— దైవ చిత్తం -11
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పేజి-116,పేరా -2
ఈ భావాలను వివరించటానికి ఇతరులు క్వాంటం మెకానిక్స్ఏ విధంగా విశ్వ ఆవిర్భావ ,భవిష్యత్ లపై ప్రభావితం చేస్తాయో తెలియాలి.ముందుగా అందరూ విశ్వాన్ని గురించిన చరిత్ర , దానిపై ఉన్న సాధారణ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవాలి . ఇదే ‘’హాట్ బిగ్ బాంగ్ మోడల్ ‘’ఇది ఫ్రీడ్ మాన్ సైంటిస్ట్ వర్ణించిన మోడల్ ను బిగ్ బాంగ్ దీరీకి ముందే ఊహించింది .ఈ మోడల్స్ లో ఈ విశ్వ వ్యాపన లో అందులోని ద్రవ్య రాశి ,లేక రేడియేషన్ చల్ల బడుతుంది .విశ్వం రెట్టింపు అయితే ,దాని ఉష్ణోగ్రత సగానికి పడి పోతుంది .ఉష్ణోగ్రత కణాల సగటు శక్తి లేక వేగాన్ని కొలిచేదేఅయినప్పుడు ఈ చల్లదనం విశ్వం లోని పదార్ధం పై పెద్ద ప్రభావాన్నే కలుగ జేస్తుంది .ప్రతి అధిక ఉష్ణోగ్రత వద్ద ,కణాలు న్యూక్లియర్ లేక ఎలక్ట్రో మాగ్నెటిక్ శక్తుల వలన ,పరస్పర ఆకర్షణకు లోను కానంత వేగంగా, భ్రమణం చెందు తాయి .ఒక వేళ అవి బాగా చల్లబడి పొతే ,ఆకర్షించుకొనే కణాలు ముద్దలా (క్లంప్ )అయి పోతాయి .ఇదే కాక విశ్వం లో ఉండే కణాలు ఉష్ణోగ్రత పైనే ఆధార పడి ఉంటాయి .అవసరమైన అత్యుష్నోగ్రతల వద్ద కణాలు అధిక శక్తిని కలిగి , ఢీకోన్నప్పుడు అనేక రకమైన కణాలు ,వ్యతిరేక కణాల జంటలేర్పడి ,అందులోకొన్ని యాంటి పారికల్స్ ను తగిలినపుడు కొన్ని అంతమొందినా ,మళ్ళీఅంత మొందిన వేగం కంటే మరింత వేగంగా మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి . తక్కువ ఉష్ణోగ్రత ల వద్ద ఈ డీ కొనే కణాలు తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కణ జంటలు (కణాలు ,యాంటి కణాల జంటలు ) తక్కువ వేగం లో ఏర్పడి ,పుట్టిన0త వేగం కంటే అత్యంత వేగం గా అంతమొందు తాయి .
శాస్త్రి గారి భాష్యం –యజుర్వేదం లోని రుద్రాధ్యాయం లో నాలుగవ ఖండం లో సృష్టి కర్తను ‘’మహాగ్ని ‘’గా అంటే ‘’రుద్రుడు ‘’గా చెప్ప బడినాడు .మంత్రాలు స్తోత్రాలు ఈ రుద్రునికే చేస్తూ చల్లబడి విశ్వ సృష్టిని చేయమని ప్రార్ధిస్తారు .కోపంగా ఉండ వద్దని అర్దిస్తారు .తర్వాత సృష్టి మొత్తాన్ని వర్ణించారు .భక్తుడు రుద్రుని తను కావించిన ఈ విశ్వాన్ని సర్వతో భద్రం గా ,సంక్షేమ సౌభాగ్యాలతో వర్ధిల్ల జేయ వలసినదిగా వేడుకొంటారు.కనుక వేదం లో అగ్నికి గొప్ప ప్రాధాన్యం ఉంది .పాశ్చాత్యులు ,భారతీయులుకాని చరిత్రకారులు వేద సంస్కృతిని అర్ధం చేసుకోకుండా మనది ఆటవికమని ,సంచార సంస్కృతీ అని ఈస డించారు .వ్యతిరేక కణాలను మించి కణాల ఉత్పత్తి జరగాలంటే ఒక క్రిటికల్ టే0ప రేచర్(క్లిష్ట ఉష్ణోగ్రత )అవసరం .కనుక వ్యతిరేక కణాల ను జయించటానికి కణాలకు అగ్ని సాయం కావాలి . అందుకే పురాణాలలో దేవతలు ఏ ఆపద వచ్చినా శివుడు,కుమారస్వామి ,విష్ణువు మొదలైన వారి దగ్గరకు పరిగెత్తి కాపాడమని మొరపెట్టుకొని రాక్షస సంహారం చేసి తమను రక్షించమని ,యుద్ధం లో విజయం ప్రసాదించమని కోరుకొంటారు ..శివుడు రుద్రుడే అని ముందే తెలుసుకొన్నాం .కుమారస్వామి అగ్ని తేజస్సు . .విష్ణువు అంటే ‘’ఆహవనీయాగ్నిఅంటే సూర్యుడు ‘’.అంటే ఈ ముగ్గురూ అగ్నికి ప్రతి రూపాలే .
ఈ సందర్భం లోనే వేదం ఈ ప్రపంచం యజ్ఞం వలన సృష్టింప బడింది అని చెప్పింది .అంటే సంఘటీకరణం వలన ఏర్పడింది అని భావం .ఖచ్చితమైన వర్ణన కల శ్లోక తాత్పర్యం –ఒక దాని నొకటి ఆకర్షించే కణాలు ముద్ద గా మారిపోతాయి ‘’.అదే దేవతల కార్యం .అందుకనే దేవతలను కణాలుగా వర్ణిస్తారు .వాళ్ళు అందరూకలిసి సృష్టి చేస్తారు .వ్యతిరేక కణాలు –యాంటి పార్టికల్స్ అంటే రాక్షసులు కణాలను విధ్వంసం చేస్తాయి అంటే సృష్టిని ధ్వంసం చేస్తారు .పార్టికల్స్ సంఖ్య కంటే యాంటి పార్టికల్స్ సంఖ్య చాలా ఎక్కువ కనుక సృష్టి నిరాఘాటం గా కొన సాగుతుంది .నిజానికి రాక్షసుల సంఖ్య దేవతల సంఖ్య కంటే ఎక్కువే. అందుకే ఎప్పుడూ అసురులు సురులపై దాడి చేస్తూ ఓడించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .సురులు భరించలేక అగ్ని ప్రతీకాత్మమైన శివుడి నో విష్ణువు నో రక్షించమని యుద్ధం లో గెలిపించమని పరిగెత్తు తారు .ఇది ప్రతీకాత్మకంగా అన్యాపదేశం గావేద పురాణాలు ఇచ్చిన విజ్ఞాన సందేశం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్