దుర్గా ప్రసాద్ గారికి,
గురువులకు ,పెద్దలకూ పాదాలకి నమస్కారం చెయమన్నారు.
అందుకే మీ పాదాలకు నమస్కారము. ఇంతకంటే మీకంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్పుకోవటం ఎట్లాగో తెలియటం లెదు. అసలు మీలాంటి అనుభవం ఉన్న science teacher నా చిన్న పుస్తకం చదవటానికి ఒపుకోవటమే ఒక condescension లాంటిది . ఇక అనువాదం చేయటం ఆ చింతామణి మంత్రం అనుగ్రహమే . చింతామణి మంత్రం నేను చేయను కాని గాయత్రి అప్పుడప్పుడు చేస్తుంటాను,. బహుశా దాని మహిమేమో . లేకపోతె మీ లెర్నింగ్ ఎక్కడ నేనె క్కడ మనం పరిచయం అయిన 36 గంటలలో ప్రత్యక్షం గా కలవటం .. 17 రోజులలోపలే మీరు నా పుస్తకం అనువాదం చేయటం … సినిమాలలో montages లో జరుగుతయ్యిఇట్లాంటివి . Truth is stranger than fiction అన్నMarie Corelli (కర్రెక్టేనా) మాట నిజమైన్ది. English రచయితల జీవిత చరిత్రలు, సాహిత్యం వ్రాసిన మీరు, science teacher గా, హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన , అనుభవం ఉన్న మీకంటే నా చిన్న పుస్తకం అనువాదం చేసే అర్హత ఎవరికీ ఉంది .నా అదృష్టాన్ని గురించి పోగుడుకోవాలంటే ఎ మాటలు వాడాల్నా అని అలొచిస్తున్నాను. మీకు ఇది బాల్య క్రీడ.కల్ప వృక్షం భగవంతుడి స్వరూపమే అయినా దానికి భూమి లో ఉండే చెట్ల గుణం ఒకటి వుంటుంది. ఇతరులకు ఉపకారం చేస్తూ ,ఇతరులు తనకు ఉపకారం చేసినట్లు మాట్లాడుతుంది . ఇది మహా మహుల లక్షణం .
నేను కుడా టీచర్ కొడుకును కాబట్టి మీ వ్యక్తిత్వం లోని nobility , ఔన్నత్యం నాకు పరిచయమే . నేను దానిని అర్థం చేసుకో గలుగుతున్నాను .
ఈ ఋణం నేను ఎటూ తీర్చుకోలేను . నా వెంటే ఉంటుంది
నేను ఒక్కటే ఉపమానం చెప్పగలను. ప్రజలకు లాటరి లో లక్షలు వస్తే ఆనందం పొందుతారని విన్నాను ,అంతకంటే నాకు సంతోషం ఎక్కువ ఉన్ది. ..పేద కు పెన్నిధి దొరకటం అంటే ఇదేనేమొ.
గాంధి గారిని ఎవరో అడిగారట .. ప్రపంచానికి మీ మెసేజ్ ఏమిటని ..ఆయన అన్నాడుట .. “My life is my message: అన్నాడట ఆయన . అట్లాగే మాటలు తక్కువ చేతలు ఎక్కువ … ఇవన్ని నేర్చుకొనేందుకు నాకు వయస్సు లేదే అని బాధ .. ఏమైనా నేర్చుకోవటానికి ప్రయత్నం చెస్తాను. శ్రీ తూములూరి దక్షిణామూర్తి శాస్త్రి గారిని ఇంతవరకు పర్సనల్ కలవలేదు . నిత్య కళ అయిన ‘సమయ ‘ భూమిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందట . అలాగే వారు కనపడకుండా నాకు చాలా సహాయం చెశారు. వారిపుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు వారియెడల నాకున్న భక్తిని నా నమస్కారం తో పాటుఅందజేయండి .
ఇప్పటికింతే . మీరు హైదరాబాద్ వచ్చి, మా ఆతిథ్యం స్వీకరించినపుడు .. నేను ఉత్తరం లో కాకుండా ప్రత్యక్షం గా మీ పాదాలకు నమస్కారం చేసినపుడు, తీరిక గా మాత్లాడు కుందాము . అదృష్టం ఉంటె ” పుల్లేరు నుండి ఓల్గా దాకా “పుస్తక ఆవిష్కరణ సందర్భం గా ఉయ్యూరు లో 25 న కలుస్తాను.
అప్పటివరకు
అయిష్టంగా లేఖా విరమణ చేస్తున్న
మీ అనుచర స్నేహితుడు
ACPSastry