దైవ చిత్తం -15
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
కాల శరం (ది యారో ఆఫ్ టైం)
పేజి -145-పేరా 2
కాలం తో ఎంట్రోపిలేక రుగ్మతలేక కల్లోలం అనేది’’ కాలశరం’’ కు ఒక ఉదాహరణ .ఇది గతానికి, భావిష్యత్తు కూ విభజన రేఖగా ఉంటుంది .కాలానికి మార్గ నిర్దేశం చేస్తుంది .
ఇది దేర్మో డైనమిక్స్ లో రెండవ సూత్రాన్ని అనుసరిస్తుంది –ఆ సూత్రం ‘’మూసేసిన వ్యవస్థ లేక ఎంట్రోపి కాలం తో బాటు పెరుగుతుంది ‘’
శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఈ వాక్య నిర్మాణమే విడ్డూరంగా ఉంది .అది ఇలా ‘’మూయబడిన ఏ వ్యవస్థలోనైనా రుగ్మత లేక ఎంట్రోపి,ఎప్పుడూ కాలం తో పెరుగుతుంది ‘’అని ఉండాలి. భారతీయ సాహిత్యం ముఖ్యంగా వేదాంత సాహిత్యం మానవ శరీరానికి ఒక భావ యుక్తమైన మంచి నిర్వచనం చెప్పింది .అదే శరీరం.దీని నిర్వచనం –‘’శరావత్ గచ్చతే ఇతి శరీరః ‘’ అంటే బాణం లాగా దూసుకు పోయేది .అందుకని హాకింగ్ శాస్త్ర వేత్త ఈ అధ్యాయానికి ‘’కాల శరం ‘’అని పేరు పెట్టాల్సింది .
పేజి 146,పేరా- 1
ఒక వ్యవస్థ ఆదేశింప బడిన అతి తక్కువ స్థాయి నుండి ప్రారంభ మైనదని అనుకొంటే ,కాలం గడిచిన కొద్దీ ఆ వ్యవస్థ సైన్సు సూత్రాలనాధారం గా మార్పు చెందుతుంది (ఇవాల్వ్ ).దాని స్థితి మారుతుంది మరి కొంతకాలం తర్వాత ఆ వ్యవస్థ ,ఆదేశించినదానికంటే అస్త వ్యస్తంగా కల్లోలంగా మారే అవకాశం ఉండచ్చు .ఎందుకంటె ఇంకొన్ని ఇలాంటి స్థితులే ఉన్నాయికనుక . ఈ వ్యవస్థ మొదట్లో ఒక ఉన్నత ఆదేశానికి విదేయం గా ఉండి ఉంటె ఈ రుగ్మత కాలాన్ని బట్టి పెరుగుతుంది .
వ్యాఖ్య –ఈ చర్చచూడటానికి చాలా సాధారణమైనదే అనిపించినా చాలా నైరూప్యమైనది (ఆబ్ స్ట్రాక్ట్)ఈ పరిస్థితిని వేదం గుర్తించి చర్చించింది .పురాణాలు అనుసరించాయి .ఇక్కడ యజుర్వేద రుక్కును తెలియ జేయాలి .ఈ రుగ్మత లేక అస్త వ్యస్త త అంటే రాక్షసులే .దీన్ని దర్శ పూర్ణ మాస యజ్ఞం,సోమయాగాలలో చర్చించారు .యజుర్వేదం లో ఈ మంత్రం మరలమరల వస్స్తుంది
‘’యో ఆస్మాన్ ద్వేష్టి యంచ వయం ద్విష్మా ‘’భావం –మనల్ని ద్వేషించే శత్రువు ,మనం ద్వేషించే శత్రువే .
నిజానికి దీన్ని యజుర్వేదం గుర్తించింది ,ఋషులు అనుసరించారు .అందుకే ప్రతి వైదిక కర్మ శాంతి కోసమే. అశాంతి అస్తవ్యస్థత కల్లోలం రూపు మాపటమే . దీని మహర్షులు గుర్తించారు ,విశ్వ౦ పై దయ చూపించే దేవుడే శంకరుడు .అస్తవ్యస్త రుగ్మతా స్థితియే రుద్రుడు. దేవతలు ఆదేశాలు .అసురులు ఎంట్రోపి..లేక రుగ్మతలేక కల్లోలం .సృష్టి ప్రారంభం లోనే ఈ ఇద్దరికీ నిర్దిష్ట విధులను ఆదేశించారు .ఇదే హయ్యర్ ఆర్డర్ –అంటే ఉత్తమ స్థితి .దీని తత్వాత రాక్షసులు ఘోర తపస్సు వలన బ్రహ్మాది దేవతలవరాల వల్ల శక్తి వంతులయ్యారు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు అప్పుడు విష్ణు మూర్తి దగ్గరకు పరిగెత్తటం,ఆయన జోక్యం చేసుకోవటం ఉండనే ఉంది. దీనిపై చెప్పాల్సింది చేటలలో చాలా ఉంది .
పేజి -147 పేరా-2
కంప్యూటర్ మెమరీ రెండు స్థితులలో ఏదో ఒకదానిలో ఉండే మూలకాల తో కూడిన వ్యవస్థ .చిన్న ఉదాహరణ –అబాకస్ –అంటే పిల్లలు లెక్కలు నేర్పించే చిన్న పూసల చట్రం.అతి సాధారణంగా ఇందులో అనేక తీగలు ,ప్రతి తీగమీద ఒక పూసా ,దాన్ని ఒకటి లేక రెండు స్థానాలలో జరిపే వీలు ఉంటుంది .కంప్యూటర్ మెమరి లో ఒక విషయాన్ని రికార్డ్ చేసేముందు అది రుగ్మతలేక అస్తవ్యస్త లేక కల్లోల స్తితిలో ఉ౦టుంది.ఒక అంశాన్నికంప్యూటర్ మెమరి లో రికార్డ్ చేసే ముందు సమాన సంభావ్య స్తితుల కోసంరెండు స్థితులలో ఉండి ,మెమరీ విస్మరణ స్థితిలో ఉంటుంది .అబాకస్ తీగలమీద పూసలు చెల్లా చెదరుగా ఉంటాయన్నమాట .సిస్టం తో గుర్తుంచు కోవలసిన దానితో మెమరి అనుసంధానమైన తర్వాత వ్యవస్థ రెండిటిలో ఏదో ఒక స్థితిలోకితప్పకుండా వచ్చేస్తుంది . అబాకస్ పూసలు తీగలపై ఎడమ లేక కుడి వైపు చేరిపోతాయని అర్ధం .కనుక జ్ఞాపకశక్తి లేక మెమరి ఒకానొక అస్తవ్య స్థితి నుండి ఆదేశించే స్థితిలోకి వస్తుంది .మెమరీసరైన స్థితిలో నే ఉంచటానికి కొంత శక్తిని వినియోగించాలి (పూసలను కదిలించటానికి ,కంప్యూటర్ కు శక్తిని అందించటానికి లాగా ) .ఈ శక్తి చెదరిపోయి ఉష్ణం గా మారి ,విశ్వం లో రుగ్మతను,కల్లోలాన్ని మరింత పెంచుతుంది . ఆదేశిత మెమరీ కంటే ఈ అస్తవ్యస్థత ఎక్కువగా ఉంటుంది. ఈ విధం గా కంప్యూటర్ కున్న కూలింగ్ ఫాన్ వెలువరించే ఉష్ణంఅంటే ఒక సారి కంప్యూటర్ మెమరీ లో రికార్డ్ అయ్యాక ,విశ్వం లోని మొత్తం రుగ్మత కల్లోలం మరింత పెరుగుతుంది .కంప్యూటర్ గతాన్ని జ్ఞాపకం చేసుకొనే కాల మార్గం ఆ స్థితిలో ,రుగ్మత పెరిగే దానితో సమానం గా ఉంటుంది
శాస్త్రి గారి భాష్యం –ఈ భావాలన్నీ మన పురాణాలలో ఉన్నవే. సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ దేవాసురలను అంటే ఆర్డర్ మరియు డిసార్దర్ లను సృష్టించాడు .రాక్షసులు తపస్సు చేస్తే డిసార్డర్ పెరిగి ప్రపంచం లో ఉష్ణం పెరిగిపోతుంది .పురాణాలు ఈ ఉష్ణాన్నే ప్రపంచాన్ని కాల్చటం గా భస్మం చేయటం గా చెప్పాయి .దీనితో సువ్యస్థితం ఉన్నది అస్తవ్యస్తమై పోతుంది కల్లోలానికి గురౌతుంది .దేవతలు అంటే సువ్యవస్థ విష్ణువును చేరి రక్షించమని ప్రార్ధిస్తారు .విష్ణుమూర్తి ఏదోఒక అవతారం దాల్చి ,అవ్యవస్త కున్న మూల రూపాన్ని,కారణాన్ని ధ్వంసం చేసి మళ్ళీ వ్యవస్థను సుస్థిరం చేస్తాడు .అందుకే విష్ణు మూర్తి అవతారాలు అనంతం .అందులో దశావతారాలు చాలా ముఖ్యమైనవి. కపిల ,వేద వ్యాస మొదలైన మహర్షులు విష్ణువు అవతార స్వరూపులే .
పేజి -148,పేరా -2
సాధారణ సాపేక్ష సిద్ధాంతం విశ్వం ఎలా ప్రారంభమైందో ఊహించ లేక పోయింది .కారణం సైన్సుకు తెలిసిన అన్ని సూత్రాలు బిగ్ బాంగ్ సింగులారిటి(ఏకత్వ ) సిద్ధాంతం తో తుడిచి పెట్టుకు పోయాయి .
వ్యాఖ్య –దీన్ని మనం ఆత్మ యొక్క ‘’సంకల్ప పూర్వస్తితి ‘’అన వచ్చా ?హాకింగ్ దీనినే ప్రీ డెసిషన్ స్టేజ్ – అన్నాడు అంటే అప్పుడు సైన్స్ సూత్ర్రలేమీ లేవన్న మాట .ఆత్మ అంటే సృస్టికర్తయేఅని ఇది వరకే చెప్పుకొన్నాం .ఆయనే సూత్రాలను ,శాస్త్రాన్ని చేస్తాడని ఉపనిషత్తులు ఉద్ఘోషి స్తున్నాయి .వీటిని ఉపనిషత్తులు కవితాత్మకం గా ‘’సో అకామయత ,బహుస్యాం ప్రజయేత్’’అన్నాయి . భావం –ఆత్మ అనేకాన్ని సృజించాలలను కొన్నది అంటే ఏక రూపం బహురూపం కావాలని భావించింది .ఈ నిర్ణయానికి లేక భావనకు ముందు ఆత్మఒకటే ఉంది ,రెండవది ఏదీ లేదు .బహురూపంగా విస్తరించాలన్న ఆత్మ సంకల్పం సైన్స్ సూత్రాలు అనుసరించాయి ఈ సూత్రాలు లేక పొతే సృష్టి కి అవకాశం లేదు .సృష్టి తనతో సూత్రాలను తెచ్చుకొంటు౦ది .లయం అయిఅనప్పుడు తన తో పాటు తీసుకొని వెడుతుంది .
పేజి -152,పేరా -3
ఏమైనా మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు , ఆహార రూపం లో ఉన్న కనీసం వెయ్యి కేలరీల సువ్యవస్తిత ఉష్ణాన్ని ,అవ్యవస్థిత శక్తి గా నే చుట్టూ ఉండే గాలి నుంచి గ్రహించి వేడి ,చెమట రూపం లో మార్చి ఉంటారు , ఇది విశ్వం లో ఇరవై మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ యూనిట్ల రెట్లు అవ్యవస్తను ఏర్పాటు చేసి ఉంటుంది . ఈ పుస్తకం లోని ప్రతి విషయాన్నీ నువ్వు గుర్తుంచుకోవాంటే నీ బుర్రలో పది లియన్ మిలియన్ మిలియన్ రెట్ల డిసార్డర్,కల్లోలాన్ని పెంచుతుంది .
శాస్త్రిగారి మహా భాష్యం –ఇది సైన్సు చెప్పిన విషయం కనుక మనం తప్పక నమ్మాలి .ఇదే విషయాన్ని మన పురాణాలు చెప్పాయంటే నమ్ముతామా ?.ఇంతకీ అవి ఏం చెప్పాయి ?’’ఎవరైనా తపస్సు చేస్తుంటే ప్రపంచం లో వేడి పెరిగి అవ్యవస్థ మౌతుంది .సువ్యవస్థ కు రాజైన ఇంద్రుడు అప్సరసలను పంపి ,ఆ ఉష్ణానికి కారణమైన దానిని నాశనం చేసి ,అవ్యవస్తను కూల్చేస్తాడు సంస్కృతం లో అప్సర అంటే నీటి ప్రవాహం .వేద విజ్ఞానం యెంత గొప్పదో యెంత ఆలోచనా పరమైనదో దీని వలన తెలుస్తోంది .మహర్షులు తపస్సు చేస్తున్నా ఈ వేడి పుట్టి జగత్ సంక్షోభానికి కారణమవుతుంది .దీనిని అఆపటానికి కూడా నీరే కావాలి . ఈవేడికి అగ్ని పర్వతాలు బద్దలౌతాయి సముద్రాలు పొంగుతాయి ,దిక్పాలకులు ఒణుకుతూ బెదిరి పోతారు .వీటినిచిత్రాలుగానూ చూసే ఉంటాం . మునుల తపస్సును అప్సరసలు ఆపలేక పొతే ,తనకంటే బ్రహ్మజానులైన వారిని ఇంద్రుడే దిగి వచ్చి నచ్చ చెప్పటం తెలుసు మనకు .రాక్షసుల తపస్సు వేరొక రకం .వారికి ఇంద్రుని కూలద్రోసి .అవ్యవస్తను కల్లోలాన్ని కలిగించి ఇంద్రపదవి పొందటం అనే ఆశతో తపస్సు చేస్తారు .వీళ్ళ తపో భంగాని కి అప్సరసల అంద చందాలు ,కులుకు ఒయ్యారాలు ఏవీ పనిచేయక అప్సరసలే’’ నీరు కారిపోతారు’’.అప్పుడువిశ్వ సృస్టికర్తే దిగి వచ్చి ఆ పాపాత్ములముందు రాజ దండం తో ఒంగి వాళ్ళు కోరిన వరాలిచ్చి సంతృప్తి పరుస్తాడు జగత్కల్లోలాన్ని తగ్గిస్తాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-16-ఉయ్యూరు