దైవ చిత్తం -8
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్ )
పేజి -82,పేరా 3
చాలా విపరీత0 గా ఉన్న వాయువు ,ముఖ్యం గా హైడ్రోజెన్ వలన నక్షత్రం ఏర్పడుతుంది .నక్షత్రం దాని భారానికి అదే గురుత్వాకర్షణ వలన కూలి పోతుంది .
శాస్త్రిగారి కామెంట్ –హైడ్రోజెన్ అంటే నీటిని ఏర్పరచే ఒక మూలకం . వేదవిజ్ఞానం ఉన్న వారందరికీ ప్రపంచం నీటి తో ఏర్పడిందన్న విషయం తెలుసు .వేదమంత్రాలలో ఈ విషయం చాలా సార్లు చెప్ప బడింది .’’ఆపోవా ఇదగం సర్వం ,సర్వా భూతా న్యాపహః ‘’భావం –విశ్వం అంతా నీరే .ప్రాణులన్నీ నీరే .ప్రపంచం లోని లయ లన్నీ జలమే ..ప్రపంచం లోని కాంతి అంతా నీరే .ప్రపంచం లోని ప్రతిదీ నీరే .అందుకే సృష్టి నీటి తో ఉన్న నక్షత్రాలనుండే ప్రారంభ మైంది .విశ్వం అంతా తారా సముదాయమే అంటే నీటి సముదాయమే .మహా విష్ణువు అన్నిటా పరి వ్యాపకమై ఉంటాడు కనుక ,అన్నీ తానె కనుక ,విశ్వం తానె అయి ఉన్నాడు కనుక ‘’నారాయణుడు ‘’అయ్యాడు సంస్కృతం లో నార అంటే నీరు అని అర్ధం .అయన అంటే సన్నిధి .ఇదే విషయాన్ని మిగిలిన వారు ,గణేశాది దేవతలందరికీ వర్తిస్తుంది .వేద,పురాణాలలో నీటిని ,దాని ప్రాముఖ్యాన్ని గూర్చి ఎన్నో ఆసక్తికర కధలున్నాయి .ఋగ్వేదం లో వరుణ దేవత అంటే కోరికలు తీర్చే వాడు అని ఉంది .అన్నిటినీ తీర్చేది,ఇచ్చేది నీరు అనే విషయం మనకు తెలిసిందే .చెట్లు ,జంతువులూ ,,మానవులు పెరగటానికి నీరే ముఖ్య పదార్ధం అనే ఈ మహా విజ్ఞానాన్ని దార్శనికులైన మన మహర్షులు ఎప్పుడో మనకు అందజేసినందుకు మనం ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం ?సర్వదా వినయం తో కృతజ్ఞతతో ఉండటం తప్ప . పేజి 87 పేరా -2..
ఒక నక్షత్రం కూలి పోయి బ్లాక్ హోల్ గా మారటం చూస్తె ,రిలేటివిటి దీరీ ప్రకారం ఆబ్సల్యూట్ టైం అనేది లేదని తెలుస్తోంది .అయితే ప్రతి పరిశోధకుడికి అతనికి సంబంధించిన కాలం ఉంటుంది .
శాస్త్రిగారి వివరణ –పూర్వపు భారతీయ తార్కికులు దీన్ని ఎప్పుడో గుర్తించారు .వాళ్ళు కాలాన్ని ‘’విభు ‘’అన్నారు అది నేచర్ సూత్రాలకు బద్ధం కాదు .కారణం అదే ప్రకృతిని సృష్టిస్తుంది కనుక .కనుక ఆబ్సాల్యూట్ టైం అనేది ఉండదు .మనం చేయాల్సింది ఏమిటంటే ఒక ఏక పక్ష (ఆర్బిట్రరి ) బి౦దువునుండి సాపేక్షం గా మాత్రమె గణించ గలం .అందుకే ఇండియాలో మనకు నాలుగైదు రకాల పంచా౦గా లున్నాయి ..ఇందులో ఒకటి చంద్ర గమనం పైనా(చాంద్రమానం ) ,మరొకటి సూర్య గమనం ఆధారంగా (సూర్య మానం )మరొకటి గురు సంచారం ఆధారంగా (బార్హస్పత్య మానం )పంచాం గాలున్నాయి .యజ్న యాగాదు లకు చా0ద్రమానాన్నే పరి గణన లోకి తీసుకొని ముహూర్త నిర్ణయం చేస్తారు . వేదం లో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలుస్తుంది .భూమిపై సృష్టి చంద్రుని నుంచి అంటే చంద్రోదయం నుండి ప్రారంభమైనదని వేదం గుర్తించింది. భూమిపైన ఏర్పడిన నీరు చంద్రుడు కనపడిన తర్వాతే ఏర్పడింది .అందుకే కృష్ణ పక్షం లో అమావాస్య ,శుక్ల పక్షం లో పౌర్ణమి ఈ రెండూ వేద కర్మలకు ముఖ్యమైనవి .
పేజి 89,పేరా -3
తప్పించుకోవటానికి అసాధ్యమైన దిక్చక్ర సంఘటన (ఈవెంట్ హోరైజన్ ),స్పేస్ టైం సరిహద్దు ఒక రకం గా బ్లాక్ హోల్ చుట్టూ పొరలా వ్యాపించి ఉంటుంది .అజాగ్రత గా ఉంటె అంత రిక్ష యాత్రికుడుబ్లాక్ హోల్ లోని ఈవెంట్ హోరైజన్ లోకి పడిపోయి ,మళ్ళీ బయటికి రాలేడు.
శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి .అదే గణేశ విషయం.మానవ లోకం లో ప్రక్రుతి సూత్రాలకు లొంగని చాలా బలమైన శత్రు బలం ఉన్నదని ,ఈవెంట్ హోరైజన్ అనేది మన వాళ్ళు అన్యార్ధం (ఎలిగరి ) గా చెప్పారని అనిపిస్తోంది .వినాయక చవితినాడు ఈ కధను చదివి చెప్పుకొంటాం .దీన్ని మరికొంచెం వివరంగా తరచి చూద్దాం –
గజాసురుడు అనే రాక్షసుడు ఉండే వాడు .తపస్సు చేశాడు .తపస్సులో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది .ఇదే ఇంద్రియాలను జయించటం .నిరాహారం గా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి మనసును సృష్టి కర్తపై లగ్నం చేసి శివుడిని మెప్పించి సాక్షాత్కారం పొందాడు .వరం కోరుకోమనగా తన కడుపులో శివుడు ఉండిపోయే వరం కోరాడు .టైం స్పేస్ సరిహద్దు ఒక రకంగా పొర.అందుకేవిశ్వం లో బయట ప్రపంచానికి శివుడు కనిపించ లేదు .ఇది వరకే చెప్పినట్లు వేద విజ్ఞానం అయస్కాంత బలాన్ని గజ బలం తో పోల్చింది .అదొక ప్రతీకాత్మక విషయం .దీనికి కారణం ఏనుగు తనబలీయమైన తొండం తోఅన్ని శక్తులను పరాస్తం చేసి విజయం సాధిస్తుంది .ఇదే పదార్ధాలను ఆకర్షించే అయస్కాంత శక్తి .మహా శివుడే నక్షత్రాలు గేలాక్సీలు ,గ్రహాలూ ఉన్న విశ్వం .శివుడు గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం గజాసుర గర్భాస్తమయ్యాడు .అంటే సకల విశ్వం గజాసురుని గర్భం లో ఉండి పోయింది .ఏనుగు ఒకే ఒక రంగు ఉంటుంది .అది నల్లగా ఉండి,అయస్కాంత క్షేత్రంగా ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.