నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
51-నరసింహ
ఈ కవికాలాదులు తెలియవు.కాని’’కృష్ణ యశో భూషణం ‘’కావ్య కర్త .ఇది రెండు అధ్యాయాలలో 50,58శ్లోకాలతో ఉంది .ఇది వైశ్య కుటుంబం లోని నార్కేడిమిల్లి వంశానికి చెందిన కృష్ణ చరిత్ర .మొదటి శ్లోకం –‘
‘’శ్రీమద్ధరాధర సుతా తనయస్య హస్త శాఖా రవింద మామితశ్రియమా తనోతు –క్రత్వాది కర్మసు భవంతి విధూత విగ్రహః కృత్వా సురాసురా ముఖా ఖలు యత్సపర్యం ‘’
తనకావ్యాన్ని ఈక్రింది విధంగా తెలియ జేశాడు –
‘’కేచిచ్చబ్ద విచార బద్వర్తయః కేచిద్రసా నందినః –కేచిత్ శ్లేష పరంపరాప్రణయినః కేచిద్గుణ గ్రాహిణః
కేచిల్లక్షణ తత్పరా స్సుమనసః కేచి త్క్రుతౌ దూషకాః –కోహం జాతమహే న దైవ బలతస్తేషాంహి నూనం సతాం ‘’
కృష్ణను గురించి చెప్పిన శ్లోకం –
‘’ఆభాతి గోత్ర మమితోత్తమ వైశ్య ధామ క్షోణీతలే మహతి నార్కేడమిల్లి నామ –క్షీ రార్నవస్సకల దీపిత రత్న శాలీ నిత్యం యదా ప్రుధుతరంగవిరాజ మానః ‘’
తర్వాత కృష్ణ పూర్వీకులను వర్ణించాడు .చివరి శ్లోకం
తయా సమేత స్త్వనుకృష్ణ యాహ్వాయ స్స్తదా రసాయం పరిపాలయన్నిరన్ –అతిస్టదట్స న్త్యా విశుద్ధ విగ్రహ స్స పుత్రా పౌత్రః ప్రభు లోక పూజితః
52-కాదంబరి నాటక కర్త –నరసింహ (14వ శతాబ్దం )
ఎనిమిది అంకాల కాదంబరి నాటకాన్ని భట్ట భాణుని కాదంబరి ఆధారంగా రాసిన వాడు నరసింహ కవి .14వ శతాబ్దం మధ్యవాడు .తండ్రి గంగాధరుడు .తాత సిద్ధ నాధుడు .కాకతి ప్రతాప రుద్రుని ఆస్థానకవి అగస్త్యునికి తండ్రి బావ గారు. అన్న విశ్వనాధుడు సౌగందికాపహరణం రాశాడు .మధురావిజయం రాసిన గంగాదేవికిగురువు .చాలా సంక్లిష్ట రచన అయిన కాడంబరిని నాటకం గా మలచటం ఆషామాషీకాదు .అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు నరసింహ .మంచి ఊహాపోహలతో కమ్మని కవిత్వం తో నాటకాన్ని రక్తి కట్టించాడు.ప్రకృతిని విషాదాన్ని గొప్పగా వర్ణించాడు ‘కవి గొప్ప మేధావి అది కవిత్వం లో దర్శనమిస్తుంది .
‘’సౌహిత్యం విదధాతియస్సుమనసం శాశ్వత్ప్రన్నైదయ –స్శాంతో యమ సముదాహరాంతి మహతో దేవస్య దేహాంతరం ‘’
సూత్రధారుడు ,పారిపార్శ్వకుల మాటలలో కవి గొప్ప తనాన్ని చెప్పించాడు
‘’రసికః కవిరదద్భుతా పద గుంఫోలలితస్పుటీరసః –పరిణద్రుపాదర్శినీ వయం నిపుణాస్తత్కి మతోపినః ప్రియం ‘’
నరసింహుడుకాళిదాసునిఅభిజ్నా శాకు౦తలమ్ ను ఆదర్శంగా తీసుకొని దీన్ని రచించాడు .రధ ,లేడి వర్ణనం అచ్చంగా కాళి దాసువే ..దుష్యంతుడు శకున్తలను రహస్యంగా కలుసుకోన్నట్లు మహా శ్వేతను చంద్రా పీడుడు కలుస్తాడు .శాకుంతలంలోని ఆరవ అంకం ఇందులోని ఆరవ అంకం కూడా ఒకే మాదిరిగా ఉన్నాయి .శాకుంతలంలోని వసంతఋతువు ఆరవ అంకం లో ఉంటె ఇందులో శరదృతు వర్ణన ఎనిమిదిలో ఉంది .వర్ణనలో పోలికలు బాగా కనిపిస్తాయి .శాకుంతలాన్ని యెంత గాఢంగా అనుసరించాడో ఈ ఉదాహరణ తెలియ జేస్తుంది
కాదంబరి –హా దిక్ హా దిక్ ఇదానీ మేవ తదా కృత ప్రతిజ్ఞా ఏతాద్రుసస్య అననుభూత పూర్వస్య కస్యాపి వికరస్య విషయోస్మి సంవృతా ‘’
శాకుంతలం –కిం ను స్వలివం ప్రేక్ష్య తపోవన విరోదినౌ వికారస్య గమనీయాస్మి సంవృతా ‘’
శాకున్తలతో పోలికలే కాక శ్రీ హర్షుని రత్నావళి తోనూ భవ భూతి ఉత్తర రామ చరిత తోనూ పోలికలున్నాయి .నాలుగవ అంకం లో అంతర్నాటకం ప్రవేశ పెట్టాడు .ఇది భవ భూతి అంతర్ నాటకం గా కనిపిస్తుంది .పాత్రలు సూటిగా రంగం పై కనిపించవు .మాజిక్ తో తెర మూతపడుతుంది .ఈ దృశ్యాలను చూసి ప్రేక్షకులు ఆనందాన్ని విషాదాన్ని అనుభవిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-16-ఉయ్యూరు