నిత్యోత్సాహి అనుక్షణ పఠనాభిలాషి సాహిత్యైక జీవి ,పరోపకార హిత ధ్యేయి,,సంస్కృతీ సంప్రదాయాను చరణ శీలి ,సర్వ జన హితైషి నాకూ సరసభారతికి అత్యంత ఆత్మీయులు ,మార్గ దర్శి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 81వ జన్మ దినోత్సవం ఈ నెల 10 తేదీ సందర్భంగా హార్దిక శుభా కాంక్షలు . మరింత ఆరోగ్యం గా వారు సార్ధక జీవితం గడపాలని వారికీ వారి కుటుంబానికి సర్వ శ్రేయస్సులను భగవంతుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాం.
శ్రీ గోపాలకృష్ణ గారి ఆయురారోగ్యాలకోసం వారి కుటుంబ క్షేమం కోసం శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా వారి పుట్టిన రోజు జనవరి 10న ఉదయం 5-30గం లకు స్వామి వారలకు ”అరిసెలతో విశేష పూజ ”నిర్వహిస్తున్నాం .స్వామి వారి అనుగ్రహం వారి కి ,వారి కుటుంబానికి సర్వదా రక్షగా ఉండాలి .-దుర్గా ప్రసాద్