దైవ చిత్తం -12
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పేజి -119,పేరా -2
అధిక ద్రవ్య రాసి గల తారలు గురుత్వాకర్షణ లను సమతుల్యం చేయటానికి ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం ఉంది .అప్పుడే న్యూక్లియర్ చర్యలు అధిక వేగంగా కొనసాగి తమలోని హైడ్రోజెన్ ను వంద మిలియన్ సంవత్సరాలలో నశింప జేసుకొంటాయి.అప్పుడు కొద్దిగా సంకోచం చెంది ,ఇంకా వేడిని గ్రహిస్తే హీలియం ను భారమైనకార్బన్ లేక ఆక్సిజన్ మూలకాలుగా మార్పు చెందిస్తూ ఉంటుంది .
శాస్త్రి గారి వ్యాఖ్యానం –మొదటిసారిగా సృష్టి పొందిన వి హైడ్రోజెన్ ,కార్బన్ ,ఆక్సిజన్ లు అయితే విశ్వ స్వరూపం ను తెలియ జేస్తాయి .రుద్రాధ్యాయం లో కర్బనాధారంగా గడ్డి మొక్క మొట్టమొదట సృష్టి చేయ బడింది .అందులోనే రెండవ అనువాకం సృష్టి ప్రారంభ దృగ్విషయాన్ని తెలియ జేసింది ఆమంత్రాలు –‘’నమో వృక్షేభ్యో హరి కేశేభ్యో –పశూనాం పతయే నమో నమో సస్పింజరాయ త్విషీ మతేపతీనాం పతయే నమో ‘’-దీని భావం – వృక్ష రూపం లో ,వాటి ఆకులు జటలుగాఉన్న రుద్రులకు నమస్కారం .గడ్డి రూపం లోపసుపు ఎరుపులలో ప్రకాశించే రుద్రులకు నమస్కారం .
పేజి -122,పేరా -3
‘’అన్ సర్టేనిటిసూత్రం’’ చెప్పిన సూత్రాల పరిమిత కి లోబడి సైన్సు కొన్ని సూత్రాలను చెప్పింది .ఏదో ఒక కాలం లో దాని స్థితి తెలిస్తే వీటి ప్రకారం విశ్వం ఎలా కాలం తో అభి వృద్ధి చెందుతుందో చెప్పగలం. ఈ సూత్రాలను అసలు దేవుడే నిర్దేశించాడు .తరువాత విశ్వానికి ఆ సూత్రాలపై పరిణామం చెందే స్వేచ్చనిచ్చాడు .తాను మళ్ళీ ఇందులో జోక్యం కల్పించుకో లేదు .ఆయన ఎలావిశ్వం యొక్క ప్రారంభ స్థితిలేక ఆకృతిని ఎంచుకోన్నాడో ? కాల ప్రారంభం లో సరిహద్దు నియమాలేమిటి ?ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి .సాధ్యమైన ఒక సమాధానం ఏమిటీ అంటే మనకు అంతుబట్టని ,అర్ధం చేసు కోలేని కారణాలతో విశ్వ ప్రారంభాక్రుతిని దేవుడు ఎంచు కొన్నాడు అని .
శాస్త్రీజీ కామెంట్ –ఇంత గొప్ప పుస్తకం లో అంత పెద్ద సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ నిర్ణయానికి రాగలడు అని మనం ఊహించలేము .ఉన్న వాస్తవ పరిస్థితిని ఆయన నిర్మోహ మాటం గా అత్యంత వినయంగా ఒప్పుకొని చెప్పాడు .ఇది దేవుడికి లొంగి పోవటమా?కాదు కానే కాదు .అది యదార్ధ సత్యాన్ని గ్రహించటమే . ‘’ భగ వంతుని ఎవరు తాము చూడ లేమని చెబుతారో వారికే తెలియ బడతాడు ‘’అని కేనోపనిషత్ చెప్పింది (విజ్ఞాతం అవిజ్ఞానతాం ).జ్ఞానానికి ఒక సరిహద్దు రేఖ ఉంటుంది .దీన్ని దాటి సైన్సు వెళ్ళలేదు .కానివేదంఎప్పుడో చెప్పింది –‘’విశ్వ జీవితం యొక్క ప్రతి క్షణం దేవుని ఆజ్ఞకు లోబడే ఉంటుంది ‘’అన్నది .మరొక రకం గా దేవుడు ఈ క్షణం లో లేక పొతేఅన్నది అన్ని సిద్ధాంతాలకు అనుభవాలకు వ్యతిరేకం .వేద విధిలో మొదట్లోనే ‘’మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య ‘’అని మంత్రం చెప్పుకొంటాం .దాని అర్ధం ఇదే .-అంటే విష్ణుమూర్తి ఆనతి ప్రకారం ఈ విశ్వం కదులుతోంది .దేవుడు విశ్వాన్ని వదిలి పెట్టలేదు .ఆయన కారణ ప్రభావాలలో (కాజ్ అండ్ ఎఫెక్ట్ ) తో కనిపిస్తున్నాడు .విశ్వం కారణ,ప్రభావాల చేత పరిపాలింప బడాలని భావించాడు భగవాన్ . కాని ఆయన ఉపాదాన కారణం అవటం వలన –అంటే ప్రపంచానికి ఆయన పదార్ధ ప్రదాత .కనుక ఆయనే కారణం ప్రభావం కూడా .ఈ సూత్రాల గురించే హాకింగ్ శాస్త్ర వేత్త మాట్లాడుతున్నాడు
పేజి 123,పేరా -2
ఒక అవకాశం ఏమిటంటే అస్తవ్యస్తమైన (కయాటిక్ ).సరిహద్దు నియమాలు .వీటివలన విశ్వం అనంతం గా నైనా ఉండాలి లేక అనంతమైన విశ్వాలు ఉండి ఉండాలి .
వ్యాఖ్య –భారతీయ వేద,పురాణాలు ఒకే ఒకఅనంతమైన విశ్వం ‘’బ్రహ్మాండం ‘’ఉన్నదని చెప్పాయి .అది గుడ్డు ఆకారం లో ఉంటుంది కనుక బ్రహ్మాండం అన్నారు .ఈ గుడ్డు ఆకారమే దాని సరి హద్దును చూచిస్తుంది .ఒక కల్పం లో బ్రహ్మాండానికి ఒక సరిహద్దు పరిమితమై ఉంటుంది .విశ్వానికి కాదు .ఎందుకంటె విశ్వం అంటే ఆత్మయే.మొత్తం మీద తేలింది ఏమిటి అంటే విశ్వం దేశాకాలలలో అనంతమైనది అని .కాని ప్రపంచాలు లేక సప్త లోకాలు సృష్టి చెంది నశిస్తాయి ,మళ్ళీ జన్మిస్తాయి లయం చెందుతాయి ఇది అంతా ఒక అంతులేని అనంత ప్రక్రియ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30-12-15-ఉయ్యూరు