగాలుగా ,వీటిని మళ్ళీ లక్షలాది సంవత్సరాలుగా సూక్ష్మ విభజన చేశారు .ఇప్పుడు మనం ఉన్న కల్పం (acon )శ్వేత వరాహ కల్పం .ఇది భూమికి సంబంధించినంతవరకు చాలా దూరం శ్వేత వరాహ కల్పం ప్రారంభం లోనే భూమి కన్యా రాశి లో లేక వరాహ నక్షత్ర కూటమి లో సృష్టింప బడింది అని ఇదివరకే తెలుసుకొన్నాం .అంటే మన భూమి ,వరాహ నక్షత్ర కూటమి ఒకే సారి సృష్టింప బడినాయి .ఇది ముందే నిర్దేశింప బడిన కాలం వరకు ఉండి,గ్రహ నక్షత్రాలతో మళ్ళీ అంతమౌతుంది .
మన పురాణాలు ఈ కూటమిని పరిమితమైన కోణం లోనే చెప్పాయి .మిగిలిన గెలాక్సీల విషయం లోనూ ఇదే విధానం .అవికూడా ఇలాగే పరిణామం చెంది శక్తిలో లయం పొంది నిద్రాణ స్థితిలో (డార్మంట్ )కనిపించకుండా స్పష్టమైన శూన్యం (అపరెంట్ ఎంప్టి నెస్)అనబడే ఆకాశం లో ఉండి,మళ్ళీ ప్రారంభ విధానం లో పాల్గొంటాయి .కనుక సృష్టి అనేది ఒకే సారి (వన్ టైం )జరిగింది కాదని స్పష్ట మౌతోంది .ఇది టైం ,స్పేస్ లో అంతు ,లేనిదని ,అనంతమైనదని స్పష్టం .ఇదే విషయాన్ని హాకింగ్ శాస్త్రజ్ఞుడు 116వ పేరాలో స్పష్టంగా చెప్పాడు . క్రిస్టియన్ మత గురువు పోప్ గారు ఏర్పరచిన సైంటిస్ట్ ల సమావేశం లో –‘’సైంటిస్ట్ ల సిద్ధాంతాలు బైబిల్ సిద్ధాంతాలతో ఘర్షణ పడుతున్నాయా ‘’?అని అడిగినప్పుడు హాకింగ్ తెలియ బరచాడు .
పేజి 116,పేరా -1
మనం మాట్లాడుకొనే సబ్జక్ట్ విషయం ఆయనకు తెలియదని సంతోషించాను .కాన్ఫరెన్స్ లో నేనిలా చెప్పాను –స్పేస్ టైం సంభావ్యత స్పస్ట మనిపరిమితమైనదని(ఫైనిట్ )దానికి సరిహద్దు (బౌడరి ) రెండూ లేవని అంటే దానికి ప్రారంభం ,అంతమూ లేదని సంపూర్ణం (ఆబ్సల్యూట్ )కాదని భావం .స్పేస్ ,టైం లకు సరిహద్దు లేదు.సృష్టి ఏర్పడిన క్షణం (మూమెంట్ ఆఫ్ క్రియేషన్ )కూడా లేదు .
శాస్త్రిగారి వ్యాఖ్య –ఇది అచ్చంగా మన భావనలనే ప్రతి బిమ్బిస్తున్నాయి .సృష్టి ఒకే కాలం లో జరిగిన తంతు కాదు .అది పరిపూర్ణమూ (ఆబ్సల్యూట్ )కాదు .స్పేస్ ,టైం లకు సరిహద్దు లేదు . అవి సరళ రేఖాత్మకం(లీనియర్ ) కాదు ,.అవిస్వభావ రీత్యా చక్రీయమైనవి (సైక్లిక్ ) ,అంటే అవి ఎప్పుడూ కనిపిస్తూ మళ్ళీ ప్రత్యక్ష మౌతూ ఉంటాయని అర్ధం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27 12-15- కాంప్ –మల్లాపూర్ =హైదాబాద్