నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )
19వ శతాబ్ది చివరిభాగం లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించాడు.తెలుగు సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు ,కవి .’’వసంత విలాస భాణం’’,మిత్ర భాషితం ‘’రాసి ముద్రించాడు .కాళిదాసమహా కవి మేఘ సందేశ కావ్యానికి అనుకరణగా ‘’శుక సందేశం ‘’రాశాడు సింహాచల రాణి చిలుక ద్వారా మద్రాస్ లో ని లాయర్ కు పంపిన సందేశం ఇది .మందా క్రాంత వ్రుతాలలో రెండు ఆశ్వాసాలలో 179శ్లోకాల తో ఉన్న కావ్యం .కొన్ని శ్లోకాలు మాత్రమె లభ్యం -.
‘’కాచిన్మోచత రుసి రుచిరే సింహ శైలస్య కూటే-ప్రజ్ఞా రాజ్ఞీ వసతి మకరో ద్దూర దేశాప్రచారం ‘’
ఘీన్కారో ద్యమ్నదకారి ఘటా కింతు భీత ప్రదాత్రీ –స్పూర్జర్గర్జ నినాద కలితా నీల కాదంబినీ వా ‘’
ఆధునిక జీవితాన్ని ప్రాచీన ఛందస్సు లో ఇంత గొప్పగా చెప్పటం కవి ప్రతిభకు తార్కాణ.ఇందులో మద్రాస్ సెంట్రల్ స్టేషన్ వర్ణన ఉంది .రైలు పట్టాలు ,దాని దగ్గర హెడ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ ,వెయిటింగ్ రూమ్ ,మెషీన్ లతో లిఫ్ట్ తో పనిచేసే విధానం , పైకి వెళ్ళే ఏర్పాటు .స్టేషన్ బంగాళాఖాతాని కి దగ్గరగా ఉండటం ,ఏనుగుల మేఘ ధ్వనుల వంటి ఘీంకారాలు ,వరుస ఇళ్ళు ,నల్లని మేఘాలు ,వేగం గా దూసుకు పోయే రైళ్ళు అన్నీ స్పష్టంగా వర్ణించాడు .
‘’రైలేలీలా నరా మృగ పతేః కుత్ర చిత్ తత్ర కానౌ –పాంసు క్రీడాప్రవణ వయసం ప్పుత్ర మ౦ఖే వహంతీ
తత్తన్మాయా వచన రచనో పక్రమైః ఖేల యంతీ-కీరం స్వేరం స్వయముపగతం రాజ పత్నీదదర్శ ‘’
55-శిష్టానరసింహ శాస్త్రి
కాశ్యప గోత్రేకుడు సేతారామ శాస్త్రి కుమారుడు నరసింహ శాస్త్రి .షట్ దర్శనాలలో మహా ప్రావీణ్యు డు..తర్కం లో అవక్ర పరాక్రముడు కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజి లో తెలుగు సంస్కృత ఉపాధ్యాయునిగా పని చేశాడు .తండ్రి కూడా గొప్ప విద్వాంసుడు .తండ్రి దగ్గరే విద్య నేర్చాడు .కాళిదాసు మేఘ సందేశ కావ్యాన్ని తెలుగు చేశాడు .’’సర్వ తంత్ర విద్వర ‘’,విద్వన్మణి,మహాపాధ్యాయ బిరుదాంకితుడు .
ఈయన సంస్కృత కావ్యాలు –ఇందిరా పరిణయం అనే 5అంకాల నాటకం ,ఆరు సర్గల శ్రీ కృష్ణోదయ మహా కావ్యం ,శృతి రత్న దీపం ,వివస్వ ప్రభ అనే బ్రహ్మ సూత్రాభాష్యానికి వ్యాఖ్యానం .ఇందిరా పరిణయ నాటకం సముద్ర మధనం తో ప్రారంభ మవుతుంది.నృసింహావతారం తో సమాప్తమౌతుంది .సంస్కృతం పై మంచి పట్టు ఉన్నకవి .నందన వన వర్ణన బాగా చేశాడు –
‘’కీరాఃకోర కితేషు కల్ప తరుషుప్రారబ్ధ వేదాక్షరా –వాతస్చందన వాటి కాంగణచలద్రంగా పరామ్భ స్ప్రుశః
కిజ్వేతే విరు వంతి పంచమ రవం చూతేషు పుంస్కోకిలాః-కున్జ్జేషు ప్రతి బద్వఝాంక్రుతి రవా దావంత్యమీ షట్పదాః’’
శ్రీ కృష్ణోదయ మహా కావ్యం లో ఆరు సర్గలున్నాయి.భాగవత క్రిష్ణావార కద.క్రిష్ణలీలలను కవితాత్మకంగా వర్ణించాడు .
గర్భిణిగా ఉన్న దేవకీదేవి పృధు పయోధరాలను వర్ణించాడు –
‘’హారి నీలామణిధ్రుతిర్హరిః సుదతీ గర్భ ముపాగామస్తతః –కుఛ మధ్యా వినిర్గాతా హరే స్తను కాంతిః కిము చుంచు కాశ్రితా ‘’
ఇందులోని కొన్నిలీలా శుకుని శ్రీ కృష్ణ కర్ణామృతం ను పోలి ఉంటాయి .తాను రాసిన ఇతర క్రుతులనూ చెప్పుకొన్నాడు .శ్రీ కృష్ణ వర్ణనలో –
‘’శ్రీ కృష్ణ పదా౦చిత శాద్వలేషు గతాగతం క్రిష్ణామ్రుగా న చక్రుః-తదీయ భక్త్యా నిజ నామ రూపే జగత్సు క్రిష్ణాత్మ కతావ గత్యా’’
93శ్లోకాల శృతి రత్న దీపం అద్వైత సారాంశం .మొదటి శ్లోక౦-
‘’జ్యోతిర్వేదే యదిందుద్రుతికలిత జటా బద్ధ లేలీహనే౦ద్రః-తద్భోగా రబ్ధానిద్రా పరి చయ చతురం చాపి లక్ష్మీసనాధం ‘’
ఆశ్వాసాంత గద్యం –‘’శిష్టా న్వయేన నరసింహ సమాశ్ర యేన శ్రీ కాశ్యపేన రచితే శృతి రత్న దీపే మయావభాస యియతా ప్రధమః పరస్య నారాయణస్య చరణామ్బుజయో ర్పితో భూత్’’
నరసింహ శాస్త్రి కృతులలో వివస్వప్రభ కవి ప్రతిభకు పట్టం కట్టిన రచన .వివిధ శాస్త్ర పరిజ్ఞానం లోక జ్ఞానం రాశీభూతమై దర్శనమిస్తుంది .ఇది శంకరాచార్య స్వామి బ్రహ్మ సూత్ర భాష్యానికి మహా వ్యాఖ్యానం .శంకర భాష్యాన్ని సమర్ధించిన భట్ట పాద ,శబర స్వామి ,పాణిని .పతంజలి ,కాశిక యాస్క ,మణి దీధితి ,గదాధరులను గట్టిగా సమర్ధిస్తూ రామానుజ భాష్యాన్ని తూర్పార బట్టిన గొప్ప రచన .తన వ్యాఖ్యానంపై కవి స్పందిస్తూ –
‘’ప్రౌడ ద్వాంతిరాస్క్రుత శృతి రివసిద్ధాంత ఘంటా పద –స్పూర్త్యై ర్నిర్మల చేత సా మియమభూదద్దేతా భాష్యోపరీ
శ్రీమత్పండిత పుండరీక పరిషద్విఖ్యాతశిష్టాన్వయ –శ్రీ విద్వన్నర సింహ తార్కిక మణోవ్యాఖ్యా వివస్పత్ప్రభా ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-16-ఉయ్యూరు