దైవ చిత్తం -13
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పేజి -123 ,124 చివరి వాక్యం తరువాత
మృదువైన ప్రదేశాలలోనే నక్షత్రాలు గేలాక్సీలు ఏర్పడ్డాయని అనుకొంటే,,మనలాంటి స్వయం ప్రత్యుత్పత్తి చేయగల జీవుల అభి వృద్ధికి తగిన పరిస్థితులు ఉన్నాయనుకొంటే ,వారికి ప్రశ్నించటం వస్తే’’ఎందుకు ఈ విశ్వం మృదువుగా ఉందని అడిగితె ?ఇదే సంబంధ సిద్ధాంతం (యాన్త్రోపిక్ ప్రిన్సిపల్)కు ఉదాహరణ గా నిలుస్తుంది .దీనికి వివరణ ఇలా ఉంటుంది –‘’ఈ విశ్వాన్ని అది ఉన్న స్థితిలో చూస్తున్నాము అంటే మాకు ఉనికి(ఎక్సిస్ట్ ) ఉన్నట్లే ‘’.
శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఇక్కడ మృదువుగా (స్మూత్ ) అనే మాటను జాగ్రత్త గా అర్ధం చేసుకోవాలి .అంటే శత్రు సంబంధమైనదికాదు(నాట్ హోస్టైల్ల్).దీనికే వేదం ‘’శం ‘’అనే మాటను ఉపయోగించింది .శివుని శరీరమే విశ్వం కనుక ఆయనను ‘’శంకరుడు ‘’అన్నారు .శం కరోతి అంటే శాంతినిచ్చేవాడు లేక శాంతియే తానూ అయినవాడు .దేవుడు వస్తుతహా క్రూరుడు అంటే రుద్రుడుఅంటే అతి శక్తి మంతుడు . ,కాని ఆయనను ప్రార్ధిస్తే శంకరుడు గా మారుతాడు –అంటే తనలోని ఉష్ణాన్నితగ్గించుకొంటాడు –ఎలా అంటే కణాలు మిగిలిన కణాల ఆకర్షణలోకి పోకుండా ఉండటం .ఈ విశ్వం లో అత్యుష్ణ పరిస్తితులు అంటే ఎక్కువ వేడి ,ఎక్కువ కణాలు ఉన్నప్పుడు ,అవి ఒకదానికొకటి దూరంగా పరిగెత్తుతున్నప్పుడు ,చల్లబడి ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోతుంది .అప్పుడు నీరు ఏర్పడి స్వయం పునరుత్పత్తి చేయగల జీవ రాసి సృష్టింప బడుతుంది .హైడ్రోజెన్ హీలియం గా మారి ,కార్బన్ ,ఆక్సిజన్ మూలకాలుగా విచ్చేదం చెందుతుంది .హైడ్రోజెన్ ఆక్సిజన్ లుకలిసి నీరుగా మారుతాయి .గడ్డిలో మొక్కలు ,వృక్షాలలో ముఖ్య భాగం గా కార్బన్ మారిపోతుంది .శివుని మొదటి రూపం వృక్ష౦ ,గడ్డి యే(సస్పింజర ).దీనికి ఉదాహరణ యజుర్వేదం లోని నాలుగవ కాండ మంత్రం –
‘’నమో వృక్షేభ్యో హరి కేషేభ్యో పశూనాం పతయే నమః –సస్పింజిరాయ త్విషీమతయే పతీనాం పతయేనమః ‘’ఈ విషయాన్ని ఇదివరకే ఒక సారి చెప్పుకొన్నాం .హాకింగ్ వంటి గొప్ప శాస్త్రజ్ఞుడు ‘’స్మూత్ ‘’అనే మాటను ఉపయోగించటం ,వేదం చెప్పిన ‘’శం (శాంతి )‘’పదానికి సరిపోతోంది .అంకిత భావం తో శాస్త్రజ్ఞులు చేసిన కృషిని తక్కువ గా అంచనా వేయ కూడదు .
పేజి 129,పేరా 1
కాని ,దీనికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ?అనే ప్రశ్న వస్తుంది .
వ్యాఖ్య –వేద ఋషులు దీనికి సమాధానం చెప్పారు .వేదం ఎందరో దేవతల గురించి చెప్పింది .వీరికి శక్తి అంతా ‘’అమ్మవారి ‘’(మదర్ గాడెస్ ) ‘’నుంచే లభిస్తుందని చెప్పింది.శ్రీ లక్ష్మీ దేవిని స్తుతించే స్తోత్రం లో మంత్రం దీనికి సమాధానం –
‘’లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం –శ్రీ రంగ దామేశ్వరీం దాసీ భూత –సమస్త దేవా వనితాంలోకైక దీపాంకురాం –శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం ‘’
భావం –బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వర మొదలైన దేవతలు తమ శక్తులను శ్రీ లేక లక్ష్మీ దేవి నుండి పొందుతారు .సంస్కృతం లో శ్రీ అంటే ఆమె అని అర్ధం .ఆమెయే అందరికి శరణ్యం .
పేజి 129,పేరా 2
‘’గుత్ ‘’శాస్త్ర వేత్త’’ఉచిత భోజనం అనేదిలేదు .కాని ఈ విశ్వం అంతిమ భోజనం ‘’అని చెప్పినట్లు –
శాస్త్రి గారి భాష్యం –ఉపనిషత్తులు ‘’ఆత్మ విశ్వంగా కనిపిస్తుందిఅన్నాయి . .అది 1-ఉపాదాన కారణం గా 2-నిమిత్త కారణంగా రెండు విధాల కనిపిస్తుంది .ఆత్మ అనేది ఒకప్పుడువిశ్వానికి మూలంగా,తయారు చేసేదిగా , ఆకారం ఏర్పరచేదిగా ఉండేది . సైంటిస్ట్ లు తీవ్రంగా సమర్పణ భావం తో తమ తార్కిక శాస్త్రీయ విధానం లో కృషి చేసి ,మన వేద ఋషులు వేలాది సంవత్సరాల క్రితం
చెప్పిన సత్యాలనే తేల్చి చెప్పటం అత్యంత మనోహరంగా ఉంది.
పేజి -129-చివరి పేరా
విశ్వం ద్రవ్యోల్బణం లాగా విస్తరించలేదు .దీనికేదో విధానం ఉండి ఉండాలి .ఆవిధానం అతి పెద్ద ప్రభావశీల విశ్వోద్భవ స్థిర గుణకాన్ని తొలగించటానికి సాయ పడి ఉండాలి.అందుకని విస్తరణ రేట్ ను,వేగవంతమైన స్తితినుండి ,గురుత్వ బలం వలన నిదానం గా మారేట్లు చేసి ,ఇప్పుడు మనం చూస్తున్న స్థితిలోకి తెచ్చి ఉంటుంది .
శాస్త్రి గారి వ్యాఖ్యానం- సృష్టి రహస్యం అంటే ఇదే .వేదం దీన్ని గమనించింది .ఈ నెమ్మది తనాన్ని ఛందస్ అంది .దీన్నే ఇగ్లీష్ లో సమానార్ధకంగా ‘’ప్రాసడి’’అన్నారు .ఇదే పద్యానికి జీవం .ఇదంతా ఒక రకమైన గణనం .ఆ గణాల ప్రకారమే పద్యాలలో పంక్తులు మళ్ళీ మళ్ళీ వస్తాయి .ముక్త పద్యం(బ్లాంక్ వెర్స్ ) దీనికి ఉదాహరణ .కదలిక సృష్టికి కారణభూతం .విశ్వ వ్యాప్తికూడా కదలికయే కదా .కవిత్వం లోని లయ వంటిది ఇది ..ఇలాంటి వివిధమైన 7రకాల ఛందస్సు లు విశ్వం లో ఉన్నాయని వేదం చెప్పింది.ప్రతి ఛందస్సు కు అధి దేవత ఉంటుంది .దానికి పేరు ఉంటుంది .ఆ దేవత ఒకానొక రకమైన సృష్టికి కారణ భూతమవుతుంది .ఉదాహరణకు ‘’శక్వరి ఛందస్సు ‘’ను తీసుకొందాం .ఈ ఛందస్సు ఆహారం ,జంతువులు ,మానవుల సృష్టికి కారణం అవుతుంది .’’పంక్తి ‘’అనే ఛందస్సు జంతు సృష్టికి కారణమౌతుంది .ప్రసిద్ధమైన ‘’గాయత్రి ఛందస్సు’’ అన్ని రకాల గోవులను సృష్టిస్తుంది .ఇది చాలా విస్తృతమైన విషయం .దీన్ని విడిగా తెలుసుకోవాల్సిందే .
సశేషం
2016 నూతన సంవత్సర శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-15-ఉయ్యూరు