దైవ చిత్తం -18(చివరిభాగం )
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పదకొండవ అధ్యాయం
పేజి -173,పేరా-3
.నాలుగు శక్తులలో బలహీనమైనది అయినా గురుత్వాకర్షణ విశ్వ నిర్మాణాన్ని రూపొందిస్తుందికనుక ఈ పుస్తకం లో గురుత్వాకర్షణ గురించి చెప్పే సూత్రాలకే అధిక ప్రాధాన్య మిచ్చాను .
శాస్త్రి గారి భాష్యం –ఇది ఎందుకంటె పురాణాలు వివిధ దేవతలను వేర్వేరు శక్తులకు ప్రతినిధులను చేసి,తర్వాత దైవమైన గణేశుని కి పేరు పెట్టాయి .ఆయనది గెలాక్సీలనన్నిటినీ అఖిల నక్షత్ర మండలాలను అంటే నక్షత్ర గణాలను కలిగి ఉన్న గజ వక్త్ర౦గల శరీరం .అందుకే గణేశుడు .ఆయన ఎంత శక్తి వంతుడు అంటే దేవతలు కూడా ఏదైనా మంచి పని చేయాలనుకొంటే,ఏదైనా సృష్టించాలంటే ముందు ఆయనను పూజించి,ప్రసన్నం చేసుకొని విఘ్నాలు రాకుండా చూసుకొంటారు. దీనిని ఆయన వ్యతిరేక శక్తుల అంటే గెలాక్సీ ఎడమ ,కుడి చుట్టగా ఉన్న నక్షత్ర సముదాయాలు బాహువులుగా ఉన్నవాడని గ్రహించాలి .ఈనాక్షత్రాలు ఎడమ వైపు ఉంటె కొంత ప్రభావాన్ని చూపిస్తాయి .కుడి వైపు ఉంటె వ్యతిరేక ప్రభావాన్ని కలగ జేస్తాయి . మొత్తం మీద ఒక ప్రభావం రెండో దానికి అది మంచి అయినా చెడు అయినా విఘ్నం కలిగిస్తుంది .ఈ అనివార్య పరిస్థితి ని గుర్తించి దేవుడు కూడా ఈ విఘ్నాల విషయం లో ఏమీ చేయ లేక చేతు లెత్తేశాడని పురాణాలు పేర్కొన్నాయి. కాని భగవంతుని దయతో నివారింప బడని చెడు పని లేదు .అందుకనే ఆటంకాలు కలగ కుండా చేయమని దయ చూపమని ముందుగానే వినాయకుని ప్రార్ధిస్తారు . ఇది తర్కానికి అతీతమైన భావోద్వేగ విషయం (ఎమో షనల్).మొత్తం మీద గణేశుడు ముఖ్యవిశ్వోద్భవ శక్తి(కాస్మోలాజికల్ ఫోర్స్ ) ఐన గురుత్వాకర్షణ దైవం.ఈ కీలక భావన వినాయక చవితి కధలో 27నక్షత్రాలకు భర్త అయిన చంద్రుడితో పగ రూపం లో చెప్పబడింది .అలాగే భాగవతం లోని గజేంద్ర మోక్ష కద కన్యా రాశికి చెందిన హస్తా నక్షత్ర రూపమైన ఏనుగు ,చివరికి మకరం (మకర రాశి )నుండి రక్షి౦పబడుతుంది .ఈ ప్రతీకాత్మికతను గణేశుని ప్రార్ధనలో చివరికి చెప్పే శ్లోకం ద్వారా రుజువు చేయ వచ్చు
‘’వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభా –అవిఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘’
దీని అర్ధం ‘’ఓ గణేశ దేవా !ప్రపంచాన్నిఅన్ని వైపుల నుంచి పాలించే తుండం కలిగి ఉన్నావు .నువ్వు కోటాను కోట్ల నక్షత్రాలు ఒక చోట చేరితే వచ్చే కాంతితో సమానమై విరాజిల్లుతున్నావు .నేను నీకు సర్వ సమర్పణమయెట్లు చేసి నేనుయజ్ఞం గా భావించి నిర్వర్తించే ఏ క్రతువుకు కూడా విఘ్నం రాకుండాకాపాడు
పేజి -174,పేరా-3
ఒక వేళ ఏకీకృత సిద్ధాంతం సాధ్యమైతే ,అది నియమాల ఏర్పాటు ,,సమీకరణాలు మాత్రమె .ఈ సమీకరణాలు విశ్వాన్ని వర్ణించటానికి సాధ్యమౌతాయా ?లెక్కల సూత్రాలు ఎన్ని ఉన్నా విశ్వం ఎందుకు అన్న ప్రశ్నకు ,దాని వివరాలకు సమాధానం ఇవ్వగలవా?అసలు ఈ విశ్వం ఎందుకు ఇంత కస్టపడి బట్ట కట్టాలి –మనగలగాలి?ఏకీకృత సిద్ధాంతం దాని అస్తిత్వాన్ని చెప్పగలదా?విశ్వానికి సృష్టికర్త అవసరమా ,ఒక వేళ అవసరమైతే ఆయన విశ్వానిపై మరేదైనా ప్రభావం చూప గలడా?
శాస్త్రి గారి మహా భాష్యం –హాకింగ్ గారి మహా ప్రశ్న ‘’ఈ విశ్వానికి పదార్ధం ఎక్కడి నుంచి తేబడింది ?అని .ఉపనిషత్ సాహిత్యం దీనికి చక్కని సమాధానం చెప్పింది .ఆత్మయేవిశ్వానికి మూలం ,ఆధారం వనరు ,రూప కర్త (డిజైనర్ ).అవే ఉపాదాన కారణ౦ –ఇచ్చేది విశ్వ నిర్మాణ రూపానికి నిమిత్త కారణం .మరోరకంగా సులభంగా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే –స్టీఫెన్ హాకింగ్ శాస్త్ర వేత్త సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను ప్రయత్నించి’’ దైవ చిత్తాన్ని’’(మైండ్ ఆఫ్ గాడ్ ) తెలుసుకొనే ప్రయత్నం చేశాడు , భారతీయ అద్వైత వేదాంతం తగిన సమాధానం ఎప్పుడోనే చెప్పింది .మామూలు భాషలో చెప్పాలంటే సృష్టికి కారణం ఆత్మ మాత్రమే .తాత్వికంగా (ఫిలసాఫికల్ )చెప్పాలంటే ఆత్మ సృష్టించటం లేదు .అది అలాగే ఉంది (ఇట్ జస్ట్ ఈజ్ )మనం మనకున్న పరిమిత జ్ఞానం తో ఇప్పుడున్న విశ్వాన్ని దర్శిస్తున్నాం అంతే.దేవుడు లేక ఆత్మ ను చూసి అది సృష్టి అని పొరబడుతున్నాం .నిజానికి సృష్టికి మొదలు ,తుది అనేవి లేనేలేవు .ఉదాహరణ పూర్వకం గా చెప్పాలంటే ఇంద్ర ధనుస్సు ప్రత్యక్ష సాక్షం .వ్యక్తి ఒక ప్రత్యెక స్థానం లో ని బిందువు వద్ద ఉండి ,నిర్నీత దిశలో ఉన్న సూర్యుని చూస్తేనే ఇంద్ర ధనుస్సు కనిపిస్తుంది .వ్యక్తి కదిలిన , లేక సూర్యుడు కదిలిన క్షణం లో అది కానీ పించదు .అన్నది మన అనుభవమే .సృష్టి కూడా అలాంటిదే .రజ్జు సర్ప భ్రాంతిలో మనం పొరబడుతున్నాం ఈ విషయాలు పూర్వపు అధ్యాయం లోనే మనం చెప్పుకొన్నాం .’’దిమైండ్ ఆఫ్ గాడ్ ‘’అంటే దైవ చిత్తం లేక దేవుని మనసు అంటేఅర్ధం –దేవుడు ఈ విశ్వంగా కనిపించటమే .
కాని దేవుడికి ఆది, అంతం లేవు .దీన్ని అందరూ అంగీకరించారు .విశ్వానికి కూడా ఆద్యంతాలు లేవు గణితం ,తర్కం ఆధారంగా వాదిస్తే –‘’అవి రెండూ ఒకటి కావా ?అవును రెండూ ఒకటే .ఇదే స్వామీ అద్వైత సిద్ధాంతం .హాకింగ్ గారి ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’అంటే ఇదే – దైవ చిత్తం –దేవుని మనసు .
సంపూర్ణం
మనవి -నా మీద అత్యంత ఆదరాభిమానాలతో తాము రాసిన ”దిమైండ్ ఆఫ్ గాడ్ ”పుస్తకాన్ని డిసెంబర్ 20 వ తేదీన నాకు తమ ఇంటి వద్ద అందజేసిన శ్రీ ఏ .సి పి.శాస్త్రి గారికి ధన్యవాదాలు .దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తాను అని అప్పుడే వారికి చెబితే మహద్భాగ్యం అన్న సౌజన్యం వారిది .మర్నాడు 21తేదీ నుండి వారి పరిచయం తో పాటు ”దైవ చిత్తం ”ను రాయటం మొదలు పెట్టి ఈ రోజుకు అంటే 7వా తేదీకి 18ఎపిసోడ్ లుగా రాసిపూర్తీ చేసి మీకు అందజేశాను . ఇందులో గుణాలన్నీ శాస్త్రి గారివి హాకింగ్ గారివి . దోషాలన్నీ మాత్రం నావే అని సవినయం గా మనవి చేస్తున్నాను .శాస్త్రి గారి ఆలోచనలను భావాలను ఎంతరకు తెలుగులోకి తేగలిగానో నాకు తెలియదు .వారి చిత్తాన్ని అర్ధం చేసుకోన్నానో లేక నా చిత్తం వచ్చినట్లు రాశానో అనే సందేహం .ఏమైనా ఒక మంచి విలువైన గ్రంధాన్ని అనువదించే మహద్భాగ్యం నాకు కల్పించి నందుకు శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .ఈ వ్యాస పరంపర లో నేను చేసిన పొరబాట్లు ,అర్ధం చేసుకో కుండా రాసిన విషయాలు అర్ధం చేసుకొన్నా సరైన భాషలో చెప్పాల్సిన రీతిలో చెప్పక పోవటం ఏవైనా ఉంటె నా దృష్టికి తీసుకు రావలసినదిగా శ్రీ శాస్త్రిగారినీ ,సాహితీ బంధువులను కోరుతున్నాను .
.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –7-1-16-ఉయ్యూరు
.