శ్రీ వెంకటేశ్వర శర్మగారికి ఈ ఉదయం ఫోన్ చేసి కొత్త సంవత్సరం పై కొత్త పద్యం ఏదైనా ఉంటె చెప్పమని అడిగితె వెంటనే ఫోన్ లోనే 8 పంక్తుల తేట గీతి పద్యాన్ని చెప్పారు .మీకోసం వారి పద్యాన్ని అందిస్తున్నాను – నూతన సంవత్సర శుభా కాంక్షలతో –దుర్గా ప్రసాద్
-తే .గీ -”రెండు వేల పదారును నిండు గాను
కలిపి చూచిన(2+0+1+6) నవ (9)సంఖ్య కాదెయిద్ది !
ఇంక పదహారు నిలువెల్ల పొంక మొప్ప
యౌవనం గదోయి అమృత సమము
నడుగు నడుగున తోడ్పడి అన్ని గతుల
అన్ని విషయాల యందున అద్భుతముగ
అలరు గాక మీ కానంద మంద జేసి
వే౦క టేశ్వర -శర్మ ద వీక్షణములు ”
డా .శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ -గుంటూరు -9866944287