నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి
లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం సంస్థానం లోనూ ఉన్నాడు .తర్వాత సన్యాసం స్వీకరించాడు .మహాగ్ని చిత్ ,సర్వ ప్రస్ట,ఆప్తోర్యామ మొదలైన యజ్న యాగాలు చేశాడు .ఆగమ ,మంత్రం శాస్త్రాలలో అఖండుడు .మహా శ్రీ విద్యోపాసకుడు ఆయన పూర్వీకులూ గట్టిఉపాసకులూ కవులే .తన వంశ చరిత్రను ఇలా తెలియ జేశాడు –
‘’పరివ శక్తిర్మహతీ హ రాణి ,సా సుప్రసన్నా హరి తన్వి యోస్మిన్ –రాజ్నీతితస్మాత్ ప్రదితోన్వ యోహం నృసింహ నామా కవి రతన రాజే ‘’ఇదంతా’’ చిత్సూర్య లోకం ‘’లో రాశాడు .కాల మానోపత్తి ,తిది మంజరి లలో కవి తన సర్వ ప్రతిభా ప్రదర్శన చేశాడు .చిత్సూర్య లోక అనే అన్యార్ధ నాటకాన్ని అయిదు అన్కాలలో కశింకోట రాజు కోరికపై రచించాడు .ఈయనకే తన సిద్ధాంత కౌస్తుభం అంకితమిచ్చాడు చిత్సూర్య లోక నాటకం సూర్య చంద్రుల మధ్య సంఘర్షణ .చివరికి సూర్యునిదే విజయం .దీనికి కారణం చంద్రుని భార్య నిశి .సూర్యుని భార్యదివాదేవి కి ఈమెకూ స్పర్ధ వాళ్ళ జరిగిన కద.నిషి తన భర్త చంద్రుడిని సూర్యుని అవమానించమని ప్రోద్బలం చేస్తుంది .నిషి చెలికత్తె భారతి దీన్ని అమలు చేస్తుంది .నాందీ ప్రస్తావన శ్లోకం –
‘’అజ్ఞా రోప్య నిజేతర క్రియమపి జ్యొతిః పరం నిష్క్రియం –వేద్యం జ్ఞాని బిరేవ సాక్షిణామిండా దారం విభుం ప్రేరకం ‘’’సూర్యుని చెంత ఉండే పింగళ అనే విదూషకుడు ,సూర్యునితో బాటు నడవ లేక కున్తివాదినయ్యానని బొంకే సన్నివేశం లో శ్లోకం
‘’భగ్నేరుసుర తీస్తే గ్రహ పరి బృదయస్చందన రాకేకచాక్రః –భగ్నాన్యన్యాని చక్రణ్యనవధిక గతేస్తేశ్చపక్షిత్వ మపే’’
నాలుగవ అంకం లో చంద్ర ,సూర్య బలగాల మధ్య యుద్ధ వర్ణన చేశాడు .చంద్ర ,బృహస్పతి భార్య తారల పుత్రుడైన బుధుడు తండ్రి వైపున కాక సూర్యునికి బాసటగా నిలిచి యుద్ధం చేస్తాడు .తండ్రీ కొడుకుల మధ్య ఉన్న సుదీర్ఘ వైరాన్ని రెండు పిశాచాల ద్వారా వర్ణించాడు-
యదా రణిభవో వహిఃవిరుధ్యా రణిం భువి –బుధస్చంద్ర భవస్త ద్వాదర్తితే చంద్ర భంజేన ‘’.
చంద్రుని బంటు రాహువు సూర్యుని పై చేరి గ్రహణం పట్టిస్తాడు .నిత్యకర్మలకు ,దాన తర్పణాలకు ఈ సందర్భం గా స్వార్ధ పరులైన పురోహితులు రాబడికోసం నీచంగా తమలో తాము కలహించుకొంటారు –
‘’సంకల్పఃప్రధమం మయేవ కదితః స్నానస్య మంత్రాస్తదా –త్వం మధ్యే ప్రసభం ప్రవిశ్య కద యస్త ప్రజ్నరే నిస్త్రప ‘’.గ్రహణ స్నానాలు చేయటానికి వచ్చిన స్త్రీలను కొందరు ఆకతాయిలు అల్లరి చేస్తారు .దీనిపై యువతులు అభ్యంతరం చెప్పి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకొంటారు –
‘’గచ్చన్న చుమ్బత్ కరి చర్మాంకుచయోః కరిద గ్రహీతు -దస్ట వాను కరి చద ఘరె నిశా ప్రాయా దివం యతః ‘’
రవి బుధులకు రక్షణగా పృథ్వి వస్తుంది –ఆమె వర్ణన-
‘దాత్రీ మిక్షు ధనుః ప్రసూన విశిఖ౦ శాలేశ్చసన్మంజరీ – కీరం హస్త చతుష్ట యేనదధతీంమాణిక్య భూషోజ్జ్వలం ‘’
నానా వర్ణ విచిత్ర దివ్య వసనం శ్యామా మురోజోన్నత ౦ –తన్వ౦గీ వికచోత్పలె క్షణ యుగం దిస్త్యాస్శ్ర్యహం దుష్టవాన్ ‘’
భూదేవత బుధుడికి విశ్వం ,మాయా, చిత్ మొదలైనవాటిని వివరించి చెబుతుంది .కధకూ దీనికి సంబంధం ఏమీ ఉండదు –ఒక శ్లోకం –‘’భ్రాంతి స్తవే యమభవన్నను వత్స పశ్య –సా తే పయాతు బృహదంతర దర్శనేన ‘’
అధ్యాస మధ్య గత వనసి లోక దృష్ట్యా –నైజేక్షణేన యది పశ్యసి నేక్షతే సౌ ‘’
భారత వాక్యం గా చెప్పిన శ్లోకం –
‘’అవతు భగవతీ వర శ్యామ లాంగీ ధరిత్రీ –భవతు శుభ మపారం బ్రాహ్మణానాంబుధానాం
నయతు నృపతి లోకః సత్పధం మానవౌఘాన్ –జయతు విమల కీర్తి ర్భూషిత ర్వేంక టాద్రిః’’
54-యలగూరి నరసింహ కవి
పుట్టుక ,కాలం తెలియని ఈ కవి 18ఆశ్వాసాల రుక్మిణీ కళ్యాణ కావ్యం రాశాడు .దీనికి తానె సాహిత్య చంద్రిక అనే వ్యాఖ్యానమూ రాశాడు .ప్రారంభ శ్లోకాలు పూర్తిగా లేవు .భారతిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –
‘’కస్తూరీ కృత గండ పలిశ లతికా ——ల్యే భ్రమ -భ్రున్గ స్త్రీకల గాన యోగా విలాస త్కంఠస్వరం గాయనీ
హస్తాబ్జ ప్రవి లోల కంకణ ఝంకారాభి రామాత్ స్వకం –వీణాయః పరి వాదినీ దిశతు సా భారతీ మంగళం ‘’
ఒక శ్లోకం లో తన పేరు ,కవితా సామర్ధ్యం చెప్పుకొన్నాడు –
‘’ఆలంకారిక మండలేన వినుతౌ నై ఘంటకైర్నిన్దితః –శ్లాఘ్యః శాంతిక నైన కైర్నమసితః పౌరాణి కేగ్రేసరే ‘’
వ్యాఖ్యానంతో బాటు కావ్యమూ తానె రాశానని చెప్పాడు –
‘’సన్నారికేళ ఫల తుల్య తమేస్ఫారం కరోమి నరసింహ కవి ర్వివ్రుత్య –గర్భ స్ఫూర ప్రస వినిర్భర మస్య సార మాస్వాదంత్విహ భ్రుశం భువిః’’
ఆశ్వాసాంత గద్యం –
‘’ఇతి శ్రీ విద్వత్కవిజనసింహ యలగూరి నరసింహ విరచితాయాం రుక్మిణీ కళ్యాణవ్యాఖ్యాయాం సాహిత్య చంద్రికా ఖ్యాయాం ఆస్టదశ సర్గః
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-16-ఉయ్యూరు